koodali

Friday, December 15, 2023

ఈ ఆచారం ఎక్కడవరకు వెళ్ళిందంటే..

 

  పాతకాలంలో నెలసరి రోజుల్లో స్త్రీలు ఎన్నో నియమాలను పాటించేవారు.  ప్రాచీనులు కొన్ని నియమాలను చెప్పారు.. అయితే కొందరు వాటిని ఎక్కువ చేసి, మూఢత్వంగా తయారుచేసారు. ఇది ఎక్కడవరకు వెళ్ళిందంటే, కొన్ని ప్రాంతాలలో నెలసరిలో ఉన్న స్త్రీల కొరకు  బయట చిన్నగుడిసె వేసి మూడు రోజులూ అక్కడ కూర్చోవటమనే స్థాయికి కూడా వెళ్ళింది. మరికొందరి విషయంలో దూరంగా గుడిసెలో కూర్చోకపోయినా ఇంట్లోనే పక్కన కూర్చోబెట్టి, ఒక అసహ్యకరమైన వ్యక్తిని చూస్తున్నట్లు వారితో ప్రవర్తిస్తారు.


నేపాల్ లో చాలా ప్రాంతాలలో ఇలా దూరంగా గుడిసెలలో ఉంచే ఆచారం ఉందట. ఆలా ఉంచటం వల్ల పాములు, తేళ్లు కుట్టి కొందరు చనిపోయారట. కొందరు అనారోగ్యం పాలయ్యారట. కొన్ని అఘాయిత్యాలు కూడా జరిగాయని వ్రాసారు. ఇప్పుడు ప్రభుత్వం అలా గుడిసెలలో ఉండటాన్ని నిషేధించిందట. మనదేశంలో కూడా కొన్ని ప్రాంతాలలో నెలసరి స్త్రీలను వేరే గుడిసెలలో ఉంచటం అనే పద్ధతి ఉందట.


మహారాష్ట్రలో కొన్నిచోట్ల నెలసరిలో ఉన్న స్త్రీల కొరకు కొన్ని స్వచ్చంద సంస్థలు గుడిసెల బదులు సౌకర్యాలతో కూడిన ఇళ్ళను కట్టి అక్కడ ఉంచుతున్నారట. నెలసరి అని ఇలా ఇళ్ళకు దూరంగా ఉంచటం ఏంటో ఖర్మ. 

 

  ఇలా తల్లులు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు చంటి పిల్లలు తల్లికొరకు ఏడుస్తారు. పిల్లల్ని ఇరుగుపొరుగుదగ్గర  వదలకూడదు. ఏంటో ఇవన్నీ. ఆచారాలలో మూఢత్వం ప్రవేశించకూడదు. 


  నెలసరి సమయంలో గర్భసంచి సున్నితంగా ఉంటుంది. అందువల్ల ఎక్కువ పనిచెయ్యకుండా, కొంత రెస్ట్ ఉండటం, అనారోగ్యం లేకుండా కొన్ని నియమాలను పాటించటం.. వంటివి మంచిదే కానీ, ఆ పేరుతో అతి చేయటం సరైనది కాదు.  కొందరైతే, నెలసరి వచ్చిన వారిని చూసి అసహ్యంగా చూస్తూ దూరంగా తప్పుకోవటం, వారికి కంచంలో కొద్దిగా ఆహారాన్ని వేసి, దూరం నుంచి ప్లేటును నెట్టటం..వంటివి చేస్తుంటారు. ఇక పండుగలప్పుడు, వివాహాదిశుభకార్యాలప్పుడు  నెలసరి వస్తే , వచ్చిన వారిని తిట్టిపోస్తారు. అనేకమంది  నెలసరి రాకుండా మందులు వాడుతూ ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు.


నెలసరి అంటే సంతానానికి సంబంధించిన విషయం. నెలసరి లేనిదే సంతానం లేదు. ఆ సమయంలో వారిని పక్కన కూర్చోబెట్టి,  కొంత రెస్ట్ ఇచ్చి, ఆరోగ్యకరమైన భోజనం వండి ఇచ్చి, మంచిగా చూసుకోవచ్చు. వారిపట్ల అగౌరవంగా ప్రవర్తించకూడ
దు.

    ఈ రోజుల్లో నెలసరి సమయంలో  స్త్రీలు కాలేజీలకు, ఉద్యోగాలకు, పనులకు వెళ్తున్నారు కదా..మరి అంటుముట్టు ఎలా పాటిస్తారు?


  నెలసరిలో స్త్రీలనుండి నెగటివ్ఎనెర్జీ వస్తుందని కొందరు అంటున్నారు. పాపాలు చేసేవారినుండి, మద్యమాంసాలు తీసుకున్నవారి నుండి కూడా నెగటివ్ ఎనెర్జీ వస్తుంది. 

అందుకే, పాపాలు చేసేవారికి దూరంగా ఉండాలంటారు. ...దుష్టులకు దూరంగా ఉండటం కుదరనప్పుడు, మంచివారు దైవస్మరణ చేసుకోవాలి.

పాపాలు చేసేవారినుండి వచ్చే నెగటివ్ ఎనెర్జీతో పోల్చుకుంటే, ప్రకృతిసహజమైన నెలసరి వల్ల వచ్చే నెగటివ్ ఎనెర్జీ ఫరవాలేదు.

ఆచార వ్యవహారాలను మంచిగా పాటించాలి. మూఢత్వంగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఒక లింక్..

Story Of A Young Bride | Gaokor- A Period House

 *****************

 మరి కొన్ని విషయాలు...
 
నెలసరి నియమాలను పాటిస్తే మంచిది. అయితే, ఈరోజుల్లో నెలసరినియమాలు నూటికినూరుశాతం పాటించాలంటే అందరికీ కుదరకపోవచ్చు. సూపర్ బజారుకో, బట్టలషాపుకో వెళితే ఆడవాళ్ళు ఉంటారు. రైలు ఎక్కితే ఆడవాళ్ళుంటారు. అంతమందిలో నెలసరిలో వారూ ఉంటారు. అలాగని ఇంటికొచ్చి అదేపనిగా తలస్నానాలు చేస్తే,  అనారోగ్యం వచ్చే అవకాశముంది. అందువల్ల కొద్దిగా పసుపునీళ్లు చిలకరించుకోవచ్చు..


ఆచారవ్యవహారాలను పద్ధతిగా పాటించాలి. అయితే, కొందరు మూఢనమ్మకాలతో పాటిస్తారు. మూఢనమ్మకాల వారికి చెప్పేదేమిటంటే, నెలసరి ఇంట్లో కలిపేసుకుంటే దోషమని భయపడి, మూఢత్వంగా  చేయవద్దు. ..దీనికి సంబంధించిన ఒక  లింక్ పోస్టులో ఉంది. ఆ సినిమాలోలా మూఢత్వంగా ఎవ్వరూ చేయవద్దు. 


పాతకాలంలో కొందరు.. నెలసరి స్త్రీలంటే గౌరవం లేకుండా, వారు బాధపడేలా మాట్లాడేవారట. ఇలా ప్రవర్తించటం సరైనది కాదు.

*******
 పాపాలు చేసేవారి నుండి కూడా నెగటివ్ ఎనెర్జీ వస్తుందని ఇంతకుముందు వ్రాసాను. దానిగురించి మరికొన్ని విషయాలు..

ఎక్కువ మంచిపనులు చేసేవారికి పాజిటివ్ ఎనెర్జీ ఉంటుంది. ఎక్కువపాపాలు చేసేవారికి నెగటివ్ ఎనెర్జీ ఉంటుంది.. ఇవి ఒకరినుంచి ఇంకొకరికి తగిలే అవకాశాలు కూడా ఉంటాయి.

 

 ఇంకో విషయం ఏమిటంటే.. అన్ని వస్తువులకు, మనుషులకు ఆరా అని ఉంటుందట. ఆరాను కొందరు ఫోటోలు కూడా తీసారు.  మనుషుల ప్రవర్తన బట్టి ఆరా ఉంటుందంటారు. మనుషులు  ధ్యానం చేసేటప్పుడు దగ్గరగా కూర్చోకుండా కొంతదూరంలో కూర్చోవాలట. ఒకరి ఆరా ఇంకొకరిని ప్రభావితం చేయకూడదంటే,  కొంతదూరం పాటించాలట. ఆరా  గురించి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి.  

*జీవితంలో దైవభక్తిని కలిగి సత్ప్రవర్తనతో జీవించడానికి ప్రయత్నించాలి.

 

Friday, September 8, 2023

పాపాలు చేసే వారి పట్ల అంటరానితనాన్ని పాటించాలని..

 

Wednesday, December 10, 2014

పాపాలు చేసే వారి పట్ల అంటరానితనాన్ని పాటించాల..


  • పూర్వీకులు  అంటరానితనాన్ని  ప్రోత్సహించారని  కొందరు    తప్పుపడతారు. దయచేసి  పెద్దలను  తప్పు  పట్టవద్దు . 

    పశుపక్ష్యాదులనే  పూజించమని  చెప్పిన  పెద్దలు  సాటి  మనుషులను  తక్కువగా  చూడమని  చెప్పరు  కదా  !

    దైవం దృష్టిలో   అందరూ సమానమేనని   పెద్దలు  ఎంతగానో   చెప్పటం   జరిగింది. పురాణేతిహాసాలలో దీనికి ఎన్నో ఉదాహరణలు కూడా చెప్పబడ్డాయి .

    ధర్మరక్షణకోసం  విష్ణుమూర్తి  దశావతారాల్లో  జంతుజన్మలను  ధరించటానికి  కూడా  వెనుకాడలేదు.


    ఈ   విషయాలను  గమనిస్తే , సృష్టిలో  ఏ  జీవినీ  తక్కువగా  చూడకూడదని  తెలుస్తుంది.

    అందుకే   పశుపక్ష్యాదులను,  చెట్లను  కూడా  పూజించి  గౌరవించమని  పూర్వీకులు  మనకు  నేర్పించారు. 


    వేదములలోని  విషయములను  చక్కగా  అర్ధం  చేసుకోవటానికి   పురాణేతిహాసాలు  తోడ్పడుతాయి.  


    వేదపురాణేతిహాసాలలోని  భావాలను  సమాజానికి  మరింత  చక్కగా  తెలియజేయటానికి ఎందరో  అవతారమూర్తులు,  మహానుభావులు  జన్మించారు.

    వీరి  బోధనలు  మరియు  ,  ఆచరణ  ద్వారా  ఏది  ధర్మం,  ఏది  అధర్మం  అనే  విషయములు    అందరికీ  తెలుస్తాయి.  


      శ్రీ  రాముడు  శూద్ర  స్త్రీ  అయిన   శబరి  సమర్పించిన  ఫలాలను  స్వీకరించారు.  గుహునితో  స్నేహం  చేశారు. శ్రీరాములవారు  అంటరానితనాన్ని  పాటించలేదు.

    భగవద్గీతలో శ్రీకృష్ణుడు .... అందరూ సమానమేనని చెప్పటం జరిగింది.


    శ్రీపాద శ్రీవల్లభుల సంపూర్ణ జీవిత చరిత్రము ..గ్రంధములో  కూడా ఇలాంటి   విషయములు   వివరంగా  చెప్పబడ్డాయి.


     ఆది శంకరాచార్యుల జీవితంలోని ఒక సంఘటన ద్వారా .... అంటరానితనం తప్పు ....అని తెలుస్తోంది.  శివుడే  ఈ  విషయాన్ని  తెలియజేశారంటారు. 


     మహావతార్  బాబాజీ  శిష్యులైన  లాహిరీ  మహాశయులు, స్వామి యుక్తేశ్వర్ , పరమహంస  యోగానంద,  రామకృష్ణపరమహంస,  వివేకానందుడు...మొదలగువారు  గొప్ప  మహానుభావులు.  వీరు   అంటరానితనాన్ని   పాటించలేదు.

  • ఒక యోగి ఆత్మకధలో ..... లాహిరీ మహాశయుల వారికి అన్ని కులాల నుంచి శిష్యులు ఉండేవారని చెప్పటం జరిగింది.

    రామకృష్ణమఠంలో అన్ని కులాలు, మతాల వారికి   ప్రవేశం ఉంది.


    అంటరానితనాన్ని  అగ్రవర్ణాల   వాళ్ళు  పాటించారని  కొందరు  అంటారు.  
     అగ్రవర్ణాలవాళ్ళలో ఇతరులను  ఎంతో చక్కగా  ఆదరించిన  వారెందరో  ఉన్నారు.  అగ్రవర్ణాల లో  కూడా పేదరికంతో  దయనీయంగా  జీవిస్తున్నవారెందరో  ఉన్నారు. 

     కొన్ని  గ్రామాలలో  ధనవంతులైన  శూద్రులు   పేదవారైన  శూద్రుల  పట్ల   పట్ల  అంటరానితనాన్ని పాటించారు.  



  •   వేదములలోని  కొన్ని  విషయాలు .....ఈ విషయాలు    అంతర్జాలంలో  సేకరించినవి.

     Before we begin our journey of solving the caste-puzzle through Vedas, let us start with certain worship mantras from Vedas that mention Shudras:


    Yajurved 18.48:
    O Lord! Provide enlightenment/ compassion to our Brahmins, Kshatriyas, Vaishyas and Shudras. Provide me also with the same enlightenment so that I can see the truth.

    Yajurved 20.17:
    Whatever crime we have committed against my village, forest or committee; whatever crime we have committed through our organs, whatever crime we have committed against Shudras and Vaishyas, whatever crime we have done in matters of Dharma, kindly forgive us relieve us from the tendency of the same.

    Yajurved 26.2:
    The way I gave this knowledge of Vedas for benefit of all humans, similarly you all also propagate the same for benefit of Brahmins, Kshatriyas, Shudras, Vaishyas, Women and even most downtrodden. The scholars and the wealthy people should ensure that they not deviate from this message of mine
    .***
     There are several shlokas in Manusmriti that state that a person belonging to high Varna falls down to level of a Shudra (uneducated) if he does not conduct noble deeds. For example,

    2.104: A person who does not worship the Supreme Lord twice daily should be considered a Shudra.

    2.172. He who has not been initiated with teaching of the Vedas is a Sudra.

    4.245: A Brahmin acquires brilliance through company of noble persons and avoiding bad company. On contrary, if he indulges in bad company, he becomes a Shudra.



    గ్రంధముల  ద్వారా  తెలుసుకున్న  మరి  కొన్ని  విషయములు.....

    బ్రాహ్మణ  క్రత్రియ  వైశ్యులను  ద్విజులు అంటారు...ఉపనయనం  జరగకుండా  వారికి  ద్విజత్వం  రాదు.  అందాకా  వీళ్ళు  శూద్రుల  కిందనే  లెక్క.  రాకుమారులకు  11  వ ఏట,  బ్రాహ్మణ పుత్రులకు  ఎనిమిదవ  ఏట, వైశ్య  తనయులకు  పన్నెండవ  ఏట  ఉపనయనం  చెయ్యాలని  ధర్మశాస్త్రాల  నిర్ణయం......... అన్నట్లు    పెద్దలు  తెలియజేశారు.


    భీష్ముల  వారి  విషయంలో............

    భారతంలో , భీష్ముల  వారు అంపశయ్యపై  ఉన్నప్పుడు  వారే  తెలియజేసిన  విషయాన్ని  బట్టి ,  వ్యక్తులు  తినే  ఆహారాన్ని  బట్టి    మనస్తత్వంలో  మార్పులుచేర్పులు  వస్తాయని  తెలుస్తుంది. 


