koodali

Thursday, September 21, 2017

ఆదిపరాశక్తి కధలు...


ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు పాలసముద్రం మీద ఆదిశేషునిపై పవళించి యోగనిద్రలో ఉన్నారు. 

 అప్పుడు విష్ణుమూర్తి చెవులలోని గులివి నుండి మధువు, కైటభుడు అనే ఇద్దరు రాక్షసులు జన్మించారు. వారిద్దరూ మహా బలవంతులు.

వారు శక్తిస్వరూపిణి అయిన పరాశక్తిని గురించి తపస్సు చేసి స్వేచ్చామరణమును వరముగా కోరుకొన్నారు.

 ఆ వరగర్వముతో రాక్షసులిద్దరూ బ్రహ్మ మీద దాడి చేశారు. బ్రహ్మదేవుడు విష్ణువు శరణుజొచ్చారు.

మధుకైటభులు విష్ణుదేవుని తమతో యుధ్ధము చేసి గెలవమన్నారు. వారు ఒకరితర్వాత ఒకరు అలసట తీర్చుకుంటూ విష్ణుమూర్తితో యుధ్ధము చేశారు.

విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేకపోయింది.

అప్పుడు మధుకైటభులు , "నీవు పరాక్రమశాలివే, అలసిపోయినట్లున్నావు. దాసోహమన్నచో నిన్ను విడిచిపెడతాం. కాదంటే నిన్ను సంహరించి తర్వాత ఈ బ్రహ్మదేవుని పని పడతాం " అన్నారు.

 అప్పుడు విష్ణువు, నేను అలసిపోయాను. కొంత విశ్రాంతి తీసికొన్న పిమ్మట మళ్ళీ మీతో యుధ్ధం చేస్తాను " అన్నారు.

మళ్ళీ యుధ్ధం ప్రారంభమయ్యింది. విష్ణువు యోగమాయను నుతించాడు. యోగమాయ విష్ణువును అనుగ్రహించటం జరిగింది.

యుధ్ధసమయములో యోగమాయ గగనతలంలో రాక్షసులకు దర్శనమిచ్చి వారివైపు తన మాయా దృష్టిని ప్రసరించటం జరిగింది.

ఆ చూపులకు మధుకైటభులు   తమనుతాము   మరచిపోయారు.

ఆ సమయములో విష్ణువు , "గతములో నేను ఎంతోమంది రాక్షసులను వధించాను. నాతో ఇంతకాలం యుధ్ధం చేసినవారు మీరు తప్ప మరొకరు లేరు. కనుక ఏదైనా వరము కోరుకొనుడు ఇస్తాను " అన్నారు.

పరవశులై, మదోన్మత్తులై యున్న ఆ దానవులు, "మేము యాచకులము కాదు. నీవే కోరుకో వరం, ఇస్తాము." అన్నారు.

అపుడు  శ్రీ మహావిష్ణువు, మీరిద్దరూ నా చేతిలో మరణించాలి: అన్నారు.

 వారు ఆశ్చర్యపోయారు. తెలివిగా మోసగింపబడ్డామని గ్రహించారు. లోకమంతా జలమయంగా ఉండడం చూసి , మమ్మల్ని నిర్జలప్రదేశంలో సంహరించు అన్నారు.

విష్ణువు రాక్షసుల్ని తన తొడలమీద నొక్కిపెట్టి సుదర్శన చక్రంతో వారి తలలు నరికారు. ఆ తలలనుండి మేధస్సు {మెదడు} బయటకు వచ్చి నీటి మీద తేలింది. మధుకైటభులిద్దరూ మరణించారు.

మేధస్సు ఆవరించిన జలభాగం మేదిని {భూమి } అయింది. అందుచేతనే మట్టి తినకూడదంటారు.Sunday, September 17, 2017

శిక్ష వల్ల తిరిగి మళ్లీ తప్పు చేయకూడదనేది సరైన ఉద్దేశ్యం. ...

 ఈ రోజుల్లో సమాజంలో పెరుగుతున్న చెడును గమనిస్తే చాలా బాధ కలుగుతుంది.

 కొందరు ప్రజలు పైకి చెప్పేదానికి, చేసే దానికి పొంతన ఉండటం లేదు. 

  భక్తులమని చెప్పుకునే వాళ్ళలో కూడా కొందరు చెడుపనులు చేస్తున్నారు.


 భక్తులనే వాళ్లు  పాపాల విషయంలో ఎందుకు భయపడటం లేదు? బహుశా వాళ్ళ ఉద్దేశం ఎన్ని పాపాలు చేసినా దానికి తగ్గ పరిహారం చేసుకుంటే చాలు.. పాపాల నుంచి విముక్తులు కావచ్చని అనుకుంటున్నారు కాబోలు, 


 
లేక మనస్సును అదుపులో ఉంచుకోలేక  తిరిగి తప్పులు చేస్తారు.  


****************

ఎవరైనా తప్పు చేస్తే చట్టంలో దానికి తగ్గ శిక్షలుంటాయి. ఇలా శిక్షించటం ఎందుకంటే, శిక్ష వల్ల భయంతో ఇకమీదటైనా తప్పులు చేయరనే ఉద్దేశంతో శిక్షిస్తారు.


అంతేకానీ , తప్పు చేసినా తప్పుకు శిక్షగా జరిమానా చెల్లించటం లేక కొంతకాలం జైల్లో ఉండి వచ్చి , చేసిన తప్పులకు పరిహారం జరిగిపోయింది కాబట్టి, మళ్లీ తప్పులు చేయటం  ..అనేది అసలు ఉద్దేశం కాదు. 


