koodali

Monday, January 30, 2012

* మహాశక్తి అయిన పరమాత్మ ..సూర్యుడు .....


ఓం
*సూర్యుడు 
 అలా వెలగటానికి భౌతికంగా చెప్పుకునే కారణాలు ఏమైనా ఇవన్ని ఏర్పాటు చేసిన మహాశక్తి అయిన పరమాత్మకు మోకరిల్లి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే సూర్యుని వెలుగువల్లే భూమిపై జీవులు జీవిస్తున్నాయి.

అందరికి రధ సప్తమి శుభాకాంక్షలండి.సూర్యుడు ప్రత్యక్ష పరమాత్మ.


దైవాన్ని చూపించండి ..... అని ఎవరైనా అడిగితే సూర్యుణ్ణి చూపించవచ్చు. సూర్యుడు లక్షలాది సంవత్సరాలుగా ఎలా వెలుగుతున్నాడో తలచుకుంటే ఎంతో ఆశ్చర్యం కల్గుతుంది.

అంతర్జాలంలో చూస్తే, ఇలా వెలగటానికి హైడ్రోజన్, హీలియం అని శాస్త్రవేత్తలు  చెబుతున్నారు. ఎక్కువగా వివరాలు నాకు తెలియవు. ( నాకు ఇంగ్లీష్ అంత బాగా రాదు . )


సూర్యుడు ఆరోగ్యప్రదాత అని పెద్దలు చెబుతారు.

శ్రీ కృష్ణుని కుమారుడైన సాంబుడు తనకు వచ్చిన అనారోగ్యమును ఈ సూర్యస్తోత్రమును పఠించి పోగొట్టుకోగలిగాడట. ఇది అతి శక్తివంతమైన స్తోత్రము. 


ఈ  లింక్ వద్ద..    

Friday, January 27, 2012

రాములవారు కరుణించారు కానీ ఆగ్రహించలేదు.ఈ రోజు టపా వ్రాయాలనుకోలేదండి. . కానీ, నిన్నటి టపా విషయంలో కొందరు బాధను వ్యక్తపరిచారు. అందుకే ఈ రోజు కూడా టపా వ్రాయవలసి వచ్చింది.


చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారం పూర్వీకుల జీవన విధానం గురించి నాకు అంతగా పాండిత్యం లేదండి.


నిన్నటి టపాలో నాకు తెలిసినంతలో వ్రాయటం జరిగింది. అంతే. అందులో పొరపాట్లు కూడా ఉండి ఉండవచ్చు.


సమాజం సజావుగా సాగటం కోసం పెద్దలు
చాతుర్వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేశారనిపిస్తుంది. పూర్వీకులు వర్ణాశ్రమ ధర్మాలను చక్కగా పాటించేవారు.


అయితే,... ఆ రోజుల్లో కూడా కొందరు ఇతర ధర్మాలను అవలంబించినట్లుగా తెలుస్తుంది. ఉదా...విశ్వామిత్రులవారు.


విశ్వామిత్రులవారు క్షత్రియులు . కానీ తరువాత కాలంలో వారు క్రమంగా బ్రహ్మర్షిగా మారటం జరిగింది.


విశ్వామిత్రుని శ్రీ రాముల వారు గురువుగా గౌరవించారు కదా!


యుగ లక్షణాలను బట్టి కూడా మనుషుల తీరు మారుతుందని అంటారు. .ఈ రోజుల్లో చాలామంది అన్ని రకాల వృత్తులను స్వీకరిస్తున్నారు.


నాకు ఏమనిపిస్తుందంటే.......ఎవరైనా ధర్మబద్ధమయిన .ఏ ధర్మాన్ని అయినా సక్రమంగా నిర్వహిస్తున్నప్పుడు దైవానుగ్రహం తప్పక ఉంటుంది అనిపిస్తుంది.

..................


శబరి విషయంలో ....ఆమె కూడా తపస్సు చేస్తున్నట్లే ( తపస్విని ) అని అనుకోవచ్చు.

మరి శూద్ర కులానికి చెందిన శబరిని రాములవారు కరుణించారు కానీ ఆగ్రహించలేదు.


వ్రాసిన విషయంలో పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.


Thursday, January 26, 2012

ఆ నాటి వృత్తులతో పోల్చుతూ ఈ నాటి వృత్తులను చూద్దాము......అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండీ. (కులమతాలతో సంబంధం లేకుండా దేశం కోసం అమరులైన వారికి నివాళులు అర్పిస్తూ...)

..............................................


శ్రీ రాముడు శంభూకుని వధించటానికి మనకు తెలియని ఇతరకారణాలు కూడా ఉండవచ్చు. శంభూకుని చరిత్ర మనకు తెలియదు. అతని పూర్వ కర్మ ఎలాంటిదో మనకు తెలియదు.


కష్టాలు తీరటానికి తపస్సులు, పూజలు అన్ని కులాలవారు చేస్తారు.


అయితే, శంభూకుడు బొందితో స్వర్గానికి వెళ్ళాలని తపస్సు చేస్తున్నట్లుగా ఒక దగ్గర చదివాను.

హరిశ్చంద్రుని తండ్రి అయిన త్రిశంకుడంతటి వారినే బొందితో స్వర్గానికి రావటానికి మొదట ఇంద్రుడు అంగీకరించలేదు.


పరిశీలిస్తే ఇక్కడ కులం అన్నది సమస్య కాదనిపిస్తుంది............................


ఆదిశంకరుల వారి జీవితంలో జరిగిన ఒక సంఘటన ద్వారా అంటరానితనం తప్పు అని తెలిసింది. , రాముల వారు శబరి, గుహుడు మొదలైవారిని చక్కగా ఆదరించారు. ఇవన్నీ చూస్తే ,.....


పెద్దలే ఇలా స్పష్టంగా తెలియజేస్తుంటే మరి అంటరానితనం పాటించటం అనేది తప్పే. అసలు అందరు మానవులు, పశుపక్షాదులతో సహా కశ్యపుని సంతానమేనట. .

......................................


దైవపూజలు, పాలనలో రాజుకు సలహాలను ఇవ్వటం, వైద్యం ఇవన్నీ చేయటానికి సత్వగుణం ప్రధానంగా అవసరం. ఆహారం ద్వారా గుణాలు అలవడతాయని పెద్దలు చెబుతారు,.అందుకే .... అధర్మపరులు, తామస గుణం కలిగిన వారి ద్వారా ఆహారాన్ని స్వీకరించేవారు కాదు.
పూర్వం బ్రాహ్మణులు తమ ఆహారాన్ని తామే తయారుచేసుకునేవారు.