      అధర్మంగా  ప్రవర్తించే  వారి  వద్దనుంచి  స్వీకరించే  ఆహారం  వల్ల  కూడా స్వీకరించిన వారి  మనస్తత్వంలో  మార్పులుచేర్పులు  వస్తాయని  తెలుస్తుంది.

     దుర్యోధనుడు  గొప్ప  వంశంలో   జన్మించినా   కూడా  ,అధర్మపరుడైనందువల్ల  అతని  నుంచి  స్వీకరించిన  ఆహారం  వల్ల  భీష్ముల  వారికి  కష్టాలు  వచ్చాయి.  


    శ్రీ కృష్ణుల వారు   కూడా.....దుష్టుడైన  దుర్యోధనుని  ఆహ్వానాన్ని  తిరస్కరించి , సౌమ్యుడైన  విదురుని  ఆతిధ్యాన్ని స్వీకరించారు. 

    పై  విషయాలన్నీ  గమనిస్తే  ,  అధర్మంగా  ప్రవర్తించేవారిపట్ల..,   పాపాలు  చేసే వారి  పట్ల  అంటరానితనాన్ని  పాటించాలన్నది . పెద్దల  అభిప్రాయం  అనిపిస్తుంది.


    కొందరు  గొప్ప పదవి  లభించినా  అంతటితో  తృప్తిని  పొందక  ఇంకా  ఏదో  కావాలని  అశాంతితో  జీవిస్తారు. 


     భగవదనుగ్రహాన్ని  పొందాలంటే  నిష్కామకర్మతో జీవించాలని పెద్దలు  తెలియజేశారు.  

  • నిష్కామ  కర్మతో  జీవించేవారు  మహారాజ  పదవిలో  ఉన్నా,   పొంగిపోకుండా  ప్రశాంతంగా  జీవించి  దైవకృపకు  పాత్రులవుతారు.    జనకమహారాజులా.  


     నిష్కామ  కర్మతో  జీవించేవారు  ఆడంబ
    రాలు  లేకున్నా  ,   క్రుంగిపోకుండా  ప్రశాంతంగా  జీవించి  దైవకృపకు  పాత్రులవుతారు . .శబరిలా .

    భగవంతుని  కరుణను  పొందిన  జీవులలో   పశువులు,  పక్షులు,   పేద వారు,  ధనవంతులు, అన్నిరకాల  జీవులు  ఉన్నారు. అంతా  దైవం  దయ.
  •  .....
  •  

ఇప్పుడు ఎవరెంత మంచిగా ఉంటున్నారు?

 
కొందరు ..మతం పేరుతో, కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి తమ పబ్బం గడుపుకుంటున్న పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఎప్పటినుంచో ఉంది...ఇలాంటి వారి మాటలు విని ప్రజలు గొడవలు పడుతుంటారు.

ఇంకా ఎన్నాళ్లు ప్రజల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకుంటారు? నిజంగా ప్రజలపై జాలి ఉంటే వాళ్లకున్న సంపదలో కొద్దిగా తమకు ఉంచుకుని, మిగతాది పేద ప్రజలకు ఇచ్చేస్తే బాగుంటుంది. మతాలు, కులాలు, ప్రాంతాలు, దేశాల పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు ఎగదోసి తాముమాత్రం కోట్ల సంపదలు కూడబెట్టుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. మరి కొందరు ముందు జాగ్రత్తతో ప్రజలకు కూడా గోరంత ఇచ్చి, తాము కొండంత సంపాదించుకుంటారు.

కొందరి ప్రవర్తన పైకి కనిపించేదొకటి..వెనుక ఉండేదొకటి.

పూర్వం జరిగిన సంగతులు అలా ఉంచితే, ఈ రోజుల్లో ఎవరు ఎంత వరకూ సాటిమనుషులను గౌరవిస్తున్నారో? ఎవరికి వారు ఆలోచించుకోవాలి. ఇంట్లో పనిచేసే సర్వెంట్ ను విసుక్కోకుండా ఎంతమంది ఆప్యాయంగా చూసుకుంటున్నారు? చాలామంది తమ ఆఫీసులో పై అధికారికి నమస్కరిస్తారు, గౌరవిస్తారు, మరి ఆఫీసు గుమ్మం బయట కాపలా ఉండే వ్యక్తి మనకు నమస్కరించినప్పుడు, ప్రతినమస్కారం చేసి గౌరవంగా మాట్లాడేవారు ఎంతమంది? రోడ్డుప్రక్కన ఉండే బిచ్చం ఎత్తుకునే వారిని సాటిమనిషిగా అయినా గౌరవించే వారెందరు? ఇంట్లో పిల్లల అభిప్రాయాలకు కొంతయినా విలువ ఇచ్చే పేరెంట్స్ ఎందరు? నీకు ఏం తెలుసు? మేము చెప్పిన చదువు మాత్రమే నువ్వు చదవాలి..అని మాట్లాడే పేరెంట్స్ ఎందరో ఉన్నారు.కుటుంబాలలో కూడా మెతకగా ఉండేవారిని గడుసుగా ఉండేవారు ఏడిపిస్తారు. ఇలా ఎన్నో అసమానతలు, అణచివేతలు ఇం
టాయటా ఉన్నాయి.

ఈ ప్రపంచంలో బలహీనులను బలవంతులు అణచివేస్తున్నారంటూ గగ్గోలు పెట్టే ఎందరో మనుషులు..మూగజీవులైన పశుపక్ష్యాదులను చంపి తింటున్నారు. అప్పుడు ఈ మాటలు వర్తించవా? మూగజీవులపైన మన పెత్తనమేమిటి? వాటికీ ఈ ప్రపంచంలో జీవించే హక్కు ఉంది.

ఈ రోజుల్లో కూడా తేడాలుంటున్నాయి. ఉదా.. వైద్యులకు ఇచ్చినంత గౌరవం, జీతం నర్సులకు ఉంటుందా? నర్సులు రోగులకు ఎంతో చేస్తారు.వారి రక్తం, మలమూత్రాలను కూడా శుభ్రం చేస్తారు. నర్సుల సాయం లేనిదే రోగులకు, వైద్యులకు కూడా  కుదరదు.అలాగని, వైద్యులకు, నర్సులకు ఒకే జీతం ఇవ్వాలంటే ఎంతమంది  ఒప్పుకుంటారు? డాక్టర్లు ఏమంటారంటే, మేము అన్ని సంవత్సరాలు కష్టపడి చదివాము..మాకు..నర్సులకు ఒకేలా జీతాలు ఎలా ఇస్తారంటారు. తేలికగా అర్ధం అవ్వటం కోసం వైద్యుల ఉదాహరణ చెప్పాను.. ఏ రంగంలో వారికైనా ఇది వర్తిస్తుంది.
 
ఈ రోజుల్లో కూడా మరి గార్డులుగా పనిచేసేవారు కొందరు వారి కష్టాల గురించి చెప్పి బాధపడుతున్నారు.ఈ గార్డుల్లో అన్ని కులాల వాళ్లున్నారు.

ప్రజల  మధ్యన  ఆర్ధిక అసమానతలు తగ్గితే అన్ని అసమానతలు తగ్గుతాయి. అందుకే, ఒకే ఆఫీసులో పనిచేసేవారి జీతాల విషయంలో పెద్ద తేడాలు లేకుండా చేస్తే బాగుంటుందేమో? అనిపిస్తుంది. ఈ విషయాల గురించి ఇంతకుముందు కొన్ని పోస్టులు వ్రాసాను. అనేక చర్చలు కూడా జరిగాయి.

ప్రాచీన గ్రంధాలలో అంటరానితనం లేదని నేను వివరించాను. క్రమంగా కొందరు తెలిసీతెలియని వారి వల్లా, కొందరు స్వార్ధపరుల వల్లా సమాజంలో అంటరానితనం..వంటి దురాచారాలు ప్రవేశించాయి.

అంటరానితనం పేరుతో సాటి మనుషులను వేరుగా పెట్టడం ఖచ్చితంగా తప్పే.అలా వేరుచేయబడ్దవారు ఎంతో బాధపడతారు.
పాతకాలంలో కొందరి శ్రమశక్తిని కొందరు  దోచుకున్నారని అంటారు.మేము ఎవరినీ దోచుకోలేదు.. మేమూ కష్టాలు అనుభవించాము అంటారు కొందరు. ఎవరి వాదన వారిది.
 
 మనము మాత్రమే  బాధలు పడ్డాము అనుకోనక్కరలేదు. ఎవరి కష్టసుఖాలు వారికున్నాయి. బ్రాహ్మణులు ఉపవాసాలని సరిగ్గా  ఆహారం కూ
డా తినకపోవటం,  తలస్నానాలు, కఠినమైన ఆచారాలను పాటించటం..వంటివి చేస్తారు. అలా పాటించాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది.వేరే వృత్తులు  చేయకూడదని వచ్చిన ఆదాయంతోనే సరిపెట్టుకుంటారు..
రాజులు, సైనికులు వంటివారు ..యుద్ధానికి వెళితే తిరిగి వస్తారో రారో తెలియదు. ఇలా ఎవరి బాధలు వారికి ఉన్నాయి. అన్ని కులాల్లోనూ మంచివారుంటారు, చెడ్దవారుంటారు.

సమాజంలో ఎన్నో వృత్తులుంటాయి. ఆవన్నీ లేనిదే సమాజం సరిగ్గా నడవదు.శూద్రులు రకరకాల పూజలు చేయకపోయినా ఫరవాలేదు, కొంత పూజ చేసినా చాలు.. చక్కటి ఫలితం వస్తుందని గ్రంధాలలో తెలియజేసారు. .. కొందరికి ఇది నచ్చదు. 

 హమ్మయ్య....పూజ కొంత చేసుకున్నా చక్కటిఫలితం వస్తుందంటే మంచిదే కదా..  అనుకునే శూద్రులూ ఉన్నారు.  శూద్రులకు ఎన్నో వెసులుబాట్లున్నాయి. వీరికి  ఆహారం విషయంలో   ఉల్లి, వెల్లుల్లి..వంటివి తినకూడదనే  నియమాలు లేవు. మడి వంటివి ఉండవు.

 ప్రత్యేకపూజలు చేయాలనుకుంటే కొన్ని నియమాలను పాటించాలి. జాగ్రత్తలు తీసుకోవాలి. నియమాలను పాటించనివారు, మాంసాహారం తినేవారు ఈ పూజల విషయంలో పండితులను సంప్రదించి ఆచరించటం మంచిది.

పాతకాలంలో మడి అని అందరినీ దూరంగా ఉంచారని అంటారు కొందరు. బ్రాహ్మణులలో కూడా మడికట్టుకున్నప్పుడు వారి ఇంట్లో వారిని కూడా అందరినీ ముట్టుకోరు.

 పాతకాలంలో అంటరానితనం లేదు. ఎవరిపనిని వారు చక్కగా చేసుకునేవారు. ఎవరి గౌరవం వారికి ఉండేది. పాతకాలంలో భారతదేశం ఎంతో సుసంపన్నంగా ఉండేది.ఈ విషయాలను ఎందరో విదేశీ యాత్రీకులు కూడా  తమ గ్రంధాలలో వ్రాసారు.అయితే, మధ్యకాలంలో విదేశీదండయాత్రల వల్ల వ్యవస్థ మారిపోయింది.

 ఇక్కడి సంపదపై కన్నేసిన కొందరు విదేశీయులు ఇక్కడకొచ్చి, ఇక్కడవారిని భయపెట్టి, బెదిరించి కొంత లోబరుచుకున్నారు. ప్రతిసమాజంలోనూ కొందరు చెడ్దవారుంటారు. వారు శత్రువులకు సహకరించారు. క్రమంగా అనేక చెడ్దవిషయాలు సమాజంలో ప్రవేశించాయి. విభజనలు జరిగాయి. మనుషుల మధ్య విభేదాలు ఏర్పడ్దాయి.

 విదేశాల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. సంపన్నులు..పేదల మధ్య దూరం, తెల్లవారు..నల్లవారి మధ్య దూరం..ఒక్క మతం వారి మధ్యే గొడవలు.. ఇలాంటివి ప్రపంచమంతటా ఉన్నాయి. ఇక్కడే భారతదేశంలోనే ఉన్నాయనుకోవటం మూర్ఘత్వం.హిందువుల్లో కులాలున్నాయంటారు. ఇతర మతాల వారిలో కూడా తెగలున్నాయి. వారి గొడవలు వారికున్నాయి.

  పాతకాలంలో శూద్రులు అంటరానితనం వల్ల ఇబ్బందులు పడ్దారని, వారు పైకి రావాలని ఈ మధ్య కాలంలో అనేక చట్టాలు వచ్చాయి. అంటరానితనాన్ని నిర్మూలించటానికి చట్టాలు తప్పకుందా రావాలి. ఇందువల్ల పరిస్థితి మెరుగుపడింది..  రిజర్వేషన్లు కూడా వచ్చాయి. కొద్దిగా ప్రారంభమయిన రిజర్వేషన్లు ఇప్పుడు బాగా పెరిగాయి.  

  రిజర్వేషన్లు లేని కులాల్లో కూడా ఆర్ధికంగా ఎంతో వెనుకబడిన వారు ఎందరో ఉన్నారు. వీరికి చదువులు, ఉద్యోగాలు లభించటం కొంత కష్టంగా ఉంది.

ఇంకో కొందరున్నారు. వారు శూద్రులలోనే కొన్ని కులాలు. వీరు ఆర్ధికంగా ముందున్నారని వీరికి  రిజర్వేషన్లు  ఇవ్వలేదు...దీనినిబట్టి  ఏ కులంలో వారైనా ఆర్ధికంగా బాగుపడితే ఇక వారికి రిజర్వేషన్లు అక్కరలేదు అని, అనుకోవచ్చేమో..

 రిజర్వేషన్లు  లేని శూద్రులలో కూడా  ఎందరో పేదవారున్నారు.  వీళ్ళు ఏమంటారంటే.. మేము పాతకాలంలో అంటరానితనంతో బాధపడ్దాము. ఇప్పుడు రిజర్వేషన్లు కూడా లేవు..ఇలా రెండు విధాలుగా అన్యాయం జరుగుతోందంటారు.  

 ఆర్ధికంగా వెనుకబడినవారికి చదువుకోవటానికి, వ్యాపారానికి నిలదొక్కుకోవటానికి ప్రభుత్వాలు ఆర్ధికంగా సహాయం చెయ్యవచ్చు. అంతేకానీ, ఎంతో కష్టపడి చదివిన మాకు  సీట్లు, ఉద్యోగాలు ఇవ్వకపోవటం అన్యాయం. పాతకాలంలో కొందరికి అన్యాయం జరిగిందని.. ఇప్పుడు మరి కొందరికి అన్యాయం చేయటం ఏం న్యాయం? మమ్మల్ని ఇలా అణచివేస్తుంటే మేము ఎవరికి చెప్పుకోవాలంటున్నారు.

ఈ కొత్త అసంతృప్తులను గమనించి కాబోలు..ఈ మధ్య అన్ని కులాల్లోనూ ఆర్ధికంగా వెనుక బడినవారికి  కొద్దిశాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. అయితే, అవకాశాలు లేనివారు మరెందరో ఉన్నారు. వీటన్నింటివల్ల ప్రజల మధ్య విద్వేషాలు పెరుగుతున్నాయి. కనిపించకుండా ప్రజల మనస్సుల్లో విభేదాలు ఉంటున్నాయి.

 ఇవన్నీ లేకుండా ఉండాలంటే అందరికీ అన్ని అవకాశాలు చక్కగా ఉండాలి.
 
