koodali

Saturday, November 17, 2018

ఓం, దైవానికి అనేక వందనములు...



నాకు గుర్తున్నంతలో రధసప్తమి రోజు బ్లాగ్ సంకల్పం చేసాననుకుంటున్నాను.

ఇంత అద్భుతమైన అవకాశాన్ని అందించిన దైవానికి అనేక ధన్యవాదములు.

తెలిసినంతలో విషయాలను వ్రాస్తున్నాను
 ఇంతకాలంగా వ్రాస్తానని మొదట్లో అనుకోలేదు 
అంతా దైవం దయ.

 బ్లాగ్ ను ప్రోత్సహించిన అందరికీ ధన్యవాదములు. 
 
బ్లాగ్ ను ఫాలో  అవుతున్నవారికి  నాధన్యవాదములు.

అందరి గురించి వివరంగా వ్రాయలేకపోతున్నందుకు దయచేసి క్షమించండి.
 
 ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు.

అంతర్జాలం పనిచేయాలంటే ఎందరో వ్యక్తుల కృషి ఉంటుంది. నాకు తెలిసిన, తెలియని అందరికీ ధన్యవాదములు.

లేఖిని ద్వారా వ్రాయటం జరిగింది. లేఖిని వారికి ధన్యవాదములు..
 అగ్రిగేటర్లకు ధన్యవాదములు

కంప్యూటర్ వాడకంలో నాకు సహకారాన్ని అందించిన మా కుటుంబసభ్యులకు మరియు అందరికి ధన్యవాదములు.

తెలిసినంతలో విషయాలను వ్రాస్తున్నాను. 

దైవం దయ వల్లఎన్నో గ్రంధాల ద్వారాపెద్దల ద్వారావార్తాపత్రికల ద్వారాపుస్తకల ద్వారాఅంతర్జాలం ద్వారాచానల్స్ ద్వారాతోటి వారితో సంభాషణల ద్వారాచూసినవివిన్నవాటి ద్వారా..ఇంకా ఎన్నో మార్గాల ద్వారా.. మనం ఎన్నో విషయాలను తెలుసుకోగలుగుతాము. 


విషయాల గురించి మాట్లాడుకోవటానికి అంతం అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే, ఎంత మాట్లాడుకున్నా ఇంకా చెప్పుకోవటానికి విషయాలెన్నో మిగిలే ఉంటాయి.


చాలా విషయాలను  వ్రాసాను కానీ, రాయాలనుకున్న కొన్ని విషయాలను రాయలేదు.నా అభిప్రాయాలు కొన్ని కొందరికి  నచ్చవనే అభిప్రాయం కలిగి విషయాలను రాయలేదు.


చాలామందికి నచ్చవని తెలిసినా కొన్నింటిని వ్రాసాను. ఇతరులకు నచ్చవని తెలిసినా కూడా, మనకు న్యాయమని అనిపించిన వాటిని కొన్నింటినైనా చెప్పక తప్పదు.


 మన అభిప్రాయాలు కొందరికి నచ్చకపోవచ్చు, కొన్ని అభిప్రాయాలు నచ్చి, కొన్ని నచ్చకపోవచ్చు. ఏది ఏమైనా అందరికీ అన్నీ నచ్చాలనుకోవటం చాలా కష్టం. వ్రాసిన విషయాల వల్ల మంచి  జరగాలనే అభిప్రాయంతో వ్రాసాను.


కొన్ని విషయాలలో మనకు  క్లారిటీ ఉన్నా కూడా   విషయాల గురించి బహిరంగంగా  రాయలేం. ఎందుకంటే, వాటిని చదివినవారిలో కొందరు సరిగ్గా అర్ధం చేసుకోలేకపోవటమో, అపార్ధం చేసుకోవటమో లేక అర్ధం అయినా కూడా కావాలని వెటకారం చేయటమో జరగొచ్చు. అందువల్ల అన్నీ రాయలేము.


 బ్లాగ్ వ్రాయటం ఎంతో ఆనందమే కానీ, పొరపాట్లు లేకుండా వ్రాయాలంటే ఎన్నో విషయాలు తెలుసుకోవాలి, ఎంతో ఆలోచించాలి. మొత్తానికి దైవం దయ వల్ల మాత్రం వ్రాయటం జరిగింది.


పాతటపాలు చదివితే ఇవన్నీ నేనే రాసానా? అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

 అయితే, ఇవన్నీ నేనే రాసానని చెప్పుకోవటం హాస్యాస్పదం. 