శిక్ష వల్ల తిరిగి మళ్లీ తప్పు చేయకూడదనేది  సరైన ఉద్దేశ్యం.  చెడుపనుల వల్ల   కష్టాలు వచ్చినప్పుడు , 
ఆ కష్టాల నుండి తప్పించుకోవటానికి పరిహార పూజలు చేసుకోవటంలో తప్పులేదు.

 అయితే పరిహారం జరిగింది కాబట్టి, మళ్లీ పాపాలు చేయటం తప్పు.ఎన్ని పాపాలు చేసినా .. పరిహారాలతో బైటపడవచ్చు ..అనే భావన ప్రజలలో వస్తే అది ఎంతో ప్రమాదకరమైనది. పూర్వీకులు మనకు తెలిపిన ఉద్దేశ్యాలకు వ్యతిరేకమైనది.

****************

 రావణాసురుడు ఎంతో గొప్ప పండితుడు. అతనికి ఎన్నో పరిహారాలు తెలిసే ఉంటాయి. 

అయినా మరి శిక్ష నుంచి తప్పించుకోలేకపోయాడు. 


పాపాలు చేయటాన్ని కొనసాగిస్తున్నప్పుడు పరిహారాలు చేయాలన్నా..అనుకున్నట్లు జరగకపోవచ్చు.

****************

 కష్టాల నుండి తప్పించుకోవాలంటే, చేసిన పాపాల గురించి పశ్చాత్తాపపడి మంచిమార్గంలోకి రావటానికి ప్రయత్నించాలి.

తప్పులు చేసిన వారిని క్షమించటమూ అవసరమే. అయితే ఎంతవరకు?  

 దైవం దయామయులు. ఎవరైనా మంచిగా మారటానికి కొంత సమయాన్ని ఇస్తారు. 


ఆ తరువాత కూడా వినకపోతే వారికి తగిన శాస్తి జరుగుతుందని పురాణేతిహాసాల ద్వారా తెలుస్తుంది. 


శ్రీరామునికి సీతాదేవిని అప్పగించేయమని ఎందరు చెప్పినా రావణాసురుడు వినలేదు. 


శివుని అంశ అయిన హనుమంతులవారు మంచి చెప్పినా రావణుడు వినిపించుకోలేదు. తుదకు అందుకు తగిన శిక్షను అనుభవించాడు.


శ్రీకృష్ణుడు..శిశుపాలుని నూరు తప్పుల వరకు సహించి తరువాత శిక్షించారు. 


అందువల్ల,  అందరమూ జాగ్రత్తగా ఉండటం మంచిది.
 

*******************

కొందరు చేసే చెడ్దపనుల వల్ల సమాజంలో ఎందరికో కష్టాలు వస్తాయి.

ఇలాంటప్పుడు దైవం చూస్తూ ఊరుకోరు.. చెడుపనులు చేసేవారిని తనదైన విధానంతో దారిలోకి తెస్తారు.

***************
ధర్మమార్గంలో జీవించే ప్రయత్నం చేయాలి..   సరైన మార్గంలో ప్రవర్తించే శక్తిని ఇమ్మని దైవాన్ని ప్రార్ధించాలి. 
అంతా దైవం దయ.Saturday, September 16, 2017

దేవుడు అన్యాయం చేసారంటూ ..మాట్లాడటం మహాపరాధం. ..

కొందరు ఆచారవ్యవహారాలను పాటిస్తూ పూజలు చేస్తారు. 

అయితే, ఎప్పుడైనా కష్టాలు వస్తే మాత్రం,  ఏమంటారంటే, నేను ఎన్నో పూజలు చేసాను. భగవంతుడు అన్యాయం చేసాడంటూ మాట్లాడతారు.

 ఇక్కడ ఒక విషయమేమిటంటే, దైవం ఎప్పుడూ, ఎవరికీ అన్యాయం చేయరు. 

ఎవరు చేసిన కర్మలను బట్టి వారికి సుఖాలు కానీ, కష్టాలు కానీ వస్తాయి. 

అంతేకానీ, విధి చిన్నచూపు చూసింది, దేవుడు అన్యాయం చేసారంటూ ..మాట్లాడటం మహాపరాధం. 

ఇప్పుడు పూజలు, మంచిపనులు..చేస్తున్నా కష్టాలు వచ్చాయంటే అర్ధం ..గతంలో ఎప్పుడో చెడ్దపనులు చేసుంటారు. అందుకే ప్రస్తుతం కష్టాలు వచ్చాయి.

 ఇప్పుడు చేస్తున్న మంచిపనులకు తగ్గ మంచి ఫలితాలు కూడా తప్పక అనుభవంలోకి వస్తాయి. 

కొన్నిమంచిపనులు, కొన్ని చెడ్దపనులు చేస్తే.. కొన్ని సుఖాలు, కొన్ని కష్టాలు కలిసి లభిస్తాయి. 
..............

కొందరు ప్రజలు పాపాలు చేసి తరువాత చేసిన పాపాలకు పశ్చాత్తాపపడి, ఇకమీదట చెడు పనులు  చేయకుండా తగిన శక్తిని ఇమ్మని దైవాన్ని ప్రార్ధిస్తూ..మంచికర్మలను చేస్తూ పూజలు చేస్తుంటే.. 

.అప్పుడు దైవం వారి పట్ల దయచూడటం , వారు చేసిన పాపాలకు పడే శిక్షను తగ్గించే అవకాశం ఉన్నాయి.