కొందరేమో రిజర్వేషన్లు తీసివేయాలంటారు. కొందరేమో కులాలు, మతాలు తీసివేయాలంటారు. రిజర్వేషనులు, కులాలు, మతాలు..పోయే పరిస్థితి ప్రస్తుతం కనిపించటం లేదు. అందువల్ల అన్నీ ఉండకతప్పని పరిస్థితి ఉంది కాబట్టి, అవన్నీ ఉండక తప్పదు.

 కులవ్యవస్థ పోవాలంటారు, అయితే వెనుకబడ్ద కులాలు అని అంటున్నవారిలో కూడా ఎవరి కులంలో వారినే వారు వివాహం చేసుకుంటారు. హిందువులలో కొందరు, ఒకే కులంలో కూడా శాఖా భేదాల వల్ల వివాహాలు చేసుకోరు.

 మతాలు, కులాలలో మూఢనమ్మకాలు, అంటరానితనం వంటివి పోవాలి. రిజర్వేషన్లు ఉన్న కులాలలో కూడా ధనవంతులు, బాగా చదివి పెద్ద స్థాయిలో ఉన్నవారు ఉన్నారు. వారిలో కొందరు తమ రిజర్వేషన్లు వదులుకున్న గొప్పవారున్నారు. కొన్ని కులాలవారు  తమ రిజర్వేషన్ కోటాలో కొంత తగ్గించుకుని ఇతర శూద్రులకు వాటా ఇవ్వవచ్చు.

అప్పుడైనా ఇప్పుడైనా సమాజంలో కొందరికి అవకాశాలు బాగుండటం..కొందరికి అవకాశాలు తగ్గటం.. అనే విధమైన వ్యవస్థ సరైనది కాదు. అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. అసమానతలు ఉండకూడదు. సంపద కొందరు ధనవంతుల వద్ద మాత్రమే కాకుండా, అందరి వద్దా ఉండేలా వ్యవస్థ మారినప్పుడు అందరికీ చదువు,ఉపాధి అవకాశాలు చక్కగా ఉంటాయి.అసమానతలు తగ్గుతాయి.

సమాజంలోనూ, కుటుంబాల్లోనూ.. అందరూ ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చుకుంటూ ఉండాలి, . అందరూ కష్టపడి పనిచేసుకోవాలి. అందరూ చేసే పని ఒకేలా ఉండకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో రకం పని ఉంటుంది.

 
  సమాజం, కుటుంబం  అన్నాక కొంతయినా ఒకరితో ఒకరు సర్దుకుపోవాలి. అప్పుడే కుటుంబమయినా, సమాజమయినా బాగుంటుంది.  స్వేచ్చ అని ఎవరిష్టానికి వారు ప్రవర్తించటం వల్ల సమాజానికి హాని కలుగుతుంది. మేము చెప్పినట్లే అందరూ వినాలని అహంకరించినా సమాజానికి హాని కలుగుతుంది.

సమాజంలో కొన్ని కట్టుబాట్లు ఏర్పరుచుకుని ముందుకుపోవాలి. లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవాలి.
.....
ప్రపంచంలో  అధికారం, డబ్బు కొరకు ఎంతకైనా దిగజారుతున్నారు కొందరు. వారి మాటలు నమ్ముతున్నారు కొందరు ప్రజలు.

విదేశీయులు చాలా కాలం భారతదేశాన్ని పాలించారు. అప్పుడు వారివల్ల భారతీయులు ఎన్నో కష్టాలు అనుభవించారు. భారతదేశాన్ని పాలించిన విదేశీయులు ఇక్కడి ప్రజలను ఎన్నోబాధలు పెట్టారు. స్త్రీలపట్ల అవమానాలు చేసారు. అన్యాయాలకు ఎదురుతిరిగి పోరాడిన యువకులను చంపివేసారు. అప్పుడు కూడా  కొందరు స్వదేశీయులే తమ స్వార్ధం కొరకు వారికి సహకరించారు. ఈ రోజుల్లో కూడా కొందరు స్వదేశీయులు దేశానికి ద్రోహం చేస్తున్నారు. 


 ప్రపంచయుద్ధసమయంలో మనకు యుద్ధంతో ఏమీ సంబంధం లేకపోయినా, మన సైనికులను యుద్ధానికి తీసుకెళ్లటం వల్ల ఆ కొత్త వాతావరణంలో యుద్ధం చేయలేక వేలమంది సైనికులు చనిపోయారు.

****
 ఈ మధ్యన..మనుషులు మతాల పేరుతో,కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో, దేశాల పేరుతో.. ఒకరికొకరు నిందించుకోవటం ఎక్కువయ్యింది. ఎవరికైనా దైవం ఒక్కరే.. ఆ మహాశక్తి ఒక్కటే. ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క దైవం సృష్టించరు. అయితే ఇతరులు మనల్ని అణచివేస్తారేమో? అనే భయాల వల్లా, ఇతరులపై మనమే ఆధిపత్యం చెలాయించాలనే ధోరణి వల్లా.. ఇలాంటి కొందరి వల్ల సమాజం అంతా సమస్యలు వస్తుంటాయి.

  గొడవకొరకే కొందరు వాదనలకు దిగుతారు. అలాంటివారు ఎవరేం చెప్పినా వినిపించుకోరు.

ఓట్ల కొరకు పార్టీలు ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ప్రజలు కూడా అలాంటి వారికే ఓట్లు వేస్తున్నారు. మతం పేరుతో, కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి తమ పబ్బం గడుపుకుంటున్న వారి విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు ఆలోచించాలి. ప్రజలు విచక్షణతో ఉండకపోతే ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు.

 ప్రపంచంలోని అందరూ సుఖసంతోషాలతో ఉండాలి.చెడు పోవాలి.

 నా అభిప్రాయాలు కొందరికి  నచ్చకపోవచ్చు. నాకు తోచినవి వ్రాసాను.  వీటిలో చాలా విషయాలను ఇంతకుముందే బ్లాగులో వ్రాయటం జరిగింది. ఎవరు ఎన్ని చెప్పినా అనేవాళ్లు అంటూనే ఉంటారు. ఎంతని చెప్పగలం? చేయగలిగినంత చేస్తాము. దైవం ఎవరికి ఏది చేయాలో అది చేస్తారు. అంతా దైవం దయ.


Sunday, August 27, 2023

సంపదలకు నిలయమైన భారతదేశం...ఇప్పుడు..

 చంద్రయాన్ విజయవంతమవటం గర్వించదగిన  ఎంతో గొప్ప విషయం.

భారతదేశం ఒకప్పుడు సిరిసంపదలతో ఉండేది.ఎంతో పరిశుభ్రంగా కూడా ఉండేది. ఇప్పుడు చాలాచోట్ల చూస్తే మురికికుప్పలతో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిని చూసి మనం సిగ్గుపడాలి. ఇండోర్ ఒకప్పుడు చాలా మురికిగా ఉండేదట. ఒక కమిషనర్ గారు కొందరు సిబ్బందితో కలసి ప్రజలను జాగృతం చేసి ఇండోర్ ను ఇప్పుడు శుభ్రమైన నగరంగా మార్చివేసారు. భారతదేశం అంతా అలా పరిశుభ్రంగా ఎందుకు మార్చుకోలేము? విదేశాల వాళ్ళు ఎంతో శుభ్రంగా ఉంచుకుంటున్నారు. మనమెందుకు ఇలా మురికిగా ఉండాలి. అందరూ తలచుకుంటే శుభ్రంగా ఉంచుకోవటం పెద్ద విషయమేమీ కాదు.  


మొదటగా కనీసం దేవాలయాల వద్ద, నదులను అయినా శుభ్రంగా ఉంచుకోవటాన్ని మొదలుపెడితే బాగుంటుంది. ఈ విషయాల గురించి పదేళ్ళ క్రితమే బ్లాగులో వ్రాసాను. ఇప్పటికీ అలాగే ఉంది పరిస్థితి. జనాల మూఢత్వం చూసి దైవానికి కూడా విసుగు వస్తోందేమో.. భారతదేశం ఇలా పేదరికంలో ఉంది. శుభ్రత ఉన్నచోట లక్ష్మీదేవి ఉంటుందని పెద్దలు తెలియజేశారు. డబ్బు కొరకు విదేశాలకు పరుగులు పెడుతున్న యువత పెరిగిపోతున్నారు. అక్కడ అంతా సుఖమే ఉండదు. విదేశాల్లో కూడా మంచి, చెడు రెండూ ఉన్నాయి. 

 

విదేశాలకు వెళ్లిన భారతీయులు గొప్పగా ఆచారవ్యవహారాలను పాటిస్తున్నారు.. అని కొందరు అంటారు. అక్కడివారు ఎంతకాలం పాటించగలరో చెప్పలేము. ఒక తరం వరకు కొంత పాటించగలరు. అక్కడ ఈ తరంవాళ్ళు కూడా కొందరు మామూలు రోజులలో మంగళసూత్రం తీసివేసి, పండుగలు వస్తే మాత్రం శ్లోకాలు చదివి పూజలు చేయటం చేస్తుంటారు. వారి తరువాతి తరం రెండు సంస్కృతుల మధ్య నలిగిపోయి క్రమంగా మారిపోయే అవకాశం ఉంది. విదేశాల్లో ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. సడన్ గా ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? మన ఇల్లు బాగోలేదని ప్రక్కింటికి వెళ్తామా? మన ఇంటినే మనం బాగుచేసుకుంటాము. విదేశాలకు పరుగులు మారి మనదేశాన్ని మనం బాగుచేసుకోవాలి.విదేశాలకు వెళ్లటానికి కూడా ఒక హద్దు ఉంటుంది. జనాలు వరదలా పోతామంటే అక్కడివాళ్ళే అడ్డుకట్టవేస్తారు. 

 

ఎక్కడైనా సంపద విపరీతంగా పెరిగితే కష్టాలే. ఎంతవరకూ అవసరమో అంతవరకే అయితే మంచిది. ఎందుకంటే, ఒకప్పుడు భారతదేశం సిరిసంపదలతో తులతూగేది. మన దేశాన్ని ఆక్రమించిన విదేశీయులు ఇక్కడనుంచి ఓడలలో బోలెడు బంగారాన్ని,రత్నాలు, వజ్రాలు ఇంకా ఎన్నో విలువైన గ్రంధాలను, అవి చదవడానికి బ్రాహ్మణులను కూడా వారి దేశాలకు తీసుకెళ్ళారని గ్రంధాల ద్వారా తెలుస్తుంది. మన ప్రాచీన విజ్ఞానం గురించి ఎన్నో గ్రంధాలు ఉన్నాయి. టెక్నాలజీ, గొప్పవైద్యం, సర్జరీలు , ఇంకా ఎంతో విజ్ఞానం  ఉంది..

 PraveenMohan తెలుగు అనే బ్లాగ్..చూడవచ్చు.   

JanakiRam.CosmicTubeChannel....చూడవచ్చు.

ఇంకా ఇలాంటివి చూడవచ్చు.

సంపదలకు నిలయమైన భారతదేశానికి రావడానికి కొత్తదారి కనుగొనే ప్రయత్నంలో కొందరు విదేశీయులు కనిపెట్టినదే ఇప్పటి అమెరికా భూభాగం... అనేకదేశాల వారు వచ్చి అక్కడ స్థిరపడ్దారు. ఎక్కడైనా మంచిచెడు ఉంటాయి. విదేశాల వారి వద్ద నుంచి కూడా ఎన్నో మంచి విషయాలను మనం తెలుసుకోవచ్చు.

 

 నేను ఆ మధ్యన విదేశాలకు వెళ్లినప్పుడు గమనించాను. వారు చాలామంది శుభ్రతను పాటిస్తారు.అంటే, రోడ్లపైన ఎక్కడపడితే అక్కడ చెత్త వేయరు. నడిచేవారు కనిపిస్తే దూసుకుపోకుండా కారును స్లొ చేసి వెళ్ళమంటారు. విదేశీయులు కొందరు, మనప్రాచీనులు తెలియజేసిన విధానాలను పాటిస్తున్నారు. కొందరు ఉదయాన్నే లేచి పనులను చేసుకుని, సాయంకాలమే భోజనం చేసి, రాత్రి త్వరగా పడుకుంటున్నారు. కొందరు స్త్రీలు ఇంటిపట్టున ఉండి చంటిపిల్లలను దగ్గరుండి చక్కగా పెంచుకుంటున్నారు. 

 

మనదేశంలో కొందరు అవసరం లేకున్నా అర్ధరాత్రి భోజనశాలలకు వెళ్ళి తింటున్నారు. భారతదేశంలో చాలామంది ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేస్తుంటారు. చాలామంది భారతీయులకు డబ్బుపిచ్చి బాగా పెరిగింది. భారతీయులు ఇలా ఎందుకు మారిపోయారో? బాధగా ఉంది. 

  ఇళ్లల్లో ప్లాస్టిక్ వేస్టుకు ఒక చెత్తబుట్ట, వంటవండినప్పుడు వచ్చిన చెత్తకు ఒక చెత్తబుట్టపెట్టుకుని బయట కూడా విడివిడిగా పారవేస్తే శుభ్రంగా ఉంటుంది. ప్లాస్టిక్ పాలకవర్లు కొంచెం కడిగి ఉంచుకోవాలి. సూపర్ బజార్ కు వెళ్ళినప్పుడు సరుకులను వేసి ఇచ్చే ఒక పెద్దప్లాస్టిక్ బాగ్ లో వేసి ఈ వాడేసిన పాలకవర్లు, నూనెకవర్లు..ఉంచి, వారానికి ఒకసారి బయటపడేసుకోవచ్చు.

 

 పూజ చేసినప్పుడు మిగిలిన పువ్వులను,ఇంకా మిగిలినవాటిని.. పెరట్లో మొక్కలవద్ద వేయవచ్చు. లేదంటే బయట ఎక్కడైనా మొక్కలు ఉన్నదగ్గర వేయవచ్చు. ఇవన్నీ వద్దనుకుంటే ఒక పాత న్యూస్ పేపర్ చింపకుండా పెద్దగా తీసుకుని అందులో వేసి, ఆ పొట్లాన్ని కూరగాయల వేస్ట్ తోపాటు పడేయవచ్చు.  ప్లాస్టిక్ కవర్లో కాకుండా పేపర్లో చుట్టివేయండి. 


జాతకాలు..కొన్ని మూఢనమ్మకాలు..

 

పాతకాలంలో కొందరికి బిడ్దలు జన్మించినప్పుడు ఆ బిడ్దల వల్ల తల్లితండ్రికి దోషం అని చెబితే ఆ చిన్నపిల్లలను విసుక్కునేవారట. అలా చేయటం చాలా పాపం.ఎవరు చేసిన కర్మల ప్రకారమే వారి జాతకాలు ఉంటాయి, వారి కర్మల ప్రకారమే బిడ్దలు కూడా జన్మిస్తారు. తమ గతకర్మ ప్రకారం బిడ్దలు జన్మిస్తే ఆ బిడ్డల తప్పు ఏముంటుంది? జాతకంలో దోషాలు ఉంటే మంచిపనులు చేసి దోషాలు తగ్గించుకోవాలి. అంతేకానీ, పసిబిడ్దలను తిట్టడం ఇంకో ఘోరమైన పాపం. 

జాతకాలు చూడటంలో ఎన్నో విధానాలు ఉంటాయి. బిడ్ద కడుపులోపడ్ద సమయం ఎవరూ చెప్పలేరు. బయటకు వచ్చాక బొడ్దుత్రాడు కత్తిరించిన తరువాతా, ముందా, ఊపిరిపీల్చిన సమయమా..ఇలా ఎన్నో ఉన్నాయి. 

