koodali

Friday, June 28, 2013

ఉత్తరాఖండ్ లో వరదలకు ముందు శ్రీ ధారీ దేవి విగ్రహమూర్తి తరలింపు మరియు కొన్ని విషయాలు.........

ఓం
ఈ  రోజు  శుభప్రదమైన  ఈ సంవత్సరపు  అమరనాధ్  యాత్ర  ప్రారంభమవుతున్నది.

...................................


ఈ  మధ్య  ఉత్తరాఖండ్ లో  వచ్చిన   వరదల  గురించి  అందరికి  తెలిసిందే.  ఉత్తరాఖండ్  రాష్ట్రంలో   శ్రీ  ధారీ దేవి  ఆలయం  ఉన్నదట. ధారీదేవి  చార్ ధాం  క్షేత్రముల  పాలకురాలట.

   ఉత్తరాఖండ్ లో  ఎన్నో  జల  విద్యుత్  ప్రాజెక్ట్ లు  నిర్మించారట.  ఆ  క్రమంలో  ఒక  పవర్  ప్రాజెక్ట్  కట్టడం కోసం  అడ్డుగా  ఉన్నదని  ధారీదేవి  ఆలయంలోని   మూలమూర్తిని  వేరొక చోటికి  తరలించాలని  నిర్ణయించారట.

 వరదలు  వచ్చిన  రోజున  సాయంకాలం  ధారీదేవి  మూర్తిని  కదిలించటానికి  ప్రయత్నిస్తుండగానే  ఆకాశంలో  మెరుపులు  వచ్చాయట.  ఆ  తరువాత  దైవమూర్తిని  అక్కడనుంచి  కదిలించిన  తరువాత  కొద్దిసేపటికే  వాన  మొదలై  అదేరోజు  ఉధృతమై  గంగమ్మ  పొంగి  వరదలు  ఉద్ధృతంగా  వచ్చాయని  మీడియా  వార్తల  ద్వారా  తెలుస్తోంది.

ఇంతకుముందు  కొన్ని  సంవత్సరాల  క్రిందట  కూడా  ఒక  రాజు  శ్రీ ధారీ దేవి  విగ్రహమూర్తిని   కదిలించటానికి  ప్రయత్నించినప్పుడు  ఇలాగే  ప్రతికూలాంశాలు  కనిపించటం  వల్ల  ఆ రాజు  విగ్రహమూర్తిని  కదిలించే  ప్రయత్నాన్ని  మానుకున్నాడని  వార్తల  వల్ల  తెలుస్తోంది. ఇంత  వరదలలో  కూడా  కేదార్ నాధ్  దేవాలయం  చెక్కుచెదరకుండా ఉంది . ప్రధాన  పూజారి  ప్రాణాలతో  బయటపడటం  దైవలీల.
  బండరాయి  ఒకటి  కేదార్ నాధ్  ఆలయం  ఎదురుగుండా  ఉన్న  నందీశ్వరుని  ప్రక్కన  కనిపిస్తోంది.  నందీశ్వరుని మూర్తి  చెక్కుచెదరలేదు.   అంతా  దైవం  దయ.
............................. 


ఈ  వరదలవల్ల  కొందరు  భక్తులు  మరణించటం  వెనుక  అనేక  కారణాలు  ఉంటాయి.  ఆ  కారణాలేమిటో  భగవంతునికే  తెలియాలి.  


 అయితే, వరదల నుంచి  బయటపడి,  సరిగ్గా   తిండితిప్పలు  లేకపోయినా  ఎందరో  భక్తులు   ప్రాణాలతో  బయటపడటం  అనేది  ఎంతో  గొప్ప   విషయం.  అంతా  దైవం  దయ.  దైవానికి  అనేక  కృతజ్ఞతలు.

బాధితులను ఆదుకున్న  అందరూ  ఎంతో  అభినందనీయులు.


బాధితులను  ఆదుకునే  సమయంలో   ప్రాణాలను  కోల్పోయిన  జవానులు మహనీయులు.  వారికి నివాళులు.

....................


 అడవులను  నరికివేయటం,  వాతావరణ  కాలుష్యం  వంటి  కారణాల  వల్ల  ఎంతో  పర్యావరణ  కాలుష్యం  జరుగుతోంది .
పవిత్రంగా భావించే గంగా నదిలోనూ  విపరీతంగా కాలుష్యాలను  కలుపుతున్నారు. 
 
మానవుల  స్వార్ధపూరితమైన  చేష్టల  వలన  కొన్ని   జీవజాతులు  అంతరించే  స్థాయికి  చేరుకుంటున్నాయంటున్నారు.
పర్యావరణాన్ని  అతిగా  కలుషితం  చేస్తే  మానవులకు  కూడా  ప్రమాదం  పొంచి  ఉన్నట్లే. 

......................... 

శ్రీ రామాయణ  మహా కావ్యాన్ని  వ్రాసిన  వాల్మీకి  మహర్షి ...   ఒక  పక్షి  జంటలోని ఒక
పక్షి మరణిస్తే రెండవ  పక్షి అనుభవించిన  వేదనను చూసి ఎంతో  ఆవేదనను  చెందారని  మనము  చదువుకున్నాము.
   
 మానవులు,  పశుపక్ష్యాదులు  అన్నీ  భగవంతుని  బిడ్డలే.   ప్రపంచంలో  మానవులతో  సమానంగా    జీవించే  హక్కు  పశుపక్ష్యాదులకు  కూడా   ఉన్నది.  అయితే  బలవంతులైన  మానవులు  బలహీనులైన  ఇతర జీవులపై  పెత్తనాన్ని  చెలాయిస్తున్నారు.

బలవంతులైన  బిడ్డలు  బలహీనులైన  బిడ్డలను  కష్టాలు  పెడుతుంటే  తల్లితండ్రులు  చూస్తూ  ఊరుకోరు  కదా  !  


అలాగే  బలవంతులైన  మానవులు  తమ  అంతులేని  కోరికల  కోసం  పర్యావరణాన్ని  కలుషితం  చేస్తూ  మూగప్రాణులకు  ముప్పు  కలిగిస్తుంటే  జగన్మాతాపితరులు  చూస్తూ  ఊరుకోరు.

ఈ  ప్రపంచంలో  జీవించే   ఇతర  జీవులకు  కూడా  ఎన్నో  హక్కులున్నాయని  మానవులు  గుర్తించటం  మంచిది.

...............................

భారతం,  రామాయణం  నిజంగా  జరిగినవా ? కాదా ? అని కొందరు  సందేహపడుతుంటారు. 


శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ  చరితామృతము  గ్రంధములో  రామాయణ, భారతముల  గురించిన  విషయాలు  కూడా  ఉన్నాయి.    


   శాటిలైట్  చిత్రాల సమాచారం  ద్వారా  రామాయణకాలంలో  సముద్రంలో   నిర్మించిన  వారధి  మరియు  భారతకాలం  నాటి    ద్వారకానగర  చిత్రాలు  కనిపించటం  మరియు  కొన్ని  విశ్లేషణల  వల్ల  రామాయణ, భారతాలు  గురించి  ఎన్నో  విషయాలు తెలిసాయి . 


దయచేసి ఈ  క్రింది  లింక్స్  చూడగలరు........

Amazing facts about - Ancient India: Scientific Dating of Ramayan Era  Science & Technology in Mahabharatha: Material evidence ...

 

వ్రాసిన విషయాలలో ఏమైనా  పొరపాట్లు ఉంటే  దయచేసి  క్షమించాలని దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.

 

 

Wednesday, June 26, 2013

జీవులకు భూమి ఒక పరీక్షాలోకం. ..రెండవ భాగము.


 కొందరు  ఏమంటారంటే  ఈ  ప్రపంచంలో  కష్టాలు  ఎందుకు  ఉన్నాయి  ? అంటారు. 


 ఆకలి  అన్నది  లేకుంటే  ఆశలు   పుట్టే  తావేది....


చీకటి  అన్నది  రాకుంటే  వెలుగుకి  విలువే  ఉంటుందా .....

Sri Satyanarayana Swamy - YouTube....   చిత్రంలోని

Sri Satyanarayana Swamy Video Songs - Bhagwan Hey ... - YouTube.. 

ఈ  పాట  ద్వారా  మనకు  ఎన్నో  చక్కటి  విషయాలు  తెలుస్తాయి. 

.............................................

 

ఐశ్వర్యవంతులు  కొందరు  అహంకారంతో  ఆర్భాటంగా  పెద్ద  ప్రదర్శనగా  యజ్ఞయాగాలు  చేస్తుంటారు. దానధర్మాలు  నిర్వహిస్తుంటారు. ఇవి అంతశ్శుద్ధి  లేని  కార్యాలు.  నిష్ఫలాలు.

ఏ  కార్యక్రమానికైనా  ద్రవ్యశుద్ధి  ప్రధానం.  ముందు  అది  చూసుకోవాలి.  ఎవరికీ  ఏ  ద్రోహమూ  చెయ్యకుండా  న్యాయంగా  సంపాదించిన  ధనం  ఉత్తమోత్తమం. ధర్మకార్యాలకు  దీనినే  వినియోగించాలి...


.అక్రమార్జనలతో  చేస్తే  విపరీతఫలాలు  వస్తాయి. పుణ్యం  రాకపోగా  పాపం  చుట్టుకుంటుంది.......

 . ఈ  విషయాలను  వ్యాసమహర్షి  జనమేజయునితో  చెప్పటం  జరిగింది. 
(  శ్రీ దేవి భాగవతము . )

 వ్యాసమహర్షి  తెలియజేసిన  విషయాలను ఆధ్యాత్మికవాదులు  సమాజంలో  బాగా  ప్రచారం  చేయాలి.   అధర్మంగా  ధనాన్ని  సంపాదించటం  తప్పు  అని  గట్టిగా  తెలియజేయాలి.......

అయితే  ప్రజలు    తాము  చేసిన  పాపాలకు  పరిహారక్రియల  గురించి  తెలుసుకోవటానికి    చూపించే  ఆసక్తిని   పాపం  చేయకుండా  ఉండటంలో  చూపిస్తే ఎంతో   బాగుంటుంది.
.................................

ఉత్తరాఖండ్ లో  వరదవిషాదాన్ని  చూస్తుంటే  ఎంతో  బాధగా  అనిపిస్తోంది.  


  కర్నూల్ వద్ద వచ్చిన వరదలలో అలంపురంలోని శ్రీబాలబ్రహ్మేశ్వరస్వామిశ్రీ జోగుళాంబదేవి  దేవాలయము  వద్దకు కూడా  వరద నీరు   వచ్చింది. ఎంతో   బురద  కూడా  వచ్చింది. 