**************

చెడ్డపనులు చేసి , ఫలితంగా కలిగే కష్టాలను తట్టుకోలేక బాధలు పడేకంటే ముందే మనస్సును అదుపులో పెట్టుకోవటం మంచిది. 
**********

 సరైన మార్గంలో ప్రవర్తించే శక్తిని ఇమ్మని దైవాన్ని ప్రార్ధిస్తూ ధర్మమార్గంలో జీవించే ప్రయత్నం చేయాలి.Friday, September 15, 2017

మాకు తెలిసిన ఒక కుటుంబం ఇంకో మతం ..మరియు ..


మేము చెన్నైలో ఒక అపార్ట్మెంట్లో ఉండే రోజుల్లో  అపార్ట్మెంటుకు సెక్రటెరీగా ఒకామె ఉండేవారు. ఆమె బాగా చదువుకున్నామె . నాకు ఆమె గురించి ఎక్కువ విషయాలు తెలియవు.

 అయితే, అపార్ట్ మెంట్  లో  తెలుగు తెలిసిన ఒక పెద్దామె నాకు బాగా పరిచయం అయ్యారు. 

ఆ పెద్దామె ఎన్నో  కబుర్లు చెప్పేవారు. మాటల్లో సెక్రటరీ కుటుంబం గురించి కూడా కొన్ని విషయాలు తెలియజేసారు. 

ఉదా.. సెక్రటరీ,  శ్రీ కృష్ణజయంతి పండుగ రోజు  బాగా పూజలు చేస్తారట , సుమారు 21 రకాల పిండివంటలతో నైవేద్యం దేవునికి నివేదిస్తారట. 

ఒకసారి నేను ఒక పని గురించి సెక్రటరీ గారింటికి వెళ్ళాను. వారి ఇంట్లో  గమనిస్తే , వేరే మతం యొక్క చిత్రాలు గోడకు కనిపించాయి. ఈ విషయాన్ని నేను నాకు పరిచయం ఉన్న పెద్దామెతో చెపితే ఆమె ఆశ్చర్యపోయి నమ్మలేదు. 

కొంతకాలానికి సెక్రటరీ వాళ్ళు వేరే మతం ప్రకారం పూజలు చేస్తున్నట్లు బహిరంగంగా తెలిసింది ..ఈ విషయాన్ని పెద్దామె నాతో చెప్పి విపరీతంగా ఆశ్చర్యపోయింది.

నేను ఇంతకుముందే చెప్తే మీరు నమ్మలేదు కదా ! అన్నాను. 

సెక్రటరీ గారు  విషయాన్ని రహస్యంగా ఉంచటం వల్ల త్వరగా ఎవరికీ తెలియలేదు. 

విషయం బయటకు తెలిసిన తరువాత సెక్రటరీ గారి ఆచారవ్యవహారాలలో చాలా మార్పులు వచ్చాయి. 

అప్పటివరకూ విపరీతంగా  హిందూ ఆచారవ్యవహారాలను పాటించిన ఆమెలో అంత మార్పు ఎలా వచ్చిందో ? అని మాకు  ఆశ్చర్యం అనిపించింది.

కొద్దికాలం తర్వాత మేము మా సొంత కారణాలతో  ఆ అపార్ట్ మెంట్  మారి వేరే ఇంటికి వెళ్లటం వల్ల అపార్ట్ మెంట్   విషయాలు సరిగ్గా తెలియలేదు.

 అయితే, కొంతకాలం తర్వాత , మాకు తెలిసిన పెద్దామె ద్వారా కొన్ని విషయాలు తెలిసాయి. సెక్రటరీ మళ్లీ ఏమంటున్నదంటే , తమ పిల్లలకు హిందువులతోనే వివాహాలు జరిపిస్తామని చెప్పటం జరిగిందట.  తరువాత ఏం జరిగిందో తెలియదు.

 (ఈ సెక్రటరి గారు తమిళ బ్రాహ్మణులు.ఇది నిజంగా జరిగిన సంఘటన.)

వారు ఆలా ఎందుకు చేసారో నాకు తెలియదు. 

*******************

ఎవరి శక్తిని బట్టి వారు దైవప్రార్ధన చేసుకోవచ్చు. ..
ఎవరైనా మతం మారటానికి ఎన్నో కారణాలు ఉంటాయేమో? హిందువులలో కొందరు అంటరానితనం వంటి కారణాలతో బాధపడి మతం మారితే,కొందరు మారటానికి మరి కొన్ని కారణాలు కూడా ఉండవచ్చు.


ఇంకా మరికొన్ని విషయాలను గమనిస్తే, ఆధునిక కాలంలో ఆచారవ్యవహారాల్లో వచ్చిన విపరీతపోకడలు కూడా ఇందుకు కారణం కావచ్చు.


ఆచారవ్యవహారాల్లో  క్లిష్టత ఉన్నాకూడా ప్రజలు సరళంగా ఉండే విధానాలపట్ల మొగ్గుచూపే అవకాశం ఉంది. 

ప్రజల మంచికోసం ఎన్నో చక్కటి ఆచారవ్యవహారాలను ప్రాచీనులు తెలియజేసారు. 

అయితే ,ఆధునిక కాలంలో కొందరు ఆచారవ్యవహారాలను కొత్తగా మార్చుకుంటూ , తమకుతామే మోయలేనంతగా నెత్తిన వేసుకుని విసుగు తెచ్చుకుని..ఆచారవ్యవహారాలను ఆడిపోసుకోవటం న్యాయం కాదు కదా! 


ఆధునిక కాలపు పరిస్థితులను ఊహించిన పూర్వీకులు ఎన్నో విషయాలను తెలియజేసారు. 

ఉదా..కలికాలంలో కేవలం దైవనామాన్ని స్మరిస్తే చాలు ..గొప్ప ఫలితం లభిస్తుందని సడలింపులను తెలియజేయటం జరిగింది. 