ఈ రోజుల్లో కొన్ని పంచాంగాలలో ఒకే ఊరికి సంబంధించిన తిధినక్షత్రాల సమయాలలో కూడా చాలా తేడాలు ఉంటున్నాయి. ఇక జాతకం ఎలా సరిగ్గా చెప్పగలరు? ఈ విషయాల గురించి గతంలో బ్లాగులో వ్రాయటం జరిగింది. 

 నాకు ఏమనిపిస్తుందంటే, మనం దైవభక్తి కలిగి ఉండి, సత్ప్రవర్తనతో ఉండటమే  చాలా సమస్యలకు పరిష్కారం.

సతీసావిత్రి, మార్కండేయుల వారు తమ జీవితాలను మార్చుకోగలిగారు. 

 ఇక , ఆడపిల్లలు మెచూర్ అయిన సమయాన్ని బట్టి భవిష్యత్తు  చెప్పటం గురించి నాకు ఏమనిపిస్తుందంటే, అసలు మొదటిసారి రజస్వల ఎప్పుడు జరుగుతుందో చెప్పలేము. మొదటిసారి కొద్దిగా కనిపించి కనిపించనట్లు జరిగి ఎవరూ గమనించకపోవచ్చు. ఆ సమయాన్ని ఎలా తెలుసుకోగలం? అందువల్ల అలాంటి వాటికి భయపడనవసరం లేదు. అసలు మొదటిసారి రజస్వల ఎప్పుడు జరుగుతుందో చెప్పలేము. మొదటిసారి కొద్దిగా కనిపించి కనిపించనట్లు జరిగి ఎవరూ గమనించకపోవచ్చు. ఆ సమయాన్ని ఎలా తెలుసుకోగలం. అందువల్ల అలాంటి వాటికి భయపడనవసరం లేదు. 

 

 

నేను గతంలో ఒక....

 

ఒక స్త్రీల వ్రతకధ పుస్తకం చదివి ఉత్సాహపడిపోయి కల్యాణగౌరీదేవి నోము చేస్తే బాగుంటుందని అనిపించింది. చాలాకాలం క్రితం జరిగిందిది.అప్పుడు ఏమనుకున్నానో కూడా సరిగ్గా గుర్తు లేదు. తరువాత గుర్తొచ్చి చేయాలని చూస్తే గుండెగుభేలుమంది. సంవత్సరకాలం రోజూ ఒక ముత్తయిదువకు తలదువ్వి, బొట్టుపెట్టాలట.

 

 వివరంగా చూద్దామని యూట్యాబ్ నొక్కి చూస్తే, తలదువ్వటమేకాకుండా తలస్నానం చేయించాలని కూడా ఇంకోదగ్గర ఉంది.ఇదేమిటి తలస్నానం చేయించాలని నేను చదివిన పుస్తకంలో లేదు..ఈ కొత్త ట్విస్ట్ ఏమిటి? నేను అందరి ఇళ్లకు వెళ్ళి వాళ్ళ బాత్రూంలో దూరి తలస్నానం చేయించటం అయ్యే పనేనా? అసలు ఇలా చెబితే ఎవరు ఒప్పుకుంటారు? నన్ను పిచ్చిదానిలా చూస్తారు అనిపించి, అయినా నేను మొట్టమొదట చదివిన పుస్తకంలో తలదువ్వమనే ఉంది కాబట్టి, అంతవరకూ చేస్తే చాలు అనిపించింది. తలకు నూనెకూడా రాయాలట.  

 

పాతరోజుల్లో స్నానాలగది ఇంటి బయట ఉండేది.ఈ రోజుల్లో టాయ్ లెట్స్ ఇళ్ళలోపల ఉంటున్నాయి. తెలియని వారి ఇళ్ళలోపలికి వెళ్ళటం ప్రమాదం. మహిళలను కూడా అందరినీ నమ్మే పరిస్థితి లేదు. మోసం చేసే మహిళలూ ఉంటారు. అలాగే నన్నూ వారు నమ్మకపోవచ్చు. తెలియని వారొచ్చి తలదువ్వి, బొట్టుపెడతానంటే దొంగ అని భయపడొచ్చు.

 

ఈ రోజుల్లో ఎవరింటికి పడితే వారింటికి వెళ్తే ప్రమాదం. నేను తలదువ్వుతానంటే అందరూ ఒప్పుకోరు కూడా....రకరకాల కారణాల వల్ల ఎవరిభయాలు వారికుంటాయి. 

ఒకామె ఏమన్నారంటే, తల పైపైన దువ్వితే సరిపోతుంది. అన్నారు. ప్రతిఒక్కరికీ కొత్త దువ్వెన ఉపయోగించాలి. 

 

ఈ విషయం గురించి ఒక పంతులు గారిని అడిగితే, ఏదైనా ఫంక్షన్ లో చాలామంది స్త్రీలు వస్తారు కదా.. అక్కడ ఒకేసారి ఎక్కువమందికి బొట్టుపెట్టండి అన్నారు. కానీ, రోజూ ఒక కొత్త మహిళకు తలదువ్వి, బొట్టుపెట్టడం.. సంవత్సరం ఆచరించమన్నారు కదా..అన్నాను. ఈ రోజుల్లో ఇవి అన్నీ జరిగేపనికాదు...  చేయలేనని దైవానికి చెప్పేసుకోమని.. అన్నట్లుగా అన్నారు. 

 

 ఈ నోములు వ్రతాలలో చిన్నపొరపాటు చేసినా వచ్చే జన్మలో కూడా దోషం వెంటాడి కష్టాలు వస్తాయని చెప్పారు కదా..అని భయం వేసి , దేవాలయాల్లో స్త్రీల వద్దకు వెళ్లి తలదువ్వవచ్చని ఆలోచించి, మళ్లీ ఏమనిపించిందంటే, దేవాలయాలకు వచ్చేవారు తలస్నానం చేసి , తలలో పువ్వులు పెట్టుకుని వస్తారు. నేనుపోయి వారి పువ్వులు తీసి మరల తలదువ్వటం పద్ధతి కాదనిపించింది. స్నానఘట్టాల వద్దకు వెళ్ళి తలదువ్వాలంటే వారి మ్రొక్కులు వారికి ఉంటాయి, వారి పూజలో భాగంగా తలకు నూనె రాసుకుని, తలస్నానం  చేసి దేవాలయానికి వెళ్దామని అనుకుంటారు. వెళ్ళి తలదువ్వటం సరికాదనిపించింది. 

 

 పుస్తకంలో చెప్పినట్లు రోజూ కాకపోయినా ఎప్పుడు వీలుకుదిరితే అప్పుడే చేయాలి. పూర్తవటానికి ఎంతకాలమైనా కావచ్చు, వేరేదారిలేదు అనిపించింది. భావన ముఖ్యం అంటారు కదా..మనస్సులోనే రోజూ ఒక ముత్తయిదువకు తలదువ్వి బొట్టుపెట్టినట్లు భావించటం కూడా కొంత చేసాను. 

 

ఇంకో ఆలోచన ఏమిటంటే, ఏదైనా హాస్పిటల్కి వెళ్లి రోజూ ఒక పేషంట్ కు తలదువ్వితే ఎలా ఉంటుందనిపించింది. ఇక్కడా కష్టాలున్నాయి. ఆమె ముత్తయిదువ అయి ఉండాలి. మైల వంటివి ఉండరాదు. ఏ హాస్పిటల్కి పోవాలి. అయినా పేషెంట్లు వారి బాధలు వారు పడుతుంటే , వెళ్ళి తలదువ్వి రావటం ఏం బాగుంటుంది. అలా అని వారికి రోజంతా సేవ చేయలేను. 

 

హాస్పిటల్ అంటే అంటుముట్టు ఉంటాయి.పేషెంట్ల వద్దకు వెళ్లి మీరు ముత్తయిదువులేనా? మైల వంటివి ఏమీ లేవుకదా? అని అడగటం, ఆ వివరాలను సేకరించటం బాగోదు.

ఇవన్నీ తలచుకుని భయం వేసి ఎందుకు ఇలా అనుకున్నానో ఏమిటో ? అనిపిస్తోంది. 

 

 అయితే, ఇవన్నీ ఇంత క్లిష్టంగా ఎందుకు చెప్పారంటే, ఎవరైనా గతజన్మలోనో, ఈ జన్మలోనో పాపాలు చేస్తేనే కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు పోవాలంటే కొంత కష్టం పడాలి మరి. ఈజీగా కష్టాలు పోయే మార్గాలు ఉంటే ఇక అందరూ పాపాలు చేసేసి, పరిహారాలు తేలికగా చేసేసుకుని మళ్లీ పాపాలు చేస్తుంటారు. పరిహారాలు కొంత కష్టంగా ఉంటేనే కొంతయినా భయముంటుంది. 

 

పాతకాలంలో స్త్రీలు ఇల్లు వదిలి బయటకు వెళ్లటం తక్కువ. వారు తోటి స్త్రీలతో కలిసి కబుర్లు చెప్పుకోవటానికి కూడా ఈ నోములు, వ్రతాలు ఉపయోగపడేవి. 

 

 ఏవైనా నోములు,వ్రతాలను ఆచరించాలనుకుంటే,చేసేస్తానని  గబుక్కున అనేసుకోకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కుదిరితేనే చేస్తానని అనుకోవటం ఇంకా మంచిది.

 
 మీ శక్తి మేరకు అనుకోండి. తేలికగా ఉండేవి అయితే కొంత సులభంగా ఆచరించవచ్చు.

 

ఇలా రోజూ ముత్తయిదువకు బొట్టుపెట్టడం అనేవి ఆచరించటం అనేది మంచిదే. చక్కగా కొత్తకొత్త వారు పరిచయమవుతారు. బాగుంటుంది కూడా. అయితే ఇలా నేను ఎంతవరకూ చేయగలను? అనేది నాకు సందేహం. పాతకాలంలో అయితే ఇవన్నీ చెప్పినా చక్కగా అర్ధం చేసుకుంటారు. ఈ రోజుల్లో ఎంతమంది అర్ధం చేసుకుంటారు? 

 

తలదువ్వి, బొట్టుపెట్టటమేగా అని తేలిగ్గా అనిపిస్తుంది. ఆచరణలో తెలుస్తుంది. పెద్దగా పట్టించుకోకుండా ఎలాగోలా పాటించేవారికి ఏమోగానీ, తూ.చా తప్పకుండా పాటించాలంటే కష్టమే. 

 

దైవస్మరణ చేసుకోండి. సత్ప్రవర్తనతో జీవిస్తూ , చేతనయినంతలో ఆపదలో ఉన్నవారికి సాయం చేయండి. తగినంత శక్తిని ఇమ్మని దైవాన్ని ప్రార్ధించుకోండి. అంతా దైవం దయ. 

 

పాలు, తేనె వంటివి శాకాహారం ఎలా అవుతాయి?..హింస..అహింస..

 

వీగన్ అనే వారు పాలు, నేయి, పెరుగు..వంటివి కూడా తినరు. ఇవి కూడా జంతువుల నుంచి వచ్చినవే అని వారు తినరు. పాలు జంతువుల రక్తం నుంచి తయారయ్యే పదార్ధమే అని వైజ్ఞానిక పరిశోధనలో తేలిందని, అందువల్ల అవి శాకాహారం ఎలా అవుతుందని అంటారు. 

  శాకాహారం అంటే కూరగాయలు,పండ్లు,ఆకుకూరలు, కొన్నిరకాల దుంపలు..ఇలా మొక్కలు, చెట్లనుంచివచ్చేవి.

మరి.. పాలు, తేనె వంటివి శాకాహారం ఎలా అవుతాయి? తేనెను పిండే సమయంలో కొన్నిసార్లు  ఆ తేనెటీగలు చనిపోయి తేనెలో ఉండే అవకాశం ఉంది. పాల ఉత్పత్తులు, తేనె..వంటివి ఆహారంగా తీసుకునేవారిని శాకాహారులని ఎందుకు అనాలి? 

 కొందరు ఏమంటున్నారంటే, మనుషులు కూడా చిన్నతనంలో తల్లిపాలు త్రాగుతారు, అలాంటప్పుడు తల్లిరక్తం త్రాగినట్లు కాదు కదా..అని వాదిస్తుంటారు. పెద్దవారు పాలు త్రాగటానికీ, చంటిపిల్లలు పాలుత్రాగటానికి పోలిక ఏమిటి? 

 తల్లిపాలు త్రాగే చంటిపిల్లలు కొద్దిగా త్రాగుతారు. చంటిపిల్లలు పాలు తప్ప వేరే ఆహారం తినలేరు కాబట్టి పాలు త్రాగుతారు. బడితల్లాగా పెద్దయిన వారుకూడా కాఫీలు, టీలు, పాలతో చేసిన స్వీట్స్ రుచికి అలవాటు పడి పాలపదార్ధాలు వాడుతున్నారు. 

 ఇక ప్రసాదాల్లో పాలు, నెయ్యి, పెరుగు..వాడమని గ్రంధాలలో చెప్పారు ..అంటారు. నిజమే చెప్పారు, ఆ కాలంలో పశువులు ధారాళంగా పాలను ఇచ్చిన రోజుల్లో వాటిదూడలు త్రాగగా ఇంకా పాలు మిగిలిఉండేవి. వాటిని పిండుకుని పాలు, నెయ్యి, పెరుగు చేసుకుని ప్రసాదం తయారుచేసి దైవానికి నివేదించి ప్రసాదం స్వీకరించేవారు. 

 ఈ రోజుల్లో మనుషుల రుచులు పెరిగి, పాలను విరిచి పన్నీరులు, కాఫీలు, టీలు తయారీకి ఎన్ని పాలు కూడా సరిపోక పశువులకు హార్మోన్స్ ఇచ్చి కొన్నిచోట్ల వాటి దూడలను చంపి, మిషన్ల ద్వారా పాలను పిండుతున్నారు. ఇదేమి న్యాయమో ఆలోచించండి. 

 నువ్వులు వంటివాటిలో పాలకంటే ఎక్కువ కాల్షియం ఉంటుందని ఎందరో చెబుతున్నారు.

 ప్రసాదం అంటే తగుమాత్రం పుచ్చుకున్నా చాలు. అప్పుడు అందరికీ కొద్దిగా పాలు, నేయి, పెరుగు..సరిపోతాయి. అంతేకానీ భారీఎత్తున ప్రసాదాలు తయారుచేసి బోలెడంత  తినమని  వారి అభిప్రాయమని నాకు అనిపించటం లేదు .  మనం రోజూ తినే భోజనాన్ని కూడా తినేముందు దైవానికి నివేదించి తినవచ్చు. ఇది ఇంకోరకం ప్రసాదం.దీనిని కడుపునిండా తినవచ్చు. 

అయినా మనకోసం ఇతర జీవులను ఇంతలా ఎందుకు బాధపెట్టాలి? 

  శాకాహారం కాని పాల ఉత్పత్తులు, తేనె వంటి వాటిని ఆహారంగా తీసుకుంటున్నప్పుడు,    శాకాహారులని ఎందుకు అంటారని సందేహం.

 
శాకాహారాన్ని కూడా ఎంతవరకో అంతవరకే తినాలి. రుచికొరకు అదేపనిగా తినటం కూడా తప్పే. అదేపనిగా తినటం వల్ల అనారోగ్యం కూడా వస్తుంది. పిల్లలు, యుక్తవయస్సు వారు సరిపడినంత పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవాలి. పెద్దవయస్సు వచ్చినతరువాత రుచికొరకు బోలెడు ఆహారాన్ని తినటం మంచిదికాదు.

 ..... 