 కేదార్ నాధ్  దేవాలయం  వద్ద  బురద  గురించి  వింటుంటే  అలంపురంలోని  దేవాలయము లోని  శివలింగాల  వద్ద  బురద  పేరుకుపోవటం  గుర్తు  వస్తోంది.   అలంపురం  దేవాలయం  వద్ద  బురదను  శుభ్రం  చేయటానికి  ఎక్కువరోజులే  పట్టినట్లుంది. 

.......................................

 లోకంలో  పాపం  పెరిగినప్పుడు  ప్రకృతి  కన్నెర్ర  చేస్తుందంటారు. 


 ఎలాగైనా  సరే  డబ్బును  సంపాదించి  విలాసంగా  జీవించాలని  కోరుకునే  వారి  సంఖ్య  ఈ  రోజుల్లో  బాగా  పెరిగింది.

 దైవాన్ని నమ్ముతాము.  అని  చెప్పే  వాళ్ళలో  కూడా  కొందరు ,  పాపకార్యాలు  చేసి  పాపపరిహారం  కోరుకుంటారు.
 ( తాము  చేసిన  పాపాలకు  పశ్చాత్తాపం కూడా  లేకుండా. )


దేవాలయాల్లో  సిబ్బంది  కొందరు   లడ్డూలను  తక్కువ  తూకం  వేసి  విక్రయించటం  వంటి  వార్తలను  వింటున్నాము. 

 మానవులు  చేస్తున్న  పర్యావరణ కాలుష్యం  వలన  ఇతర  జీవజాతులు  అంతరించే  స్థాయికి  చేరుకుంటున్నాయి.

మానవులు  తమ   స్వార్ధం  కోసం  ఎన్నో   పశుపక్ష్యాదుల  కుటుంబాలలో  చిచ్చుబెడుతున్నారు.   మరణం  వంటివి  సంభవించి,   ఎడబాటు  సంభవించినప్పుడు   పశుపక్ష్యాదులు    కూడా   బాధను  అనుభవిస్తాయి.  అయితే  వాటి  బాధను  పైకి  చెప్పుకోలేవు.  అవి  మూగ  జీవులు  కదా  !

 బలవంతులైన  మానవులు  తమ  అంతులేని  కోరికల  కోసం  పర్యావరణాన్ని  కలుషితం  చేస్తూ  మూగప్రాణులకు  ముప్పు  కలిగిస్తుంటే  జగన్మాతాపితరులు  చూస్తూ  ఊరుకోరు.


కొన్నిచర్యల  ద్వారా  మానవులకు  హెచ్చరికలను  చేస్తారు. అప్పటికీ   మానవులు  బుద్ధి  తెచ్చుకోకపోతే  తమదైన  శైలిలో  దైవం  ప్రపంచాన్ని  రక్షించుకుంటారు.
Monday, June 24, 2013

జీవులకు భూమి ఒక పరీక్షాలోకం.

మనకు  అనేక  సందేహాలు  వస్తుంటాయి.  లోకంలో  కష్టాలు  ఎందుకుండాలి  ?  అన్నీ  సుఖాలే  ఉండవచ్చు  కదా  !  వంటి  ప్రశ్నలు ..చక్కటి  ఆహారం  తీసుకోవటం  మనకు  సుఖంగా  అనిపిస్తే  మన  ఆహారం  కోసం  త్యాగం  చేసే  మొక్కల  సంగతేమిటి  ?  

మొక్కలు  సుఖంగా  ఉండాలంటే  మనుషులు  కేవలం  రాలిపడిన  ఆకులను,  పండ్లను  తిని  జీవించాలి.  అందుకు  ఎందరు  సిద్ధంగా  ఉంటారు  ?


కష్టాలు లేని లోకాలూ ఉన్నాయి. అవి పొందాలంటే, అర్హత సంపాదించాలి.....

 

కొంతకాలం క్రిందటి వరకూ ఇలా అనిపించేది.

* సృష్టిలో ఎన్నో బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నాయి కదా ! అవి ఎందుకు జరగాలి ? అనిపించేది. 


  అయితే , ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, ఈ లోకంలో బాధ కలిగించే విషయాలున్నాయి నిజమే.    కానీ , భూకంపాలు, సునామీలు, వంటి బాధలు , ఇతర బాధలు లేని లోకాలు కూడా ఉన్నాయి.


* " ఒక యోగి ఆత్మకధ " గ్రంధములో చెప్పబడిన , కారణలోకం.... వంటి  ఉత్తమలోకాలలో ఈ బాధలుండవు.


కానీ అక్కడికి చేరుకోవాలంటే ఈ జన్మలో సక్రమమార్గంలో జీవించాలి. అలా క్రమంగా అత్యుత్తమమైన బ్రహ్మానంద పరమపదమును పొందవచ్చు.


* మానవులు ఈ భూలోకంలోనే శాశ్వతంగా ఉండిపోవాలని దైవం యొక్క అభిప్రాయం కాదని పెద్దలు చెపుతారు.


* మానవులు సత్కర్మలను ఆచరించటం ద్వారా దైవకృపను పొంది ,బాధలు లేని ఉత్తమలోకాలను పొంది, పరమపదాన్ని పొంది బ్రహ్మానందాన్ని పొందాలని వారి భావన.* ఇంకా, ఏమనిపిస్తుందంటే, ఇదంతా దైవం మనకు పెట్టే పరీక్ష.

ఈ ప్రపంచమనే పరీక్షలో ఎక్కువ మార్కులు తెచ్చుకుని పాసయిన వారికే బాధలు లేని ఉత్తమ లోకాలను పొందే అర్హత లభిస్తుంది. క్రమంగా అలా పరమపదాన్నీ పొందే అర్హత లభిస్తుంది.అనిపించింది.లోకంలో మామూలు పరీక్షలంటేనే , ఎంతో కష్టపడి   చదవాలి. ఆటల్లో గెలవాలన్నా ఎంతో శ్రమపడి   కోచింగులు తీసుకోవాలి. ఆటల్లో తగిలే దెబ్బలకు  భయపడకుండా కష్టపడాలి.


మరి బాధలు లేని ఉత్తమలోకాలను పొందాలన్నా, పరమపదాన్ని పొందాలన్నా కొంచెమయినా  కష్టపడకుండా ఎలా .

* ఇలా అనిపించిన తరువాత నా సందేహం తీరింది.


* జీవులకు అసలు పరీక్ష........ మనసును అదుపులో పెట్టుకోవటమే.

అందుకే పెద్దలు అంటారు మనస్సును జయించితే.....ప్రపంచాన్ని
జయించినట్లే అని.


* అందుకే లోకంలో ఇన్ని కష్టాలు ఎందుకు ఉన్నాయి ? అని వాటిని చూసి నిరాశ పడిపోకూడదు.


గొప్ప సుఖాలను పొందాలంటే కొన్ని కష్టాలను ఎదుర్కోవాలి మరి.

చిన్నపిల్లలు నడక నేర్చుకునే క్రమంలో ఎన్నోసార్లు క్రిందపడి దెబ్బలు తగిలించుకుని ఏడుస్తారు. అది సహజం. 


నడకనేర్చుకునేటప్పుడు దెబ్బలు ఎందుకు తగలాలి ? మా అమ్మ ఎంత దయలేనిది . నేను క్రిందపడి దెబ్బలు తగిలించుకుంటున్నా కూడా నడకనేర్చుకోమంటోంది. అని పిల్లలు అనుకోరు కదా ! .సైకిల్ నేర్చుకునేటప్పుడు బాలన్స్ చేతకాక ఎన్నో సార్లు క్రిందపడి దెబ్బలు తగిలించుకుంటారు. అయినా లెక్కచేయకుండా ఉత్సాహంగా సైకిల్ నేర్చుకుంటారు.


 అంతేకానీ సైకిల్ నేర్చుకోవాలంటే దెబ్బలు ఎందుకు తగులుతాయి ? ఇది చాలా అన్యాయం, మా నాన్నకు కూడా దయలేదు, క్రిందపడుతున్నా జాలి లేకుండా సైకిల్ నేర్పిస్తున్నారు. అని పిల్లలు అనుకోరు కదా !


ఒక ఆఫీసులో ఉద్యోగస్తులను చేర్చుకోవాలన్నా వ్యక్తుల అర్హతలను పరిశీలించే ఉద్యోగంలో చేర్చుకుంటారు..... రోడ్డున పొయ్యే వారిని పిలిచి ఎవరికైనా ఉద్యోగాలు ఇవ్వరు కదా !* అలాగే, మరి కష్టాలు లేని ఉత్తమలోకాలను పొందాలన్నా దానికి కొన్ని అర్హతలను సంపాదించాలి.

* అలాగే పరమపదాన్ని సాధించే క్రమంలో ......... జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సునామీలు, భూకంపాలూ అటువంటివే.


ఆ కష్టాలను చూసి ధైర్యాన్ని కోల్పోకూడదు. అప్పుడే బ్రహ్మానందం మనకు లభిస్తుంది.


* భూకంపాలు, రైలు ప్రమాదాలు వంటి ప్రమాదాల్లో కూడా కొందరు చెక్కుచెదరకుండా బయటపడతారు, కాలం కలిసి వస్తే అంతే మరి.* చిన్నచీమ కూడా తాను ఎప్పుడు ఎవరి కాలిక్రింద పడి చనిపోతానో అని భయపడకుండా తన జీవితాన్ని సాగిస్తుంది.


* మనిషి కూడా ప్రతిదానికి భయపడకుండా భగవంతునిపై భారం వేసి స్వధర్మాన్ని పాటిస్తూ నిష్కామంగా జీవితాన్ని గడపటానికి ప్రయత్నించాలి.


* బాధలు లేని లోకాలను చేరాలంటే ఈ జన్మలో సక్రమమైన పద్ధతిలో జీవించాలి.


* జీవించటమో ? మరణించటమో ! కష్టమో ! సుఖమో ! అంతా భగవంతుని దయ .అనుకున్ననాడు బాధేలేదు.


* ఆ ధైర్యం రావాలన్నా దైవకృప అవసరం . అందుకే దైవకృప కోసం ప్రయత్నించాలి..

* దయచేసి  ఈ  క్రింది  లంకెను   కూడా  చదువుతారా........* అందుకేనేమో దైవం సునామీలనూ, సుడిగాలులనూ కూడా... Friday, June 21, 2013

మానవతప్పిదం..గంగమ్మ ఉధృతి ..మహా విలయం ...