దైవం దయ వల్ల వ్రాసాను. వ్రాసిన వాటిల్లో తప్పులు ఉంటే, తప్పులు నావిగా భావిస్తున్నాను.


 కొంతకాలం క్రిందటే వ్రాయటం మానేద్దామనుకున్నాను కానీ, ఏవో కారణాలతో కొనసాగింది. ఇకమీదట ఎప్పుడైనా తప్పనిసరిగా వ్రాయాలనిపిస్తే రాస్తాను. 


దైవానికి ధన్యవాదములు, వందనములు.

 అందరికీ ధన్యవాదములు.

వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.



ఓం ...







ఈ పాటను శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారు వ్రాసారని ఈ మధ్యనే తెలిసింది. అయితే, వారు వ్రాసిన  పాటలో పదములు ఎలా ఉన్నాయో నాకు తెలియలేదు.

అంతర్జాలంలో  పాట చాల దగ్గర ఉన్నది. అయితే,  కొన్నిచోట్ల..  పదాలలో మార్పులు ఉన్నాయి. 

పాటను అందించిన అందరికి  ధన్యవాదములండి.

నేను పాటను పాడిన విధానంలో చాలా తప్పులు ఉండవచ్చుసంగీతం బేసిక్స్ కొద్దికాలం మాత్రమే నేర్చుకున్నాను. అది కూడా సాధన లేక మర్చిపోయాను

ఏదో తోచినట్లుగా  పాడాను. పాడిన విధానంలో తప్పులను దయచేసి క్షమించమని కోరుతున్నాను.

...............

బంధువులు,స్నేహితులు ఒక జన్మకే తోడుగా ఉంటారేమో?

 దైవం మాత్రం అందరికీ జన్మజన్మల తోడుగా ఉండే అద్భుతమైన ఆత్మబంధువు

 దైవాన్ని ఆరాధించాలి.

 జీవితంలో ఎవరి స్వధర్మాన్నివారు చక్కగా  ఆచరించాలి.దైవకృపను పొందాలి. 

సాలోక్యం,సామీప్యం,సారూప్యం, సాన్నిధ్యం.....అని ముక్తులు ఉంటాయని తెలుస్తోంది.

  కష్టమూ లేని పరమానందాన్ని పొందాలంటే దైవాన్ని పొందాలి.

శ్రీ మాత్రే నమః శ్రీ పరమాత్మనే నమః.


దైవానికి వందనములు. 


Friday, November 16, 2018

ఓం ....మరి కొన్ని విషయములు..




త్రిమూర్తులకు వందనములు.
...........................
 
మరి కొన్ని విషయములు..
  ఇంట్లో శివలింగాకారం అని నలుగురికి చూపిస్తే, మూఢనమ్మకాలు ప్రచారం చేస్తున్నట్లు కొందరు మాట్లాడుతున్నారు...
 
మా ఫ్రిజ్లో కూడా చాలాకాలం క్రిందట  శివలింగాకారంలా ఏర్పడింది. ఆ చిత్రాలను బ్లాగులో పోస్ట్ చేసాను. 
 
 link..

 ఫ్రిజ్లో శివలింగం ఆకారంలా ఏర్పడటం చూసి నాకు ఆశ్చర్యంగా, ఆనందంగా..అనిపించింది. పెద్దసైజులో అలా ఆకారం ఏర్పడటం నేను ఎప్పుడూ గమనించలేదు.
 
 అది ఐస్ వల్లే ఏర్పడినా, శివలింగంగా భావించి..ఆ విషయాన్ని చూపించాలనిపించి చూపించాను. మూఢనమ్మకాలు ప్రచారం చేయాలని కాదు. నేను మూఢనమ్మకాలకు వ్యతిరేకం.

అప్పట్లో మా ఫ్రిజ్లో శివలింగాకారాన్ని నేను మా చుట్టుపక్కల ఎక్కువమందికి చూపించడానికి భయపడ్దాను. 
 
నేనే అలా ఏర్పాటు చేసానని అనుకుంటారేమో అని, ఇంకా  ఏమంటారోనని, చూడటానికి ఎక్కువమంది  వస్తారేమో? తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో? అని సందేహాలు కలిగాయి.

 మరికొందరు కూడా వాళ్ల ఫ్రిజ్లో ఇలా ఏర్పడినట్లు చూపించిన ఫోటోస్ చూశాను.
 
