koodali

Wednesday, January 25, 2012

రామాయణంలో శంభూక వధ.....న్యాయమా ? కాదా ? అని కొందరు......


కవిరాజు పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది ఆయన రాసిన శంభూక వధ నాటకం. ధర్మావతారుడుగా పూజలందుకునే రాముడు మహా తపస్సు చేస్తున్న శంభుకుణ్ని కేవలం శూద్రుడైన నేరానికి గాను నిస్సంకోచంగా
వధించాడనటం ఈ నాటకం ఇతివృత్తం..ఇలా..

కొంతకాలం క్రిందట తెలకపల్లి రవి గారి బ్లాగులో
శ్రీ రాముడు ..... శూద్రుడైన శంభుకుణ్ని వధించటం గురించి చదివాను.

నాకు ఈ కధ తెలియదు. అంతర్జాలంలో వెతికితే కనిపించింది.

* శ్రీ రాముల వారు అందరినీ గౌరవిస్తారు.

శబరి ఆప్యాయంగా ఇచ్చిన పండ్లను స్వీకరించారు . గుహుని తక్కువగా చూడలేదు. ఎంతో ఆప్యాయంగా చూశారు. జటాయువు యొక్క అంత్యక్రియలను నిర్వహించారు. అలాంటి రాములవారిని అపార్ధం చేసుకోవటం పొరపాటు.

ఇక రాముడు శంభూకుని సంహరించటం అంటే...నాకు ఏమనిపిస్తోందంటే..

శంభుకుడి వ్యక్తిత్వం మనకు తెలియదు. 

కొందరు మంచి కోరికలతో, ఉద్దేశ్యాలతో తపస్సులు చేస్తారు. కొందరు మనసులో స్వార్ధపరమైన కోరికలతో, ఉద్దేశ్యాలతో తపస్సులు చేస్తూ పైకి మంచిగా కనిపిస్తారు.

ప్రహ్లాదుని వంటివారు రాక్షస జాతికి చెందినా దైవ భక్తులై దైవానుగ్రహాన్ని పొందారు. . కానీ, కొందరు రాక్షసులు స్వర్గాన్ని , దేవతలను జయించాలని తపస్సులు చేసారు.

మరి, శంభుకుడు ఎందుకు తపస్సు మొదలుపెట్టాడో ఎవరికి తెలుసు ?


* బహుశా  శంభుకుడు  స్వార్ధపూరితమైన  చెడ్ద  కోరికలతో  తపస్సును  మొదలుపెట్టి ఉండవచ్చు....అందుకే రాముల వారు వధించి ఉంటారు.
******

రాముడు శూద్రులను చంపే వ్యక్తే అయితే,  శబరి తపస్సు చేసినప్పుడు చంపలేదు కదా! శబరి కూడా శూద్ర స్త్రీయే.

(తపస్సు అంటే  ఒంటికాలుమీద  నిలబడి తపస్సు చేయటం మాత్రమే కాదు, ఏ పనినైనా 
ఏకాగ్రతతో చేస్తే అది తపస్సే . ..

శబరి ఎన్నో ఏళ్లు రామునికై ఎదురుచూసింది అలా భక్తితో ఎదురుచూడటం కూడా తపస్సే. )

**************

 సనాతనధర్మం అంటరానితనాన్ని ప్రోత్సహించలేదు. సమాజంలోని కొందరు స్వార్ధపరులవల్ల అంటరానితనం వచ్చి ఉంటుంది.  

మతంగ ముని తండ్రి  దళితులని చదివాను. అయినా కూడా మతంగమునికి గొప్ప మునిగా పేరొచ్చింది.
 
ఈ క్రింది విషయాలను  గమనించగలరు.

* There is no caste-system in Vedas
agniveer.com

* Sabari's selfless service | Amruthakathalu#5 | Story of Sabari in Ramayana | Telugu stories - YouTube


............

 తపస్సులు చేస్తున్నంత మాత్రాన అందరూ మంచివారే ఉంటారా ? లోకాలను పీడించే వరాలను పొందటం కోసం రాక్షసులు కూడా తపస్సులు చేస్తారు . అంతమాత్రాన రాక్షసులు కూడా మంచివారు అయిపోతారా ? 

శంభూకుడు ఎటువంటివాడో ఎవరికి తెలుసు? 

 శూద్ర స్త్రీ అయిన శబరి అందించిన ఎంగిలిపండ్లను స్వీకరించిన రామునికి శూద్రులనే భేదభావం ఉండదు.
ఇంకా,

పూర్వీకులు ఎన్నో విషయాలను లోతుగా ఆలోచించి సమాజం సజావుగా సాగటానికి కొన్ని ఏర్పాట్లు చేశారు. సమాజంలో అభివృద్ధి ఉండాలని రకరకాలుగా వర్గీకరించారు.

కొందరికి ( బ్రాహ్మణులు ) దైవపూజ, విద్య మొదలైన బాధ్యతలను, కొందరికి ( క్షత్రియులు ) రక్షణ, పాలన మొదలైన బాధ్యతలను, కొందరికి ( వైశ్యులు ) వ్యాపారం మొదలైన బాధ్యతలను, కొందరికి ( శూద్రులు ) అన్ని విషయాలలోనూ అందరికీ తోడ్పాటును అందిస్తూ చేదుడువాడోడుగా ఉంటూ సమాజాభివృద్ధిలో పాలుపంచుకోవాలని...ఇలా నిర్ణయించారు. ( వ్యవసాయం విషయంలో నాకు అంతగా తెలియదు. )

ఇలా అందరూ ఎవరి పని వారు సక్రమంగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తేనే సమాజం చక్కగా ఉంటుందని వారు భావించారు.

ఎవరి ధర్మాన్ని వారు
నిర్వర్తించాలి.అలాగే శూద్రులు వారి ధర్మాన్ని వారు నిర్వర్తించాలి.

అలా కాకుండా శంభుకుని వంటి శూద్రులు తీవ్రమైన తపస్సులు మొదలైనవి చేస్తే ఆయనను చూసి మిగతా శూద్రులు అనుసరిస్తే .....

* అలా అందరూ ఎక్కువగా పూజలలో మునిగిపోతే సమాజంలో అభివృద్ధి కుంటుపడుతుంది అని వారి ఆలోచన కావచ్చు.