.ఉత్తరాఖండ్ లో  జరిగిన  విషాదం  అత్యంత  బాధాకరమైనది.   వరదల  వల్ల  జరిగిన  నష్టం  ఒక  విషాదమైతే,  ఆ  తరువాత   ఆహారం,  నీరు  అందక   బాధితులు  అనుభవించిన,  అనుభవిస్తున్న   వ్యధ  మరింత  విషాదకరం .  

 4  రోజులు  గడుస్తున్నా  ఇంకా  కొందరు  సహాయం  కోసం  ఎదురుచూస్తూ  కొండలలో  చిక్కుకుని  ఉన్నారని  వార్తలు  వస్తున్నాయి.   తమకు   సహాయం  అందటం  లేదని , తమను  ఆదుకోవాలని  బాధితులు   విలపిస్తున్నారు.  ఇదంతా  చూస్తుంటే  మనదేశ పరిస్థితి  ఏ స్థాయిలో ఉందో  తెలుస్తోంది.


ఇప్పటికయినా  దైవం  దయ  వలన  వాతావరణం  అనుకూలించి  వానలు  తగ్గుముఖం  పట్టాయి  కాబట్టి ,  సహాయకార్యక్రమాలు  అందించటానికి   వెసులుబాటుగా  ఉంది. ఇలాంటివి  గమనించినప్పుడు  ప్రకృతి  ముందు మనిషి  శక్తి  ఎంత  తక్కువో   తెలుస్తుంది. కొన్ని రోజులు  నీరు  ఆహారం  అందకపోయినా  ఎంతోమంది  ప్రజలు  ప్రాణాలతో  బయటపడటం  దైవం  దయ  వల్లనే. అత్యంత  క్లిష్టసమయంలో  సైన్యం  అందిస్తున్న  సేవలు  ఎంతో  ప్రశంసనీయమైనవి.  వారిని  చూసి  మనం  ఎంతో  నేర్చుకోవాలి. సమాజానికి  ఎంతో  సేవను  అందిస్తున్న   వారు,  వారి  కుటుంబసభ్యులు   ధన్యజీవులు.  మీడియా  వారు  కూడా  బాధితులకు  సమాచారాన్ని  అందించి   సేవ  చేస్తున్నారు. సైన్యం ,  పోలీసులు , ఉద్యోగస్తులు  మరియు  ఇతర  సేవకులు  ఇంకా   బాధితులకు  సహాయాన్ని  అందిస్తున్న  ప్రతి  ఒక్కరికి  కృతజ్ఞతలు.


ఈ  సంఘటనలో  పెద్ద  ఎత్తున  నష్టం  జరగటానికి  వెనుక  ఎన్నో    మానవ  తప్పిదాలు  ఉండవచ్చనిపిస్తోంది.  మానవుల  మితిమీరిన  కోరికల  వల్ల   వాతావరణం  విపరీతంగా  మారిపోతోంది.  విపరీతమైన  ఎండలు,  విపరీతమైన  వానలు,  వరదలుగా  మారుతున్నాయి.  

 

  గంగానది  కాలుష్యానికి  ఎన్నో  కారణాలున్నాయి.  అద్భుతమైన ,  పవిత్రమైన,  పరిశుద్ధమైన  గంగమ్మను  పూజిస్తూనే ,  కలుషితాలను  కూడా  నదిలో   విపరీతంగా  కలిపేస్తున్నారు.
గంగమ్మను  గౌరవించటం  ఇలా కాదు కదా !


 ఎన్నో  పారిశ్రామిక  వ్యర్ధాలను  గంగానదిలో    వదిలేస్తున్నారట. సగం మాత్రమే  కాల్చిన  శవాలను  కూడా గంగలో  వదిలేస్తారట. 


 గంగానదిని  కాలుష్యం  బారినుంచి  కాపాడాలని  నిరాహారదీక్ష  చేసి  కొంతకాలం  క్రిందట  ఒక  సాధువు  ప్రాణాలను  కోల్పోయారు.  అయినా    కాలుష్యనివారణ  చర్యలను    పెద్దగా  చేపట్టలేదు.  
గంగను  శుద్ధిచేసి ,  కాలుష్యాలను  నదిలోకి  వదలకుండా  కట్టడి  చేసి,  నదిలో  పూడికను  తీసి  శుభ్రం  చేస్తే  ఇంత  విషాదం  జరిగి  ఉండేది  కాదనిపిస్తుంది.  


ఉత్తరాఖండ్  రాష్ట్రంలో  విద్యుత్  కోసం  నదీ  ప్రవాహాలను  దారి  మళ్ళించి  ఎన్నో    జల విద్యుత్ ప్రాజెక్టులు  నిర్మించారట.  కొండలలో  ఎన్నో  సొరంగాలు  త్రవ్వారంటున్నారు. ఆ  సొరంగాలు  త్రవ్వగా  వచ్చిన  మట్టి  లేక  ఇసుకను  నదులలో  గ్రుమ్మరించారట.   ఆ  విధంగా  నదులలో  పూడిక  పెరిగిపోతే   వరదనీరు  ఊళ్ళ  మీద  పడే  అవకాశం  ఉంది.

 కొండలలో  సొరంగాలు  త్రవ్వటానికి   పేలుళ్ళు  జరిపితే,  బీటలు వారిన  కొండచరియలు  బలహీనమవుతాయి. అలా  బలహీనమైన  కొండచరియలు  త్వరగా  విరిగిపడే  అవకాశం   ఉంది.   ఇవన్నీ  కలిసి   ఇంతటి  మహావిషాదానికి  కారణం  అయిఉండవచ్చు.   ప్లాస్టిక్  వల్ల  పర్యావరణం  ఎంతో  కలుషితం  అవుతోంది. గాలికి  కొట్టుకువచ్చి  కాలువలకు  అడ్డం  పడే  టన్నుల  కొద్ది  ప్లాస్టిక్   కవర్ల   వల్ల   నీటిపారుదల  వ్యవస్థ  దెబ్బతిని , వాననీరు  పోయే  దారిలేక  కొంతకాలం  క్రిందట   ముంబయి  వంటి  నగరాలను  వరదలు  ముంచెత్తాయి. మేము  అమరనాధ్  వెళ్ళినప్పుడు  అక్కడ  కొండల  వద్ద  కూడా వాడి   పడేసిన  మంచినీటి  ప్లాస్టిక్  బాటిళ్ళు  కనిపించాయి. ( నిలువ  ఉండి  పుల్లటి  వాసన  వస్తున్న  కొన్ని  ఆల్బుకరా  పండ్లు  ఉన్న  ప్లాస్టిక్  కవరును  మేము  కూడా  అక్కడ  పడేసి వచ్చాము.)ఇప్పటికైనా  ప్రజలు  మేలుకుని ,  వినోదకార్యక్రమాల  నుంచి  కొద్దిగా  బయటకొచ్చి ,  సమాజంలోని  సమస్యల  పరిష్కారానికి  కృషిచేస్తే  బాగుంటుంది.

 ప్రతి  వ్యక్తి  తన  పరిధిలో  పద్ధతిగా  జీవిస్తే  సమాజం  దానికదే  బాగుపడుతుంది.  అవినీతికి,  అత్యాశకు   దూరంగా  ఉండటానికి  ప్రయత్నించాలి.  ప్లాస్టిక్  కవర్ల  వాడకాన్ని  తగ్గించటం,  విద్యుత్  పొదుపుగా  వాడటం,  రసాయనాల  వాడకం  తగ్గించటం    వంటి    ఎన్నో  జాగ్రత్తలను  తీసుకోవాలి. 
 

 పర్యావరణ  పరిరక్షణ,  సమాజ  శ్రేయస్సు   అంటే   ఎవరినో  ఉద్ధరించటానికి  కాదు.  మనల్ని  మనం  ఉద్ధరించుకోవటం  కోసమే.

............................

ఈ  బ్లాగ్ ను  ప్రోత్సహిస్తున్న  అందరికి  కృతజ్ఞతలండి.
Wednesday, June 19, 2013

దైవం గురించి ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్ స్టీన్ అభిప్రాయాలుగా చెప్పబడుతున్న సంభాషణ..?

దైవం  గురించి  ప్రసిద్ధ  శాస్త్రవేత్త  ఐన్ స్టీన్  అభిప్రాయాలుగా  చెప్పబడుతున్న  సంభాషణ..?

 Professor : You are a Christian, aren’t you, son ?

Student : Yes, sir.

Professor: So, you believe in GOD ?

Student : Absolutely, sir.

Professor : Is GOD good ?

Student : Sure.

Professor: Is GOD all powerful ?

Student : Yes.

Professor: My brother died of cancer even though he prayed to GOD to heal him. Most of us would attempt to help others who are ill. But GOD didn’t. How is this GOD good then? Hmm?

(Student was silent.)

Professor: You can’t answer, can you ? Let’s start again, young fella. Is GOD good?

Student : Yes.

Professor: Is satan good ?

Student : No.

Professor: Where does satan come from ?

Student : From … GOD …

Professor: That’s right. Tell me son, is there evil in this world?

Student : Yes.

Professor: Evil is everywhere, isn’t it ? And GOD did make everything. Correct?

Student : Yes.

Professor: So who created evil ?

(Student did not answer.)

Professor: Is there sickness? Immorality? Hatred? Ugliness? All these terrible things exist in the world, don’t they?

Student : Yes, sir.

Professor: So, who created them ?

(Student had no answer.)

Professor: Science says you have 5 Senses you use to identify and observe the world around you. Tell me, son, have you ever seen GOD?

Student : No, sir.

Professor: Tell us if you have ever heard your GOD?

Student : No , sir.

Professor: Have you ever felt your GOD, tasted your GOD, smelt your GOD? Have you ever had any sensory perception of GOD for that matter?

Student : No, sir. I’m afraid I haven’t.

Professor: Yet you still believe in Him?

Student : Yes.

Professor : According to Empirical, Testable, Demonstrable Protocol, Science says your GOD doesn’t exist. What do you say to that, son?

Student : Nothing. I only have my faith.

Professor: Yes, faith. And that is the problem Science has.

Student : Professor, is there such a thing as heat?

Professor: Yes.

Student : And is there such a thing as cold?

Professor: Yes.

Student : No, sir. There isn’t.

(The lecture theater became very quiet with this turn of events.)