సాత్వికాహారం,రాజసాహారం, తామసాహారం..అని కూడా ఉన్నాయి. సాత్వికాహార నియమాలు పాటించటం చాలా  కష్టం. చద్దివి, నిల్వ ఉన్నవి,  ఎక్కువగా వేయించిన వేపుళ్లు..వంటివి తినటం కూడా తామసాహారం కోవలోకే  వస్తుందంటారు. ... ఇంకా చాలా ఉన్నాయి. న్యాయార్జిత సొమ్ముతో సంపాదించిన ఆహారం కూడా తామసాహారమే.

  .......

పశువులు ఏమైనా చనిపోతే వాటి శరీరాలను పూడ్చవచ్చు, దహనం చేయవచ్చు. లేదంటే ఇతర పశుపక్ష్యాదులకు ఆహారంగా అలా బయట వదిలేయవచ్చు..వాటిని మనుషులు తినవలసిన అవసరం లేదు.

  ప్రాచీనకాలంలో రాజులు, సైనికులు యుద్ధాలలో శత్రువులను చంపవలసి వచ్చేది. సౌమ్యులుగా ఉండేవారు చంపలేరు. వారికి కొంత కఠినత్వం రావటానికి ..వేటకు వెళ్ళటం, జంతువులను చంపటం.. జరిగాయని అనిపిస్తుంది. యుద్ధసమయంలో కొన్నిసార్లు ఆహారం సరిగ్గా దొరకని సందర్భాలలో..  దొరికిన జంతువులను చంపి తినటం తప్పనిసరి అవుతుంది కాబట్టి,  అలా కూడా వారు మాంసాహారాన్ని అలవాటుచేసుకుని ఉండవచ్చన్నది నా అభిప్రాయం.

అయితే,  వేట అలవాటు వల్ల  దశరధ మహారాజు , పాండుమహారాజు.. కష్టాల పాలయ్యారు.


అయితే, మనుషులు తమలో తాము యుద్ధాలు చేసుకుని అందుకొరకు జంతువులను చంపటం క్రూరత్వమే.  తమపై దండెత్తివచ్చిన క్రూరులైన శత్రువులను చూస్తే ఆవేశం దానికదే ఉప్పొంగి శత్రుసంహారం చేస్తారు. అందుకొరకు మూగజీవులను చంపవలసిన అవసరం లేదు.  తమ మనస్సును అదుపులో ఉంచుకున్న వారే వీరులు. అంతేకానీ, మూగజీవులను చంపటం వీరత్వం కాదు.

 

 సృష్టిలో పర్యావరణ సమతౌల్యం కొరకు  మొక్కలను జంతువులు తినటం, చిన్న జంతువులను పెద్ద జంతువులు తినటం ఉంది. ఎందుకంటే, మొక్కలు అన్నీ బ్రతికి పెరిగి పెద్దవయితే దగ్గరదగ్గరగా ఉండి బలంగా పెరగవు. భూసారం సరిపోదు. జంతువులు అన్నీ బ్రతికి, పెరిగితే వాటికి ఆహారం సరిపోదు. అందుకే జంతువులు ఒకదానిని మరొకటి తింటాయి.

సమతౌల్యం కొరకు మనుషులు జంతువులను తినే అవసరం లేదు.అయితే రుచి కొరకు తింటారు. మనుషులు పశుపక్ష్యాదులను పెంచి,  మరీ తింటున్నారు.

ఈ రోజుల్లో చాలామంది పర్యావరణాన్ని పాడుచేస్తున్నారు. ఇందువల్ల, కొన్ని జీవజాతులు అంతరించే పరిస్థితి వచ్చిందంటున్నారు. పర్యావరణంలో సమతౌల్యత ఉండాలంటే మానవుల జనాభా తగ్గాలి...


జగదీశ్చంద్ర బోస్ అనే శాస్త్రవేత్త మొక్కలకూ ప్రాణం ఉందని, కొంత స్పందిస్తాయని కనిపెట్టారు. ఈ విషయాన్ని  చదివినప్పుడు, ఆకుకూరలను తినాలన్నా ఏదోగా అనిపించేది. వాటిని కత్తిరించినప్పుడు చనిపోయేంతవరకూ బాధపడతాయేమోనని,  వేర్ల వద్ద కట్ చేసేదాన్ని. పుదీనా వంటి వాటికి  కణుపుల వద్ద కూడా వేర్లుంటాయి. బచ్చలి వంటివి కాడలు తెంపితే చాలు.

అయితే, కొమ్మలు తెంపినా చెట్లు బాధ పడతాయనుకుంటే ఇక మనం బ్రతకలేం.అలా అనుకుంటే నడిచేటప్పుడు కాళ్ళక్రింద ఎన్ని చీమలు చనిపోతాయో? అతి ఆలోచనలకు పోకుండా కొంతవరకే పాటించటం మంచిది.

హింస చేయకూడదనుకుని కొందరు.. క్రిందరాలిపడిన ఆకులను, పండ్లను తిని జీవిస్తారట. వారు 
 మాత్రమే గొప్పవారని, మామూలుగా జీవించేవారు తక్కువవారని చెప్పలేం. ఎన్నో నియమాలతతో ఎంతో తపస్సు చేసినా కూడా, కొందరు కొన్నిసార్లు కామక్రోధాలకు లొంగి పొరపాట్లు చేయటం జరుగుతుంది. మనస్సును నిగ్రహించుకోవటం అత్యంత కష్టం. దైవసహాయం తప్పనిసరి.

హింస అంటే చంపటం, తినటం ఒక్కటే కాదు. మనుషులను, పశుపక్ష్యాదులను.. మాటలతో, చేతలతో బాధించటం కూడా హింసే.

  జంతువులను ఒకదగ్గరనుంచి ఇంకొకదగ్గరికి పంపేటప్పుడు సరిగ్గా నీరు, మేత ఇవ్వకుండా చిన్న వాన్ లో కుక్కి పంపటం, జంతువులపైన విపరీతంగా బరువులను వేసి మోయించటం.. ఇవన్నీ హింసే.

 మొక్కలకు, 
మనుషులకు..  నెప్పి విషయంలో బాధపడే స్థాయిలో తేడాలుంటాయని అంటారు...ఈ విషయాలు సరిగ్గా అర్ధం కావట్లేదు.

 పశువులకు  ఎప్పుడైనా దెబ్బలు తగిలితే,  మనుషులలానే బాధపడటం, పెద్దగా గాయాలు తగిలితే గిలగిలా కొట్టుకోవటం మనకు కనిపిస్తుంది.మొక్కలలో అలా కనిపించదు.
అయితే.. జుత్తు, గోర్లను కత్తిరిస్తే బాధ  ఉండదు. మత్తు ఇచ్చి ఆపరేషన్ చేసినా ఎక్కువ బాధ ఉండదు. అలా మొక్కలకు ఎక్కువ బాధ ఉండదేమో? అని కొందరి అభిప్రాయం. ఇవన్నీ సరిగ్గా అర్ధంకాని విషయాలు.... ఆధునిక వైజ్ఞానిక పరికరాలకు
కూడా  సరిగ్గా అంతుబట్టని  విషయాలు ఎన్నో ఉన్నాయి.

మొక్కలు, పశుపక్ష్యాదులు మూగజీవులు. వాటి భావాలు మనకు సరిగ్గా అర్ధం తెలియవు,

భూమి ఒక పరీక్షా లోకం.ఇక్కడ కష్టాలు, సుఖాలు రెండూ ఉండే విధంగా సృష్టి ఉంది. ఇది ఒక ఆటస్థలం, నాటకరంగం వంటిది కూడా కావచ్చు.  లౌకిక జీవితంలో ఒక గొప్ప స్థాయికి రావాలంటే ఎంతో కష్టపడాలి. మరి ఏ కష్టాలు లేని అత్యంత ప్రశాంతమైన, అత్యంత గొప్పదైన పరమపదాన్ని పొందాలంటే కొంతైనా కష్టాలు ఉంటాయి కదా. ఇక్కడ మంచిగా జీవించి దైవకృపకుపాత్రులైనవారు పైలోకాలకు చేరుకుంటారు.. పరమపదాన్ని పొందుతారు.

మనకు అర్ధం కాని విషయాలు సృష్టిలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ దైవానికే తెలుస్తాయి.



బలవంతులు బలహీనులను పీడించకూడదని మాట్లాడే హక్కు వీరికి ఉందా?

 

చాలామంది ఏమంటారంటే, సమాజంలో బలవంతులు బలహీనులను అణచివేస్తున్నారు. ఇది అన్యాయం కదా..బలహీనులకు జీవించే హక్కులేదా? అని ప్రశ్నిస్తారు. నిజమే బలవంతులు బలహీనులను అణచివేయటం ఘోరమైన తప్పే. 

 మరి ప్రపంచంలో అన్ని జీవులకూ జీవించే హక్కు ఉంది. చాలామంది మనుషులు జంతువులను ఎందుకు చంపి తింటున్నారు? 

 

 మనుషులు బలవంతులు కాబట్టి, బలహీనులైన పశుపక్ష్యాదులను బంధించటం, చంపి తినటం చేస్తున్నారు. మనుషులకు తెలివి ఉంది. రకరకాల విధాలుగా ఆలోచించి జంతువులను శాసిస్తున్నారు.

 

 ఇలా పశుపక్ష్యాదులను బాధపెట్టేవారికి, చంపి తినేవారికి ..బలహీనులను బలవంతులు శాసించకూడదని మాట్లాడే హక్కులేదు. 

 

 మనకు బుద్ధి బలం ఉంది కదా ..అని జంతువులను ఎన్నో విధాలుగా వాడుకుంటున్నాము. వాటిని తాళ్లతో కట్టి, పొలాలలో బండ్లకు కట్టి వ్యవసాయం చేస్తాము. అవి ఎదురుతిరగలేవు కాబట్టి అలా బాధను అనుభవిస్తున్నాయి. 

బండిలాగకుంటే చర్నాకోలతో కొట్టి నడిపిస్తారు. అదే మనుషులతో బండిలాగిస్తే అన్యాయం.. అంటూ గుండెలు బాదుకుంటారు. 

 

నొప్పి,బాధ.. మనిషికైనా, జంతువుకైనా ఒకటే. మనుషులు నీతులు చెప్పటం కాదు, నీతులను ఆచరించాలి. ఉదా.. మూగ జీవులపట్ల దయతో ఉండాలి. వాటిని చంపి తినకూడదు..అలా తింటున్నవారికి ..బలహీనులను బలవంతులు పీడించకూడదని మాట్లాడే హక్కులేదు. 

 ..............

  ఎవరికైనా.. గతజన్మలోనో, ఇప్పుడో చెడుకర్మలు చేసినప్పుడు ఆ చెడుకర్మల ఫలితంగా కష్టాలు వస్తాయి. మూఢనమ్మకాలు ఉండి.. వాటితో కుటుంబసభ్యులను, ఇతరులను ఇబ్బంది పెట్టినా కూడా కష్టాలు వచ్చే అవకాశముంది.



 కష్టాలను పోగొట్టుకోవటానికి పరిహారాలపేరిట ఇతరజీవులను బాధకుగురిచేసి జీవహింస వంటివి చేస్తే తాత్కాలింగా కొందరికి కష్టం తగ్గినట్లు అనిపించినా..జీవహింస చేసినందుకు  భవిష్యత్తులో ఇంకా కష్టాలు వచ్చే అవకాశముంది..గతంలో పాపాలు చేసినందుకు వచ్చిన కష్టాలను పోగొట్టుకోవటానికి , జీవహింస చేయటం అనే కొత్త పాపం చేసి కొత్త కష్టాలు తెచ్చుకోవటం ఎందుకు?


 మనుషులు చెడును బలి చేయటానికి (వదిలివేయటానికి) ప్రయత్నించవచ్చు..
చెడ్డపనులు చేయకుండా.. ఇతరజీవులను బాధపెట్టకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ.. దైవప్రార్ధన చేస్తూ మంచిపనులు చేస్తూ ఉంటే..  కష్టాలు తగ్గే అవకాశముంటుంది.

 

చూసినవారు ఏమైంది? అన్నారు..

 

నేను కొంతకాలం క్రిందట ఏమనుకున్నానంటే, కుదిరినంతలో.. బెండకాయ, పనసపండు తినకూడదనుకున్నాను.అయితే ఆ విషయంలో చిత్రమైన విషయాలను ఫేస్ చేస్తున్నాను.

 నాకు చాలా పదార్ధాలు ఇష్టమే కానీ, బెండకాయ అయితే అన్ని కూరల్లో కలపరు కదాని.. బెండకాయను తినకూడదనుకున్నాను. అయితే భోజనాలకు వెళ్లినప్పుడు సాంబారులో, పులుసులో బెండకాయ వేసారేమో తెలియదు. అవి వద్దంటే ప్రక్కన కూర్చున్నవారు మీరు అన్నీ వద్దంటారేమిటి? అని ఆరాలు అడుగుతారు.

 తెల్లటి పంచదారలో ఎముకలపొడి కలుపుతారని ఎక్కడో చదివి స్వీట్స్ తినటం తగ్గించాను.అయితే, దేవుని ప్రసాదాలను తింటాను. 

ఒకసారి భోజనాలలో స్వీట్స్ వద్దంటే నా ప్రక్కనకూర్చున్న వారు నీకు సుగర్ ఉందా? అని అడిగారు. సుగర్ లేదన్నాను. మరి ఎందుకు స్వీట్స్ వద్దంటున్నావు అని అడిగారు. నేను పంచదార.. ఎముకలపొడి ..అన్నీ చెప్పవలసి వచ్చింది. బెల్లంతో చేసిన స్వీట్స్ తింటానన్నాను.

 బెల్లం తయారీ ఎప్పుడైనా చూసావా? తయారీలో బోలెడు చీమలు, ఈగలు చస్తాయి అన్నారు.

 ఆర్గానిక్ బెల్లం మొదలుపెట్టి కొంత సంతోషంగా ఉండగా పేపర్లో ఒక న్యూస్ చదివాను. వాళ్లెవరో కెమికల్స్ కలపని ఆరోగ్యకరమైన బెల్లం తయారీ విధానం గురించి వ్రాస్తూ ..బెండకాయజిగురు కలపటం వల్ల ఇలా సాధించగలిగామని ఆనందంగా వ్రాసారు. 

అది చదివి నాకు నీరసం వచ్చింది..నేనేదో సుగర్ తిందామనుకుంటే ఇలా జరుగుతోంది, బెల్లం బెండకాయను కలపటమేమిటి? ఎప్పుడైనా ఊహించామా? అయినా నేను తినకూడదనుకున్న బెండకాయ ఈ బెండకాయ వేరే జాతివి లా ఉన్నాయి. బెండకాయ అంటే అన్ని బెండకాయ జాతులూ తినకూడదా? ఇలా ఎన్నో సందేహాలు కలిగాయి. 

ఇక చెరుకురసం తెచ్చి పంచదార చేసుకుని వాడాలేమో..చెరుకుగడ పైన శుభ్రంగా కడగాలి,లోపల పుచ్చులు లేకుండా చూడాలి..అతిగా ఆలోచిస్తే అన్నీ కష్టాలే అని తెలుస్తోంది. 

(నా సంగతి అలా ఉంచితే, కెమికల్స్ కలపకుండా బెండకాయ జిగురు కలిపి మంచిగా బెల్లాన్ని తయారుచేయడం మంచి విషయం.) 

......

శాస్త్రప్రకారం గుడాన్నం తయారీకి కొన్ని నియమాలున్నాయి. ఎలా తయారుచేయాలో పదార్ధాల వివరాలు కూడా ఉన్నాయని పండితులు తెలియజేసారు. అయితే ఈ రోజులలో కొన్నిరకాల బెల్లం లో  కొన్ని రసాయనాలు, బెండకాయ జిగురు వంటివి కూడా కలుపుతున్నారు.  ఇలాంటి పదార్ధాలను వాడితే మరి, శాస్త్రప్రకారం సరైనదేనా? కాదో? తెలియదు.