అలాగని పూర్వీకులు ఏ వర్గం వారినీ తక్కువగా చూడమని చెప్పలేదు. శూద్రులకు దైవానుగ్రహం అక్కరలేదని పెద్దలు చెప్పలేదు.

శూద్రులు పెద్దగా పూజలు చెయ్యకపోయినా వారు తమ ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తేనే చాలు....... దైవానుగ్రహాన్ని పొందగలరని ధర్మవ్యాధుని కధ ద్వారా చెప్పించారు.

* ధర్మవ్యాధుడు మాంసం అమ్మే వృత్తిలో ఉన్నా కూడా కౌశిక బ్రాహ్మణునికి ఎన్నో విషయాలను చెప్పటం జరిగింది.

* ఆదిశంకరులవారి జీవితంలో జరిగిన ఒక సంఘటన ద్వారా అంటరానితనం తప్పు.... అని చెప్పబడిందని అందరికీ తెలిసిన విషయమే.

సమాజంలో ఏ బాధ్యత తక్కువది కాదు. ప్రతి వృత్తి బాధ్యతలోనూ కష్టాలూ
ఉంటాయి. .....సుఖాలూ ఉంటాయి.

ప్రతివారూ పల్లకీ ఎక్కేవాళ్ళే అయితే ఇక పల్లకిని మోసేవారెవరు ?

అందరూ, బస్సు, విమానం ఎక్కి కూర్చునే వారే అయితే ..... వాటిని నడిపే వాళ్ళూ ,అవి రిపేరయితే బాగు చేసేవారు....యిలా
కూడా అవసరమే కదా !

ఇలా ఆలోచించి పూర్వులు సమాజంలో అందరికి అన్ని బాధ్యతలను అప్పగించారు.అని నాకు అనిపిస్తోంది.
సమాజంలో ఏ బాధ్యత తక్కువది కాదు. ప్రతి వృత్తి బాధ్యతలోనూ కష్టాలూ ఉంటాయి. ......సుఖాలూ ఉంటాయి.

ఉదా..బ్రాహ్మణులకు ఎన్నో నియమాలు, ఉపవాసములు , ఎక్కువగా పూజలు చేయటం ...ఇలా ఉంటాయి.




54 comments:

  1. అసలు శంభూక వధ మూలరామాయనంలో లేదు. అది ప్రక్షిప్తం

    ReplyDelete
    Replies
    1. సరైన విషయాన్ని తెలియజేసినందుకు కృతజ్ఞతలండి.

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
  2. మీ వాదన ఏదో కొంచెం తేడా గా ఉంది. జరిగిన దాన్ని సమర్థించబోయి ఇంకాస్త కాంప్లికేట్ చేసేలా ఉన్నారు .

    // శూద్రులు తాము తక్కువగా బాధపడకూడదని పెద్దలు వాల్మీకి మహర్షి చేత రామాయణం అంతటి మహాకావ్యాన్నే రచింపచేశారు .//

    ఏమిటీ ? శూద్రులు బాధపడకూడదని బీసీ కోటాలో వాల్మీకిని ఎన్నుకుని ఆయన చేత రచింపజేశారా ? అంతే కానీ వాల్మీకి మహర్షి స్వతహాగా రాయలేదా ? అన్యాయమండి ...దయచేసి ఇలా విషయమేదైనా సరే , దాన్ని సమర్థించేయాలని చూస్తే ఇలాంటి కొన్ని పొరపాట్లు దొర్లుతాయి , మన ఔచిత్యం మరింత దెబ్బతింటుంది , జాగ్రత్త వహించండి .

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. మరి అంటరాని తనం రాజ్యమేలు తుంటే ఒక్కదేవుడు రాలేదే, ఒకటా రెండా కొన్ని వందలసంవత్సారాలు ఎక్కడికి పోయారు.

      Delete
  3. waste of time!!! try to analyze better

    ReplyDelete
  4. వాల్మీకి మహర్షి "ప్రచేతసుడు" అనబడే ఋషి కుమారుడు. వారి పేరు ప్రాచేతసుడు.

    వేదవేద్యే పరే పుంసీ జాతే దశరథాత్మజే
    వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా

    బ్రాహ్మణుడై ఉండీ క్రౌర్యచిత్తంతో బోయవాళ్లలో కలిసిపోయాడు. తర్వాత ఇంకా దారుణమైన దొంగయ్యాడు. ఆ తర్వాత సప్తర్షి ఉపదేశంచేత ఋషి అయ్యాడు. అంతకు ముందు జన్మలో ఆయన పేరు "అగ్నిశర్మ" గా చెప్పబడిందని విన్నాను.

    అనేక పురాణాల్లో వీరిగురించి ప్రస్తావన ఉన్నట్లు విన్నాను. అవసరమైతే references సంపాదించటానికి ప్రయత్నిస్తాను.

    ReplyDelete
    Replies
    1. వ్యాఖ్యానించిన అందరికి కృతజ్ఞతలండి.

      వాల్మికి మహర్షి ...మహర్షిగా మారక ముందు జరిగిన విషయాల గురించి నేను సరిగ్గా వ్రాయలేకపోయాను.

      * జరిగిన పొరపాటుకి క్షమించండి... .

      ఇప్పుడు ఒక దగ్గర చదివితే వాల్మికి మహర్షి బ్రాహ్మణకులంలో జన్మించారనీ , వారు బాలునిగా ఉన్నప్పుడు అడవిలో వెళ్తుండగా తల్లిదండ్రుల నుండి తప్పిపోతే కొందరు బోయవాళ్ళు చేరదీసి పెంచటం జరిగిందని చదివానండి. . అందుకే టపాలో వ్రాసిన ఆ వాక్యాన్ని తీసివేస్తున్నానండి....

      Delete
  5. ఇప్పటికీ ఈ మొత్తం కంటెంట్ తోనే నేను విభేదిస్తూన్నాను ! మొట్టమొదట అనానిమస్ గా రాసింది నేనే . పేరు మహేష్.

    // శూద్రులు పెద్దగా పూజలు చెయ్యకపోయినా వారు తమ ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తేనే చాలు....... దైవానుగ్రహాన్ని పొందగలరని ధర్మవ్యాధుని కధ ద్వారా చెప్పించారు //

    అసలీ చెప్పించే బాధ్యత ఏమిటో ? అంటే ధర్మవ్యాధుడు అనేది కథేనా? నిజం కాదా ? నిజం ఐతే ' కథ ద్వారా చెప్పించడం ' అనే ప్రసక్తే రాదు . అది ఆల్రేడీ జరిగిపోయింది కాబట్టి .ఇక్కడ పెద్దలకు పాత్ర ఏమీ ఉండదు మరి .