Student : Sir, you can have lots of heat, even more heat, superheat, mega heat, white heat, a little heat or no heat. But we don’t have anything called cold. We can hit 458 degrees below zero which is no heat, but we can’t go any further after that. There is no such thing as cold. Cold is only a word we use to describe the absence of heat. We cannot measure cold. Heat is energy. Cold is not the opposite of heat, sir, just the absence of it.

(There was pin-drop silence in the lecture theater.)

Student : What about darkness, Professor? Is there such a thing as darkness?

Professor: Yes. What is night if there isn’t darkness?

Student : You’re wrong again, sir. Darkness is the absence of something. You can have low light, normal light, bright light, flashing light. But if you have no light constantly, you have nothing and its called darkness, isn’t it? In reality, darkness isn’t. If it is, well you would be able to make darkness darker, wouldn’t you?

Professor: So what is the point you are making, young man ?

Student : Sir, my point is your philosophical premise is flawed.

Professor: Flawed ? Can you explain how?

Student : Sir, you are working on the premise of duality. You argue there is life and then there is death, a good GOD and a bad GOD. You are viewing the concept of GOD as something finite, something we can measure. Sir, Science can’t even explain a thought. It uses electricity and magnetism, but has never seen, much less fully understood either one. To view death as the opposite of life is to be ignorant of the fact that death cannot exist as a substantive thing.

Death is not the opposite of life: just the absence of it. Now tell me, Professor, do you teach your students that they evolved from a monkey?

Professor: If you are referring to the natural evolutionary process, yes, of course, I do.

Student : Have you ever observed evolution with your own eyes, sir?

(The Professor shook his head with a smile, beginning to realize where the argument was going.)

Student : Since no one has ever observed the process of evolution at work and cannot even prove that this process is an on-going endeavor. Are you not teaching your opinion, sir? Are you not a scientist but a preacher?

(The class was in uproar.)

Student : Is there anyone in the class who has ever seen the Professor’s brain?

(The class broke out into laughter. )

Student : Is there anyone here who has ever heard the Professor’s brain, felt it, touched or smelt it? No one appears to have done so. So, according to the established Rules of Empirical, Stable, Demonstrable Protocol, Science says that you have no brain, sir. With all due respect, sir, how do we then trust your lectures, sir?

(The room was silent. The Professor stared at the student, his face unfathomable.)

Professor: I guess you’ll have to take them on faith, son.

Student : That is it sir … Exactly ! The link between man & GOD is FAITH. That is all that keeps things alive and moving.

P.S.

I believe you have enjoyed the conversation. And if so, you’ll probably want your friends / colleagues to enjoy the same, won’t you?

Forward this to increase their knowledge … or FAITH.

By the way, that student was EINSTEIN.


Monday, June 17, 2013

ఆధునిక విజ్ఞానం అయినా ..ఆధ్యాత్మికత అయినా ...

Monday, December 19, 2011

ఆధునిక విజ్ఞానం అయినా ..ఆధ్యాత్మికత అయినా ... 

 

ఆధునిక విజ్ఞానాన్ని కొందరు తమ స్వార్ధానికి వాడుకుంటున్నట్లే ఆధ్యాత్మికతను కూడా కొందరు తమ స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.

తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రజలను మోసం చేసే దొంగ స్వాములు కొందరి గురించి వింటూనే ఉన్నాము.

ఇలాంటి వారివల్ల ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడని పరిస్థితి ఏర్పడింది.


హేతువాదుల వంటి వారి వల్ల ఇలాంటి మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. అందువల్ల మనం వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.


కొందరు స్వార్ధం వల్ల మరి కొందరు తెలిసీతెలియనితనం వల్ల సమాజంలో కొన్ని మూఢాచారాలను వ్యాపింపచేశారు.


మేధావుల్లో కూడా కొందరు ఎలా ఉంటారంటే వారు మంచివారే కానీ తాము నమ్మిందే నిజం అని పిడివాదం చేస్తుంటారు.


ఇలాంటివారు ప్రాచీన కాలంలోనూ, ఈ కాలంలోనూ, భవిష్యత్తులో కూడా ఉంటారు.


ఉదా.......మాకు తెలిసిన ఒక ( అల్లోపతీ ) డాక్టర్ ఉన్నారు. వారు మంచి వ్యక్తే.

కానీ వారు ఏమంటారంటే హోమియో మందులు ఏం పనిచేస్తాయి ? అవి వట్టి పంచదార బిళ్ళలు. అంటారు.


కానీ ,మాకు హోమియో బాగా పని చేసింది. ఆ విషయం చెప్పినా వారు ఒప్పుకోరు.


మీ అనారోగ్యం కాకతాళీయంగా తగ్గింది. హోమియో వల్ల కాదు అని పిడి వాదం చేస్తారు.


ఆయుర్వేదం, హోమియో, అల్లోపతి ఏ వైద్యమన్నా మాకు గౌరవమే.

ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే ఇలా పిడివాదం చేసే వారిలో మేధావులు కూడా ఉంటారు అని. .


( హోమియో వైద్యాన్ని కనుగొన్నది విదేశీయులే .... సమాజానికి ఉపయోగపడేది ఎవరు కనిపెట్టినా వారు స్వదేశీయులైనా విదేశీయులైనా వారిని గౌరవించాలి. )సరే ఆ విషయం అలా ఉంచితే ఆధ్యాత్మిక రంగంలో కూడా పిడివాదులు ఉంటారు. తెలిసీతెలియనివారూ ఉంటారు. ఇలాంటి వారి వల్ల కూడా కొన్ని మూఢ నమ్మకాలు ప్రచారంలోకి వస్తాయి.


ఇలాంటి వారందరి వల్ల దైవం , పూజలు అంటే ఒకలాంటి భయం కలిగే పరిస్థితులు వచ్చాయి.ఈ రోజుల్లో ప్రేమభక్తితో కన్నా భయంతో పూజలను చేసేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు.అసలు దైవం అంటే ఎందుకు భయపడటం ?


ఈ రోజుల్లో పూజలలో ఆడంబరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పూజకు మూలకారణమైన దైవానికి ,ప్రేమభక్తికి తక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు అనిపిస్తోంది. .


పూర్వపుకాలం వాళ్ళకు ఎంతో ఓపిక , శారీరిక మానసిక దృఢత్వం ఉండేవి. వాళ్ళు పూజలు విధివిధానంగా భక్తిగా చేసుకునేవారు.


ఈ రోజుల్లో మనుషులకు అంతటి ఓపిక ఎక్కడిది ? ఇవన్నీ ఊహించే కాబోలు పూర్వులు .కలికాలంలో నామస్మరణను మించినది లేదు. అని చెప్పటం జరిగింది.


అయితే ఓపిక ఉన్నవాళ్ళు వాళ్ళ ఓపిక ప్రకారం పూజలు చేసుకోవచ్చు.


కానీ కొందరు పూజ చేసేటప్పుడు భక్తి కన్నా పూజలో ఎక్కడ పొరపాట్లు వస్తాయో ? వస్తే ఏమవుతుందో ? అనే భయంతో పూజలు చేస్తూ ఉంటారు.


దైవం అంటే మనకు కొద్దిగా భయం ఉండవచ్చు . కానీ ఆ భయం దైవానికే దూరం అయ్యేలా ఉండకూడదు కదా !


ఒక చంటిబిడ్డ తన తల్లితండ్రుల దగ్గరకు ఏ భయం లేకుండా ఎంత స్వతంత్రంగా వెళ్తుందో ..... భక్తులు భగవంతుని అంతే స్వతంత్రంగా ఆరాధించాలి.


అంతే కానీ భయంతో ఆరాధించటం ఎందుకు ?


లలితాసహస్ర నామాలలో " సుఖారాధ్యా " అన్న నామం ఎంత హాయిగా అనిపిస్తుందో కదా !


కష్టంలోనూ, సుఖం లోనూ అందరికి తోడునీడ దైవమే.


ఒక్కోసారి మనసు
బాధతో ఉన్నప్పుడు నేనున్నానని గుర్తు వచ్చేది దైవం మాత్రమే. భక్తి భయపడే స్థాయికి రాకూడదు.


ఒక ఆకును కానీ, కొద్దిగా నీటిని కానీ, కొద్దిగా పువ్వులను కానీ ప్రేమతో సమర్పిస్తే చాలు అని భగవానుడే చెప్పటం జరిగింది. ఏమీ సమర్పించకపోయినా దైవం ఏమీ అనుకోరు.


మన అందరికీ హితులు, స్నేహితులు, జన్మజన్మల ఆత్మ బంధువు, ఆత్మ, పరమాత్మ అన్నీ దైవమే.


దైవం ఎంత గొప్ప అయినా మనలో ఆత్మగా అత్యంత సన్నిహితుడు .


తల్లిదండ్రులు ఎంత గొప్ప వారైనా పిల్లలకు ఆత్మీయులే కదా ! . రామకృష్ణపరమహంస చెప్పేవారట. దేవునికి భయపడటం ఎందుకు ? అని.


మనకు ఎవరైనా విసుగుతో పంచభక్ష్య పరమాణ్ణాలు పెట్టిన దానికన్నా .....ప్రేమతో పెట్టిన కొద్దిగా పదార్ధాలే బాగుంటాయి.


* అలాగే భగవంతుని కూడా విసుగుతో, భయంతో బోలెడు సేపు పూజ చెయ్యటం కన్నా ..... ప్రేమ భక్తితో మీకు వీలు కుదిరినంత సేపే పూజ చెయ్యండి అని నా అభిప్రాయం .ఒకప్పుడు నేను కూడా తక్కువసేపు పూజ చేస్తే దేవునికి కోపం వస్తుందేమోననే భయంతో ఎక్కువసేపు పూజ చెయ్యటం జరిగేది.


పనులు మాని ఎక్కువసేపు అలా పూజ దగ్గర కూర్చున్నప్పుడు నాకు కూడా అయ్యో ! పనులేమీ అవలేదు కదా ! అని మనసు పీకుతూ ఉండేది....


ఈ గందరగోళంతో ఏం చెయ్యాలో ? ఏం చెయ్యకూడదో ? అర్ధం కాక విషయం మా అమ్మ మరియు నాన్నగారి వద్ద చెప్పి బాధ పడ్డాను.


అప్పుడు వారు ఏమన్నారంటే నువ్వు అంతసేపు పూజ వద్ద కూర్చుంటే పనులెలా జరుగుతాయి ? ఇంట్లో వారికి విసుగు వచ్చే అవకాశం ఉంది.


అందుకని నీ పనులు చేసుకుంటూనే కుదిరినప్పుడు దైవనామస్మరణ చేసుకుంటూ ఉండు. ఆన్నారు.