అయితే రాములవారు.... శబరి ఇచ్చిన ఆహారాన్ని స్వీకరించటాన్ని తప్పుగా భావించలేదు.

భీష్ముల వారు....ద్రౌపది అడిగిన ఒక సందేహానికి.... తప్పని పరిస్థితిలో తాను రాజైన దుర్యోధనుని ఆహారాన్ని స్వీకరించటం .... మనిషి ప్రవర్తనపై ఆ వ్యక్తి తీసుకునే ఆహారం యొక్క ప్రభావం ఎంత ఉంటుందో..... అనే విలువైన విషయాన్ని భీష్ముల వారు తెలియజేసారు.


ఇవన్నీ గమనిస్తే ఆహారాన్ని స్వీకరించే విషయంలో కులానికన్నా వ్యక్తి గుణానికి,... ఇంకా ఆహారం ధర్మబద్ధమయినదా ? లేక అధర్మబద్ధమయినదా ?అనే విషయాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలేమో అనిపిస్తుంది.

(
ఇవి తెలియని పరిస్థితిలో దైవం మీద భారం వెయ్యటమే అన్నింటికన్నా ఉత్తమం.)


................................................


ఆ నాటి వృత్తులతో పోల్చుతూ ఈ నాటి వృత్తులను చూద్దాము...సరదాగా...ఈ రోజుల్లో ఎవరైనా ఏ వృత్తినైనా స్వీకరించవచ్చు. ఇది కేవలం ప్రాచీన కాలం నాటి వ్యవస్థతో పోల్చుతూ వ్రాసినది మాత్రమే అని గమనించ ప్రార్ధన.ఆ రోజుల్లో. బ్రాహ్మణులు .... వేదవిద్య , దైవపూజలు, ఇతర విద్యలు , వైద్యం, అధ్యయనం, రాజులకు పరిపాలనలో మంత్రులుగా సలహాలను అందించటం , యాత్రలు, వ్యవసాయం.. ఇలా....

ఈ రోజుల్లో ... వేదవిద్య, దైవ పూజలు ,
ఇతర విద్యలు, ఉపాధ్యాయులు, వైద్యం, మంత్రులు, శాస్త్రవేత్తలు, పాలనలో భాగంగా అధికారులు,యాత్రలు, వ్యవసాయం.. ఇలా చెప్పుకోవచ్చు..ఆ రోజుల్లో క్షత్రియులు ..... దైవపూజలు.,.రాజులు , విద్య, రాజ్యాధికారం, రక్షణ రంగం, న్యాయం చెప్పటం , ఆయుధరంగం, ఆర్ధిక వ్యవస్థ,, వైద్యం, ఇతరదేశాలతో స్నేహం వంటి విషయాలు, వ్యవసాయం......

ఈ రోజుల్లో .........దైవపూజలు,విద్య, రాజ్యపాలన, రక్షణ రంగాలు, ఆర్ధిక వ్యవస్థ,
వైద్యం, న్యాయవాదులు, ఆయుధరంగం, ఇంజనీరింగ్ , ఇతరదేశాలతో స్నేహం వంటి విషయాలు, పాలనా రంగం, ( పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ) , వ్యవసాయం.......
ఆ రోజుల్లో వైశ్యులు.. దైవ పూజలు,విద్య, వ్యాపారం, ఆర్ధిక వ్యవస్థ, వ్యవసాయం,
వైద్యం......

ఈ రోజుల్లో ......దైవపూజలు,విద్య, వ్యాపారం, ఆర్ధిక వ్యవస్థ, వ్యవసాయం
, వైద్యం ....ఆ రోజుల్లో శూద్రులు ......దైవపూజలు, వ్యవసాయం,విద్య, ( ఏ పని చేయటం తెలిసి ఉండటమైనా విద్యే కదా !).
వైద్యం, ఆయుధాలు తయారు చేసేవారు, చేతివృత్తుల వాళ్ళు, సంగీత పరికరాలు తయారుచేయటం, వస్త్రాల తయారి, పూటకూళ్ళ వాళ్ళు ( హోటల్ ),సమాజానికి కావాల్సిన అన్ని పనిముట్లను తయారు చేయటం మరియు కొత్త పరికరాలను కనిపెట్టటం ,.... అంటే ఇప్పటి ఇంజనీరింగ్ రంగం లాగా ..ఈ రోజుల్లో ,......దైవపూజలు, వ్యవసాయం,విద్య,( ఏ పని చేయటం తెలిసి ఉండటమైనా విద్యే కదా ! )
వైద్యం, సైనికులు, ఆయుధాలు తయారు చేసేవారు, చేతివృత్తుల వాళ్ళు, సంగీత పరికరాలు తయారుచేయటం, హోటల్స్ నడపటం, traavel కంపెనీలు, రకరకాల పరిశ్రమల్లో ఉద్యోగాలు చేయటం, ఇంజనీరింగ్ ఉద్యోగాలు, వస్త్రపరిశ్రమ, .....


ఇవన్నీ గమనిస్తే అప్పుడు ఇప్పుడు కూడా .... అన్ని కులాల వాళ్ళు గౌరవంగానే జీవిస్తున్నారు కదా !

....................ఇంకా అన్ని కులాల వాళ్ళూ తమ ఇళ్ళల్లో ... దైవ పూజలు చేసుకుంటాము. ఎవరి ఇంటిని వారు సంరక్షించుకుంటాము . అందరమూ ఇంట్లో బడ్జట్ ప్రకారం ఖర్చు, లెక్కలు వేసుకుంటాము. ఇంట్లో అందరం ఇల్లు శుభ్రం చేసుకుంటాము. అన్ని కులాలవాళ్ళం ఇంటిలో కూరగాయల మొక్కలను పెంచుతాము కాబట్టి అందరూ వ్యవసాయదారులే. ఇంట్లో అందరం పెరటి వైద్యం చేస్తాము కాబట్టి , అన్ని కులాల వాళ్ళూ వైద్యులమే. అని పెద్దలు తెలియజేశారు....................