    // ప్రతివారూ పల్లకీ ఎక్కేవాళ్ళే అయితే ఇక పల్లకిని మోసేవారెవరు ? // అసలు ఒకరు పల్లకీ ఎందుకు ఎక్కాలి ? ఇంకొకరు దాన్నెందుకు మోయాలి ? అలా అనుకోవడమే తప్పు - అందరూ కలిసి ' నడవాలి ' కదా !

    అది అలా పక్కన పెడితే శంబూకుని కథ క్షిప్తమో , నిక్షిప్తమో , ప్రక్షిప్తమో కానీ , అసలు ఆ కథనంటూ మీరు నమ్ముతున్నారా ? నమ్మితే రాముడు చేశాడు కాబట్టి ఏదో పాయింటు ఉండే ఉంటుంది అంటారా ? లేదు , రాముడలా చేసే వాడే కాదు , అలా చేశాడని ఎవరైనా చెప్పినా నేను నమ్మను అంటారా ? అది తేలకుండా ఏదో ఒకే పాయింటునే అటూ ఇటూ తిప్పి చెప్పడం వల్ల లాభం లేదు . ఇంతకి ఈ శంబూకుని కథ ఉత్తర రామాయణం లో ఉంది , లవకుశుల కథ ఉన్నది కూడా ఇందులోనే , ప్రక్షిప్తమని అన్నా ఎవరో ఒకరు దాన్ని చేర్చే ఉంటారుకదా , మనం ఆ కథ ని నమ్మి , దానికోసం ఎదోలా ఒకలా సమర్థిస్తూన్నామా , అసలు ఆ కథే అబద్ధం అందామా ...అది ఆలోచించి చెప్పండి

    ReplyDelete
    Replies
    1. ఏది ఏమైనా ఆనాటి కులవ్యవస్థను అన్ని వర్గాల వారూ ఆమోదించారు.. కాబట్టే ఎన్నో వేల సంవత్సరాలు ఎటువంటి గొడవలూ లేక అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆనందంగా జీవించారు..నేటి ఆధునిక యుగంలో సాంఘీక దురాచారంగా గ్రహించి అన్ని కులాల వారికీ సమానమైన హోదా ను కలిగించాలన్న భావము లోని తప్పు లేదు.. కాని ఒకరి నొకరు దూషించు కుంటనే తప్పు. ఏమి ఫలితం ఆశించి రాజ్యాంగ కర్తలు రిజర్వేషన్ విధానం అవీ కల్పించారో దాని వలన కులాల ప్రాతినిధ్యం, కులాల మధ్య అంతరంగాలు మరింత పెరిగాయే తప్ప తగ్గట్లేదు.. ఇంకా కొన్ని వందల ఏళ్ళైనా ఈ వ్యవస్థ లో మార్పు రాదు..అని అనిపిస్తోంది..

      Delete
    2. ఆ వ్యవస్థను అన్ని కులాల వారూ ఆమోదించారు , అందుకే సుఖం గా ఉన్నారు అని అనడం మసిపూసి మారేడు కాయ చేయడమే ! ఉత్తర రామాయణ కాలానికే ప్రక్షిప్తమైన ఆ శంబూకుడి కథలోనే తెలుస్తోంది , వ్యవస్థ కు ఎదురు తిరిగిన వారి సంగతి ఏమైందో , కనుక ఆమోదించారు అనేకన్నా , అన్ని కులాలవారూ నిర్బంధంగా ఆమోదించేలా చేశారు అనాలేమో . ఇంక ఈ గొడవ లోకి రిజర్వేషన్స్ లాగడం అనవసరం , చర్చ దారిమళ్లుతుంది . రాముడు శంబూకుడిని చంపాడా లేదా ... శంబూకుడు అనే ఒక కారెక్టర్ ఉందా లెదా , ఉంటే చంపడం కరెక్టేనా ? సమర్థిస్తారా ? అసలా కారెక్టరే లేకుంటే ( మీ మాటల ప్రకారం ప్రక్షిప్తం అనుకుంటే ) ఎవరు ప్రక్షిప్తం చేశారు ? ఎందుకు చేశారు ?...ఇలా చర్చ జరగడం సబబు .

      Delete
    3. శంభూక వధ అన్యాయం... అది నిజంగా జరిగి ఉంటే. అప్పుడు రాముడు నిందార్హుడు. కానీ, అది పూర్తిగా ప్రక్షిప్తం. ప్రక్షిప్తం చేసే పనికి పూనుకున్నది హిందువుల మధ్య చిచ్చు పెట్టాలనుకునే లుచ్ఛాలు.

      Delete
  6. ప్రాచేతసమహర్షులవారు బ్రహ్మదేవుని ఆదేశం మేరకు విరచించిన శ్రీమద్రామాయణం 6 కాండలే. ఉత్తరకాండ ప్రక్షిప్తం.

    ReplyDelete
    Replies
    1. ఉత్తర కాండ ప్రక్షిప్తమా కాదా అనేది పెద్ద ప్రశ్న కాదు , ఉత్తర కాండ లోని శంబూక వధ ప్రక్షిప్తమా కాదా అనేది పాయింటు . ఉత్తరకాండ మొత్తం ప్రక్షిప్తమైతే లవకుశుల కథ కూడా ఎగిరిపోతుంది , శంబూకవధ గురించేమంటారో అది చెప్పండి , లేకపోతే మీ వ్యాఖ్య వల్ల పెద్ద ప్రయొజనం ఏం లేదు .