ఈ సలహా నాకు నచ్చింది. వీలున్నంత వరకూ పాటిస్తున్నాను.


ఆధునిక విజ్ఞానం అయినా ..ఆధ్యాత్మికత అయినా
స్వార్ధ ప్రయోజనాలకు వాడకూడదు.


వ్రాసిన విషయాల్లో పొరపాట్లు ఉంటే దైవం క్షమించాలని ప్రార్ధిస్తున్నాను. ఎవరైనా తెలిసీతెలియక తప్పులు చేసినా .... దైవం వారిని ఒకవేళ శిక్షించవలసి వస్తే అది కూడా వారి మంచికే అవుతుంది.


దైవం కోరుకునేది . అందరూ పరమపదాన్ని పొంది ఎప్పటికీ పరమానందంగా ఉండాలనే.....

3 comments:

 1. ఈ రోజుల్లో ప్రేమభక్తితో కన్నా భయంతో పూజలను చేసేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు.
  ------------
  ఏకాగ్రతతో పూజలు చేస్తున్నారు చాలులే అని సంతోషించవచ్చు. ఎందుకంటే ఏకాగ్రత దేనిలోవున్నా పని నేరవేరటానికి దోహదం చేస్తుందనుకుంటాను.
  ReplyDelete
 2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
  నిజమేలెండి. భయంతోనయినా పూజ అంటూ చేస్తున్నారు . అయితే భయం లేకుండా పూజ చేస్తే మరింత సంతోషంగా ఉంటుంది కదా అనిపిస్తోంది.
  ReplyDelete
 3. ఇంకా నాకు ఏమనిపిస్తుందంటేనండి.......
  మనకు , ఇతరులు భయం వల్ల పలకరించటం కన్నా ..... ప్రేమగా పలకరించటమే బాగుంటుంది అనిపిస్తుంది కదా !
  అలాగే . దైవాన్ని కూడా మనము ప్రేమగా ఆరాధించటమే బాగుంటుంది.


Friday, June 14, 2013

యంత్రాల వాడకం, నిరుద్యోగం, పనివత్తిడి, పెరిగిన ధరలు....

ఈ  రోజుల్లో  నిరుద్యోగ  సమస్య  బాగా  పెరిగింది.  ఎందరో  యువత  ఉపాధి  లేక  మానసికంగా  కుమిలిపోతున్నారు.  నిరుద్యోగ  సమస్య  పెరగటానికి   అనేక  కారణాలున్నాయి.  యంత్ర  వినియోగం  మితిమీరి   పెరిగటం  కూడా  నిరుద్యోగ  సమస్య  పెరగటానికి  ఒక  ముఖ్యమైన  కారణం.    

అయితే  కొందరు  ఏమంటారంటే ,  ఈ  రోజుల్లో  పని  చేయటానికి  మనుషులు  దొరకటంలేదు. అందుకే  యంత్రాలను  ఎక్కువగా  వాడవలసి  వస్తోంది   అంటున్నారు. .  పనిచేయటానికి  మనుషులు  దొరకటం  లేదన్నది  నిజం  కాదు. 


 అందుకు  ఉదాహరణ ..  ప్రపంచమంతటా  నిరుద్యోగ  సమస్య  పెరిగిందని  సర్వేల  ద్వారా  తెలుస్తోంది  కదా  !  ఉపాధి  కోసం  ఎందరో  నిరుద్యోగులు  ఎదురుచూస్తున్నారు.  ఇక  పనిచేయటానికి   మనుషులు  దొరకకపోవటమేమిటి  ?

 ఉదయం  బయటకు  వెళ్ళి  చూస్తే  ఎందరో   దినసరి  కూలీలు  పనికోసం  ఎదురుచూస్తూ   కనిపిస్తారు.  వీళ్ళందరూ  రోజుకూలీలు.  ఆ రోజుకు  పని  దొరికితే  కుటుంబాన్ని  పోషించుకుంటారు.  పని  దొరకకపోతే  కుటుంబం  అంతా  పస్తులుండవలసి  వస్తుంది.  నిత్యావసర  వస్తువుల  రేట్లు  విపరీతంగా  పెరిగిన  ఈ  రోజుల్లో  ఇలాంటి  వారి  జీవితం  దినదినగండమే.

ఉన్న చోట  ఉపాధి  లభించక   పొట్టచేత  పట్టుకుని  విదేశాలకు  వెళ్ళి  అష్టకష్టాలు  పడుతున్న  వారెందరో  ఉన్నారు. 


 వాస్తవాలు  ఇలా  ఉండగా  పనులు  చేయటానికి  మనుషులు  దొరకటం  లేదంటూ  యంత్రవినియోగాన్ని  పెంచాలని  చూడటం  సబబు   కాదు.
.........................


కొందరు  యజమానులు  మనుషులను  ఉద్యోగంలోకి  తీసుకోవటం  కన్నా  యంత్రాలతో  పనులు  చేయించుకోవటానికి  ఇష్టపడుతున్నారు.  మనుషులకైతే  ఎక్కువగా  జీతాలు  ఇవ్వాలి  కదా  ! 


మరి కొందరు  ఏం  చేస్తున్నారంటే  ఎక్కువ  యంత్రాలు  తక్కువ  మంది  మనుషులతో   పనులను  జరిపిస్తున్నారు.

చిన్న,  మధ్యతరహాపరిశ్రమల  వారిలో  చాలామందికి   ఎక్కువ   లాభాలు  రాకపోవచ్చు.   వీరు   కూడా   ఎక్కువ  యంత్రాలు ,  తక్కువమంది  ఉద్యోగస్తులతో  పరిశ్రమలను  నడిపించటానికి  ఇష్టపడుతుంటారు.

పెద్ద పరిశ్రమల  వారిలో   కొంతమంది  తమకు  ఎక్కువ  లాభాలు  వచ్చినా  కూడా    ఎక్కువ  యంత్రాలు  తక్కువమంది  ఉద్యోగస్తులతో  పరిశ్రమలను  నడిపించటానికి  ఇష్టపడుతుంటారు.  


( ఎక్కువమందిని  ఉద్యోగాల్లోకి  తీసుకుంటే  తమకు  వచ్చిన  లాభాలలో   ఎక్కువ  సొమ్మును   జీతాల  కోసం  ఖర్చుపెట్టవలసి  వస్తుంది  కాబట్టి ..)

ఖర్చులు  పెరిగితే  వ్యాపారస్తులు  వస్తువుల  ధరలను  పెంచుతారు.   

...................

వ్యాపారస్తులు  ఎక్కువ  ధరలు  పెంచితే  ఎక్కువ  లాభం  వస్తుందనుకుంటారు. 
 అయితే ,  ధరలు   పెంచటం  కన్నా  ధరలను  తగ్గించటం   వల్ల  కూడా   ఎక్కువ  లాభాలు   వచ్చే  అవకాశం  ఉంది. 
ఉదా..  ధరలు   ఎక్కువ   ఉన్నప్పుడు   10 మంది సరుకులు   కొంటే,    ధరలను  తగ్గిస్తే   20 మంది వస్తువులను  కొనే   అవకాశం  ఉంది  కదా  ! 
 అయితే  ధరలు  బాగా  తగ్గాయి  కదా !  అని  వినియోగదారులు  వస్తువులను  కొని  పడేస్తుంటే  సహజవనరులు  వేగంగా  తరిగిపోవటం,  చెత్త  పెరిగి  పర్యావరణ  సమస్యలు  వచ్చే  అవకాశాలూ  ఉన్నాయి.

...............................................

రైతుల  వంటి  వారు  యంత్రాలను  వాడటానికి  ఇష్టపడుతున్నారు. అయితే  రైతుల  విషయంలో ఏం  జరుగుతోందంటే,   తాము   పండించిన  పంటకు  ధరను  నిర్ణయించుకునే  హక్కు  రైతులకు  లేదు. 

 అతివృష్టి ,  అనావృష్టి,  పెరిగిన  విత్తనాల  ధరలు  , ఎరువుల  ధరలు , పురుగుమందుల  ధరలు,  వంటి  సమస్యలతో  ఎంతో ఖర్చుతో వ్యవసాయాన్ని  కొనసాగించినా  కూడా  వారు    పండించిన  పంటలకు  తగిన  గిట్టుబాటు  ధరలు  లభించక  నష్టాలపాలవుతున్నారు.  

అందువల్ల  ఎక్కువమంది  కూలీలను  పెట్టుకుని  వారికి  తగినంత   జీతాలను  ఇవ్వలేక   యంత్ర  వినియోగానికి  సిద్ధపడుతున్నారు.

 (  పూర్వకాలంలో రైతులకు  విత్తనాలను  కొనే  అవసరం  ఉండేది  కాదు. సేంద్రియ  ఎరువును కూడా  తామే  తయారుచేసుకునేవారు .)

.............................................

1975 నాటి  కాలంలో  జీతాలు    తక్కువగా  ఉండేవి.  ధర
లూ    తక్కువగా  ఉండేవి. ఇప్పుడు  జీతాలు  బాగా  పెరిగాయి. ధరలూ  బాగా  పెరిగాయి. 

అప్పట్లో  5 రూపాయలకే  హోటల్స్  లో మంచి  భోజనం  లభించేది. ఈ  రోజుల్లో  అన్ని  రేట్లు  బాగా  పెరిగిపోయాయి.

  ఎక్కువ  జీతం,  తక్కువ  జీతం  అనేది  సమస్య  కాదు. 
  ధరలు  పెరగటానికి    మనుషుల్లో  పెరిగిన  స్వార్ధం,  విపరీత  లాభాపేక్ష  కూడా  కారణం.

 మనుషులు  తమ  సొంత  స్వార్ధాన్ని  కొంత  తగ్గించుకుని,  వస్తువుల  ఉత్పత్తి  వ్యవస్థ ,  వినియోగ  వ్యవస్థ ,  పంపిణీ  వ్యవస్థ    మధ్య  సరైన  అవగాహనను  కలిగి  ,  చిత్తశుద్ధితో  చర్యలను  చేపడితే     తక్కువ  ధరలకే    సమాజంలోని  అందరూ  చక్కగా  జీవించవచ్చు. 

 ఒక  పద్ధతి  ప్రకారం  చర్యలు  చేపడితే  ఈ  రోజుల్లో  కూడా   తక్కువ  ధరకే   చక్కటి  ఆహారాన్ని అందించవచ్చు.
 
.................................