 షిరిడి సాయి నవవిధ భక్తులు గురించి తెలియజేసారు. ఇంకా,  భక్తి లేని సాధనములన్ని నిష్ప్రయోజనములని చెబుతూ కావలసినది ప్రేమాస్పదమయిన భక్తి మాత్రమే అని తెలియజేసారు.

సాయిబాబాను కొందరు ఆదిపరాశక్తి అవతారముగా భావించేవారట....

 .భక్తులలో కొందరికి శివునిగా, కొందరికి కృష్ణుడుగా, కొందరికి గురువుగా ,కొందరికి వారివారి ఇష్ట దైవముల రూపములో దర్శనమిచ్చారట.


**************

ఆచార వ్యవహారాలు అవసరమే, అయితే మూఢత్వం పెంచే విధంగా కాకుండా ఎవరి విచక్షణతో వారు పాటించటం అవసరం. 

ఆచారవ్యవహారాలను నిక్కచ్చిగా పాటించాలనుకుంటూ  విసుగు వచ్చేలా చేసుకోవటం కాకుండా..తమశక్తికి తగినంతలోనే పూజలు చేస్తూ దైవభక్తి ఎక్కువగా ఉండేలా నిలుపుకోవటం సరైన పద్ధతి అనిపిస్తుంది.


దీనికి సంబందించిన ఒక కధను పెద్దలు తెలియజేసారు. 

ఒక భక్తుడు భక్తి పారవశ్యంలో పూజ చేస్తూ దైవానికి అరటిపండ్లను నివేదించబోయి, భక్తి పారవశ్యంలో అరటిపండ్లను ప్రక్కన పడవేసి వాటి తొక్కలు తీసి దైవానికి నివేదిస్తారు. ఆ భక్తుని భక్తికి మెచ్చిన దైవం అతనికి దర్శనాన్ని అనుగ్రహించారని అంటారు.


 తరువాత కొంతసేపటికి భక్తుడు తాను చేసిన పొరపాటు తెలుసుకుని.. ఈ సారి  పొరపాటు రాకుండా పూజ చేయాలనే తాపత్రయంలో భక్తి కన్నా, పూజను చేసే విధానంపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించగా ఈసారి దైవం ప్రత్యక్షం కాలేదట.


 ఈ కధ ద్వారా ఏం తెలుస్తుందంటే,  పూజా విధానాలను, ఆచారవ్యవహారాలను చక్కగా పాటించటం మంచిదే కానీ, దైవంపై భక్తి అన్నింటికన్నా ముఖ్యం..  అని గ్రహించాలి.


శక్తి ఉన్నవారు ఆచారవ్యవహారాలను నిక్కచ్చిగా పాటించుకోవచ్చు. అంత ఓపిక లేనివారు తమకు వీలున్నంతలో పాటించుకోవచ్చు. ఎవరి శక్తిని బట్టి వారు దైవప్రార్ధన చేసుకోవచ్చు. 


అంతేకాని, తమకు శక్తి లేనప్పుడు  మోయలేనంతగా నెత్తిన వేసుకుని విసుగు తెచ్చుకుని..ఆచారవ్యవహారాలను ఆడిపోసుకోవటం న్యాయం కాదు కదా! Thursday, September 14, 2017

దైవపూజ సుఖముగా ప్రశాంతముగా చేసుకోవాలండి.....

Monday, October 4, 2010


దైవపూజ సుఖముగా ప్రశాంతముగా చేసుకోవాలండి.

దైవపూజ సుఖముగా ప్రశాంతముగా చేసుకోవాలండి. విసుగుతోనో, భయపడుతూనో చేయకూడదు. భగవంతుడు దయామయుడు. పూజలో లోటుపాట్లను ఆయన క్షమిస్తారు. వాటి గురించి అతిగా ఆలోచించి దైవపూజలకు , దైవానికి దూరమవ్వటం మరీ పాపం.


నేను ఒకదగ్గర ఇలా చదివానండి. తీర్ధప్రసాదములు తీసుకుని గుడిలోనుంచి బయటకు వచ్చాక తిరిగి వెంటనే మళ్ళి గుడిలోకి వెళ్ళకూడదని......... పెద్దలు ఇలా ఎందుకు చెప్పారో ? అనిపించిందండి. .(అలా చెప్పారు కదా ! అని దేవాలయంలో ఇంటితాళాలు, బండి తాళాలు  లేక మరేదైనా మర్చిపోతే అప్పుడే తిరిగి దేవాలయానికి వెళ్ళొచ్చో? లేదో ? అనుకోనవసరం లేదు, తిరిగి దేవాలయానికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. )


తరువాత నాకు జరిగిన అనుభవాల ద్వారా నాకు అనిపించినది చెబుతాను అండి.

ఒకసారి ....... గుడికి వెళ్ళినప్పుడు లోటుపాట్లు జరగకుండా పూజ జరగాలనే ఆలోచనలోపడి ................ ఆ కంగారులో ఏదో ఒకటి మర్చిపోవటము జరిగేది. అంటే తీర్ధప్రసాదములు తీసుకుని బయటకు వచ్చాక తీరిగ్గా గుర్తు వచ్చేది.


ఏమంటే హుండీలో కానుకలు సమర్పించటము మరిచిపోవటమో, లేక తీసుకువెళ్ళిన పండ్లు సమర్పించటం మర్చిపోయి సంచీలో ఉండిపోవటమో ........ కొన్ని ఉపాలయములు చూడలేదని గుర్తు రావటము ........ ఇలాగన్నమాట..........