ఎవరైనా, ఫ్రిజ్లో శివలింగాన్ని చూపించి, గుడికట్టి భక్తులను పిలిచి, ఇక్కడ మొక్కుకుని హుండిలో డబ్బులు సమర్పిస్తే కష్టాలు, కోరికలు తీరుతాయని.. చెప్పారా ?

మూఢాచారాల పట్ల కొందరి ఆవేదన నేను అర్ధంచేసుకోగలను.

సమాజంలో కొందరు దైవము పేరుతో కూడా ప్రజలను మోసం చేస్తున్నారు. అయితే, అందరూ అలా మోసం చేసేవాళ్ళే ఉండరు.

 దైవము పేరుతో వ్యాపారంలా చేసి, డబ్బు సంపాదించేవారు కూడా ఉండవచ్చు. ఈ రోజుల్లో ఎవరు ఎటువంటివాళ్ళో తెలియదు కాబట్టి, జాగ్రత్తగానే ఉండాలి.

  ఎవరు ఏం అనుకున్నా, మా ఇంట్లో ఫ్రిజ్లో శివలింగాకారంలా ఏర్పడటం విషయం గురించి నేను గొప్పగా, ఆనందంగా భావిస్తాను.
................

చాలామంది.. ప్రకృతిలో, రాయిలో, రప్పలో, చెట్టులో, పుట్టలో దైవాన్ని చూస్తారు. మట్టితో, ఇసుకతో ..దైవరూపాన్ని తయారుచేసి పూజిస్తారు. 
 
ఇంట్లో పూజించే పటాల్లోని  దైవచిత్రాలను మనుషులే గీచినా, ఆ చిత్రంలో దైవాన్ని ఆరాధిస్తారు.
........................

ఒక పాతసినిమాలో ఒక వ్యక్తి తనకు శివపూజకు సమయం మించిపోతోందని దగ్గరలో శివలింగం లేదని, తను ప్రేమించిన  స్త్రీ యొక్క వక్షోజాన్ని,  శివలింగాకారంలో ఉన్నదని భావించి, దానినే పూజించినట్లు  సినిమాలో చూసినట్లు గుర్తుంది. ..

అలా  చూపిస్తే,  జనాలు బాగా చూసారు. మరి సినిమాల్లో ఇలా చూపిస్తే ఏమంటారు?

అలా కాకుండా, ఆ వ్యక్తి  కొబ్బరికాయనుకాని,  చిన్నరాయినికాని శివలింగంగా భావించి పూజించవచ్చు. లేదంటే మానసికంగా భావించి, మానసికపూజ చేయవచ్చు. మానసిక పూజ చాలా గొప్పదంటారు.

కొందరు దైవము పేరుతో వ్యాపారం చేస్తున్నారనిపిస్తోంది.  మూఢనమ్మకాలు పెంచే సీరియల్స్, సినిమాలను  అందరూ వ్యతిరేకించాలి.
.........................

 దైవపూజలు పేరుతో మూఢత్వంగా ప్రవర్తించకూడదు.
...................

పండుగలు, ఫంక్షన్లు అని ....బోలెడు పనులను,  భయాలు,  సందేహాలను,  ఆచారవ్యవహారాలను..పెంచుకుని సతమతమవటం,  పూజ అంటే బోలెడు  విషయాలను చెప్పటం, వాటిని సరిగ్గా పాటించకపోతే కష్టాలు వస్తాయనటం.. 

 దైవము పట్ల ధ్యాస కన్నా, చాలావిషయాలను పాటించటం పట్లే ధ్యాస ఎక్కువ ఉండేలా పరిస్థితి తయారయ్యింది.

సమాజంలో ప్రచారంలో ఉన్న కొన్ని మూఢనమ్మకాలవల్ల ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.. చాలా మూఢనమ్మకాలున్నాయి.
....................

  ప్రజలకు దైవము అంటే భక్తి ఉండాలి, పాపాలు చేయకూడదని భయం ఉండాలి. 
 
అంతేకానీ, పాపభీతి లేకుండా, ఎన్ని పాపాలు చేసినా పరిహారాలు చేస్తే సరిపోతుందనే విధంగా పరిస్థితి తయారయ్యిందనిపిస్తుంది.

 .......................

సోషల్మీడియా వచ్చాక ఎందరో ఎన్నో చెప్పటం, ప్రతిదానికి ఇలాగే చెయ్యాలి, ఇలా చెయ్యకూడదంటూ చెప్పి ప్రజలను భయాందోళనకు, అయోమయానికి గురిచేస్తున్నారు. 
 