ఈ టపాలో ఇప్పటికి తోచింది వ్రాశాను. వృత్తుల గురించి ఎన్నో మార్పులు, చేర్పులు చెయ్యవచ్చు, తప్పులుంటే తెలిసినవారు చెప్పగలరు. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.


నేను నాకు తెలిసినంతలో తోచింది వ్రాసాను. అంతేనండి. ఇందులో పొరపాట్లు కూడా ఉండిఉండవచ్చు. . తెలిసిన వాళ్ళు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. .


పొరపాట్లు ఉంటే దైవం దయచేసి క్షమించాలని కోరుకుంటున్నానండి...
.

Wednesday, January 25, 2012

రామాయణంలో శంభూక వధ.....న్యాయమా ? కాదా ? అని కొందరు......


కవిరాజు పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది ఆయన రాసిన శంభూక వధ నాటకం. ధర్మావతారుడుగా పూజలందుకునే రాముడు మహా తపస్సు చేస్తున్న శంభుకుణ్ని కేవలం శూద్రుడైన నేరానికి గాను నిస్సంకోచంగా
వధించాడనటం ఈ నాటకం ఇతివృత్తం........ఇలా...........

కొంతకాలం క్రిందట తెలకపల్లి రవి గారి బ్లాగులో
శ్రీ రాముడు ..... శూద్రుడైన శంభుకుణ్ని వధించటం గురించి చదివాను.,


నాకు ఈ కధ తెలియదు. అంతర్జాలంలో వెతికితే కనిపించింది.


* శ్రీ రాముల వారు అందరినీ గౌరవిస్తారు.

శబరి ఆప్యాయంగా ఇచ్చిన పండ్లను స్వీకరించారు . గుహుని తక్కువగా చూడలేదు. ఎంతో ఆప్యాయంగా చూశారు. జటాయువు యొక్క అంత్యక్రియలను నిర్వహించారు. అలాంటి రాములవారిని అపార్ధం చేసుకోవటం పొరపాటు.


ఇక రాముడు శంభూకుని సంహరించటం అంటే...నాకు ఏమనిపిస్తోందంటే..
శంభుకుడి వ్యక్తిత్వం మనకు తెలియదు. 


కొందరు మంచి కోరికలతో, ఉద్దేశ్యాలతో తపస్సులు చేస్తారు. కొందరు మనసులో స్వార్ధపరమైన కోరికలతో, ఉద్దేశ్యాలతో తపస్సులు చేస్తూ పైకి మంచిగా కనిపిస్తారు.


ప్రహ్లాదుని వంటివారు రాక్షస జాతికి చెందినా దైవ భక్తులై దైవానుగ్రహాన్ని పొందారు. . కానీ కొందరు రాక్షసులు స్వర్గాన్ని , దేవతలను జయించాలని తపస్సులు చేసారు.


మరి శంభుకుడు ఎందుకు తపస్సు మొదలుపెట్టాడో ఎవరికి తెలుసు ?


* బహుశా  శంభుకుడు  స్వార్ధపూరితమైన  చెడ్డ  కోరికలతో  తపస్సును  మొదలుపెట్టాడేమో ? 

రాముడు శూద్రులను చంపే వ్యక్తే అయితే,  శబరి తపస్సు చేసినప్పుడు చంపలేదు కదా ! శబరి కూడా శూద్ర స్త్రీయే.

............


 తపస్సులు చేస్తున్నంత మాత్రాన అందరూ మంచివారే ఉంటారా ? లోకాలను పీడించే వరాలను పొందటం కోసం రాక్షసులు కూడా తపస్సులు చేస్తారు . అంతమాత్రాన రాక్షసులు కూడా మంచివారు అయిపోతారా ? 

శంభూకుడు ఎటువంటివాడో ఎవరికి తెలుసు ? బహుశా శంభూకుడు చెడ్దకోరికలతో తపస్సు చేస్తున్నాడేమో ? అందుకే రాముల వారు వధించి ఉంటారు.

 శూద్ర స్త్రీ అయిన శబరి అందించిన ఎంగిలిపండ్లను స్వీకరించిన రామునికి శూద్రులనే భేదభావం ఉండదు.
............ఇంకా,


పూర్వీకులు ఎన్నో విషయాలను లోతుగా ఆలోచించి సమాజం సజావుగా సాగటానికి కొన్ని ఏర్పాట్లు చేశారు. సమాజంలో అభివృద్ధి ఉండాలని రకరకాలుగా వర్గీకరించారు.


కొందరికి ( బ్రాహ్మణులు ) దైవపూజ, విద్య మొదలైన బాధ్యతలను, కొందరికి ( క్షత్రియులు ) రక్షణ, పాలన మొదలైన బాధ్యతలను, కొందరికి ( వైశ్యులు ) వ్యాపారం మొదలైన బాధ్యతలను, కొందరికి ( శూద్రులు ) అన్ని విషయాలలోనూ అందరికీ తోడ్పాటును అందిస్తూ చేదుడువాడోడుగా ఉంటూ సమాజాభివృద్ధిలో పాలుపంచుకోవాలని...ఇలా నిర్ణయించారు. ( వ్యవసాయం విషయంలో నాకు అంతగా తెలియదు. )


ఇలా అందరూ ఎవరి పని వారు సక్రమంగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తేనే సమాజం చక్కగా ఉంటుందని వారు భావించారు.


ఎవరి ధర్మాన్ని వారు
నిర్వర్తించాలి.అలాగే శూద్రులు వారి ధర్మాన్ని వారు నిర్వర్తించాలి.

అలా కాకుండా శంభుకుని వంటి శూద్రులు తీవ్రమైన తపస్సులు మొదలైనవి చేస్తే ఆయనను చూసి మిగతా శూద్రులు అనుసరిస్తే .....


* అలా అందరూ ఎక్కువగా పూజలలో మునిగిపోతే సమాజంలో అభివృద్ధి కుంటుపడుతుంది అని వారి ఆలోచన కావచ్చు.


అలాగని పూర్వీకులు ఏ వర్గం వారినీ తక్కువగా చూడమని చెప్పలేదు. శూద్రులకు దైవానుగ్రహం అక్కరలేదని పెద్దలు చెప్పలేదు.


శూద్రులు పెద్దగా పూజలు చెయ్యకపోయినా వారు తమ ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తేనే చాలు....... దైవానుగ్రహాన్ని పొందగలరని ధర్మవ్యాధుని కధ ద్వారా చెప్పించారు.