      Delete
    2. ఇప్పటి రాజ్యాంగం లో కూడా సమాన న్యాయంగా అయే విధంగా రాయలేదే.. పోనీ అదైనా ఓ పదేళ్ళే అని స్పస్ఠంగా రాసినప్పుడు మరి ఎన్నేళ్ళయినా ఇంకా అలాగే కొనసాగుతోందే.. దాని మూలంగా ఎంతో కష్ఠ పడి చదివి, ఎన్నో మంచి మార్కులు, ర్యాంకులు వచ్చిన మేము అనాదిగా ఇలా వెనక బడిపోవటమైనా. ఇప్పటి దాన్ని గురించి మాట్లాడ కుండా ఎప్పుడో అసలు జరిగిందో లేదో అన్న పురాణ గాధల గురించి చర్చ అవసరమా.. ప్రతిభ అధారంగా వుద్యోగాలు, పదవులు రాకుండా, మన చేతిలో లేని జన్మ ని ఆధారంగా కులాన్ని నిర్ధేశించి దాని అధారంగా అన్ని హక్కులు, రాయితీలు పొందడం ఎంతవరకు సమంజసం..ఇప్పుడున్న సమాజంలో కుల, వర్ణ వివక్షకు గురైన వాళ్ళు ఎవరూ లేరు..తిరిగి అగ్ర కులాల వారినే ఎట్రాసిటీ కేస్ లో ఇరికిస్తామని బెదిరించి బ్లాక్ మైల్ చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగా వుంది..

      Delete
    3. వ్యాఖ్యానించిన అందరికి కృతజ్ఞతలండి.మహేష్ garu ,

      కధ ద్వారా చెప్పించారు ..అంటే కధ ద్వారా పెద్దలు మనకు తెలియజేశారు అని అర్ధం.

      ఇక అందరూ నడవటం అనేది ......ఒక జిల్లాకు ఒక కలెక్టరే ఉంటారు కానీ బోలెడుమంది ఉండరు కదండి. అలాగే దేశానికి ఒకరే రాజు ఉంటారు. ప్రజాస్వామ్యం అయినా ప్రధానమంత్రి నివాసంలో ఆయనే ఉంటారు కానీ, ప్రజలందరూ వెళ్ళి ప్రధాని బాధ్యతలను నిర్వహించరు కదా !

      ఇక శంభూకవధ అనేది నిజంగా జరిగిందా ? లేదా ? అనేది నాకు ఎలా తెలుస్తుందండి ? నేను మూల రామాయణం చదవలేదు. కానీ చదివిన పండితులు చెబుతున్నారు కదా !

      * శ్రీరాముడు ఏం చేసినా సరిగ్గానే చేస్తారని నేను గట్టిగా నమ్ముతాను. .

      Delete
    4. అక్కడే ఆగండి , అందుకె రిజర్వేషన్స్ గురించి వద్దు టాపిక్ మారుతుంది అన్నది , నేను ఒక బ్రాహ్మణుడినే , నాకేమి రిజర్వేషన్స్ లేవు , శంబూకుడి గురించి నిజానిజాలు తెలియాలి కాని , ఈ రామాయణం లో పిడకల వేట లాగా ....ఏం అడిగినా రిజర్వేషన్స్ ను లాక్కొస్తే ఇంక ఈ పోస్ట్ ఎందుకు ...వేస్ట్ ....రిజర్వేషన్స్ మీదే రాసేవారు కదా !

      Delete
  7. శంబూక వధ జరిగిందా లేదా అని మిమ్మల్ని అడగలేదండీ వ్యాసకర్త గారూ ! ఒకవేళ జరిగి ఉంటే మీ అభిప్రాయం ఏమిటీ అని మాత్రమే అడిగాను , అడిగిన తరువాత ఎలాగూ ఆన్సర్ చెప్పేశారు లెండి , రాముడు చేసింది సమర్థిస్తాను అని , అంటే శంబూక వధని . ఆపాటిదానికి ఈ నిక్షిప్త ప్రక్షిప్తాల గోల , ఈ ధర్మాధర్మ న్యాయవాదాలూ గట్రా ఎందుకూ ? చర్చా ఎందుకు? ఏం చేసినా న్యాయమే అని అంటానంటే సరిపోయింది , ఇంక మిగిలిందంతా ఉబుసుపోకᰕే .

    ReplyDelete
  8. Sudra caste of ancient India were happy and thus the system stayed for 2000 years at least!!

    How can you say this??? The Sudra caste was not allowed to learn SANSKRIT!! they can not write or express their feelings or experiences!! Its a fact! the facts would come out only if they had written any puranas or history from their point of view! such a thing is not there in history!

    Its useless to discuss what was written in the literature of one caste!! obviously they won't write that the Sudra's are suffering.

    Whatever the Sanskrit scripts available for us right now are entirely written by the other 3 castes, the first one in particular.

    Even if they say, a Sudra has written it....no way! it was written by somebody else and canvassed otherwise!! it's as clear as the day! what are you fighting against??

    ReplyDelete
  9. If Rama really existed and killed Shambhuka, then he is warning the Shudra's not to practice 'Tapas', If it was not so and the killing was just a fabrication by the story's author, then the "Auhor" is warning the Shudra's!
    Anyhow, the sum total is to tell the Shudra's what they should and should not! that can be called as oppressing!

    The caste system might have been more flexible when it was set up, but inevitably, it turned very rigid, and nobody can deny this!!
    Which simply infers that, whoever set it up, doesn't have any idea how its going to be if their system doesn't allow changes along with time. If they knew, then I doubt, they would have never set it up. there would have never been so many other religions preaching brotherhood and equality!