ఇలా గుడిలోనుంచి ఒకసారి బయటకువచ్చాక ............. మళ్ళీ తిరిగి వెళ్ళి ఉపాలయములు దర్శించుకోవటము ............... ఇలా చేసినప్పుడు చుట్టూ అక్కడివాళ్ళు నన్ను వింతగా చూస్తున్నట్లు నాకు అనిపించిందండి.

ఎందుకంటే ఇప్పుడే తీర్ధప్రసాదములు తీసుకుని వెళ్ళి మళ్ళీ ...................... అప్పుడే వస్తే ఎవరైనా కొంచెం ఆశ్చర్యముగా చూస్తారు గదండి. ( ఏమో వాళ్ళు చూసినా చూడకపోయినా నాకు అలా అనిపించేది. )


ఇలా కొన్ని సార్లు జరిగాక నాకు ఏమని అనిపించిది అంటేనండి.......ఇలా ఎవరూ అతిగా చేయకుండా ............. అంటే ఏదోఒకటి మర్చిపోయి గుడిలోకి బయటకు తిరగటం ............. ఇలాంటివి ఆపటానికే పెద్దలు అలా చెప్పారేమోనని.


ఇలా ఒకటిరెండుసార్లు జరిగాక నాకు ఓపిక లేక భగవంతునితో దేవా ............ పూజలో జరిగే లోటుపాట్లకు క్షమించు..... నాకు శక్తి మేరకే చేయగలను . అని చెప్పేసాను..


అప్పటినుంచి ఏదయినా మర్చిపోయి ఇంటికి వచ్చేసినా భయపడటంలేదు. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడని ......... లోటుపాట్ల గురించి అతిగా ఆలోచించకుండా, ప్రశాంతముగా నా శక్తి కొలది ప్రవర్తించటము మంచిదని అలా ప్రయత్నిస్తున్నాను.


ఇంతగా ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటేనండీ ................. ఈ రోజుల్లో దేవుని గురించి తక్కువగా ............. విధి విధానముల గురించి అతిగా ఆలోచిస్తూ ఉండే నా లాంటి వాళ్ళు అక్కడక్కడా ఉంటారేమోనని............ ............. ఇలా వ్రాయాలనిపించిందండి.


ఇలాంటివారు అతిగా ప్రవర్తించి మూఢత్వముగా మారకూడదని నా ఆలోచన.

పూజలో జరిగే లోటుపాట్ల వలన వచ్చే పాపం కన్నా.... అతిగా ఆలోచనల్లో పడి భగవంతుని భక్తికి దూరమవ్వటము మరింతపాపమని నాకు అనిపించింది అండి. 

............. సాయి కూడా పూజ ఎట్టిదయినా బుద్ది ప్రధానమనితెలియజేసారటరామకృష్ణపరమహంస వారు కూడా దైవముతోమనము చనువుగా ఉండాలి....... భయపడటమెందుకు అనిఅనేవారట.........

.అసలు పూజ చెయ్యటము దైవం కొరకే ............... మనముఅసలు లక్ష్యమునకు దూరము కారాదు. .. ...***************

Wednesday, October 6, 2010


దైవము . మరియు ,పెద్దలు మనకోసము ఎంతగా ఆలోచిస్తారో కదా..................

పూజల యొక్క విధివిధానములను పాటించటములో నాకు వచ్చిన సమస్యలు, సందేహములను గురించి ఇంతకుముందు వ్రాశాను కదండి.

శ్రీ లలితాసహస్రనామములలో సుఖారాధ్యా అనే నామమును గురించి విన్నాక ధైర్యం వచ్చిందండి.

అలాగే భగవద్గీతలో శ్రీ కృష్ణపరమాత్మ కూడా తెలియజేసారు కదండీ ........... ఎవరయినా భక్తితో ........ కొద్దిగా జలమును గానీ, పుష్పములను గానీ, ఫలములను గానీ సమర్పించినా చాలు తాను స్వీకరిస్తానని. ....................నిజంగా భగవంతుడెంతో దయామయుడు.


పెద్దలు ఒక అత్యుత్తమ సాధకుని గురించి ఎంతగా ఆలోచిస్తారో ఒక అతి సామాన్య భక్తుని గురించి కూడా అంతగానూ ఆలోచిస్తారు.


ప్రపంచములోని ప్రతి ఒక్కరూ దైవానికి దగ్గరవ్వాలని వారి తాపత్రయము.

ప్రపంచములో రకరకముల మనస్తత్వముల వాళ్ళు, ఎన్నో రకాల పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తితో ఒక్కో విధముగా ప్రవర్తించవలసి ఉంటుంది.

అందుకేనేమో పూజల విధివిధానముల విషయములో పెద్దలు ఒక్కోదగ్గర గట్టిగా చెబుతారు. ఒక్కోసారి పట్టు సడలిస్తారు.


పూజానియమాలను ఉన్నదున్నట్లు చెప్పటము వల్ల శక్తి ఉన్నవాళ్ళు వాటిని పాటించి ఫలితములను శీఘ్రముగా పొందుతారు. అందరికీ అంత శక్తి ఉండదు కదా.
అటువంటి వారు నిరాశపడకుండా పెద్దలు మనకు ఎన్నో ఉపాయములను ఎందరో భక్తుల కధల ద్వారా తెలియజేసారు.


ఉదా...........కొంతమందికి సంసార బాధ్యతల వల్ల ఎక్కువసేపు పెద్దపెద్ద పూజలు చెయ్యలేకపోవచ్చు. ధర్మవ్యాధుని కధ ద్వారా స్వధర్మమును ఆచరిస్తూ కూడా దైవమునకు దగ్గర అవ్వచ్చునని తెలియజేసారు.