ఎక్కువ  జీతాన్ని  ఆశించేవారు  పెరుగుతున్న  రేట్ల  వల్లే  తాము  ఎక్కువ  జీతాన్ని  కోరుతున్నామని  అంటుంటారు.  అయితే,   జీతాలు  పెరిగాయనే  వంకతో  వర్తకులు  రేట్లను   పెంచేస్తారు.  రేట్లు  పెరిగాయని  మళ్ళీ  జీతాలు  పెరగటం,   మళ్ళీ  రేట్లు  పెరగటం,  ...... 

 ఈ  అంతులేని  చక్రభ్రమణం  కధలో  దిక్కుతోచక  నలిగిపోతున్నది  సామాన్యులైన  ప్రజలు  , కూలీలు,  కార్మికులు,  కర్షకులు,  వీధుల   ప్రక్కన వ్యాపారం  చేసుకునే  చిన్న  వ్యాపారులు.....మొదలైనవారు.

విచ్చలవిడిగా  ధరలు  పెరగటాన్ని  నియంత్రించటానికి  గట్టి   చర్యలు  తీసుకోవాలి. అప్పుడు  ఎక్కువ  జీతాల  కోసం  డిమాండ్  తగ్గవచ్చు. 

..............................

1.  ఎక్కువ  సంపదను  పోగేయాలని   కోరుకొనే  వ్యక్తుల  సంఖ్య  ఈ  రోజుల్లో  బాగా  పెరిగిపోయింది.  ఇలాంటి  కోరికల   వల్లనే  సమాజంలో  పేదరికం  ఇంకా  తగ్గటం  లేదు.    ప్రజలు   అవసరానికి  మించి  డబ్బును  ఖర్చుపెడుతున్నారు. 


2.. పెద్దమొత్తంలో  జీతాలను  ఇవ్వవలసి  వచ్చినప్పుడు  కొంతమంది  యజమానులు  ఏం  చేస్తారంటే,   ఉద్యోగస్తుల సంఖ్యను   తగ్గించి,  ఉన్న వాళ్ళతోనే   మొత్తం  పని చేయిస్తారు.


 అంటే   ఒకే వ్యక్తి   ఇద్దరు  చేసేటంత  పనిని   చేయవలసి వస్తుంది.  అందువల్ల   ఉద్యోగస్తులు   విపరీతంగా అలసిపోయి జబ్బులు కొని తెచ్చుకొంటారు.

నాకు ఏమనిపిస్తుందంటే, యాజమాన్యాలు  ఒకే వ్యక్తికి   నెలకు  50 వేలు జీతం ఇవ్వటం కన్నా ....... 60 వేలు చొప్పున, ఒక్కొక్కరికి 30 వేలు జీతం ఇచ్చేటట్లు , ఇద్దరు ఉద్యోగస్తులను నియమించితే బాగుంటుంది.


అప్పుడు నిరుద్యోగుల సంఖ్యా తగ్గుతుంది.   ఉద్యోగస్తులకు  పని వత్తిడి   తగ్గి   అనారోగ్యాలు   లేకుండా   ఉత్సాహంగా  పని   చేస్తారు.   అందువల్ల  పనిలో నాణ్యత బాగుంటుంది. నాణ్యత  పెరిగితే   పరిశ్రమకు  ఎక్కువ  లాభాలు  వస్తాయి.

యాజమాన్యాలు   సమాజంలోని  నిరుద్యోగ  సమస్యను   తగ్గించిన  పుణ్యాన్ని  మూటకట్టుకుంటారు.

3..  ఈ రోజుల్లో   ఎక్కువమంది   నెలకు 50 వేలు ,  అంతకన్నా ఎక్కువ జీతం రావాలని కోరుకుంటున్నారు. ఎక్కువ  జీతం  వస్తే  మొదట్లో  సంతోషంగానే  ఉంటుంది. 


 క్రమంగా   ఉత్సాహం  తగ్గిపోతుంది.  ఎందుకంటే    అంత  పెద్ద మొత్తం  జీతాలు  ఇస్తున్న  యాజమాన్యం  జీతానికి   తగ్గ పనిని   చేయించుకుంటారు కదా ! 

ఎక్కువ  జీతం  కోసం  ఆశపడేవాళ్ళు   కొన్ని  విషయాలను  ఆలోచించాలి.

 విపరీతమైన పనివత్తిడి వల్ల   ఆరోగ్యం  పాడయ్యే  అవకాశం  ఉంది.  ఇంకా,  కోపం, అసహనం, చిరాకులు, జబ్బులు తప్పవు.   వీటివల్ల   కుటుంబంలో కలతలు మొదలవుతాయి.

పనివత్తిడి  వల్ల  ఆరోగ్య  సమస్యలు  వస్తే  ఉద్యోగం    కోల్పోయే  అవకాశాలు  కూడా  ఉన్నాయి.


............................................


ఈ  రోజుల్లో  పెద్దవాళ్ళకు .పనివత్తిడి,  పిల్లలకు  విపరీతమైన  చదువు  వత్తిడి  పెరిగిపోయింది.   పెద్దవాళ్ళు .పనులు చేయవద్దని, పిల్లలు చదువుకోవద్దని ఎవరూ అనరు.


 అయితే శరీరం తట్టుకోలేనంతగా వత్తిడి వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ.  

ఈ  రోజుల్లో ఉపాధి  లభించి   ఎక్కువ  ఆదాయం  ఉన్న  కొందరు  యువత  విపరీతంగా  ఖర్చు  చేస్తుంటే ,  ఉపాధి  లభించక  చుట్టుపక్కల  వారు  అడిగే  ప్రశ్నలకు  జవాబులు  చెప్పలేక  క్రుంగి  పోతున్న  యువత  చాలామంది   ఉన్నారు.

 యంత్రాల  వాడకం  కొంతవరకూ  అవసరమే.  అయితే  యంత్రాల  వాడకం  మితిమీరితే  సమాజంలో  నిరుద్యోగం   బాగా  పెరుగుతుంది.  తద్వారా  పేదరికం  పెరుగుతుంది.


   నిరుద్యోగం,  పేదరికం  వల్ల  యువతలో  నిరాశానిస్పృహలు  పెరిగితే  సమాజంలో  ఎన్నో  సమస్యలు  వస్తాయి.

 యంత్రాల  అతి  వినియోగం  వల్ల  సహజవనరులు  కూడా  వేగంగా  తరిగిపోతాయి.

పూర్వకాలంలో  చేతివృత్తులు  బాగా  నడిచిన  రోజుల్లో   నిరుద్యోగం  ఉండేది  కాదు.  ఎవరిపనులు  వారు  చేసుకునేవారు. 

 చదువు  కోసం,  ఉపాధికోసం  ఇతరుల  మీద  ఆధారపడే  అవసరం  ఉండేది  కాదు. 

ఈ  రోజుల్లో   విద్య,  ఉపాధి  రంగాలు,  మరియు   సంపద  కొందరి  పెట్టుబడిదారుల  వద్దనే  కేంద్రీకృతమవటం  ఎక్కువగా  జరుగుతోంది.

 అన్నింటికీ  కారణం  మనుషులలో  కోరికలు  పెరగటం,  స్వార్ధం  పెరగటం,  నైతికవిలువలు  తగ్గటం. 


 మనుషులలో  కోరికలు  తగ్గి,  స్వార్ధం తగ్గి ,  నైతికవిలువలు  పెరిగితే   సమాజంలోని  అందరూ  చక్కగా  జీవించవచ్చు.

ఇవన్నీ  అమలు  కావాలంటే  చిన్నతనం  నుంచి  నైతికవిలువలతో  కూడిన  విద్య  అవసరం.


రెండు, మూడు   టపాలలో  వ్రాసే విషయాలను  ఒకసారే  వ్రాయటం  వల్ల   చదవటానికి   కొంచెం   ఇబ్బందిగా  ఉంటుంది  ఏమో ..  

Wednesday, June 12, 2013

అంతా దైవం దయ .


నాకు  తెలిసిన  విషయాలు  తక్కువ. బ్లాగులో   ఈ  మాత్రం   విషయాలు  వ్రాస్తున్నాను  అంటే ,  అంతా  దైవం  దయ  వల్లనే . 


అందువల్లనే , నేను ఇంతకుముందు వ్రాసిన   కొన్ని  పాత   టపాలలో  అంతా  దైవం  దయ .  అని  వ్రాసాను.  ఈ  మధ్య  కాలంలో   అలా  వ్రాయలేదు.  

అందువల్ల   మొన్న  సోమవారం   వ్రాసే  టపాలో  అంతా  దైవం  దయ .   అనే  వాక్యాన్ని  వ్రాయాలని   నాకు   అనిపించింది.


అయితే  సోమవారం   పనివత్తిడి  వల్ల  కొత్త  టపా  వ్రాయటానికి  కుదరలేదు. అందుకని  పాత టపానే  వేద్దామనిపించి ,  తెలుగు  భాష  వాడకం  యొక్క  ప్రాముఖ్యత  ..... మొదలైన  విషయాల  గురించిన  పాత  టపాను  పోస్ట్  చేస్తూ .....   అంతా  దైవం  దయ . అని  వ్రాయటాన్ని  మర్చిపోయాను.  టపాను  పోస్ట్  చేసే  ప్రయత్నంలో  ఉండగా    కరెంట్  పోయి  వెంటనే  వచ్చింది. తిరిగి  కరెంట్  వచ్చిన తరువాత    టపాను  పోస్ట్    చేయటం  కోసం   ప్రయత్నిస్తుంటే ,  2012 లో  వ్రాసిన  టపా  అక్కడ  మాయమై  కొత్త  టపాగా  వచ్చింది.  (  అప్పటి  వ్యాఖ్యలతో  సహా  రావటం  ఆశ్చర్యంగా ఉంది ... )  


   ఇంకా  నయం  దైవం  దయ  వల్ల   పాతటపా  మాయమై  పోలేదు  అని  సంతోషం  వేసింది .  అప్పుడు  అంతా  దైవం  దయ.  అని  టపాలో  వ్రాయలేదన్న  విషయం   గుర్తొచ్చి,   అంతా  దైవం  దయ .  అని  వ్రాసాను.


 జరిగిన  సంఘటన  నాకు  ఆశ్చర్యాన్ని,  ఆనందాన్ని  కలిగించింది.     అంతా  దైవం  దయ.

ఇంకొక  టపా  లంకె ను  ఇక్కడ  ఇస్తున్నాను.  ఆసక్తి  ఉన్నవారు   దయచేసి  చదువుతారని  ఆశిస్తున్నాను.
    