* ధర్మవ్యాధుడు మాంసం అమ్మే వృత్తిలో ఉన్నా కూడా కౌశిక బ్రాహ్మణునికి ఎన్నో విషయాలను చెప్పటం జరిగింది.


* ఆదిశంకరులవారి జీవితంలో జరిగిన ఒక సంఘటన ద్వారా అంటరానితనం తప్పు.... అని చెప్పబడిందని అందరికీ తెలిసిన విషయమే.సమాజంలో ఏ బాధ్యత తక్కువది కాదు. ప్రతి వృత్తి బాధ్యతలోనూ కష్టాలూ
ఉంటాయి. .....సుఖాలూ ఉంటాయి.


ప్రతివారూ పల్లకీ ఎక్కేవాళ్ళే అయితే ఇక పల్లకిని మోసేవారెవరు ?

అందరూ, బస్సు, విమానం ఎక్కి కూర్చునే వారే అయితే ..... వాటిని నడిపే వాళ్ళూ ,అవి రిపేరయితే బాగు చేసేవారు,....యిలా
కూడా అవసరమే కదా !


ఇలా ఆలోచించి పూర్వులు సమాజంలో అందరికి అన్ని బాధ్యతలను అప్పగించారు.అని నాకు అనిపిస్తోంది.
సమాజంలో ఏ బాధ్యత తక్కువది కాదు. ప్రతి వృత్తి బాధ్యతలోనూ కష్టాలూ ఉంటాయి. ......సుఖాలూ ఉంటాయి.

ఉదా..బ్రాహ్మణులకు ఎన్నో నియమాలు, ఉపవాసములు , ఎక్కువగా పూజలు చేయటం ...ఇలా ఉంటాయి..Monday, January 23, 2012

2 + 3 = 5 ఐసు ముక్కలు అని కాదా టిచర్ ?.......4 - 4 = 0 కాదాండీ ?..


ఒక ఉపాధ్యాయదినోత్సవం రోజున సీనియర్ క్లాసుల పిల్లలే టీచర్లుగా జూనియర్లకు పాఠాలు చెబుతున్నారు.

ఆ పాఠశాలలో సందేహాలకు కూడా ఒక పీరియడ్ ఉంటుంది.

టీచర్ క్లాసులో పాఠం చెబుతున్నారు. 2 + 3 = 5 అవుతుంది. అని.

ఇంతలో ఒక విద్యార్ధి లేచి టీచర్ 2 + 3 = 5 అనే ఎందుకు అవుతుందండి ?
2 + 3 = 4 ఎందుకు అవకూడదండి ?
అని ప్రశ్నించగా ( నా లాగ అన్నమాట )....
టీచర్ 5 ఐసు ముక్కలను
తెప్పించారు. అందులో మూడు నీలం రంగు ఐసు ముక్కలు , రెండు పచ్చ రంగు ఐసు ముక్కలు.
ఒక గిన్నెలో మూడు నీలము రంగు ఐసు ముక్కలను పెట్టారు. వేరొక గిన్నెలో రెండు పచ్చ రంగు వాటిని పెట్టారు.

తరువాత పిల్లలకు చూపిస్తూ..... రెండో గిన్నెలోని 
ఐసు ముక్కలను కూడా మొదటి గిన్నెలో పెట్టారు.


( ఇప్పుడు అన్ని ఐసు ముక్కలను కలిపి లెక్కపెడితే 5 ఐసు ముక్కలు అని జవాబు వస్తుంది కదా ! కాబట్టి........2 + 3 = 5. అని చెప్పాలని టీచర్ యొక్క ఉద్దేశం .

అప్పుడు మొదటి గిన్నెలో యెన్ని ఐసు ముక్కలు ఉన్నాయో ? పిల్లలను లెక్కపెట్టమని చెప్పబోయేంతలో .......
క్లాస్ బయట పెద్దగా
కోలాహలం వినిపించింది. అందరూ అటు పరిగెత్తారు.
ఎవరో వచ్చి ఏదో కారణంతో బంద్ అని స్కూల్ మూసివెయ్యాలని గొడవచేస్తున్నారు. వాళ్ళకు సర్ధిచెప్పి పంపేసరికి ఒక అరగంట పైనే పట్టింది.
తిరిగి క్లాస్ కు వచ్చి గిన్నెలోకి చూసిన పిల్లలందరూ ఆశ్చర్యపోయారు.
గిన్నెలోకి చూసిన టీచర్ కు....
నాలుగు ఐసు ముక్కలే కనిపించాయి.

అన్ని ఐస్ ముక్కల కన్నా సైజులో చిన్నదయిన ఒక
నీలం రంగు ఐసు ముక్క కరిగి నీరై పోయింది.


ఐసు ముక్క నీరుగా రూపాంతరం చెందింది కాబట్టి ..... దానిని ఇప్పుడు ఐసు ముక్క అనలేము కదా ! అలా లెక్క తప్పిపోయింది అన్నమాట.అప్పుడు పిల్లలు అడిగారు.

టీచర్ ! 2 ఐస్ ముక్కలు + 3 ఐస్ ముక్కలు = 5 ఐసుముక్కలు అనుకున్నాం కదండి.....
మరి ఇక్కడ చూస్తే 2 + 3 = 4 ....ఐస్ ముక్కలు అని మాత్రమే జవాబు కనిపిస్తోంది....

మరి 2 + 3 = 5
అని కాదా టిచర్ ? అని.
అప్పుడు టీచర్ గంభీరంగా ఇచ్చిన జవాబు......కొన్నిసార్లు 2 + 3 = 5 కాకపోవచ్చు. .

......................


టీచర్ మరియు విద్యార్ధులు,మరియు కొందరు పెద్దవాళ్ళు .... సరదాగా నది ఒడ్డున షికారుకు వెళ్ళారు. . వేసవి కాలం వల్ల నదిలో నీళ్ళు ఎక్కువగా లేవు.
ఉదయం స్కూల్ లో ,
లెక్కల టీచర్ .... 4 - 4 = 0 అని చెప్పటం జరిగింది.

ఆ విషయం గుర్తొచ్చిన కొందరు సందేహపు విద్యార్ధులు ( నా లాగా అన్నమాట . )
టీచర్ ! 4 - 4 = 0. అనే ఎందుకు అనుకోవాలి ?

3 అనో 5 అనో ఎందుకు అనుకోకూడదండీ ? అని అడగగా..