గ్రంధాలలో కూడా ప్రక్షిప్తాలైన మూఢనమ్మకాలు ఉన్నాయి. వాటిని తొలగించాలి, వాటిని ఎవరూ ప్రచారం చేయకూడదు.

సమాజంలో ఎప్పటినుంచో ప్రజలలో ఏర్పడిన మూఢనమ్మకాలకు కారణాల గురించి ఆలోచించి సరిదిద్దుకోవాలి.

నే
ను కూడా  చాలా విషయాల గురించి భయపడుతూ చాలాకాలం కొన్నింటిని పాటించాను. అయితే, ఇప్పుడు మూఢనమ్మకాలతో కాకుండా , నేను చేయగలిగినంలో మాత్రమే చేయడానికి ప్రయత్నిస్తున్నాను. 
 
మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా బ్లాగులో ఎన్నో విషయాలను వ్రాసాను. అయినా కొన్ని సెంటిమెంట్స్..ఉన్నాయి.

Monday, November 12, 2018

ఓం..


లింగాష్టకం.

1..బ్రహ్మమురారి సురార్చితలింగం
....నిర్మల భాసితశోభితలింగమ్ 
జన్మజదుఃఖవినాశకలింగం
....తత్ప్రణమామి  సదాశివలింగమ్

2..దేవముని ప్రవరార్చితలింగం
....కామదహనకరుణాకరలింగమ్ 
రావణదర్పవినాశకలింగం
....తత్ప్రణమామి సదాశివలింగమ్

3..సర్వసుగంధసులేపితలింగం
....బుద్ధివివర్ధనకారణలింగమ్ 
సిద్ధసురాసురవందితలింగం
....తత్ప్రణమామి సదాశివలింగమ్

4..కనకమహామణిభూషితలింగం
....ఫణిపతివేష్టిత శోభితలింగమ్ 
దక్షసుయజ్ఞవినాశనలింగం
....తత్ప్రణమామి సదాశివలింగమ్

5..కుంకుమచందన లేపితలింగం
....పంకజహారసుశోభితలింగమ్
సంచితపాపవినాశక  లింగం
....తత్ప్రణమామి సదాశివలింగమ్

6..దేవగణార్చితసేవితలింగం
....భావైర్భక్తిభిరేవ  చ లింగమ్
దినకరకోటి ప్రభాకరలింగం
....తత్ప్రణమామి సదాశివలింగమ్

7..అష్టదళో పరివేష్టితలింగం
....సర్వసముద్భవకారణలింగమ్ 
అష్టదరిద్ర వినాశనలింగం
....తత్ప్రణమామి  సదాశివలింగమ్

8..సురగురు సురవర పూజితలింగం
....సురవనపుష్పసదార్చితలింగమ్ 
పరమపదం పరమాత్మక లింగం
....తత్ప్రణమామి  సదాశివలింగమ్

లింగాష్టక  మిదం పుణ్యం
....యఃపఠే చ్చివసన్నిధౌ
శివలోక  మవాప్నోతి
....శివేన  సహ  మోదతే.

గౌరీస్తుతి 

నానాయోగిమునీంద్ర హృద్యనిలయాం
నానార్ధసిద్ధిప్రదాం
నానాపుష్పవిరాజితాంఘ్రియుగళాం
నారాయణేనార్చితామ్
 నాదబ్రహ్మమయీం  పరాత్పరాం
నానార్ధతత్వాత్మికాం
మీనాక్షీం  ప్రణతోస్మి  సంతత మహం
కారుణ్యవారాన్నిధిమ్ .


శ్రీ మాత్రే నమః శ్రీ పరమాత్మనే నమః



 వ్రాసిన విషయాలలో ఏమైనా  అచ్చుతప్పులు  వంటివి ఉంటే ,  దయచేసి  క్షమించమని దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.



Sunday, November 11, 2018

ఓం....




నాగుల చవితి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలండి. 



Wednesday, November 7, 2018

ఓం..


శ్రీలక్ష్మీనారాయణులకు వందనములు.

అందరికీ దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలండి.

లక్ష్మీదేవి అనే రూపాలుగా ఉంటుంది. 

 ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి..ఇలా  లక్ష్మీదేవిని పూజిస్తారు. 

ఇంకా..  వరలక్ష్మి, స్వర్గలక్ష్మి, మోక్షలక్ష్మి..గా  కూడా లక్ష్మీదేవిని పూజిస్తారు. 

దైవానికి వందనములు.