    ReplyDelete
    Replies
    1. దేవుళ్ళకి కూడా కాస్ట్ ఫీలింగ్ కట్టబెడ్తున్న వాళ్ళని ఏమి అంటాం?
      రాముడు, గుహుడు (పడవ నడిపే వాడు) మంచి మిత్రులు, శబరికి మించిన భక్తురాలు, జటాయువుని కంటే మిన్న అయిన ఆప్తుడు ఎవరున్నారు?
      అంత ఎందుకు ఒక చాకలి వాని మాటకు విలువిచ్చి సీతా దేవిని తిరిగి అడవులకి పంపలేదా? ప్రతీ ఒక్కరి పెళ్ళిళ్ళలోనూ తప్పని సరి ఘట్టం అరుంధతీ నక్షత్ర దర్శనం ? మరి ఆవిడ చరిత్ర ఒక్కసారి తెలుసుకోంది..
      అంత దాకా ఎందుకు.. ఇప్పటికీ తిరుమల లోని అగ్ర తాంబూలం ఎవరికి ? ఆ శ్రీనివాసుని మొట్టమొదట దర్శించేది ఎవరు? శ్రీనివాసుని కరుణా కటాక్షాలకు గురి అయిన భక్తుల చరిత్ర కూడా తెలుసుకోండి..
      వృత్తులని బట్టి కులాలగా ఏర్పడి, ఎవరి కుల వృత్తులని వారు కాపాడుకోసం ఆంక్షలు పెట్టుకున్నారు.. ఇప్పుడు కేవలం వైశ్యులే వ్యాపారం చేస్తున్నారా? మరి వాళ్ళకి పోటీగా అందరూ వ్యాపారాలు చేయడం వల్ల తర తరాలుగా వ్యాపారాన్నే వృత్తిగా నమ్ముకున్న వైశ్యులెందరో ఇప్పుడు నష్ట పోవట్లేదా.. ఇంకొక మాట మమ్మల్ని వేదాలు చదుకోనివ్వ లేదు అని నింద వేస్తున్నారు.. కాని వేదాలు చదువుకున్న బ్రాహ్మణులు కూడా సరి అయిన పోషణ, ఆదరణ లేక పేదలైన బ్రాహ్మణులు కూడా ఎంతో మంది వుండేవాళ్ళు..( ఆ కాలం లోనే).. ఏది ఏమైనా అందరూ సమాజ హితాన్నే కోరేవారు, ధర్మాన్ని పాటించే వారు... కుల, మత తేడాల్లేకుండా అందరూ సమానంగా బ్రిటిష్ వాళ్ళకి ఎదురొడ్డి ప్రాణాలర్పించారు..ఆస్ఠులని కోల్పోయారు.. కాని కేవలం కొన్ని వర్గాల వారికే ప్రాముఖ్యత కల్పిస్తూ రాయితీలు, కుల ప్రాతిపదికగా కేటాయింపులు జరగడం, ఇంకా కొనసాగించడం ఎంతవరకు సమంజసం? అదీకూడా రాజ్యాంగంలో రాసిన నిభంధనలకు వ్యతిరేకంగా..

      Delete
    2. // అంత ఎందుకు ఒక చాకలి వాని మాటకు విలువిచ్చి సీతా దేవిని తిరిగి అడవులకి పంపలేదా? //

      అది ఉత్తర రామాయణ కథ. శంబూకవధ ప్రస్తావన వచ్చినప్పుడేమో ప్రక్షిప్తమంటారు . మరి అవసరార్థం అదే కథలోని చాకలి వాడు , వాడి మాటకు విలువివ్వడం గురించి చెబుతారు . సో ఇప్పుడు చెప్పండి - రిజర్వేషన్స్ గురించి మళ్ళీ తీరిగ్గా మాట్లాడుకుందాం కానీ , శంబూకవధ న్యాయమా , అన్యాయమా, న్యాయమైతే ఎందుకు ? సమర్థిస్తారా , విమర్శిస్త్రారా ? పోస్ట్ అసలు ఉద్దేశం గమనించండి మహాప్రభో !

      Delete
    3. // ఏది ఏమైనా ఆనాటి కులవ్యవస్థను అన్ని వర్గాల వారూ ఆమోదించారు.. కాబట్టే ఎన్నో వేల సంవత్సరాలు ఎటువంటి గొడవలూ లేక అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆనందంగా జీవించారు.. // వోలేటి గారి ఈ వాదన ఎంత అసమంజసం గా ఉందంటే , ఒకవేళ ప్రస్తుతం కొనసాగుతోన్న ఈ రిజర్వేషన్స్ వ్యవస్థ , కొన్ని శతాబ్దాలపాటు ఇలాగే కొనసాగితే , అప్పుడెవరైనా రిజర్వేషన్స్ అనుకూలుడైన వ్యక్తి - " ఏది ఏమైనా ఆనాటి రిజర్వేషన్స్ వ్యవస్థను అన్ని వర్గాల వారూ ఆమోదించారు ... కాబట్టే ఎన్నో వేల సంవత్సరాలు ఎటువంటి గొడవలూ లేక అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆనందంగా జీవించారు " అని వ్రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంది .

      ఇక్కడ మనం ( నేను కూడా రిజర్వేషన్స్ బాధితుడినే కాబట్టి , పుట్టుకతో వాటికి అర్హుడిని కాదు కాబట్టి ) , రిజర్వేషన్స్ కి ఎంత వ్యతిరేకమైనా , నేటి రాజ్యవ్యవస్థ మనం దాన్ని ఆమోదించేలా చేస్తూ ఉంది . ఆమోదించి తీరాలి , వేరే మార్గం లేదు . ఆనాటి వ్యవస్థ కూడా అంతే , వర్ణవ్యవస్థ ను ఆమోదించి తీరాలి వేరే మార్గం లేదు ఆనాటి వర్గాలకు - ఇప్పుడు మనకు వేరే దారి లేనట్టే , అని అనుకోలేకపోవడమే వారి వాదన లో ఉన్న డొల్లతనం !!!

      Delete
    4. శంభూక వధ అన్యాయం... అది నిజంగా జరిగి ఉంటే. అప్పుడు రాముడు నిందార్హుడు. కానీ, అది పూర్తిగా ప్రక్షిప్తం. ప్రక్షిప్తం చేసే పనికి పూనుకున్నది హిందువుల మధ్య చిచ్చు పెట్టాలనుకునే లుచ్ఛాలు.

      Delete
    5. మహేశా ఎక్కడున్నావు.. సమాధానం చెప్పాను, రిప్లై ఇవ్వు

      Delete
  10. ఉత్తర కాండ ప్రక్షిప్తమా కాదా అనేది పెద్ద ప్రశ్న కాదు , ఉత్తర కాండ లోని శంబూక వధ ప్రక్షిప్తమా కాదా అనేది పాయింటు .

    If B is proper subset of A, A contains all elements of B. If A is prakshiptam, then all elements of A, including elements of B are prakshiptam. What is point you are talking about? So, it is sufficient to say that your arguement doesn't make sense.

    ReplyDelete
    Replies
    1. I don't know what is ur qualification , that made u to judge my argument ( correct the spelling of 'argument 'in ur statement first ) but what i was saying there was if A might be genuine but some times B , which is fictional could have been incorporated into A or sometimes B might be genuine and since it was incorporated in a fictional A . So there's a lot of sense in my argument , if u could understand in a proper manner .
      Anyhow , leaving it apart , do u justify ' sambooka vadha ' if at all that had taken place , or not? confine to that and express ur views ! that's enough .