టీచర్ వారికి వివరంగా చెప్పాలనుకొని...........
నది వద్ద చిన్న గుంత త్రవ్వి పిల్లల దగ్గరున్న నీళ్ళ సీసాల్లోని నీటిని ఆ గుంతలో పోశారు..
అలా 4 సీసాల లోని నీరు ఆ గోతిలో పోసారు.

ఇప్పుడు టీచర్ ఆ గోతిలోని నీటిని మరల సీసాల్లోకి నింపమని పిల్లలతో చెప్పగా .......
పిల్లలు సీసా మూతలతో నీటిని తోడి సీసాల్లో నింపారు. అలా 4 సీసాలు నీటితో నిండిపోయాయి.
గోతిలో పోసిన 4 సీసాలలోని నీటిని ........తిరిగి 4 సీసాల్లోనూ నింపితే గోతిలో నీరు ఉండదు కాబట్టి ..... 4 - 4 = 0. అని చెప్పాలని టీచర్ ఉద్దేశ్యం.
చిత్రమేమిటంటే ఆ గోతిలో ఇంకా నీళ్ళున్నాయి.
సుమారుగా ఇంకో మూడు సీసాలకు సరిపడా నీళ్ళు కనిపిస్తున్నాయి. ( వాళ్ళు త్రవ్విన గోతిలోకి అడుగునుంచి నీరు ఊరాయన్నమాట. )
అది చూసిన పిల్లలు అడిగారు......
టీచర్ ! 4 - 4 = 0 అని చెప్పారు కదా ! ................ చూస్తుంటే 4 - 4 = 3 లేక ఇంకా ఎక్కువే జవాబుగా అనుకోవచ్చు అనిపిస్తోందండి. .............. 4 - 4 = 0 కాదాండీ ?....... అని అడిగారు.
అప్పుడు టీచర్ గంభీరంగా ఇచ్చిన జవాబు........ కొన్నిసార్లు 4 - 4 = 0 కాకపోవచ్చు ...........................


ఇందుమూలంగా నేను చెప్పదల్చుకున్నదేమంటేనండి..........
ఒక ఐసు గడ్డ అంత త్వరగా కరగక పోయినా, చెలమ నుంచి నీరు అప్పుడే ఊరకపోయినా లెక్కలు వేరేవిధంగా ఉండేవి. అనుకోనివిధంగా లెక్కలను ( పరిస్థితులను ) మార్చటంలో దైవానికి సాటి ఎవరూ ఉండరు.
దైవం తలుచుకుంటే ఏదయినా సాధ్యమే అని. ........భౌతిక శాస్త్రం లెక్కలు వేరు.

( ఆధ్యాత్మిక ) యోగ శాస్త్రం లెక్కలు వేరు అని. .ఈ విషయం చెప్పటానికి ఇక్కడ
గణితశాస్త్రం యొక్క సహాయాన్ని తీసుకున్నాను. అంతేనండి.. నేను గణితంలో చాలా వీక్ .

వ్రాసినదానిలో తప్పులుంటే పెద్దమనసు చేసి క్షమించెయ్యమని ప్రార్ధిస్తున్నానండి...
Friday, January 20, 2012

అశ్వమేధ యాగాన్ని గురించి .......మరి కొన్ని విషయాలు.


* శ్రీ దేవీభాగవతము గ్రంధములో .... వరాహస్వామి అవతార సందర్భంలో ...... సర్వకళ్యాణకారకమైన భూదేవీ స్తవం గురించి ఉందండి.


ఈ స్తోత్రాన్ని పఠించిన వారికి కలిగే ఫలాలను గురించి చెబుతూ అందులో .......ఈ స్తోత్రాన్ని పఠించిన వారికి......అశ్వమేధాలు నూరు చేసిన పుణ్యఫలం లభిస్తుంది . అని కూడా చెప్పారండి.


అంటే...ఈ స్తోత్రాన్ని పఠిస్తే చాలు....నూరు అశ్వమేధాలు చేసిన ఫలం లభిస్తుందని పెద్దలే చెప్పటం జరిగింది.


* పెద్దలు ...సూక్ష్మంలో మోక్షంలా.... ఇలా ఎన్నో ఉపాయాలను కూడా మనకు అందించారు.


* శ్రీ శని దేవుని మహిమలు ............ఈ ప్రోగ్రాం మా... చానల్లో సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 6 గంటలకు వస్తోంది. ఈ ప్రోగ్రాంలో పురాణేతిహాసాలలోని ఎన్నో విషయాలను చక్కగా తెలియజేస్తున్నారు..


వెయ్యి
అశ్వమేధ యాగాలు చేస్తే ఎటువంటి ఫలం దక్కుతుందో అంతకంటే ఎక్కువ ఫలాన్ని సత్యనిష్ఠ ఇస్తుంది ........అని పండితులు చెబుతున్నారు. సామాన్యులు ఈ విధంగా పుణ్యాన్ని పొందవచ్చు.


హరిశ్చంద్రుడు, శ్రీరామచంద్రుడు, వంటి గొప్పవారు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా సహించి .... సత్యం యొక్క గొప్పతనాన్ని లోకానికి తెలియజేశారు.

.....................................................

అశ్వమేధ యాగాన్ని గురించి . తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం సార్ వివరించారు . ( ఇంతకు ముందు టపాలో వ్యాఖ్య )
....................................................


నాకు సంస్కృతం అసలేరాదు. కాబట్టి ఈ విషయాల గురించి అంతగా తెలియదండి. అయితే నాకు తెలిసినంతలో ఏమనిపిస్తుందంటే.........అశ్వమేధ యాగాన్ని పూర్వం కొందరు రాజులు తమ రాజ్యం సుభిక్షంగా ఉండాలని , ..........ఈ యాగాన్ని నిర్వహించిన రాజు అందరి రాజుల కన్నా ఉన్నతస్థాయికి చేరటం వల్ల రాజ్యానికి శత్రువుల తాకిడి ఉండదని ..... ఇలాంటి కోరికలతో కూడా ఈ యాగాన్ని నిర్వహించేవారట.సరే, కొందరు అంటున్నట్లు పట్టపురాణియే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అనుకుందాము. ........ అయితే ఈ ప్రక్రియలో అప్పటికే చంపబడిన గుర్రాన్నే ఉపయోగిస్తారట.