.......

ఇక పనసపండు సంగతి..

ఒక ఫంక్షన్ లో భోజనాలకు వెళ్తే స్పీడుగా వడ్దించుకుంటూ నా విస్తరాకులో పులావ్ వడ్దించారు. తినబోతుంటే అందులో నుంచి ఒక్స ముక్క బైటపడింది. ఇదేమిటని చూస్తే పనసముక్క, అది పనసబిర్యానీ.

 ఒక్క ఉదుటున తేరుకుని ప్రక్కన పెట్టేసాను. చూసినవారు ఏమైంది? అన్నారు. నేను పనసపండు తినను అన్నాను. వివరాలు తెలుసుకుని, పనసపండు తినకూడదనుకున్నప్పుడు పనసకాయ తినవచ్చని సలహా ఇచ్చారు. అయోమయంతో చిరాకు కలిగి, నేను తిననన్నాను.

విస్తరాకును మార్చుకుంటే బాగుంటుందనిపించింది కానీ, విస్తరాకులో అప్పటికే కొన్ని పదార్ధాలను వడ్దించారు. ఇక చేసేదేమీ లేక పులావును ప్రక్కకు జరిపి జాగ్రత్తగా తిన్నాను. 

ఎవరైనా విస్తరిలో పదార్ధాలు వదిలేస్తే, అలా పదార్ధాలు వేస్ట్ చేయటమెందుకు ? ముందే వేయించుకోకుండా ఉండవచ్చు కదా.. అని విమర్శించే నేను అలా పనస పులావు ప్రక్కన వదిలేయవలసి వచ్చింది.

 ఈమధ్య ఇంకో న్యూస్ ఏమిటంటే, పనసగింజలు ఎంతో బలవర్ధకమైన ఆహారం కాబట్టి, వాటిని పొడి చేసి అన్నింట్లో కలిపి తింటే మంచిదని వ్రాసారు. ఇదెక్కడ ఖర్మ.. అందరూ నేను తినకూడదనుకున్న వాటిపైనే రీసెర్చులు చేస్తున్నారేమిటి..ఇక పనసపొడిని అన్నిటిలో కలుపుతారో ఏమిటో? అని సందేహాలు కలిగాయి. 

కలిపితే కనీసం ప్యాకెట్ పైన వివరాలను వ్రాయాలి. నేను ఎప్పుడైనా కేరళ వెళ్తే జాగ్రత్తగా ఉండాలి. అక్కడ పనసపండు ఎక్కువగా వాడుతారు కదా.. 

ఇవన్నీ పాటించలేక,  నేను ఇప్పుడు మామూలు బెల్లం,పంచదార కూడా కొంతవరకూ తింటున్నాను.అయితే, ఇప్పుడు ఆర్గానిక్ పంచదార అని కూడా అమ్ముతున్నారు. 

బయట భోజనాలలో వంకాయలలో పుచ్చులు సరిగ్గా తీయరేమోననే భయంతో వంకాయ కూర అంతగా తినను. ఇంట్లో తింటాను. ఇలా నా బాధలు నాకు ఉన్నాయి. అయితే  కొందరు ఊరుకోకుండా, అలా వద్దంటావేమిటి? అని ప్రశ్నలు అడుగుతారు.


 

కష్టాలు తీరటం..

 

కొందరు ఏమంటారంటే, ఎంతో డబ్బు ఖర్చుపెట్టి ఎన్నో పూజలు చేసాము. అయినా మాకు కష్టాలు తీరటం లేదు అంటారు.

 ఇలాంటప్పుడు కొంతకాలం మామూలుగా పూజ చేసుకోవచ్చు,  నిత్యపూజ చక్కగా చేసుకోండి.ఎవరేది చెబితే అవి అన్నీ చేయనవసరం లేదు... దైవనామస్మరణ, దైవాన్ని స్మరించుకోవటం సులభం.

ఎందుకంటే, పూజలు చేసినా కష్టాలు తీరటంలేదు అనటం తప్పు. కష్టాలు తీరకపోవడానికి ఎన్నో కారణాలుంటాయి.

 ఎవరికైనా గతంలో చేసిన పాపాల వల్ల కష్టాలు వస్తాయి. గతజన్మలోనో, ఈ జన్మలోనో వారు చేసిన తప్పులు వారికి గుర్తు ఉండకపోవచ్చు. ఇప్పుడు పాపాలు చేయటం మాని, పుణ్యకార్యాలు చేస్తుంటే కష్టాలు తగ్గే అవకాశముంది. అందుకు కొంత సమయం పట్టవచ్చు. 

 కొందరికి తాము తప్పులు చేసినా కూడా అవి తప్పులుగా అనిపించవు. మేము ఎప్పుడూ పాపాలు చేయలేదు. అయినా కష్టాలు వచ్చాయని వాపోతారు. 

ప్రత్యేకమైన పెద్ద పూజలు చేయటం కొంత మాని, పేదవారికి, ఆపదలో ఉన్నవారికి సాయం చేయవచ్చు. గోవులకు, మూగజీవులకు చక్కటి ఆహారాన్ని అందిస్తే పుణ్యం వస్తుంది. 

అలాగని గోవులకు, ఇతరమూగజీవులకు ఏదిపడితే అది తినిపించకూడదు. అలా తినిపిస్తే పుణ్యానికి బదులు పాపం వస్తుంది. వాటి ఆహారం ఏమిటో సరిగ్గా తెలిసినవారిని అడిగి తినిపించాలి.

 కొన్ని ప్రత్యేకంగా చేసే పూజలు ఎన్నో నియమాలతో చేయాలి. పూజలో తప్పులు వస్తే ప్రాయశ్చితం చేసుకోవాలట. పూజలకు వాడే ద్రవ్యాలు కల్తీ కానివి వాడాలి. అన్యాయంగా ఆర్జించిన సొమ్ముతో పూజలు చేయకూడదంటారు.

 కష్టాలు వచ్చాక బాధలు పడేకన్నా, ముందే దైవభక్తి కలిగి, మనస్సును చెడు వైపుకు వెళ్ళకుండా నియంత్రించుకోవటానికి ప్రయత్నించాలి. శక్తి చాలకుంటే దైవాన్ని ప్రార్ధించుకోవాలి. 

................
ప్రతిపనికి కొన్ని నియమాలు ఉంటాయి.
ఉదా..పెట్రోల్ బంక్ కు వెళ్తే పరిసరాల్లో అగ్గిపుల్ల వెలిగించకూడదని, సెల్ఫోన్లు మాట్లాడకూడదని  జాగ్రత్తలు చెబుతారు. కారణాలు మనకు తెలుసు.

 ప్రాచీనకాలంలో ఏ నియమాలను ఎందుకు పెట్టారో మనకు ఇప్పుడు తెలియదు. వాటి అంతరార్ధాలు మనకు తెలియకపోయినా , కొన్ని నియమాలను పాటించితే  మంచిది.  అయితే, గ్రంధాలలో మార్పులు చేర్పులు జరిగాయని..అంటే ప్రక్షిప్తాలు కూడా ఉన్నాయని అంటారు.

కొన్ని పూజలకు ఎన్నో నియమాలను పాటించవలసి ఉంటుంది. ఎలాపడితే అలా చేస్తే మంచిదికాదు. కొందరు  ఎవరు ఏది చెబితే అది చేస్తుంటారు. అలాకాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

సంస్కృతంలో పలికేటప్పుడు కొన్నిసార్లు  కొద్దిగా తేడా వచ్చినా , అర్ధం మారిపోయే అవకాశం ఉంది.  దైవాన్ని తిట్టినట్లు అర్ధం మారిపోయే అవకాశముంది. ఇలా తప్పులు చదివితే పుణ్యానికి బదులు పాపం వచ్చే అవకాశముంది.

ఇలాంటప్పుడు, అనేక నామాలను చదవటం కన్నా తేలికగా తప్పులు రాని నామాలను చదువుకోవటం మంచిది.ఈ రోజుల్లో కొన్ని పుస్తకాలలో తప్పులుంటున్నాయి. మాతృభాషలో దైవాన్ని పూజించుకోవటం కూడా మంచిదే.

దేవాలయాల వద్ద మైకులలో కూడా, కొన్ని తప్పుగా పాడిన కొన్ని కేసెట్లు వేస్తున్నారు.

 ఇప్పుడు అందరికీ అందుబాటులోకి ఫోన్లు వచ్చాక తేలికగా ఒక కామెంట్ పెట్టేస్తున్నారు..ఈ విషయంలో ఏం చెయ్యాలి? అని.  అవన్నీ చదివిన వారికి మరిన్ని సందేహాలు, అనుమానాలు వస్తుంటాయి..

 సందేహాలను అడగటంలో తప్పులేదు గానీ, అదేపనిగా సందేహాలతోనే జీవితమంతా సతమతమయితే, సందేహాలతోనే సమయం గడిచిపోతుంది.

ఇలా అనేక సందేహాలను అడుగుతున్న వారు జీవితంలో ఇతరులను బాధపెట్టకుండా, పాపాలు చేయకుండా ఉంటున్నారా? అన్ని పనులను సత్ప్రవర్తనతో ఉంటూ సవ్యంగా చేస్తున్నారా?
ఇవన్నీ పాటించటం కూడా ముఖ్యమే. ఇది కూడా పూజలో భాగమే.

 

అంటుముట్టు

 

ఇక నెలసరి విషయంలో ఎన్నో చెబుతున్నారు. 4 రోజుల వరకూ కొన్ని నియమాలను పాటించటం ఫరవాలేదు.

 ఈ రోజుల్లో కొందరికి ఎక్కువరోజులు రక్తస్రావం కనిపిస్తోంది.
అలా జరిగినప్పుడు వారిని, వారింట్లో వారిని కూడా పూజలు చేసేవారు ముట్టుకోకూడదని కొందరు అంటున్నారు. లేదంటే వారు ముట్టులో ఉన్నామని చెప్పాలంటున్నారు. ఆడవాళ్ల నెలసరి పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అందరికీ చెప్పుకోవటం ఇబ్బందిగా ఉంటుంది. 

 

 నాకు ఏమనిపించిందంటే,ఊళ్లో ఉన్న దేవాలయానికి వెళ్ళాలంటే ఇంట్లో స్నానం చేసి బస్సులు,లోకల్ రైళ్లు ఎక్కుతారు. అలాంటప్పుడు ప్రక్కన ఉండేవారిలో అంటు ఉన్నవారు ఉండవచ్చు. అందరికీ కార్లు ఉండవు కదా..కార్లు ఉన్నా కూడా కారును కూడా శుద్ధిచేయాలి మరి, ఇంతకుముందు ముట్టు ఉన్నప్పుడు కార్ ఎక్కిఉండవచ్చు కదా.. 

 

 అంతెందుకు ఈ రోజుల్లో చాలామంది అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా లిఫ్ట్ ఎక్కిదిగాలి.లిఫ్ట్లో మైల ఉన్నవారు ఎక్కవచ్చు. వారు ముట్టుకున్న లిఫ్ట్ తలుపే అందరూ ముట్టుకుంటారు.మెట్లు ఎక్కిదిగినా వారు నడిచిన దారే కదా నడవాలి.ఈ రోజుల్లో అతిగా చెపితే అసలుకే మోసం వచ్చే ప్రమాదముంది. 

 దైవస్మరణకు అంటుముట్టు ఉండదు ..చక్కగా దైవస్మరణ చేసుకోవచ్చు . 

 అయితే, శరీరం సున్నితంగా ఉండే నెలసరి సమయంలో ఎక్కువపనులు చేయకూడదు. విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కువగా పనిచేస్తే అనారోగ్యం కలిగే అవకాశాలున్నాయి. అందువల్ల 4రోజుల విశ్రాంతి మంచిదే. అయితే నియమాల పేరుతో అతిగా చేయకూడదు.

 

కొన్నిసార్లు ఏదైనా ఫంక్షన్ అనుకుని అందరినీ పిలిచి ఫంక్షన్ జరుగుతున్నప్పుడు సందేహాస్పదంగా తెలుపుఎరుపూ కానీ రంగులో అతికొద్దిగా స్రావం కనిపించవచ్చు.కొద్దిగా కనిపించి తరువాత ఆగిపోవచ్చు. అనారోగ్యకారణాల వల్ల టెన్షన్ తో ఇలా జరగొచ్చు.

 అప్పుడు ఏం చేయాలో తెలియదు. బోలెడు ఖర్చుపెట్టి ఫంక్షన్ జరుగుతుంటే విషయం చెప్పి ఫంక్షన్ ఆపేయమని చెప్పలేరు. భయంతో నిజంగా రక్తస్రావం కనిపించినా చెప్పకుండా ఊరుకుంటారు .

మాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి ఇంజనీరు.అమ్మాయి డాక్టర్. అబ్బాయి దైవపూజ చేస్తాడు. అమ్మాయి డాక్టర్. అమ్మాయి దైవపూజ  చేస్తుంది  కానీ.. ఇన్నిరకాల ఆచారవ్యవహారాలను పాటించటం నావల్లకాదంటుంది.

 కొన్నిసార్లు..ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు అంటుముట్టు అనే భావనతో  వారికి సాయం చేయకపోవటం తప్పు.
 

నూటికినూరుశాతం  అంటుముట్టు నియమాలను పాటించాలంటే చాలా కష్టం. మనం ఎంత ఇంట్లో కూర్చున్నా కూడా ఏదో విధంగా మనకు చేరే అవకాశముంది.  ఉదా..కూరగాయలు, పువ్వులు, పండ్లు, దుకాణాలలో సరుకులు..ఇవన్నీ కొనక తప్పదు. కూరగాయలను  అమ్మే వారు నెలసరిలో ఉండవచ్చు.వారు ఆ వస్తువులను తాకి మనకు ఇస్తారు కదా..

 

   పాతకాలంలో పాటించే పద్ధతులను చాలావాటిని ఇప్పుడు పాటించలేకపోతున్నాం.  ఉదా..పాతకాలంలో స్త్రీలు..  బయటకు వెళ్లేవారు కాదు. ఈ రోజుల్లో అలా వెళ్ళొద్దని చెప్పగలమా? చెప్పినా వినేవాళ్ళెందరు?

 
నెలసరి 
ఆచారం  సరిగ్గా పాటించాలంటే, నెలసరి రోజుల్లో స్త్రీలు బయటకు వెళ్ళకూడదు. అలా ఎందరు పాటిస్తున్నారు?  కాలానుగుణంగా ఆచారాలను మార్చుకుంటున్నారు. ఉదా..ఈరోజుల్లో కాలేజీలకు, ఆఫీసుకు వెళ్ళే ఆడవాళ్లు నెలసరిరోజుల్లో బయటకెళ్ళి అంటుముట్టు  కలిపేస్తున్నారు..


ఈ విషయంలో ఆచారం గురించి ఏమంటారంటే, ఈరోజుల్లో స్త్రీలు బయటకు వెళ్ళకతప్పదు కాబట్టి, వెళ్ళవచ్చంటారు. బయటకెళ్ళి అంటుముట్టును అందరికి కలిపేసినా, ఇంటికొచ్చి దుస్తులు మార్చుకుంటే సరిపోతుందంటారు..కానీ, నెలసరిలో ఉన్న స్త్రీలు తప్పనిసరి పరిస్థితిలో ఇంట్లో వంటచేస్తే మాత్రం దోషం అంటారు.