      Delete
    2. నా వాదన అసమంజసం అయితే,, మన సాంఘీక దురాచారాలైన "సతీ సహగమనం", "బాల్య వివాహ వ్యవస్థ" గురించే రాజా రామ్మోహన్ రాయ్ వంటి వారు పోరాడారు. (స్వతంత్ర పోరాట కాలాములో).. మొన్న మొన్న కందుకూరి వీరేశలింగం, గురజాడ లాంటి వారు కూడా "కన్యా శుల్కం" విధవా పునర్వివాహం" గురించే ప్రస్తావించారు గాని ఇంత భయంకరంగా వర్ణ వ్యవస్థ లో లొపాలు రాయలేదు.. అప్పటి సోషల్ రిఫార్మర్స్ కి కనబడని దురాచారం స్వతంత్రం వచ్చాక మాత్రమే కనిపించిందా.. అది కూడా బ్రిటీష్ వాళ్ళు చిచ్చు పెడితేనే.. భాయి భాయి అన్న హిందూ, ముస్లిం లను, పటిష్టమైన హిందూ కుల వ్యవస్థను విచ్చిన్నం చేసి, మనలో మనల్ని విడదీసి, ఇప్పుడు ఇలా కుల గజ్జి తో పొట్లాడుకునే విధంగా సమాజాన్ని తయారు చేయడం లో వాళ్ళు సఫలీకృతం అయ్యారు,.,

      Delete
    3. ముందు శంబూకవధ గురించి చెప్పిన తరువాత మీకు సమాధానం ఇస్తాను. శంబూకవధ గురించి తమ అభిప్రాయం ప్లీజ్ !

      Delete
    4. సీతమ్మను అడవులకు పంపించటం. .......భర్తగా సీతాదేవిని రక్షించుకున్నారు. ......రాజుగా ఒక చాకలివాని అభిప్రాయాన్ని ప్రజల అభిప్రాయంగా భావించి ... అలా చేయవలసి వచ్చింది.


      ఒక వ్యక్తి అలా అన్న తరువాత నెమ్మదిగా మిగిలిన ప్రజలలో కూడా ఆ ఆలోచనలు వచ్చే ప్రమాదముంది. పైకి అనకపోయినా.....అందుకే భవిష్యత్తులో దీనిపైన వాదోపవాదములు, అనవసర చర్చలు, అపార్ధములు రాకుండాను, ఒక్కోసారి కొంతమంది అవకాశవాదులు తమ చెడ్డపనులకు ఇలాంటి సంఘటనను తమకు అనుకూలంగా మలచుకుని అధర్మానికి పాల్పడకుండాను, ఇన్ని ఆలోచించి ప్రజల క్షేమం కొరకు సీతారాములు తమ జీవితాన్ని, సంతోషాలను త్యాగం చేశారు...

      .ప్రజలు ఎలా భావించినా అశ్వమేధ యాగం సందర్భంలో రాములవారు సీతాదేవి యొక్క బంగారు ప్రతిమను భార్యగా భావించటం ద్వారా .... ఎవరు ఎన్ని అన్నా తన భార్య సీతాదేవే .... అన్న విషయాన్ని లోకానికి తెలియజేశారు. దీనిని బట్టే సీతాదేవి గురించి శ్రీరామునికి గల గొప్ప అభిప్రాయం తెలుస్తుంది.


      రాములవారు సీతాదేవిని అడవులకు పంపించిన తరువాత తానురాజ్యాన్ని పాలించినా చాలా సాధారణ జీవితం గడుపుతూ సీతమ్మ వారి లాగే భోగాలు లేని సాధారణ జీవితాన్ని గడిపారు.


      లవకుశులను రామునికి అప్పగించిన తరువాత సీతాదేవి భూదేవిని ఆశ్రయించటం గురించి.......మళ్ళీ సీతాదేవి రాజ్యానికి తిరిగి వచ్చినా ఎవరైనా ఏమైనా అంటే సమస్య మొదటికొస్తుంది. అవన్నీ ఆలోచించి రాములవారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సీతాదేవి ఆ నిర్ణయం తీసుకుని ఉంటారు. ( అయితే సీతాదేవి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉంటే బాగుండేదని నాకు అనిపిస్తుంది. )

      తన ఇంటికి తాను రాలేని పరిస్థితి సీతమ్మది...తన భార్యను తాను పిలవలేని పరిస్థితి రామయ్యది. ధర్మం కోసం వారు అలా కష్టాలు అనుభవించారు.

      సీతారాములు ఆదర్శ దంపతులు.....

      Delete
    5. భర్తగా రాములవారు సీతాదేవిని ....లంక నుండి తీసుకువచ్చి రక్షించుకున్నారు. .....తరువాత ఒక రాజుగా చాకలివాని అభిప్రాయాన్ని ప్రజల అభిప్రాయంగా భావించి ... సీతాదేవిని అడవులకు పంపించవలసి వచ్చింది.


      ఒక వ్యక్తి అలా అన్న తరువాత నెమ్మదిగా మిగిలిన ప్రజలలో కూడా ఆ ఆలోచనలు వచ్చే ప్రమాదముంది. పైకి అనకపోయినా.....అందుకే భవిష్యత్తులో దీనిపైన వాదోపవాదములు, అనవసర చర్చలు, అపార్ధములు రాకుండాను, ఒక్కోసారి కొంతమంది అవకాశవాదులు తమ చెడ్డపనులకు ఇలాంటి సంఘటనను తమకు అనుకూలంగా మలచుకుని అధర్మానికి పాల్పడకుండాను, ఇన్ని ఆలోచించి ప్రజల క్షేమం కొరకు సీతారాములు తమ జీవితాన్ని, సంతోషాలను త్యాగం చేశారు...

      .ప్రజలు ఎలా భావించినా అశ్వమేధ యాగం సందర్భంలో రాములవారు సీతాదేవి యొక్క బంగారు ప్రతిమను భార్యగా భావించటం ద్వారా .... ఎవరు ఎన్ని అన్నా తన భార్య సీతాదేవే .... అన్న విషయాన్ని లోకానికి తెలియజేశారు. దీనిని బట్టే సీతాదేవి గురించి శ్రీరామునికి గల గొప్ప అభిప్రాయం తెలుస్తుంది.