కొంతమంది ఎన్నో పాపాలు చేసి తరువాత తప్పు తెలుసుకుని అయ్యో మనకు దైవ పూజ చేసే అర్హత ఉందోలేదో అనుకుంటారు. నిగమశర్మోపాఖ్యానము ద్వారా అలాంటివారికి కూడా దైవపరమయిన ఆశను కల్పించారు. వారు మంచి మార్గములోకి వచ్చే మార్గమును తెలియజేసారు.


ఇంకొంతమంది ఉంటారు. ఇవన్నీ విని ..................... అయితే విధివిధానములు పెద్దగా పాటించనక్కరలేదులే ........ అనేసుకునే బధ్ధకస్తులూ ఉంటారు. విధివిధానములు సరిగ్గా పాటించాలి అని కొన్ని కధల ద్వారా గట్టిగా చెప్పటము వల్ల ఇటువంటివారి బధ్ధకమును పోగొట్టవచ్చు.


మళ్ళీ ఇవన్నీ విని జనం భయపడకుండా ఈ విధమయిన గొప్ప భక్తుల కధలను తెలియజేసారు.


ఒక భక్తుడు ..భక్తిపారవశ్యములో పడి దైవమునకు పండ్లకు బదులుగా తొక్కలను నివేదించారట.................. ఆ భక్తికి మెచ్చి భగవంతుడు ఆ తొక్కలనే ఆప్యాయముగా స్వీకరించారట..........

అప్పుడు ............ ఆ భక్తుడు అయ్యో తొక్కలను సమర్పించానే అని బాధపడి మళ్ళీ పూజను విధివిధానముగా చేసి ఈ సారి జాగ్రత్తగా తొక్కలు కాకుండా పండ్లనే దైవమునకు నివేదించగా ............ ఆ భగవంతుడు స్వీకరించలేదట.


ఎందుకంటే రెండవసారి చేసిన పూజలో భక్తి శాతము తగ్గినందువల్ల. దీనిని బట్టి అన్నిటికన్నా భక్తి ప్రధానమని తెలుస్తోంది.


ఇంకా నాకు ఏమని అనిపిస్తోదంటేనండీ, ఏదైనా సరిగ్గా పాటించటమువల్లా ఉత్తమ ఫలితములను శీఘ్రముగా పొందవచ్చును. అయితే ఒకోసారి అలా పాటించటము కుదరదు కదండి.
ఉదా..........పూజ చేసేటప్పుడు షోడశోపచారములు సమర్పించే సమయములో రత్నఖచిత సిం హాసనము సమర్పించటము విషయములో పుష్పములు వేసి నమస్కరించి సరిపెట్టుకుంటారు గదా.....అలాగే మధుపర్కములు సమర్పించే విషయములో కూడా చాలామంది అక్షతలు సమర్పించి సరిపెట్టుకుంటారు కదా...... ఇలాగే కొన్నికొన్ని ఇతరమయిన విషయములలో కూడా ఉన్నదున్నట్లు చేయటము కుదరక పోవచ్చు.


ఇలా ధర్మ సందేహములు వచ్చినప్పుడు పరిస్థితిని బట్టి ఆలోచించి ఏమి చేయాలో ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. తెలియకపోతే దైవంపైన భారం వేయటము ఉత్తమమయిన పధ్ధతి. ఆ తరువాత పెద్దలు చెప్పిన శ్రీ దైవాపరాధ క్షమాపణ స్తోత్రము చెప్పుకోవలెను. ........................ .......................ఇంతవరకు వ్రాసిన దానిలో తప్పులున్నచో దయచేసిక్షమించాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. Wednesday, September 13, 2017

సంస్కృతి అంటూ చెప్పడమే తప్ప....

ఈ రోజుల్లో కొందరు  మన సంస్కృతి  అంటూ  చెప్పడమే తప్ప,  ఆచరణలో ఎంతవరకూ పాటిస్తున్నారు?  

పాపపు పనులు చేయకూడదు, అత్యాశ ఉండకూడదు ..ఇలా ఎన్నో చక్కటి  విషయాలను పెద్దలు  తెలియజేసారు.ఇంద్రుడంతటి గొప్పవారైనా పొరపాట్లు చేస్తే , కష్టాలను అనుభవించినట్లు పురాణేతిహాసాల ద్వారా తెలుసుకోవచ్చు. 


తపస్సు చేసి వరాలను పొందినవాడు, పండితుడు అయిన రావణుడు  మనస్సును అదుపులో ఉంచుకోలేక చేసిన పాపపుపనుల వల్ల సంతానంతో సహా నాశనమయ్యాడు. 


********


 జీవులు మరణించిన తరువాత గతంలో సంపాదించిన సొమ్ము వెంటరాదు, చేసిన ధర్మమే వెంట వస్తుంది. 

 తన స్వార్ధం కోసం అడ్డమైన పనులూ చేసి ఎంతో సొమ్ము కూడబెడతారు. 


..... ఇలాంటి వాళ్ళు మరణించిన  తరువాత గతంలో చేసిన పాపాల వల్ల కొంత నరకాన్ని అనుభవించి , కర్మశేషంతో ఎక్కడో తిరిగి జన్మను పొందుతారు. ఎన్నో కష్టాలను అనుభవిస్తారు. ఇవన్నీ తెలిసినా మనుషులు పాపాలు చేస్తూనే ఉన్నారు. 


ఈ  రోజులలో పాపాలు చేయనివారు, పాపాలు చేయకూడదనుకునేవారు ఎంతమంది?  