అంటుముట్టును ఇంట్లో కలిపితే దోషం ఇంట్లో వారికే ఉంటుంది. బయటకలిపితే అందరికీ దోషం తగులుతుంది ..ఇంకా, అలా అందరికీ కలిపిన దోషం.. కలిపినవారికి ఇంకా ఎక్కువ ఉంటుంది..

ఎన్నో విషయాలను ఎవరికి అనుగుణంగా వారు మార్పులుచేర్పులు చేస్తూఉన్నారు.  వంటచేయకూడదని చెబుతున్నప్పుడు.. బయటకు వెళ్ళకూడదని కూడా స్త్రీలకు గట్టిగా చెప్పగలరా?

ఇలా రాయటం ఎవర్నీ తప్పుపట్టాలని కాదు. నెలసరిలో పూజలు చేయవచ్చని నా అభిప్రాయం కాదు.  తప్పనిసరి పరిస్థితిలో ఇంట్లో వంట చేసుకోవచ్చు..అని నా అభిప్రాయం. అలా చేయటం తప్పో..ఒప్పో ఏం చేయగలం?  అయినా, నెలసరిలో పక్కన కూర్చునే అలవాటులేని కుటుంబాలలో ఈరోజుల్లో ఇవన్నీ పాటించాలంటే కష్టం.  అర్ధం చేసుకోనప్పుడు,  మనుషులకు పదేపదే  చెప్పుకునే కన్నా, దైవానికి చెప్పుకోవటం మంచిది.

 రజస్వల ఉన్నవారు ఒక మూలన కూర్చోకుంటే, వారి ఇంట్లో వారిని కూడా పూజలు చేసే వారు ముట్టుకోకూడదంటున్నారు. మరి, వైద్యులు రోజూ హాస్పిటల్ కు వెళ్తారు.  ఎందరో  ఇతర సిబ్బంది..ఉంటారు. నెలసరి ఉన్నవారుంటారు. కొన్నిసార్లు రోగులు చనిపోతారు. ఇక వైద్యులు , హాస్పిటల్స్ లో ఇతర సిబ్బంది,  వారి కుటుంబసభ్యులు   పూజలు చేసుకోకూడదా? వారిని ఎవ్వరూ  తాకకూడదా? ఇవన్నీ పాటించటం . ఇవన్నీ చాలా కష్టం.  కొంతవరకే పాటించగలరు. 

 

 నేను ఎవరినీ బాధపెట్టాలని  ఈ విషయాలను వ్రాయలేదు. ఇంట్లో ఉండే స్త్రీల విషయంలో కూడా నెలసరి సమయంలో పక్కన కూర్చుంటే చిన్న పిల్లలకు కష్టం.ఈ రోజుల్లో చిన్న కుటుంబాల్లో భర్త ఆఫీసుకు వెళ్తే, పిల్లలు స్కూల్ నుంచి వస్తే పిల్లల్ని చూసుకోవాలి. ఇలా ఎన్నో పనులు ఉంటాయి.

   మనలో కూడా  దైవం ఉంటారని అంటారు.  దైవం సర్వాంతర్యామి. అయితే, సూర్యకాంతి.. మురికి నీటిపైన పడినా కూడా సూర్యునికి మురికి అంటదు.  మన లో దైవం ఉన్నా కూడా , మనుషులు చేసే పాపాలతో దైవానికి  సంబంధం ఉండదు. మనుషులు చేసే పుణ్యాలు, పాపాలను బట్టి మనుషులకు  కర్మఫలితం ఉంటుంది.

  మలమూత్రాలతో కూడిన శరీరంతోనే పూజలను చేస్తాము. ఉమ్మి ఉన్న నోటితోనే స్తోత్రాలను చదువుతాము. మానవశరీరాలు ఇలాగే సృష్టించబడ్దాయి. అలాగని మురికిగా ఉండకూడదు.

 ఆచారవ్యవహారాలను అసలే వదిలేయమని కాదు. ఆచారవ్యవహారాలను పాటించాలి. పూర్వీకులు తెలియజేసిన ఆచారవ్యవహారాలలో ఎన్నో చక్కటి విషయాలు ఉన్నాయి. విచక్షణతో పాటించాలి.

 

కొన్ని విషయాలు..ఆచారవ్యవహారాలు..

 

మీడియా ద్వారా ఎన్నో మంచివిషయాలను తెలియజేస్తున్న గొప్పవారు  ఎందరో ఉన్నారు. 

 అయితే, కొందరేమో ప్రజలలో  మూఢనమ్మకాలు పెరిగేవిధంగా చెబుతున్నారు. మీరు అలా చేయకూడదు, ఇలానే చేయాలి..లేకపోతే మీబ్రతుకులు అధోగతే..అంటూ చెపుతారు.ఇక వినేవారికి ఏంచేస్తే ఏం తప్పో? అనే పరిస్థితి వస్తుంది. ప్రజలు ఇలా నిరాసక్తంగా తయారయితే సమాజం ఏమవుతుంది? వేరేవారు ఆక్రమించుకుంటారు..దయచేసి ఆ పరిస్థితి రాకూడదంటే అందరూ విచక్షణతో ప్రవర్తించాలి. .

దైవభక్తి, సత్ప్రవర్తన..వంటి వాటి కన్నా, మూఢనమ్మకాలు బాగా పెరిగిపోయాయి.  రోజూ ఏదో పండుగ అన్నట్లు చెబుతారు కొందరు. రోజూ ఉపవాసాలు, తలస్నానాలు, బ్రహ్మచర్యం.. అయితే ఇక గృహస్థాశ్రమం అనేది ఎందుకు? సన్యాసాశ్రమం ఒక్కటే హిందువులకు మిగులుతుంది. 

సనాతనధర్మంలో నాలుగురకాల వ్యవస్థలు ఉన్నాయి. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్తం, సన్యాసాశ్రమం ఉండేవి. దానికి తగ్గట్లు ఆచరణ ఉండేది.  ఎవరి స్వధర్మాన్ని వారు చక్కగా ఆచరించాలని సనాతనులు తెలియజేసారు. 

 భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ స్వధర్మాన్ని పాటించాలని అర్జునునికి తెలియజేసారు. ఇంకా ఎన్నో విషయాలను తెలియజేసారు.

 విరక్తితో యుద్ధం చేయనని అన్న అర్జునునికి.. నీ స్వధర్మాన్ని నీవు పాటించాలని తెలియజేసారు. అంతేకానీ, ఈ యుద్ధాలు అవీ  అన్నీ వ్యర్ధం, అన్నీ వదిలి నువ్వు తక్షణమే  ఎటైనా వెళ్ళి  ఒక దగ్గర కూర్చుని   తపస్సు చేసుకో.. అని చెప్పలేదు. స్వధర్మం యొక్క ప్రాముఖ్యతను బోధించి, యుద్ధానికి సిద్ధం చేసారు. 

వైరాగ్యం అని చెప్పి యుద్ధం చేయకుంటే, రాజ్యం చెడ్దవాడైన దుర్యోధనుని చేతికి వెళ్ళిపోతుంది, అప్పుడు సమాజం అతలాకుతలమవుతుంది. సమాజం బాగుండాలంటే, ఎవరి స్వధర్మాన్ని వారు చక్కగా ఆచరించాలి. 

 గృహస్థాశ్రమంలో ఉంటూ రోజూ తలస్నానాలు, ఉపవాసాలు, బ్రహ్మచర్యం.. పాటించటం సరైనది కాదు. అతిగా ఉపవాసాలు , తలస్నానాలు చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. రోజూ బ్రహ్మచర్యం అంటే  కుటుంబంలో భార్యాభర్త మధ్య కలహాలు వచ్చే అవకాశముంది. దగ్గరకు పిలిస్తే రోజూ ఏదో ఒక పూజ అంటావు మరి పెళ్ళెందుకు చేసుకున్నావు?.. అని భర్త విసుక్కుంటే భర్తతో ఏం చెప్పాలో తెలియక, అలాగని పూజ చేసిన రోజున భర్తకు చేరువయితే  దోషమేమో? అని ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ భార్య పూజ కూడా సరిగ్గా చేయలేదు. ఇలాగే పరిస్థితి ఉంటే అక్రమసంబంధాలు కూడా పెరిగే అవకాశముంది.

 స్త్రీపురుషులకు విచ్చలవిడి శృంగారం లేకుండా, పద్ధతిగా  ఉండటం కొరకు కుటుంబవ్యవస్థ ఏర్పడింది. కుటుంబవ్యవస్థ  పాడయితే సమాజమూ విఛ్చిన్నమవుతుంది.   రోజూ  దైవ పూజ చేసుకోవాలి. అయితే, తలస్నానాలు, ఉపవాసాలు, బ్రహ్మచర్యం..వంటి నియమాలను కొన్ని ప్రత్యేకమైన పూజలు, పండుగలు అప్పుడు ఆచరిస్తే సరిపోతుంది. 

అంతేకానీ, అతిగా ఆచారవ్యవహారాలను పెంచేసుకుని ..ఏ పని చెయ్యాలన్నా యూట్యూబ్ చూసి, వారి సలహాలతో గానీ చెయ్యలేమేమో? అనుకుంటూ సందేహాలతో  బ్రతికితే హిందువులు శారీరికంగా, మానసికంగా బలహీనమైపోతారు. కుటుంబవ్యవస్థ బలహీనమవుతుంది. సమాజం కూడా అస్త వ్యస్థమయి, ఇతరుల చేతిలోకి వెళ్ళే అవకాశముంది.  

మరి ఎప్పుడూ లౌకికమైన విషయాలేనా.. జీవితానికి అంతిమలక్ష్యం దైవసన్నిధిని పొందటం కదా.. అని సందేహాలు కలుగవచ్చు. ఏం చేయాలని భయపడనక్కరలేదు.  అందుకు సనాతనులు చక్కటి పద్ధతులను తెలియజేసారు.  

చతురాశ్రమధర్మాలను చక్కగా పాటిస్తూ బ్రహ్మచర్యంలో చక్కగా విద్యను అభ్యసించి, గృహస్థాశ్రమంలో  ధర్మాలను చక్కగా పాటిస్తూ..ధర్మబద్ధమైన సుఖాలను పొంది, వానప్రస్థంలో అడవులకు వెళ్లకపోయినా ఉన్న చోటే ఉండి కూడా.. క్రమంగా కోరికలను తగ్గించుకుంటూ, ఇంట్లో ఉండి కూడా మనస్సును సన్యాసాశ్రమానికి తగ్గట్లు మార్చుకుని దైవభక్తితో నిండి దైవంలో లీనమవ్వచ్చు. అంతేకానీ, అంతులేని కోరికలతో పాపాలు చేస్తూ, ఎన్ని ఆచారాలను పాటించినా వ్యర్ధమే.  

జీవితంలో దైవమే దిక్కు, జీవితపరమార్ధం దైవమే ..అనే సత్యం తెలుసుకునే పరిస్థితి చాలాసార్లు ఉంటుంది. ఆ విషయాన్ని మర్చిపోకుండా గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలి.

 సినిమాలు, సీరియల్స్ వల్ల కూడా మూఢనమ్మకాలు పెరిగాయి. అతిచేష్టలను తగ్గించుకోమని  ఎవరైనా చెబితే వారిని తిడుతూ, హిందూత్వం మంటకలిపేస్తున్నారు..అంటూ గగ్గోలు పెడతారు.. హిందువులు ఎప్పుడూ మూఢత్వంలోనే ఉండాలని కోరుకునే కొందరు ఇలా గగ్గోలు పెడతారు.  సనాతనులు ఎంతో విజ్ఞానవంతులు. ఎన్నో విషయాలను గ్రంధాల ద్వారా తెలియజేసారు. 

అయితే, కాలక్రమేణా కొందరు తెలిసీతెలియనివారు, కొందరు అవకాశవాదులు గ్రంధాలలో ప్రక్షిప్తాలను చేర్చటం జరిగింది.గ్రంధాలలో ఉన్న విషయాలను మార్చటం, క్రొత్తవి చేర్చటం చేస్తే ప్రక్షిప్తాలు అంటారు. నాకు చాలాసార్లు అనిపించింది. నియమాల పేరుతో ఇన్ని ఆంక్షలు ఎందుకున్నాయి? 

అతి ఆంక్షల వల్ల అనర్ధమే. నాకు తెలిసిన ఒక  తమిళ   బ్రాహ్మణ కుటుంబం పండుగ రోజు 21 ప్రసాదాలు చేయాలని చేసేవారు. ఆ తరువాత ఎందుకో  ఏమో?  వారు మతం  మారటం జరిగింది.  ఈ విషయాలను ఇంతకు ముందే బ్లాగులో వ్రాసాను. 

 పండుగ వస్తోందంటే ఎంతో పని ఉంటుంది. పని అంటే, ఇవన్నీ టెన్షన్  తో  కూడిన పనులు కదా.. పూజ సరిగ్గా చేయగలమో లేదో? పనులన్నీ ఎలా అవుతాయో? అని భయంగా ఉంటుంది.పండుగ అంటే ప్రశాంతంగా ఉండాలి . అంతేకానీ, కనీసం రోజూ మామూలుగా దైవాన్ని ప్రార్ధించుకునేలా కూడా పరిస్థితి ఉండదు. రకరకాల సామానులను  సమకూర్చుకోవాలి. 

పూజలలో ఎన్నో నియమాలు. వాటిని సరిచూసుకోవటానికే ధ్యాస ఉంటుంది. ఉపవాసాల వల్ల నీరసమూ ఉంటుంది. ప్రతిపూజకూ బంధుమిత్రులను పిలిస్తే వారికి అల్పాహారం, భోజనాలు కూడా చూడాలి. ఇవన్నీ కాకుండా, సులభంగా  ప్రశాంతంగా దైవస్మరణ చేసుకుంటే ఎంతో బాగుంటుంది. పనులు చేసుకుంటూనే వీలైనంతలో దైవస్మరణ చేసుకోవాలి. 

మా చిన్నప్పుడు శ్రావణమాసం పేరంటాలు అయితే స్త్రీలు ఇరుగుపొరుగు ఇళ్లకు పేరంటానికి వెళ్ళి పూజచూసి కొద్దిసేపు కబుర్లు చెప్పుకుని కొద్దిగా శనగలు, తాంబూలం పుచ్చుకుని వచ్చేవారు. అప్పట్లో అలా సింపుల్ గా ఉండేది.   జీవితంలో ఎన్నో సందర్భాలలో అతి ఆచారవ్యవహారాల వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి. 

 నాకు చాలాసార్లు అనిపిస్తుంది..మతం అనేది లేకుండా నాకు నచ్చినట్లుగా స్వేచ్చగా దైవస్మరణ చేసుకుంటే ఎంత బాగుంటుంది..అని, లేకపోతే ఉన్నమతంలోనే ఉంటూ మనకు నచ్చినట్లు, మన శక్తి కొలది  దైవాన్ని పూజించుకుంటే బాగుంటుంది కదా..అనిపిస్తుంది.  

కొన్ని దేవాలయాలలో ఎన్నో ఉపాలయాలు ఉంటాయి. అందరు దేవతలను ప్రత్యేకంగా ప్రార్ధించుకుంటారు కొందరు. అలా ప్రార్ధించుకోవచ్చు. 

హడావిడిగా ఉన్నప్పుడు, శ్రీమాత శ్రీపరమాత్మ
అనుకుంటే ..అందరు దేవతలను ప్రార్ధించుకున్నట్లే.. అని నాకు అనిపిస్తుంది.. లేదంటే శ్రీపరమాత్మ అని ఒక్క నామముగా కూడా అనుకోవచ్చు.