      రాములవారు సీతాదేవిని అడవులకు పంపించిన తరువాత తానురాజ్యాన్ని పాలించినా చాలా సాధారణ జీవితం గడుపుతూ సీతమ్మ వారి లాగే భోగాలు లేని సాధారణ జీవితాన్ని గడిపారు.


      లవకుశులను రామునికి అప్పగించిన తరువాత సీతాదేవి భూదేవిని ఆశ్రయించటం గురించి.......మళ్ళీ సీతాదేవి రాజ్యానికి తిరిగి వచ్చినా ఎవరైనా ఏమైనా అంటే సమస్య మొదటికొస్తుంది. అవన్నీ ఆలోచించి రాములవారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సీతాదేవి ఆ నిర్ణయం తీసుకుని ఉంటారు. ( అయితే సీతాదేవి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉంటే బాగుండేదని నాకు అనిపిస్తుంది. )

      తన ఇంటికి తాను రాలేని పరిస్థితి సీతమ్మది...తన భార్యను తాను పిలవలేని పరిస్థితి రామయ్యది. ధర్మం కోసం వారు అలా కష్టాలు అనుభవించారు.

      సీతారాములు ఆదర్శ దంపతులు.....

      Delete
    6. శంభూక వధ గురించి టపాలో స్పష్టంగానే వ్రాసానండి.

      స్వార్ధపూరితమైన ఆలోచనలతో ఉన్న వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే.

      శంభూకుడు చెడ్ద కోరికలతో తపస్సు మొదలుపెట్టి ఉంటాడు. అందుకే అతనికి శిక్ష పడి ఉండవచ్చు.

      శబరి శూద్రవర్ణానికి చెందిన ఆమె అయినా రాములవారు ఆమెను గౌరవించారు.

      ఇవన్నీ టపాలో రాసినా కూడా శంభూకుని గురించి అభిప్రాయం చెప్పమని పదేపదే అడగటం ఏమిటి ?

      ***************
      ఉత్తరకాండ ప్రక్షిప్తమంటున్నారు.
      అలాంటప్పుడు సీతాదేవిని అడవులకు పంపటం, శంభూక వధ వంటివి కూడా ప్రక్షిప్తాలే అవుతాయి.

      Delete
    7. Chedda alochana ani telsukokunda ela champutaru meeru chusara

      Delete
    8. శంభూకుడూ చెడ్డ ఆలోచనతో తపస్సు చేస్తున్నాడని ఎలా నిర్ణయిస్తారు... అయితే మహా దేవుడు అయిన శ్రీ రామునికి తెలియదా చెప్పుడు మాటలు విని ఆలోచించే , విచారణ చేయకుండానే వధిస్తాడా....అదేనా ఆయన ధర్మం... అదేనా మీరు అనే రామరాజ్యం

      Delete
  11. voleti వీడ్ని చెప్పుతో కొడితే ఎవడికైనా అభ్యంతరమా?

    ReplyDelete
    Replies
    1. నిన్ను చెప్పుతో కొట్టేవాళ్లు లేరనుకుంటున్నావా?

      Delete
  12. Anonymous
    ilanti matalu tagavu. vadanaku vadanatone samadhanam cheppali kani ila anavaddu

    ReplyDelete
    Replies
    1. మాటలతో సమాధానం చెప్పలేకే .. చెప్పుతో...

      Delete
  13. ముందు చరిత్ర తెలుసుకో.. ఆ తర్వాత కామెంట్లు రాయండి.. రాక్షసులని ఎవరిని అంటారు..? అసలు రాముడి ఆ అధికారం ఎక్కడిది..? ఆరుద్ర హిందూనే కదా.. ఆయన రాసిన రాముడు బుద్ధుడు పుస్తకం చదువు.. రాముని గురించి తెలుస్తుంది.. చరిత్ర తెలియకుండా బ్లాగ్‌లు రాయడమేంటి..?

    ReplyDelete
  14. https://www.facebook.com/ravisankar.vipparla/posts/802751383207408

    ReplyDelete
  15. కులాలు పెద్ద నాటకాలు..మతాలు పెద్ద బూటకాలు..అర్ధం లేని పిట్టకథలకు ప్రాణం పోసిరూపంచేసి బహుజనులపై రుద్దిన అబద్దపు అవతారాలు..

    ReplyDelete
  16. ప్రఖ్యాత చరిత్రకారిణి రొమిలా థాపర్‌ చెప్పినట్టు చదివాను ఇంతకూ ఆవిడెవరు? ఆవిడగురించి నాలుగు మంచి విషయాలేమైనా చెప్పగలరు మహేష్ గారు

    ReplyDelete
  17. సుప్రీంలో స్వర్గప్రాప్తి ధర్మవిరుద్ధం

    ReplyDelete
  18. సశరీర స్వర్గప్రాప్తి ధర్మవిరుద్ధం

    ReplyDelete
  19. చాలా చెండలం గా ఆలోచించావ్.ఏ కులం వారు అయిన ఇప్పుడు నచ్చిన పని చేసుకోవచ్చు. నీకు నచ్చి నువ్వు డాక్టర్ కోర్స్ చదివితే నేను వచ్చి నిన్ను చంపాలా?ముందే నువ్వు డాక్టరు అయితే ప్రజలను ఇబ్బంది పెడతావ్ అని చదివే టైంలో చంపేయడం న్యాయమా?పనికి రాని కుల వ్యవస్థలో పనికిరాని రూల్స్ పెట్టి వాటిని పాటించాలి అని ఎందుకు చెప్పాలి.ఎవడికి నచ్చిన విధంగా వాడు నచ్చిన పని ఎవ్వరిని ఇబ్బంది పెట్టకపోగే చాలు.పనికిరాని వ్యవస్థ పాటించకూడదు.

    ReplyDelete
  20. This comment has been removed by the author.