**************

ఈ రోజుల్లో చాలామంది ప్రజలలో మంత్రాలు, పూజలు  .. వంటి వాటి పైన ఆసక్తి పెరిగింది. వీటి గురించి అనేక సందేహాలను అడుగుతున్నారు. 

మంచిదే కానీ, దైవకృపకు పాత్రులవ్వాలంటే ..వీటిని  ఎలా ఆచరించాలనే  విషయాల గురించి తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు,  ధర్మమార్గంలో జీవించటానికి  కూడా ప్రయత్నించాలి. 

మరి,  ధర్మమార్గంలో జీవించాలని ఎంత మంది ప్రయత్నిస్తున్నారు? 


*************


 పాపపు పనులు మానివేయాలనుకుంటూ కూడా మనస్సును అదుపులో ఉంచుకునే శక్తి లేనప్పుడు,  పూజలు చేయగాచేయగా ధర్మమార్గంలోకి రాగలరు. 


అంతేకానీ, పాపాలుచేస్తూనే ప్రాయశ్చితపూజల ద్వారా పాపాలు తొలగించుకోవచ్చనుకుంటే మాత్రం అది దురాశే అవుతుంది.Tuesday, September 12, 2017

కొంత సొమ్ము సంపాదించిన తరువాత ఇక..


దైవం సృష్టించిన ఈ ప్రపంచంలో సంపద ఏ కొద్దిమందికో సొంతం కాదు. 


దైవం ఇచ్చిన తెలివితేటలను,శక్తిసామర్ధ్యాలను ఇతరులతో పంచుకోవాలి.తమ ఎదుగులతోపాటూ ఇతరుల ఎదుగుదలకోసమూ తమ ప్రతిభను ఉపయోగించాలి. 


తమ అవసరాలకోసం  తమకు కొంత సొమ్ము సంపాదించిన తరువాత ఇక తృప్తిచెందాలి. 


ఉన్నసొమ్మంతా కొందరి వద్దే ప్రోగుబడటం , మిగిలినవారు బాధలు పడటం న్యాయం కాదు. 


ఇప్పుడు చూడండి.దేశంలో కొందరు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టి వినోదిస్తుంటే , కొందరు తగిన సంపాదన లేక ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఉదా..డబ్బులేక గల్ఫ్ వంటి దేశాలకు వలస వెళ్లి, అక్కడ అనుభవిస్తున్న బాధలు చూస్తుంటే ఇదేనా మనం సాధించిన అభివృద్ధి ? అనిపించడం లేదా ? మన చుట్టుప్రక్కల కొందరు తిండిలేక , వైద్యానికి డబ్బులేక నరకం అనుభవిస్తుంటే, డబ్బు ఉన్నవాళ్లు మాత్రం ..వేలు, లక్షలు, కోట్లు పోసి.. నగలు, దుస్తులు, కార్లు, ఇళ్లు..కొంటూ జీవిస్తున్నారు. ఇదేం నీతి ? భారతీయసంస్కృతిలో పెద్దలు ఎన్నో విషయాలు తెలియజేసారు .అత్యాశ వద్దని, తృప్తిని మించిన సంపద లేదని తెలియజేసారు.


పాపాలు చేయవద్దన్నారు.పుణ్యకార్యాలు చేయమన్నారు.


 పాపపు సొమ్ముతో చేసే పూజలు సత్ఫలితాలను ఇవ్వవు ..అనీ తెలియజేసారు. 


అయితే, ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే...


.అన్యాయాలు చేసి డబ్బు సంపాదించి ఆ సొమ్ముతో పూజలు చేస్తూ దైవాన్ని కూడా మోసం చేయగలమని భ్రమపడుతున్నారు. 


ఎవరైనా సరే, అధికమొత్తంలో సంపద కూడబెట్టడం సరైనది కాదు. 


తమకు అవసరమైనంత వరకు ఉంచుకుని మిగిలినది సమాజహితానికి ఉపయోగించాలి. 


ఇక, వందలకోట్లు, వేలకోట్లు కూడబెట్టేవాళ్లు  తమ వద్ద  కొంత సొమ్ము ప్రోగుపడిన తరువాత.. ఉన్న సొమ్ములో  సమాజానికి వాటా ఇవ్వాలి. 


అంతేకానీ, తరతరాలకూ సరిపడా కూడబెట్టుకుంటూ జీవించటం పాపమే అవుతుంది. 


బాగా డబ్బున్నవాళ్లు తమకు ఉన్నదానిలో అతికొద్దిభాగం మాత్రం సమాజం కోసం ఉపయోగిస్తే సరిపోదు.


 ఎక్కువసంపద ఉన్నవారు అందుకు తగ్గట్లుగా ఇవ్వాలి. 


కొందరి వద్దే డబ్బు ప్రోగుపడటం తగ్గినప్పుడు ఎన్నో అసమానతలు గణనీయంగా తగ్గుతాయి.
Saturday, September 9, 2017

ఓం శ్రీ శనిదేవులు...కొన్ని విషయములు..


శింగణాపూర్ లో శ్రీ శనేశ్వర భగవానులు తాను స్వయంభూ అవతార శిలారూపం నుండి సృష్టినంతా వీక్షిస్తూ జీవుల్ని పాలిస్తున్నారు.

కర్మపాశవిముక్తి దేవత గ్రహసార్వభౌమునికి మానవకృతపీడ,దోషాలు ఆపాదించడము దేవత యెడ మహాపరాధమవుతుంది.

 సకలజీవరాశులయెడ కృపాదృష్టి గల గ్రహదేవత లోకోద్ధరణ కాంక్షించి భూస్థలిపై శిలామూర్తియై అవతరించారు. 
...........