టీవీలు, యూట్యూబ్ వచ్చిన క్రొత్తలో అందులో చెప్పినవి  చాలామంది పాటించడానికి ప్రయత్నిస్తారు. క్రొత్తలో ఉత్సాహంగానే ఉండవచ్చు. ఆచారవ్యవహారాలలో అతి ఎక్కువయితే క్రమంగా విసుగు అనిపిస్తుంది.అప్పుడు మొదటికే మోసం వస్తుంది. ఇవన్నీ చూసి, విసుగొచ్చి  చాలా కుటుంబాలలో  కొందరు  మేము ఇవన్నీ చేయం .. అని అంటున్నారు. 

అందరూ అన్ని పూజలూ చేయాలని ప్రాచీనులు చెప్పలేదు. కొందరికి, పెద్దగా పూజలు చేయకపోయినా ఫరవాలేదు. కొద్దిగా పూజచేసుకుని, మీ స్వధర్మాన్ని మీరు చక్కగా పాటించితే చాలు చక్కటి ఫలితం వస్తుందన్నారు. ఆచారవ్యవహారాల విషయంలో కూడా అందరికీ ఒకే విధంగా చెప్పలేదు. అలాంటప్పుడు,  అందరికీ అన్నట్లుగా ఇన్ని ఆచారవ్యవహారాలను, విధివిధానాలను చెప్పటం ఎందుకో అర్ధం కావటం లేదు.

కొన్ని కుటుంబాలలో ఇన్ని ఆచారవ్యవహారాలను పాటించరు. అలాంటప్పుడు యూట్యూబ్ లో ఇవన్నీ చూసి, ఇవన్నీ అందరూ చేయాలి కాబోలు అనుకుని ఎవరైనా మొదలుపెడితే కొన్ని కుటుంబాలలో  కుదరకపోవచ్చు.కుటుంబసభ్యుల మధ్య గొడవలు కూడా వస్తాయి.

మాంసాహారాన్ని తినే వారింట్లో ఎక్కువ నియమాలను పాటించాలంటే కష్టం. మాంసాహారం తిని పూజ చేయవచ్చా? అని  అడుగుతారు కొందరు. తలస్నానం చేసి చేయవచ్చని చెబుతారు కొందరు. ఇక చిన్నపిల్లలకు కూడా అదేపనిగా చన్నీటితో తలస్నానాలు చేయించి పూజలు చేస్తుంటారు. పిల్లలకు తల తడి బాగా ఆరాలి. లేకపోతే, జలుబు చేసే అవకాశముంది.

 కలియుగంలో బ్రాహ్మణులకు కూడా కొంత సులభమైన  విధానాలే ఉంటాయి. కాలపరిస్థితులకు తగ్గట్లుగా కూడా ఉండాలి. అందువల్లే కాబోలు కలియుగంలో  దైవస్మరణ, దైవనామస్మరణ సులభోపాయం ..అని   ప్రాచీనులు తెలియజేసారు. 

 లోకంలో ఎంతో విజ్ఞానం ఉంది. ఎన్నో విద్యలున్నాయి.  అన్ని విద్యలను ప్రతి ఒక్కరు నేర్చుకోనవసరం లేదు. నేర్చుకోలేరు కూడా. ఎవరు నేర్చుకునేవి వారు నేర్చుకోవచ్చు.

  దైవం ఎప్పుడూ అందరికీ ఒక్కరే. దేశాలు, సంస్కృతులు వేరు కాబట్టి  అనేక మతాలు ఏర్పడ్దాయి. ఎవరి మతాన్ని వారు చక్కగా ఆచరించుకోవచ్చు. అయితే, కొందరు మనుషుల్లో ఇన్ సెక్యూరిటీ, ఇతరులపైన ఆధిపత్యం చేయాలనే ధోరణుల వల్ల ఎవరి మతాన్ని వారు కాపాడుకోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 

ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఒక విషయం మాత్రం నిజం. అతి ఆచార వ్యవహారాలను  తగ్గించుకోకుంటే  హిందూ మతానికి నష్టం జరిగే అవకాశముంది. ఆచారవ్యవహారాలను పూర్తిగా వదిలేయమని నా అభిప్రాయం కాదు.  ఈ రోజుల్లో భక్తులమని చెప్పుకుంటున్నవారిలో ఎంతమంది  పాపాలు చేయకుండా ఉంటున్నారు? 

 దైవభక్తి, సత్ప్రవర్తన..ఉంటే  సమాజంలో చాలావరకు సమస్యలు సమసిపోతాయి. పాపాలు చేయటం వల్ల కష్టాలు వస్తాయి. పాపాలు చేయకపోతే దైవం కూడా కష్టాలను ఇవ్వరు. పాపాలు చేస్తూ ఉంటే ఎన్ని పాటించినా కష్టాలు రాక తప్పదు. 

రావణాసురుడు కైలాసానికే వెళ్ళగలిగిన గొప్ప శివభక్తుడు. అయితే అతడు చేసిన పాపాల వల్ల అతని సంతానంతో సహా నాశనమయ్యాడు. సీతాదేవిని శ్రీరామునికి అప్పగించాలని శివాంశసంభూతుడైన ఆంజనేయుల వారు ముందుగా హెచ్చరించినా రావణాసురుడు వినలేదు. అందుకు తగ్గ శిక్ష పడింది. ఎవరైనా సరే ఒక ప్రక్కన పాపాలు చేస్తూ ఎన్ని ఆచారాలను పాటించినా మంచి ఫలితం ఉండదు.

ఎవరైనా తరించటానికి దైవభక్తి, సత్ప్రవర్తన..ఎంతో అవసరం. ఆచారవ్యవహారాలను అతి  క్లిష్టంగా చేసుకోనవసరం లేదు. సులభంగా ఉంటే మంచిది. ఆధునిక కాల పరిస్థితులకు ఇది చాలా అవసరం. 

 దైవం మెచ్చేటట్లు జీవించితే అది కూడా పూజయే. 

   ........ 

వ్రాసిన వాటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
 వ్రాసిన విషయాలలో ఒప్పులు దైవం దయవల్ల వ్రాసినవి. తప్పులుంటే అవి నేను చేసినవి.


Thursday, June 1, 2023

చెప్పుల వంటివి లేకుండా నడిస్తే ..

 

 కరెంట్ విషయంలో జాగ్రత్త కొరకు ఎర్తింగ్ చేస్తారు. పిడుగుల నుంచి రక్షణ కొరకు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.

అయితే, ఎర్తింగ్ అనే పదం మనుషుల విషయంలో కూడా వాడుతున్నారు....కొద్దిసేపైనా నేలపైన పాదరక్షలు లేకుండా నడిస్తే ఎర్తింగ్ జరిగి ఆరోగ్యంగా ఉంటారని  కొందరు తెలియజేస్తున్నారు.

దేవాలయాల చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు, దేవాలయానికి వెళ్ళటానికి కొండలు ఎక్కేటప్పుడు..చెప్పులు లేకుండా నడిస్తే పుణ్యం వస్తుందని అంటారు. చెప్పుల వంటివి లేకుండా నడిస్తే ఆరోగ్యానికి కూడా మంచిదని పరిశోధకులు తెలియజేస్తున్నారు.

 అయితే.. ప్లాస్టిక్, రబ్బర్..పాదరక్షలు వేసుకుని నడిస్తే ఎర్తింగ్ జరగదట. చెక్క వంటి సహజమైన వాటితో చేసిన పాదరక్షలు వేసుకుంటే ఎర్తింగ్ జరుగుతుందట. పాతకాలంలో మనవాళ్ళు చెక్కతో చేసిన పాదరక్షలు వేసుకునేవారు. ..

 ఈ రోజుల్లో కొండ మీద నడవాలంటే కొన్ని చోట్ల తారురోడ్ల మీద కూడా నడవవలసి వస్తోంది. తారురోడ్డు కృత్రిమం కనుక తారురోడ్ల మీద నడవటం వల్ల ఎర్తింగ్ ఉండదేమో అని నాకు అనిపించింది. మట్టిరోడ్డు మీద నడిస్తే ఎర్తింగ్ ఎలాగూ ఉంటుంది. నాపరాళ్ళు వేసిన ` దారిమీద అయితే నాపరాళ్ళు సహజమైనవే కాబట్టి ఎర్తింగ్ ఉండవచ్చు అని నాకు అనిపిస్తోంది. వీలైతే తారురోడ్డు ప్రక్కన నేలమీద నడవవచ్చు. .. 

ఎర్తింగ్ అనే విషయం గురించి విదేశాల వాళ్ళు ఒక మూవీ కూడా తీశారు...The Earthing Movie..The Remarkable Science of Grounding (full documentary) .. 

 రోజూ ఆరోగ్యం కొరకు వాకింగ్ చేసేవారు ఇంటివద్ద మట్టినేలమీద చెప్పులు లేకుండా నడవవచ్చు. రాళ్ళు గుచ్చుకుంటే నడవలేని వారు సాక్స్ వేసుకోవచ్చేమో అని నాకు అనిపిస్తోంది. (సాక్స్ అంటే నా అభిప్రాయం ప్యూర్ కాటన్ సాక్స్.)

 అయితే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎర్తింగ్ తో పాటూ ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అంతేకానీ, మన ఇష్టానికి ప్రవర్తిస్తూ ఎర్తింగ్ మాత్రమే చేయటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు.

కొందరు ఏమంటారంటే,  పూజలు చేసే సమయంలో నేల మీద డైరెక్టుగా కూర్చోకూడదు.. పూజ సమయంలో  ఏకాగ్రతతో, చక్కగా ఉండాలంటే  నేలమీద చెక్కపీట కాని, ఏదైనా పరుచుకుని కాని కూర్చోవాలని చెబుతారు. 

 కొందరు ఏమంటారంటే, విపరీతంగా పూజలు చేసే కొందరిలో విపరీతమైన శక్తి వచ్చే అవకాశం ఉంది ..అనేక కారణాల వల్ల కొందరు ఆ శక్తిని తట్టుకోలేరు... అలా  తట్టుకోవాలంటే బాగా నడవటం వంటి శారీరికశ్రమ చేయాలని కూడా అంటారు.

ఇవన్నీ గమనిస్తే నాకు ఏమనిపించిందంటే, నడిచే సమయంలో అప్పుడప్పుడూ అయినా పాదరక్షలు వేసుకోకూడదు..ముఖ్యంగా దేవాలయాల వద్ద పాదరక్షలు వేసుకోకుండా నడిస్తే మంచిది...ఇక, కూర్చుని పూజ చేసే సమయంలో ఏకాగ్రతతో, చక్కగా ఉండాలంటే  నేల పైన  ఏమైనా పరుచుకుని కూర్చోవాలేమో .. అనిపించింది. 

.....

 నడిచే సమయంలో నేలమీద కొన్నిసార్లయినా బూట్ల వంటివి లేకుండా నడిస్తే మంచిదనే విషయంలో అనేక కారణాలు ఉంటాయి.
నాకు తోచిన వాటిలో మరి కొన్ని కారణాలు ఏమిటంటే..
 కొందరిలో అనారోగ్యం ఉంటుంది. బూట్ల వంటివి లేకుండా కొంతసేపు మట్టినేలమీద నడవటం వల్ల  ఆరోగ్యం బాగుంటుంది.  దేవాలయాల వద్ద ప్రదక్షిణ చేయటం, గిరిప్రదక్షిణ వంటి సందర్భాలలో ఇలా నడవటం ఇంకా మంచిది.

 విపరీతంగా పూజలు చేసే కొందరిలో విపరీతమైన శక్తి వచ్చే అవకాశం ఉంది. అనేక కారణాల వల్ల కొందరు ఆ శక్తిని తట్టుకోలేరు. అలా తట్టుకోవాలంటే  నడవటం వంటి శారీరిక శ్రమ చేయటం మంచిది.... కొంతసేపు మట్టినేలమీద బూట్లువంటివి లేకుండా నడవటం మంచిది...దేవాలయాల వద్ద ప్రదక్షిణ చేయటం, గిరిప్రదక్షిణ వంటి సందర్భాలలో ఇలా నడవటం ఇంకా మంచిది...దైవకృపను పొందాలి. అంతా దైవం దయ.

  ఇలా ఎన్నో విషయాలు ఉంటాయి. .... సరిగ్గా అర్ధం కాని విషయాలు సృష్టిలో ఎన్నో ఉన్నాయి. అయితే, ఇవన్నీ అతిగా ఆలోచించి ఏది ఎలా చేయాలో తెలియక అయోమయం అవ్వటం కన్నా, తగుమాత్రం విషయపరిజ్ఞానం కలిగి, జీవితంలో ధర్మబద్ధంగా ఉండటానికి ప్రయత్నించటం..దైవం పైన చక్కటి భక్తి కలిగి ఉండటం ద్వారా.. ఎక్కువ విషయపరిజ్ఞానం లేకున్నా కూడా దైవకృపను పొందగలరు ..అని నాకు అనిపిస్తుంది. దైవస్మరణ ఎంతో మంచిది.

************

ఇంకా ఏమనిపిస్తుందంటే,
 చాలామంది పూజచేసేటప్పుడు నేలమీద రకరకాలైన పట్టాలను(మాట్స్)పరుచుకుని కూర్చుంటారు. ఉదా..దర్భతో చేసినవి, కొబ్బరినారతో చేసినవి. ప్యూర్ కాటన్ వస్త్రాలు పరచుకుని కూడా కూర్చోవచ్చు. అయితే, పోలియెస్టర్తో చేసిన మాట్స్ పరుచుకుని కూర్చోకూడదనిపిస్తుంది.

ఇంకా ప్రాచీనకాలంలో పూజ చేసేటప్పుడు ప్యూర్ కాటన్ వంటి వస్త్రాలను ధరించేవారు. ఈ రోజుల్లో కూడా పూజ సమయంలోనైనా ప్యూర్ కాటన్ దుస్తులను వేసుకుంటే మంచిదనిపిస్తుంది. పట్టువస్త్రాలను ధరించటం కొందరికి ఇష్టం ఉండదు. వాటి తయారీలో పట్టు పురుగులు చనిపోతాయని.

పూజ చేసేటప్పుడు ఈ మధ్య కొందరు ప్లాస్టిక్ పీటలు వేసుకుని కూర్చుంటున్నారు. అయితే, సహజమైన చెక్కతో చేసిన  పీటలు వేసుకుని కూర్చుంటే మంచిది. ఆ పీటలకు ఇనుప మేకులు లేకుండా ఉంటే మంచిదికావచ్చు. పాతకాలంలో కొందరు ఇనుప మేకులు కాకుండా చెక్క చీలలు వేసి  పీటలను తయారుచేసేవారు.

విషయపరిజ్ఞానం తెలుసుకుంటే మంచిదేకానీ, ఇలా ఆలోచిస్తుంటే ఆలోచనలకు జీవితకాలం సరిపోదు. విజయపరిజ్ఞానం అనంతమైనది. మనకు తెలియని రహస్యాలెన్నో ఉన్నాయి. అందువల్ల, మనకు చేతనైనంతలో పాటించటానికి ప్రయత్నిస్తూ దైవాన్ని నమ్మి చక్కగా జీవించాలి.

   అంతా దైవం దయ. 

****

మరికొన్ని విషయాలను నేను కామెంట్స్ వద్ద వ్రాసానండి. పోస్ట్ ఇప్పటికే పెద్దగా అయ్యింది కాబట్టి, మరిన్ని విషయాలను ఒకేచోట వ్రాస్తే గజిబిజిగా ఉంటుందేమోననే అభిప్రాయంతో కామెంట్స్ వద్ద వ్రాసాను. దయచేసి చదవగలరు.