.ఉన్నాడు ఆ పై వాడు............ఉంటాడు మనకు సైదోడు..................

 

 

Monday, June 10, 2013

2013 లో 2012 సంవత్సరపు వ్యాఖ్యలతో సహా వచ్చిన టపా...

 రాష్ట్రంలో  తెలుగును  అభివృద్ధి  చేయటానికి    చర్యలు  తీసుకుంటున్నట్లు  అనిపిస్తోంది.  తెలుగు  అభివృద్ధికి  కృషిచేస్తున్న  అందరికి  కృతజ్ఞతలండి.  
........... .........

  ఈ   క్రింద వ్రాసిన  టపా  2012  ఫిబ్రవరిలో  వ్రాసినది .  ఈ  రోజు   ఈ పాత  టపా  యొక్క   లంకె  ఇవ్వాలనుకుని  ఇచ్చి  పోస్ట్  చేస్తుంటే  మధ్యలో  కరెంట్  పోయింది.  మళ్ళీ  వెంటనే  వచ్చింది.

నాకు కంప్యూటర్ గురించి  ఎక్కువగా  తెలియదు. కరెంట్  పోయి  వచ్చిన  తరువాత    నేను  ఏదేదో  మార్పులు  చేర్పులు  చేసేసరికి  పాతటపా  2012  వద్ద    మాయమైపోయి   వ్యాఖ్యలతో  సహా  ఇక్కడికి  వచ్చి  పడింది. 

* టపా  మాయమయి  పోకుండా   ఉన్నందుకు   భగవంతునికి  అనేక  ధన్యవాదములు.  అంతా  దైవం  దయ.   

....................................

బ్లాగును ప్రోత్సహిస్తున్న అందరికి అనేక ధన్యవాదాలండి.


1. అక్షరాస్యత పెరగాలంటే.......

 
కొందరికి గణితంలో చాలా ప్రతిభ ఉంటుంది. మిగతా సబ్జెక్ట్స్ అంటే అంత శ్రద్ధ ఉండదు. మరి కొందరికి కొన్ని విషయాల్లో ప్రతిభ ఉంటుంది . మరి కొన్ని విషయాల్లో అంత శ్రద్ధ ఉండదు. ఇలా వ్యక్తుల్లో తెలివితేటలు రకరకాలుగా ఉంటాయి.

 
కానీ, ఎక్కువ శాతం విద్యార్ధులు  ఇంగ్లీష్ వంటి భాషలో విద్యాభ్యాసం విషయంలో మాత్రం ఇబ్బందిగానే భావిస్తారు.వారికి అర్ధం కాని విషయాల గురించి ట్యూషన్స్ చెప్పించుకునే అవకాశాలు లేని వారెందరో ఉన్నారు.


అలా భాష అర్ధం కాక ఫెయిల్ అవుతూ .. కొంతకాలానికి చదువును మధ్యలోనే మానేసిన వారు ఎందరో ఉన్నారు. ఇలాంటప్పుడు దేశంలో అక్షరాస్యత ఎలా పెరుగుతుంది ?


 
2. మాతృభాషలో విద్య వల్ల వృత్తిఉద్యోగాలలో రాణిస్తారు....

 
మాతృభాషలో విద్యను అభ్యసించటం వల్ల భవిష్యత్తులో వృత్తిఉద్యోగాలలో రాణిస్తారు.. సరిగ్గా అర్ధం కాని పరాయి భాషలో బట్టీపట్టి చదివి పాసైన విద్యార్ధులు భవిష్యత్తులో వృత్తిఉద్యోగాల్లో ప్రతిభను చూపించలేరు.


 
3. మాతృభాషలో విద్య అంటే  సరళంగా ఉండాలి.......

అయితే మాతృభాషలో విద్య అంటే విద్యార్ధులకు సులభంగా అర్ధమయ్యే విధంగా సరళంగా ఉండాలి. అంతేకానీ గ్రాంధికమైన పదాలతో కష్టంగా ఉంటే విద్యార్ధులు  తెలుగు కంటే ఇంగ్లీషే తేలిక . అని భావించే ప్రమాదముంది. ఇప్పుడు ఇలా కొందరు భావిస్తున్నారు కూడా.ఈ రోజుల్లో అనేక కారణాల వల్ల మనకు ఇష్టం లేకపోయినా ఇంగ్లీష్ పదాలను వాడక తప్పని పరిస్థితి ఏర్పడింది.
అందుకని తెలుగు వాడకంలో  అప్పుడప్పుడు ఇంగ్లీష్ పదాలు వాడినా తప్పు పట్టకూడదు.

పెద్దవాళ్ళు కొంచెం(చూసీచూడనట్లు)తేలికగా ఉంటేనే, పిల్లలు తెలుగు నేర్చుకోవటానికి ముందుకు వస్తారు. ఉదా..ఒక తెలుగుమీడియం విద్యార్ధికి పరీక్షల సమయంలో ఆఫీస్ అన్న పదానికి కార్యాలయం అన్న తెలుగుపదం తెలియక .. ఆఫీస్ అని వ్రాసాడనుకోండి.

ఠాట్ ! అని ఇంగ్లీష్ పదం వాడినందుకు ఒక మార్కు తీసివెయ్యటం వంటివి చెయ్యకూడదు.

ఉదా.. ఆఫీస్ ( కార్యాలయం ) .. అని ఇలా అలవాటు చేస్తూ ఉంటే కొంతకాలానికి తెలుగు పదాలు అందరికీ అలవాటు అవుతాయి.4. మా చిన్నప్పుడు ....నేను చిన్నప్పుడు తెలుగు మిడియంలో చదివినా కూడా మాకు ఇంగ్లీష్,హిందీ(కొందరికి
సంస్కృతం) సబ్జక్ట్స్ కూడా ఉండేవి. ఇప్పుడు కూడా అలా బోధించవచ్చు. మరీ ఎక్కువ సబ్జెక్ట్స్ అయిపోతాయి . అనుకుంటే ....

..తెలుగుమీడియంలో చదువు +ఇంగ్లీష్ లేక హిందీలను.(లింక్ లాంగ్వేజ్ గా) బోధించవచ్చు. అప్పుడు మాతృభాషలో తేలికగా విద్యను నేర్చుకుంటాము. ఇతర భాషలవాళ్ళతో మాట్లాడటానికి లింక్ లాంగ్వేజ్ ఉపయోగపడుతుంది.


సంస్కృతం ఎంతో గొప్ప భాష. ఆ భాష ఒక్కటి చాలు విద్య నేర్చుకోవటానికి., లింక్ లాంగ్వేజీ ఇలా .... అన్నింటికి కూడా ఉపయోగపడుతుంది.


5. మాతృభాషలో విద్య + లింక్ లాంగ్వేజ్......

 
అయితే మన దేశంలో అనేక రాష్ట్రాలు, అనేక భాషలు ఉండటం వల్ల , అందరి మధ్యన ఒక లింక్ లాంగ్వేజ్ ఉండవలసిన అవసరం ఉంది. అందుకని మాతృభాషలో శాస్త్రవిషయాలను నేర్చుకుంటూ + ఏదైనా లింక్ లాంగ్వేజ్ ను కూడా ఒక సబ్జెక్ట్ గా బోధించాలి.

అంటే తెలుగులో గణితం, సైన్స్, సోషల్ వంటివి నేర్చుకుంటే ఆ విషయాలు చక్కగా అర్ధమవుతాయి +
సంస్కృతం లేక ఇంగ్లీష్ లేక హిందీని  లింక్ లాంగ్వేజ్ గా నేర్చుకుంటే ఇతర భాషల వాళ్ళతో మాట్లాడటానికి బాగుంటుంది.

 
6. తెలుగు భాషలో యాసలు.........

ఒకే భాషలో కూడా ఎన్నో రకాల యాసలు ఉంటాయి. ఉదా..ఒక వ్యక్తి యొక్క బంధువుల కుటుంబాల్లో చూసినప్పుడు , పల్లెలలో నివసించే బంధువుల భాష స్వచ్చంగా ఉంటుంది. పట్టణాల్లో ఇంగ్లీష్ చదువులు చదివిన బంధువుల భాష యొక్క యాస ఇంకో రకంగా ఉండే అవకాశం ఉంది.


 
7. ఏ ఆఫీసుకు వెళ్ళినా మనకు తెలియని భాషే.......

 
మన రాష్ట్రమే అయినా  చాలా ఆఫీసులలో మనకు తెలియని భాషే. ఇదంతా చూస్తే మనం ఇతరదేశాల్లో ఉన్నామా ? అనిపిస్తుంది.

ఇతర భాషలలో కార్యకలాపాలు జరగటం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడతారు. ఉదా..ఇంగ్లీష్ అంతగా రాని వ్యక్తి ఏదైనా పనిమీద ఆఫీసుకి వెళ్తే ఆఫీసుల్లో రాతకోతలు, వ్యవహారాలన్నీ ఆంగ్లభాషలో జరిగినప్పుడు అతనికి అర్ధం కాదు కదా !


చట్టం గురించి తెలుసుకోవాలంటే , ఆ వివరాలు ఇతర భాషలో ఉంటే  చట్టం, విధివిధానాలు గురించి
సరిగ్గా అర్ధం కాదు కదా !
 
ఇంకా, మాతృభాషలో వ్యవహారాలు నిర్వహించటం వల్ల , ప్రజలకు ఆఫీసు నిర్వహణ సులభంగా ఉంటుంది. పనులు కూడా త్వరగా అయ్యే అవకాశముంది.


ఇంగ్లీష్ సరిగ్గా అర్ధం కాని వ్యక్తికి  ఇంగ్లీషులో పత్రాలు పంపటం వల్ల   అందులోని విషయాలు అతనికి అర్ధం కాక, ఇతరులతో చదివించుకోవటానికి ఇష్టం లేక  ఇబ్బందిపడటం జరుగుతుంది.


( భాష రాని వ్యక్తిని ఇతరులు మోసం చేసే అవకాశం కూడా ఉంది. )

ఇలా ఎందరో నిత్యజీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా మన భాషలో మనం పనులు చేసుకోలేని పరిస్థితులు ఉండటం అనేది ఎంతో బాధాకరం.
 8.కార్యాలయాల పత్రాలు .... ఆ రాష్ట్రపు మాతృభాష + లింక్ లాంగ్వేజ్ ( హిందీ లేక ఇంగ్లీష్ ) లలో ఉన్నప్పుడు.....కొంతకాలం క్రిందటి మనీయార్డర్ ఫాంస్ ఒక వైపు ఇంగ్లీషులో,ఒక వైపు హిందీలో ముద్రించబడేవి. 