 జీవి యొక్క రాశి చక్రములో శనిగ్రహదేవత , జన్మస్థానము నందు,  అష్టమ, ద్వాదశ యందు , అర్ధాష్టు యందు సంచరించునపుడు శోధించి జీవియొక్క గతజన్మల కర్మానుఫలంగా శిక్షకు గురిచేస్తారు . దీన్ని శనిదోషముగా భావించడము దైవము యెడ మహాపరాధము. అని పెద్దవారు తెలియజేసారు. 

ఆయా స్థానములలో గ్రహరాజు సంచరించుకాలంలో.. శనిదేవుని పూజ చేయటం మంచిది.

దశరధుల వారు చేసిన శనిదేవుని స్తోత్రమును చదివినా, విన్నా మంచిది.
...............

శనిదేవుని గురించి మరి కొన్ని విషయములు ఈ క్రింది లింకుల వద్ద గమనించగలరు.


SHANI DEV KI KATHA - YouTubeshani-6.wmv.flv - YouTube*************


shani-6.wmv.flv అనే లింకును..


దయచేసి...

shani-6.wmv.flv -YouTube ....అని ఉన్న దగ్గర చూడగలరు.**********
వ్రాసిన వాటిలో అచ్చుతప్పుల వంటివి ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.Thursday, September 7, 2017

మనదేశమూ అందంగా ఆహ్లాదంగా ...

కొన్ని విదేశాలలో పచ్చటి చెట్లతో చక్కటి పార్కులు, రహదారులకు ఇరువైపులా దట్టమైన చెట్లు, సరస్సుల చుట్టూ పూలగుత్తులతో నిండిన ఒత్తయిన వృక్షాలు , పండ్ల వృక్షాలు వంటివి ఉండి వాతావరణం ఎంతో బాగుంటుంది. 

ఇప్పుడు మనదేశంలో చాలా పట్టణాలు, నగరాలలో రోడ్ల ప్రక్కన చెత్తచెదారం తప్ప వృక్షాలు చాలా తక్కువగా పెంచుతున్నారు.

 ఇక చాలా సరస్సుల ( చెరువులు) ప్రక్కన చూస్తే కుళ్ళిన చెత్తకుప్పలు, ప్లాస్టిక్ కుప్పలు.. దర్శనమిస్తాయి. 

ఈ రోజుల్లో ఎక్కువమంది ప్రజలు ఇళ్ళలో కూడా వృక్షాలు పెంచటానికి అంతగా ఇష్టపడటం లేదు. 

ఇళ్లలో పెద్ద చెట్లు పెంచుదామన్నా కరెంట్ వైర్లకు అడ్డమని నరికేస్తారు. 

కొందరు ఇళ్ల గోడలు బీటలు వస్తాయంటూ పెద్ద వృక్షాలను పెంచటం లేదు. 

మరికొందరేమో రాలిపడిన ఆకులు, పువ్వులు  ఎత్తిపొయ్యలేమంటూ సాకులు చెబుతారు.

 కొద్దిగా ఖాళీ స్థలం మిగిలినా గదులు కట్టేసి అద్దెకు ఇస్తున్నారు. 

కొందరు  ప్రజల మనస్తత్వాలు ఇలా మారిన తరువాత..  కాంక్రీట్ , ప్లాస్టిక్ తప్ప పచ్చదనానికి చోటెక్కడుంటుంది.

చెట్లను పెంచడానికి పెద్ద ఖర్చేమీ అవదు. చెట్ల వల్ల ఎన్నో లాభాలున్నాయి. 


 ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే విజయవాడ వంటి ఊరిలో కూడా చెట్లు బాగా ఉన్న ఏరియాలో వేడి కొంత తక్కువగా ఉంటున్నట్లు చెబుతున్నారు. 

అలాంటప్పుడు మరింత  దట్టంగా చెట్లను పెంచితే ఉష్ణోగ్రత కొంతయినా తగ్గుతుంది కదా!

 చెట్లను దట్టంగా పెంచే విషయంలో ప్రజలు శ్రద్ధ వహించాలి.

 ప్రతి ఇంటి వద్ద  కొన్ని చెట్లను పెంచాలన్నే విషయాన్ని తప్పక పాటించాలి.  

విదేశాల వాళ్లు వారి పరిసరాలను అందంగా పచ్చదనంతో తీర్చిదిద్దుకుంటుంటే, మనం ఎందుకు పచ్చదనం, పరిశుభ్రంగా ఉంచుకోలేకపోతున్నాము ? 

ఎందుకంటే మన దేశంలో చాలామందికి పట్టుదల లేదు. 

ప్రాచీనులు నదులను దేవతలుగా వర్ణిస్తే చాలామంది హేళన చేసారు. 

ఇప్పుడు కొన్ని విదేశాలలో నదులను ప్రాణమున్న వాటిగా చట్టం చేసి జాగ్రత్తగా రక్షించుకుంటున్నారు. 

మరి, నదులను దేవతలుగా పూజించే మనదేశంలో నదులను స్వచ్చంగా ఉంచుతున్నామా ? 

నదులను దేవతలంటూ పూజిస్తూనే.. ఆ నదులలో మురుగును వదలటం ఏం సంస్కారం ? 

విదేశాలు బాగున్నాయి అనుకోవటం కంటే,  మనదేశాన్ని మనమూ బాగుచేసుకోవచ్చు. 

అందరూ  పట్టుదలగా పనిచేస్తే మనదేశమూ పరిశుభ్రంగా పచ్చదనంతో అందంగా ఆహ్లాదంగా ఉంటుంది.