ఇవన్నీ చెప్పుకోవటానికి కొంచెం ఇబ్బందిగానే ఉన్నా........

*
ప్రాణం లేని గుర్రం ....ప్రాణంలేని వస్తువుతో సమానం కాబట్టి ....రాజ్యం కోసం తప్పనిసరి పరిస్థితిలో వారలా యాగాన్ని నిర్వహించేవారేమో.


* ఇంకా.... చనిపోయిన జంతువుల శరీరభాగాలను అనేక విధాలుగా ఉపయోగిస్తారు. కొందరు వాటి చర్మం వలిచి చెప్పులు
,బ్యాగులు తయారుచేస్తారు. కొందరు వాటి ఎముకలు వంటి శరీరభాగాలను పొడిచేసి ఔషధాలుగా తయారుచేసి మానవ శరీరభాగాలకు ఔషధంగా పూస్తారు.( వాడతారు.) మరి ఇవన్నీ తప్పులుగా భావిస్తున్నారా ?మరి ఈ రోజుల్లో చూస్తే, చాలామంది మాంసాహారం తినే వారు జంతువుల యొక్క * అన్ని రకాల శరీర భాగాలను వండి ఇష్టంగా భుజిస్తారు. మరి ఇది మాత్రం ఇబ్బందిగా అనిపించే విషయమేకదా ! ఒక రకంగా ఆలోచిస్తే ఇదీ అసహ్యంగానే అనిపిస్తుంది. కానీ ఇదంతా ఎవరూ మాట్లాడరు.ఇక అశ్వమేధ యాగంలో జంతుహింస
ఒక రకంగా ఆలోచిస్తే తప్పే .......

అయితే , ఈ రోజుల్లో మనం మాత్రం జంతుహింస చేయటం లేదా ? మాంసాహారుల కోసం రోజూ ఎన్ని వేల జీవులు చంపబడుతున్నాయో అందరికి తెలిసిందే.


ఇక పరిశోధనల పేరుతో ఎన్ని జీవులను సజీవంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారో ఈ మధ్య ఒక చానల్లో చూపించారు. పరిశోధనల కోసం మూగజీవులను ఎన్నో పరీక్షలకు గురి చేస్తారు. అవి బ్రతికుండగానే నరకాన్ని అనుభవించి ఇక బాధ భరించలేనప్పుడు చనిపోతాయి.


ఈ పరిశోధనలన్నీ మానవుల సుఖం కోసమే అంటారు....... ఇప్పటివాళ్ళు.

అశ్వమేధ యాగం రాజ్యంలోని ప్రజల సుఖం కోసమే అంటారు.... అప్పటివాళ్ళు.
ఎవరి వాదన వారిది.


* అయితే,అశ్వమేధం ఎప్పుడో తప్ప ఎక్కువసార్లు చెయ్యరు.


ఆ మధ్యన సముద్రంలో ఒక నౌకనుంచి ఆయిల్ ఒలికిపోయి ఆ నూనె తెట్టులో చిక్కుకుని ఎన్నో సముద్ర జీవులు కళ్ళలోకి ఆయిల్ వెళ్ళి కళ్ళు కనబడక గిలగిలలాడుతూ చనిపోవటం చూశాము.అంతేకాదు ఈ రోజుల్లో. పశువుల పాలు కూడా మనం పశువులకు హార్మోన్ ఇంజక్షన్స్ ఇచ్చి మరీ ఆఖరి బొట్టువరకూ పిండుతున్నాము . వాటి దూడలను కూడా పాలు త్రాగనివ్వకుండా మనమే త్రాగేస్తున్నాము.


ఇవన్నీ అన్యాయాలు కాదా ? మనుషులు రానురానూ మరీ స్వార్ధపరులైపోతున్నారు....

అశ్వమేధయాగం గురించి నేను టపా వ్రాయవలసివస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. పరిస్థితులు అలా వచ్చాయండి.


Wednesday, January 18, 2012

తెలుగు అంతగా తెలియని వాళ్ళు దయచేసి నెమ్మదిగా చదవమని ప్రార్ధిస్తూ....

అజ్ఞాత గారూ మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.


నేను కూడా ఒకప్పుడు మీలాగే ప్రాచీనగ్రంధాలలోని విషయాలను అపార్ధం చేసుకున్నాను. కానీ అలా అపార్ధం చేసుకున్నందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను.


ఈ అశ్వమేధ యాగం గురించి నేను కూడా విన్నాను. అయితే ఇది ఎంతవరకూ నిజమో మనకు తెలియదు. ఎన్నో తరాల క్రిందటి సంగతి కదా ! చాల విషయాలు ఒక తరం నుంచి ఇంకో తరానికి వచ్చేసరికి మనకు తెలియకుండానే కొన్ని విషయాలలో అసలు విషయం మారే అవకాశం కూడా ఉంది.


ఈ విషయంలో అంతరార్ధం మనకు సరిగ్గా తెలియదు.అయితే, ఈ విషయంలో కొందరు అనుకుంటున్నట్లుగా జరిగి ఉండకపోవచ్చు. ఈ విషయంలో కూడా ..... పెద్దల అభిప్రాయాన్ని మనం సరిగ్గా అర్ధం చేసుకోలేదు అనుకుంటున్నాను.పెద్దలు చెప్పే వాటిల్లో అనేక అంతరార్ధాలు ఉంటాయి అంటారు. ఉదా.. గుమ్మానికి పసుపు రాస్తే ఇంటికి లక్ష్మీ దేవి వస్తుంది అంటారు. అంటే గుమ్మం ఏర్పాటు చేసుకుని , గుమ్మానికి పసుపు రాయటం వల్ల బయటనుంచీ వచ్చే దుమ్మూధూళీ ఇంట్లోకి నేరుగా రావటం కొంచెం తగ్గుతుంది. పసుపుతో కూడిన గుమ్మం వల్ల బాక్టీరియా చచ్చిపోతుంది.


ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటే లక్ష్మీదేవి వచ్చినట్లే కదా ! మనమేమో ఇదంతా అర్ధం చేసుకోకుండా పసుపు రంగు గుమ్మాలకు వేసేసి పెద్దలదంతా చాదస్తం అనుకుంటాము.


తెలివితక్కువతనం మనదే కానీ పెద్దలది కాదు.ఇంకా ఎన్నో విషయాలు సమాజంలో అపార్ధాలకు గురి అయ్యాయి. ఉదా... సతీసహగమనం.