 ఇప్పుడు కూడా కార్యాలయాల కార్యకలాపాలను , వారు విడుదల చేసే పత్రాలను ఆ రాష్ట్రపు మాతృభాష + లింక్ లాంగ్వేజ్ ( హిందీ లేక ఇంగ్లీష్ ) లలో ఉన్నప్పుడు అందరికి సౌకర్యంగా ఉంటుంది.

9.బదిలీల వల్ల ................

ఇక బదిలీల వల్ల దేశమంతా తిరిగేవారికి ఇంగ్లీష్ మీడియం లేక హిందీ మీడియంలో చదువు + విద్యార్ధి యొక్కమాతృభాషను ఒక తప్పనిసరి సబ్జక్ట్ గా(ఉదా..తెలుగు)ను నేర్పించాలి.

అసలు ఈ బదిలీల వల్ల కూడా పిల్లలు మాతృభాషకు దూరమవుతున్నారు. భాషలు నెమ్మదిగా అంతరిస్తున్నాయి.


ఏ రాష్ట్రం వాళ్ళని ఆ రాష్ట్రంలోనే బదిలీలు చెయ్యవచ్చు  లేక
బదిలీలు చేసే వాళ్ళే సెంట్రల్ స్కూల్స్ ఎక్కువగా నెలకొల్పి , తమ ఉద్యోగస్థుల పిల్లలకు మాతృభాషలో విద్యాభ్యాసానికి ఏర్పాట్లు చెయ్యాలి.ఉదా..కేంద్రీయ విద్యాలయాలలో అన్ని భాషల ఉపాధ్యాయులను నియమించాలి.(కనీసము ౧౪ భాషలు)లేదా బదిలీలను ఆపేయాలి.


 ( స్థానికులనే ఉద్యోగాల్లో తీసుకోవటం ఎన్నో విధాలుగా మంచిది. )

అలా కాకుండా ఉద్యోగస్థులను దేశమంతా తిప్పటం వల్ల లాభాలకన్నా నష్టాలే ఎక్కువ. ఉదా..ఒక బ్యాంక్ ఉద్యోగికి బ్యాంకులో బిజినెస్ పెరగాలంటే అతను అక్కడి స్థానికులతో వారి భాషలోనే మాట్లాడవలసివస్తుంది. కానీ ఆ ఉద్యోగి స్థానిక భాష నేర్చుకునే సమయానికిఅతన్ని ఇంకో ప్రాంతానికి బదిలీ చేస్తారు. దీనివల్ల ఉద్యోగికి , బ్యాంకుకి కూడా నష్టం తప్ప లాభమేమీ ఉండదు. 

ఇవన్నీ గమనిస్తే ..... వ్యవస్థ అంతా అనేక రంగాల్లో గజిబిజి అయిపోయింది అనిపిస్తుంది.

ఒక రాష్ట్రంలో వేరే భాషకు సంబంధించిన వారు కూడా ఎక్కువగా ఉన్నప్పుడు,   వారి మాతృభాషలో కూడా విద్యాభ్యాసానికి పాఠశాలలను ఏర్పాటు చెయ్యాలి.

మాతృభాషలో విద్యాభ్యాసం వల్ల మేధస్సు పెరుగుతుందని తెలిసిన వారు చెబుతున్నారు. ఎందుకంటే చదివే సబ్జక్ట్ సులభంగా అర్ధమవుతుంది కదా !  ఇంకా చాలా సమయం కలిసివస్తుంది కూడా .


మాతృభాషలో విద్యాభ్యాసం వల్ల విద్యార్ధుల పై ఎంతో భారం తగ్గుతుంది.

అర్ధం కాని భాషతో కుస్తీ పట్టటం, బట్టీపట్టి పరీక్షలు పాసవటం వంటివి కూడా తగ్గుతాయి.
ఏమైనా మాతృభాషను మరిచిపోవటం అన్నది మహాపరాధం.


ప్రపంచీకరణ అంటే .. తర తరాల నుంచి వస్తున్న ఎంతో విలువైన
మన భాషా సంస్కృతులను త్యాగం చెయ్యటం ఎంత మాత్రమూ కాదు.

చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఇవన్నీ అమలు చేయటం అంత కష్టం ఏమీ కాదు.


Friday, June 7, 2013

కాంక్రీట్ కట్టడాలను తగ్గించుకుని , వాననీరు ఇంకే విధంగా మట్టినేలను ఉంచాలి.

ఈ  బ్లాగ్ ను  ప్రోత్సహిస్తున్న  అందరికి  ధన్యవాదములండి.
........... 

ఈ మధ్య  మేము  కొన్ని  ఊళ్ళు  వెళ్ళి  వచ్చాము.  ప్రయాణంలో  గమనిస్తే  ఏ  ఊరులో  చూసినా    కాంక్రీట్  జంగిల్ లా  కట్టడాలు కనిపించాయి.

  మానవుల  స్వయంకృతాపరాధాల  వల్ల   ప్రపంచవ్యాప్తంగా  ఉష్ణోగ్రతలు  పెరుగుతున్నాయి.  వాతావరణంలో  విపరీతమైన  మార్పులు  వస్తున్నాయి.  ఎండలు,  వరదలు  పెరగటానికి  అనేక  కారణాలున్నాయి.

 భూమిపై  పడిన  వానచినుకులు  నేలలో   ఇంకటానికి   లేకుండా   భూమిపై  ఎక్కువభాగం  కాంక్రీట్  వేయటం  కూడా  ఒక  కారణం.  


పూర్వం  ఇళ్ళ  చుట్టూ  చాలా  మట్టి  ప్రదేశం  ఉండేది.  ఇప్పుడు  ఇంటి  చుట్టూ  కాళ్ళకు  మట్టి  అంటకుండా  సిమెంట్  చేసేస్తున్నారు.   భూమిపై   ఖాళీ  ప్రదేశాలంటూ  మిగలకుండా  కాంక్రీట్  కట్టడాలు  కట్టేస్తున్నారు.

భూమిలోకి  నీరు  ఇంకకుండా   నున్నటి   రోడ్లను  వేస్తున్నారు.  రోడ్ల  ప్రక్కనే  షాప్స్,  ఇళ్ళు  ఉంటాయి.  రోడ్లకు  షాపులకు   మధ్య  సన్నగా  కొద్దిపాటి  మట్టి   దారి  ఉంటుంది.  ఈ  మట్టిలో  ఎంత  నీరు  ఇంకుతుంది? 


 భూమిలో  నీరు  ఇంకకపోవటం   వల్ల  . భూగర్భజలం   తగ్గిపోతోంది. పూర్వకాలంలో  మట్టినేల  ఎక్కువగా  ఉండేది  కాబట్టి  ఎక్కడ  పడే  వాన  అక్కడ  భూమిలో  ఇంకి  భూగర్భజలం  బాగా  ఉండేది.  ఇందువల్ల   భూమి  చల్లగా  ఉండి  ఉష్ణోగ్రతలు  ఎక్కువగా  ఉండవు.

ఎక్కడ  పడిన  నీరు  అక్కడే  భూమిలో  ఇంకటం  వల్ల  వరదలు  ఊళ్ళను  ముంచెయ్యటం   ఉండదు.  పూర్వ  కాలంలో    వరదలు  వచ్చినా  తక్కువ  ఎత్తులో  ఊళ్ళోకి  నీరు  వచ్చి  ఆ  వరదలతో  పాటు  పొలాలలోకి  కొట్టుకువచ్చిన  ఒండ్రు  మట్టి  వల్ల  పొలాలు  సారవంతంగా    అయి  పంటలు  బాగా  పండేవి.

ఈ  రోజుల్లో   వాననీరు   భూమిలో  ఇంకే  పరిస్థితి  తగ్గిపోవటం  వల్ల , ఇంకా   కాలువల  వ్యవస్థ  కూడా  సరిగ్గా  లేకపోవటం  వల్ల    వాన  నీరు  ఉధృతమైన   వరదలుగా  మారి  ప్రాణనష్టం,  పంటనష్టం  కలుగుతోంది.  ఉధృతమైన  వరదల  వల్ల  పొలాలలో  నేల   కోసుకుపోతోంది. 

పూర్వం   ప్రతి  ఊరికి  చెరువు  ఉండేది.  వేసవిలో   ఊరిప్రజలందరూ  కలిసిమెలసి  శ్రమించి   చెరువులలో  పూడిక  తీసుకునేవారు.   వానలు  పడిన  తరువాత   పూడిక  తీసిన  చెరువులో  నీరు  చక్కగా  నిలువ  వుండి    ఊరు  ప్రజల  అవసరాలకు  సరిపోయేవి. ఈ  రోజుల్లో  పూడిక  తీయని  చెరువులు,  కాలువల  వల్ల కూడా  వాననీరు    వృధా అవుతోంది. 

పూర్వం    ప్రజలు   కలసిమెలసి   చెరువులో  పూడిక  తీయటం  వంటి  పనులను  చేసుకునేవారు.
 
 మేము  చిన్నప్పుడు  మా  తాతగారి  ఇంటికి  వెళ్తే  అక్కడి  ఊళ్ళోని  ప్రజలు  చెరువులో  పూడిక  తీయటం  వంటివి  చేస్తుంటే  ఎంతో  సందడిగా  ఉండేది.  చెరువు  పూడికతీసే  పనులు  జరుగుతుంటే  మేము  చిన్నపిల్లలం   సాయంత్రం  పూట    చల్లబడిన  తరువాత  అక్కడ  ఆడుకునే  వాళ్ళం.  అక్కడంతా  ఎంతో సందడిగా  ఉండేది.  వెన్నెల  వెలుగులో  కూడా  పనులు  కొనసాగేవి.


 కాంక్రీట్  కట్టడాలను  కట్టడాన్ని  తగ్గించుకుని  ,  వాననీరు  ఇంకే  విధంగా  మట్టినేలను  ఉంచాలి. మట్టి   నేలల   విస్తీర్ణం ఎక్కువ  ఉండేలా  జాగ్రత్తలు  తీసుకోవాలి.


  ఈ  రోజుల్లో  కాలువలు  పూడిపోవటానికి   ప్లాస్టిక్  కవర్లు  కూడా  ముఖ్యమైన  కారణం..  ఈ  ప్లాస్టిక్  కవర్లు   కాలువలకు  అడ్డంపడటం  వల్ల  కూడా   నీటిపారుదల  వ్యవస్థ  అస్తవ్యస్థమవుతోంది.