koodali

Friday, August 14, 2015

దైవ సృష్టి ...

 
ఇంత పద్దతిగా వైవిధ్యభరితమైన సృష్టిని ఏర్పాటు చేయాలంటే, ఊహాతీతమైన ఆలోచనా శక్తి గల మహాశక్తికే సాధ్యం. ఈ మహాశక్తినే ఆస్తికులు దైవం అని పిలుచుకుంటున్నారు.

ఆధ్యాత్మికవాదులు..  దైవానికి   ఆది ,  అంతమూ ..లేవు .  అని తెలియజేసారు. 

".Matter and energy cannot be created or destroyed "....... అని ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పే విషయాన్ని బట్టి చూసినా .. పదార్ధం , శక్తి ..యొక్క రూపం మారుతుంది .

 అంతేకానీ, పదార్ధాన్ని, శక్తిని.. సృష్టించలేము, నశింపజెయ్యలేము....అని తెలుస్తుంది.

ఉదా...నీరు ఆవిరిగా మారుతుంది ... ఆవిరి మరల నీరుగా మారుతుంది, నీరు మంచులానూ మారవచ్చు, ఆ మంచు మరల నీరుగానూ , ఆ నీరు ఆవిరిగానూ మారవచ్చు.

విశ్వాన్ని దైవం సృష్టించారు అంటే,  మరి దైవం  ఎలా సృష్టించబడింది ? అనే ప్రశ్న వేస్తారు భౌతికవాదులు. 

 మరి , పదార్ధం లేక శక్తి  మొదట ఎలా సృష్టించబడింది ? అనే ప్రశ్నకు భౌతికవాదులు ఏం సమాధానం  చెబుతారు ?

 పదార్ధానికే పుట్టుక , నశించటం అనేవి లేనప్పుడు , పదార్ధాన్ని సృష్టించిన దైవం ఆద్యంతాలు లేని నిత్యశక్తి .... అని పెద్దలు చెప్పిన మాట నిజమని తెలుస్తోంది కదా !
  
దైవం వద్ద   జీవులకు కలిగే  అన్ని సందేహాలకు  సమాధానాలు ఉంటాయి . 

అయితే,   విజ్ఞాన రహస్యాలు తెలుసుకోవాలంటే   జీవులు  తగిన అర్హతలు సంపాదించుకోవాలి. 

 దైవకృపను పొందగలిగిన జీవులకు ఆ రహస్యాలు తెలిసే అవకాశం ఉందనిపిస్తుంది. ఉదా.. మోక్షాన్ని పొందిన జీవులకు  విషయాలు తెలుస్తాయి .  అనిపిస్తుంది . 

 విమానం ఎలా ఎగురుతుంది ? అని చిన్న పిల్లవాడు ప్రశ్నిస్తే పెద్దవాళ్ళు ఎంత వివరించినా పిల్లవాడికి అర్ధం కాకపోవచ్చు. 

అదే పిల్లవాడు పెద్దవాడయి చదువుకుంటే ఆ విషయాలు సులభంగా బోధపడతాయి. 

విశ్వరహస్యాలు తెలుసుకోవాలన్నా తగిన  అర్హతలను సంపాదించుకోవాలి.
 
*******
సృష్టి ఎలా ఏర్పడింది? అనే  ప్రశ్నకు,   దైవం  వల్ల   సృష్టించబడింది.. అని  ఆస్తికులు ఖచ్చితమైన   సమాధానం  చెప్పగలరు.

సృష్టి ఎలా ఏర్పడింది?  అనే  ప్రశ్నకు, నాస్తికులు ఏమంటారంటే.. సృష్టి దానికదే ఏర్పడిందని అంటారు.

కొందరు నాస్తికులు  ఏమంటారంటే, దైవం  ఎలా ఏర్పడ్డారని  ప్రశ్నిస్తారు.

సృష్టి దానికదే ఏర్పడటం సంభవమని  వారు నమ్ముతున్నప్పుడు..  మరి, దైవం తమకు తామే ఏర్పడలేరా
ఏమిటి ..దైవానికి ఆది అంతములు లేవు. 
 
 

2 comments:

  1. జీవులు సృష్టి ఎలా జరిగింది, పరిణామక్రమం లో మానవుడు ఎలా ఏర్పడ్డాడు డార్విన్ లాంటి శాస్త్రజ్ఞులు విఅరిచారు.పదార్దం ఎలా ఏర్పడింది,ఈ విశ్వం ఎలా ఏర్పడింది అనేదాని గురించి కూడా భిన్న వివరణలు ఉనాయి.ఇంకా శాస్త్రజ్ఞులు కృషి చేస్తూనే ఉన్నారు.అంతే కాని దైవ నమ్మకం, మోక్షం లాంటి విశ్వాసాల వల్ల విశ్వ రహస్యాలు బయటపడవు.

    ReplyDelete


  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    జీవులు సృష్టి ఎలా జరిగింది, పరిణామక్రమం లో మానవుడు ఎలా ఏర్పడ్డాడు అని, డార్విన్ లాంటి శాస్త్రజ్ఞులు వివరించిన విషయాల గురించి శాస్త్రవేత్తలలో కూడా ఎన్నో అభిప్రాయభేదాలు ఉన్నాయి.

    పదార్దం ఎలా ఏర్పడింది,ఈ విశ్వం ఎలా ఏర్పడింది అనేదాని గురించి కూడా భిన్న వివరణలు ఉన్నాయని మీరే వ్రాసారు.

    ఈ విషయాల గురించి ఇంకా శాస్త్రజ్ఞులు కృషి చేస్తూనే ఉన్నారు.అని కూడా మీరే వ్రాసారు.

    అయితే, పదార్ధాన్ని, శక్తిని.. సృష్టించలేము, నశింపజెయ్యలేము. అని ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పటానికి ముందే ...ఆధ్యాత్మికవాదులు దైవానికి ఆది, అంతమూ లేవు .. అని తెలియజేసారు.

    ప్రాచీన గ్రంధాల ద్వారా ఎంతో విజ్ఞానం తెలుస్తుంటే... మీరు దైవ నమ్మకం, మోక్షం లాంటి విశ్వాసాల వల్ల విశ్వ రహస్యాలు బయటపడవు. అని వ్రాయటం హాస్యాస్పదం.


    ఈ విషయాల గురించి మరికొన్ని అభిప్రాయాలను తరువాత టపాలో చూడగలరు.

    ReplyDelete