పూర్వీకుల వల్లే ఈ దురాచారం సమాజంలో వ్యాపించిందని పూర్వీకులని తప్పుపడతారు.


రామాయణంలో దశరధుని మరణం తరువాత కౌసల్యాదేవీ, సుమిత్రాదేవీ , కైకేయి సహగమనం చెయ్యలేదు కదా !


. భారతంలో ...... శంతనుని మరణం తరువాత సత్యవతీదేవి సహగమనం చెయ్యలేదు. తమ భర్త మరణం తరువాత అంబిక, అంబాలికలు సహగమనం చెయ్యలేదు కదా !


అంటే ఆ రోజుల్లో సతీసహగమనం తప్పనిసరి ఆచారంగా లేదని తెలుస్తోంది.


మాద్రిలాగ కొందరు స్త్రీలు ఇష్టపూర్వకంగా సహగమనం చేయటం చూసి ఇక తరువాతి తరాల వాళ్ళు ఇష్టపూర్వకంగా కొందరు, ఇతరుల బలవంతం వల్ల కొందరు అలా...అలా....సమాజంలో సతీసహగమనం ఒక మూఢాచారంగా పెరిగిపోయి ఉంటుంది.ఇలాగే చాలా ఆచారాలు పెద్దలు చెప్పిన దానిని అపార్ధం చేసుకుని తరువాతి తరాలవాళ్ళు మూఢాచారాలుగా చేసేసారు. అది పెద్దల తప్పు కాదు. ఇప్పటి వారి తప్పే.


శ్రీ కృష్ణునికి చాలా మంది భార్యలు అని ఎగతాళి చేస్తారు కొందరు. మరి పెద్దలే శ్రీకృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి అని కూడా చెప్పారు. మరి దీని గురించి మాత్రం ప్రచారం చెయ్యరు.


ఇలాంటి విషయాల గురించి ..... శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరిత్రము గ్రంధంలో వివరించారు. ఇంట్రస్ట్ ఉన్నవారు చదవవచ్చు. ఇలాంటి విషయాల్లో అనేక అంతరార్ధాలు ఉంటాయట.


పురాణేతిహాసాలలోని నాకు తోచిన విషయాల గురించి పాత టపాలలో వ్రాశానండి. ఒక టపా క్రింద ఇస్తున్నాను.తెలుగు అంతగా తెలియని వాళ్ళు దయచేసి నెమ్మదిగా చదివితే బాగా అర్ధం అవుతుంది.

........................


రామాయణం, భారతం ..........ముందే ఒక ప్రణాళిక ప్రకారం దైవం కధలు నడిపించారని పెద్దల ద్వారా తెలుసుకున్నాము.


భూమిపై పాపుల భారం తగ్గించుటకై భారతయుద్ధం జరిగిందని, రావణాసురుని వధ కొరకు రామావతరణం జరిగిందని పెద్దలు చెబుతారు.


రామాయణ, భారత కధలను దైవం ఇలా చాకచక్యంగా నడిపించటానికి ఎన్నో కారణాలున్నాయని అనిపిస్తుంది. ( అవన్నీ నాకు అంతగా తెలియవు . ) తోచినంతలో , ఇలా కూడా ఆలోచించవచ్చేమో అనిపించిందండి .........


భూమిపై దుష్టులను సంహరించాలంటే దైవానికి చిటికెలో పని.

దైవం తలచుకుంటే రామాయణంలో సీతాపహరణం .........భారతంలో కురుక్షేత్రం సంగ్రామం జరగవలసిన అవసరం లేదు.


శ్రీరామునికి, శ్రీ కృష్ణునికి కూడా దుష్టులను సంహరించటం పెద్ద పనేమీ కాదు.

రాజ్యవిస్తరణ మిషతో రాములవారు రావణాసురుని చంపవచ్చు.

శ్రీకృష్ణుడు కూడా యుద్ధం చేసి దుష్టులైన రాజులను చంపవచ్చు.

( పరశురాముడు ఒక్కరే ఎందరో క్షత్రియులను చంపటం జరిగింది కదా ! )

కానీ, రామాయణ, భారత కధలను దైవం ఇలా చాకచక్యంగా నడిపించటానికి ఎన్నో కారణాలున్నాయని అనిపిస్తుంది.

( అవన్నీ నాకు అంతగా తెలియవు . )

అయితే, ఇలా కూడా ఆలోచించవచ్చేమో అనిపించిందండి.......

కధలలోని పాత్రధారుల పూర్వ కర్మలు ఒక కారణం. , ఇంకా కధల ద్వారా, అందులోని వారి జీవితాల ద్వారా రాబోయే తరాలవాళ్ళు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.


విష్ణుమూర్తి భృగు మహర్షి శాపం వల్ల ఎన్నో అవతారాలు ధరించవలసి వచ్చింది . తద్వారా దుష్ట శిక్షణ జరిగింది కూడా. .


ఇంకా , విష్ణుమూర్తి సతీవియోగం అనుభవించాలన్నది కూడా ( కొంతకాలం ) భృగు మహర్షి శాపం.


ఇంకా, మనం కధల ద్వారా ఎన్నో వైజ్ఞానిక విషయాలు, మనస్తత్వాలకు సంబంధించిన విషయాలు, న్యాయశాస్త్ర సంబంధ విషయాలు కూడా తెలుసుకోవచ్చు.


ఎన్నో ఉపకధల ద్వారా మానవ జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఉదా.శకుంతల కధ.


తెలిసీతెలియని యుక్తవయసులో జాగ్రత్తగా ఉండాలని స్పష్టంగా పిల్లలకు చెప్పటానికి పెద్దలకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది.


శకుంతలా దుష్యంతుల వంటి కధల ద్వారా పిల్లలు ఇలాంటి విషయాలు తెలుసుకోవచ్చు. .

ఇవేకాక , కొన్ని ప్రత్యేకపరిస్థితుల్లో తప్ప , ఒకటి కన్నా ఎక్కువ వివాహాలు చేసుకోవటం వల్ల సుఖాల కన్నా కష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అనిపిస్తుంది.


ఉదా... రామాయణంలో కైకేయికి మంధర ప్రబోధం వల్ల రామాయణం ఒక పెద్ద మలుపు తిరిగింది.


భారతంలో సత్యవతీదేవి తండ్రి అయిన దాశరాజు కోరిన కోరికల వల్ల భీష్ముడు రాజ్యాధికారానికి , వివాహానికి దూరంగా ఉండటం భారతంలో ఒక పెద్ద మలుపు.

( శంతనుని భార్య గంగాదేవి ఆయనను వదలి వెళ్ళిన తరువాతే సత్యవతీదేవిని వివాహమాడటానికి నిశ్చయించుకున్నాకూడా .........)


.ఇక రామాయణంలో ........ సవతులంటే సుమిత్రాదేవి వంటి మంచి వారూ ఉంటారు. ( కానీ అరుదుగా ఉంటారు. )


లోకంలో మంధర వంటివారి మాటలు విన్న కైకేయి లాంటివారే ఎక్కువగా ఉంటారు.


ఇవన్నీ చూశాక నాకు అనిపించింది. ఒక వివాహంతోనే సంసారంలో ఎన్నో సాధకబాధకాలు ఉంటాయి.

మనలాంటి సామాన్యులు ఒక్క వివాహంతో సరిపెట్టుకుంటే చాలు.


బోలెడు పెళ్ళిళ్ళు చేసుకుని కొత్త సమస్యలు , కొత్త లంపటాలూ సృష్టించుకునేకన్నా , ఉన్న జీవితాన్ని తృప్తిగా గడిపితే చాలు అని కూడా కధల ద్వారా తెలుసుకోవచ్చు అనిపించింది.


మంచివారైనా, చెడ్డవారైనా , ఎవరికయినా తన జీవితభాగస్వామి ఇంకో వివాహాన్ని చేసుకోవటమనే విషయం అత్యంత బాధను కలిగిస్తుంది.


స్త్రీలకు సవతులు ఉండటం అనే విషయం వైధవ్యాన్ని మించి బాధను కలిగిస్తుందని హయగ్రీవుని చరిత్రలో చెప్పబడింది.

ఇంకా,


ధర్మరాజుకు జూదం ఆడటం వల్ల కష్టాలు వస్తాయని తెలుసు. ( వారు రాజ్యాన్ని కోల్పోయారు కదా !. )

దైవం నడిపించిన వీరి జీవితాల ద్వారా మనం ఏమి తెలుసుకోవచ్చంటే, ఉదా..........మనలో కొందరు ఉంటారు.

వాళ్ళకి అన్నీ మంచి అలవాట్లే ఉంటాయి. కానీ ఒక చిన్న చెడ్డ అలవాటు ఉంటుంది.


ఇక వారు ఏమనుకుంటారంటే ...........నాకు ఉన్నది ఒక్క చెడ్డ అలవాటే కదా ! దీనివల్ల నష్టమేమిటి ? అనుకుంటారు.

కానీ ఒక చిన్న చెడ్డ అలవాటు వల్ల కూడా ఎన్ని నష్టాలు జరగవచ్చో ధర్మరాజు పాత్ర ద్వారా తెలుసుకోవచ్చు.

తెలివి గలవాళ్ళు అలా తెలుసుకుని తమ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారు.

వితండవాదులు ధర్మరాజంతటివారే జూదం ఆడగాలేంది నేను ఆడితే తప్పేంటి ? అని జీవితాన్ని నష్టపోతారు.

ఎవరి తలరాతను బట్టి వారి బుద్ధి ఉంటుంది మరి. అంతా దైవం దయ.


ఇంకా,


(ఇక్కడ దేవలోకాలలోని దేవతల గురించి మాట్లాడటం లేదు. ఎందుకంటే, దేవతల ధర్మాలు వేరు. మానవుల ధర్మాలు వేరు. దేవతలకు మానవుల వంటి శరీరాలు ఉండవు. దేవతలకు సంబంధించిన విషయాల్లో పైకి కనిపించేవి కాకుండా అసలైన అంతరార్ధాలు ఎన్నో ఉంటాయని పెద్దలు చెబుతున్నారు. వారి శరీరాలు మనలా ఉండవు. అయితే, వారు ఎలాంటి రూపమైనా ధరించగలరు. వారు తమ శక్తితో ఎన్నో అద్భుతాలు చెయ్యగలరు. ఒక టపాలో చెప్పుకున్నాము.
వారి విషయాలను మానవసంబంధ దృష్టితో చూసి అపార్ధం చేసుకోవటం తెలివితక్కువతనం.

( ఇంతకుముందు చెప్పుకున్న విషయాల్లో చాలావరకూ భూమిపై మానవులుగా జన్మ ఎత్తినవారి గురించి చెప్పబడ్డాయి. )


ఇంకా,


శ్రీ కృష్ణుల వారు కూడా కొన్ని సాంసారిక కష్టాలను అనుభవించినట్లుగా లోకానికి కనిపిస్తుంది. ( శ్రీ కృష్ణుల వారు విష్ణుమూర్తి అంశావతారం. )


రుక్మిణీదేవికి సంతానం కలిగారు. కానీ జాంబవతికి చాలాకాలం వరకూ సంతానం కలగలేదు.


అందువల్ల తనకీ సంతానం కావాలని ఆమె కోరగా కృష్ణుడు శివుని గురించి తపస్సు చేస్తారు.


అప్పుడు పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమవుతారు.

అప్పుడు కృష్ణుడు వారితో తన కోరికను వెల్లడించి, తాను లౌకిక కోరికలతో తపస్సు చేసినందుకు బాధపడతారు.


పార్వతీపరమేశ్వరులు ఎన్నో వరాలను ప్రసాదించి ..

ఇంకా, యాదవుల ప్రవర్తన వల్ల ముని శాపం, తద్వారా చాలావరకూ యాదవ వంశ నాశనం, ఇంకా ఎన్నో విషయాలను చెప్పి అంతర్దానమవుతారు.


టపా వ్రాయటానికి బాగానే గాభరా పడ్డానండి.

సున్నితమైన విషయాలు ఉన్నాయి కదా !

* దైవం దయవల్ల మాత్రం వ్రాయగలిగానండి. ఎప్పుడయినా నేను వ్రాస్తున్న విషయాల్లో ఒప్పులను దైవం దయగానూ, తప్పులను నావి గానూ పాఠకులు గ్రహించవలసినదిగా కోరుతున్నాను.

ఇందులో పొరపాట్లు ఉన్నచో దైవం క్షమించాలని ప్రార్దిస్తున్నానండి..