    ReplyDelete
  21. శంభూకవధ న్యాయమే....
    ఇది నిజంగా జరిగినప్పటికీ వాల్మీకి రామాయణంలో లేదు.
    ఇది ప్రక్షిప్తం. అంతమాత్రాన జరగలేదని కాదు. భవభూతి అనే రచయిత 6వ శతాబ్దంలో ఉత్తర రామాయణంలో ఒక నాటకం జతచేశాడు. జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా రాసిన నాటకం. శంభుకుడు గొప్ప వైద్యుడు. శరీరం తో స్వర్గానికి వెళ్ళాలని తపస్సు చేస్తూండగా ఒక బ్రాహ్మణ బాలుడు ప్రాణాపాయ స్థితిలో అతని వద్దకు వెళ్ళగా శంభుకుడు నిర్లక్ష్యం చేసి ఆ బాలుడు చనిపోవడానికి కారణమౌతాడు. బాలుని తండ్రి ఫిర్యాదు మేరకు వైద్య వృత్తిలో ఉన్న వ్యక్తి వృత్తినే దైవంగా భావించాల్సింది పోయి తన స్వార్థం మాత్రమే ఆలోచించిన కారణంగా అతనికి మరణ శిక్షను విధించి అతనికి స్వర్గ ప్రాప్తి కలిగించాడు....
    పూర్తిగా తెలుసుకోకుండా మిడిమిడిజ్ఞానంతో ఆరోపణలు చెయ్యకండి

    ReplyDelete
  22. Mari rakshasulu tapasullu chesina appudu enduku champaledu ippudu shambukudini enduku champaru

    ReplyDelete
  23. This comment has been removed by the author.

    ReplyDelete
  24. రాక్షసులు తపస్సు చేసినా కూడా వారిని చంపలేదు. అలాంటప్పుడు మనుషులు తపస్సు చేస్తే చంపరు కదా..శంభూకుడిని చంపారంటే శంభూకుడు ఎంత చెడ్డవాడో తెలుస్తోంది. అతను వినాశకరమైన రీతిలో వరాలను పొందటానికి తపస్సు చేస్తుండవచ్చు. అందుకే చంపారు.

    చిత్రం ఏమిటంటే, కొందరు రాక్షసప్రవృత్తికలవారు కూడా తపస్సు చేసి.. దేవతలను జయించేలా వరాన్ని ఇమ్మని దేవతలనే అడిగి.. ఆ వరాలతో శక్తిని పొంది దేవతలను బాధించాలని అనుకుంటారు.

    శంభూకుడు తాను శరీరంతో స్వర్గానికి వెళ్లాలని, స్వర్గాన్ని జయించాలని తపస్సు చేస్తున్నట్లు చెప్పటం జరిగిందట. అలాంటప్పుడు చంపక ఏం చేస్తారు? చెడ్డవారు బ్రతికుంటే మరిన్ని పాపాలు చేసి తమ పాపాలను పెంచుకుంటారు..అలాంటి చెడ్డవారిని వధించటం వల్ల ఆ చెడ్డవారికి మంచి జరుగుతుంది..ఇంకా సమాజానికి కూడా మంచి జరుగుతుంది.

    **************
    ఎవ్వరివిషయంలోనైనా వాళ్ళు ఎవరికి జన్మించినా, వారి ప్రవర్తన ముఖ్యం. ప్రహ్లాదుడు రాక్షసవంశంలో జన్మించినా కూడా గొప్పవిష్ణుభక్తులయ్యారు.

    శ్రీరాములవారు తపస్వి అయిన శబరిని, గుహుడుని, విభీషణుడిని ఆదరించారు. పక్షి అయిన జటాయువుకు అంత్యక్రియలను నిర్వహించారు.

    శ్రీరాములవారు రావణాసురుడిని సంహరించారు. రావణుడి తండ్రి బ్రాహ్మణులు, తల్లి రాక్షసస్త్రీ...రావణుడు ఎందరో స్త్రీలను చెరపట్టటం జరిగింది. సీతాదేవిని బాధపెట్టాడు...అలాంటివ్యక్తిని చంపితే తప్పేమీలేదు. చంపకపోతేనే తప్పు.

    ఎంతటివారైనా సరే పాపాలు చేస్తే శిక్షలను పొందినట్లు గ్రంధాల ద్వారా తెలుస్తుంది.

    శ్రీకృష్ణుని వారసులు కొందరు, మహర్షితో అసత్యంతో కూడిన మాటలు మాట్లాడి శాపాన్ని పొందారు.అయినా శ్రీకృష్ణులవారు వారిని కాపాడలేదు.

    ************
    శ్రీకృష్ణుడు గురుదక్షిణగా తమ గురువుయొక్క పుత్రులను బ్రతికించి తెచ్చారు. పరీక్షిత్తుకు ప్రాణదానం చేసారు. అయితే, అభిమన్యుని కాపాడలేదు. వీటివెనుక ఎన్నో రహస్యాలుంటాయి. ఆ జీవుల గతకర్మలు వంటి ఎన్నో రహస్యాలు కూడా ఉంటాయి. ఏది ఎందుకు జరుగుతుందో..దైవానికి తెలుస్తాయి.

    ReplyDelete
  25. ఇంకో కోణం ఏమిటంటే, ఉత్తరకాండలో కొన్ని భాగాలు ప్రక్షిప్తం కావచ్చని కొందరి అభిప్రాయం. శంభూకునివధ కానీ, ఆ కధలో కొన్ని భాగాలు కానీ ప్రక్షిప్తం కావచ్చు. ప్రక్షిప్తాలు చేసినప్పుడు కొన్ని శ్లోకాలను మార్చి ఆ స్థానంలో వేరే శ్లోకాలను వ్రాసి, అదే సంఖ్యలో శ్లోకాల లెక్క సరిపోయే విధంగా మార్చివ్రాయటం చేసేవారు చేయగలరు.

    ***********
    నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, ఎవరైనా రాక్షసుడు శంభూకుని రూపంలో వచ్చి తపస్సు చేస్తుండవచ్చు. రాక్షసప్రవృత్తి గలవారికి సమాజం ప్రశాంతంగా ఉండటం ఇష్టం ఉండదు. ఎప్పుడూ గొడవలు, ఇతరులను చంపటం, యుద్ధాలు వంటివి చేయడాన్ని ఇష్టపడతారు.

    శంభూకుడు స్వర్గాన్ని జయించటానికి తపస్సు చేస్తూ మధ్యలో రాజ్యంలో పిల్లల్ని కొందరిని చంపాడేమో? ఇవన్నీ గమనించిన శ్రీ రాములవారు శంభూకుని చంపేసి ఉండవచ్చు. శంభూకుడు రాక్షసుడైనా కావచ్చు, రాక్షసప్రవృత్తి కల మనుషుడైనా కావచ్చు. ఏమో ఏదైనా అయ్యుండవచ్చు.

    వ్రాసినవాటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే, దయచేసి క్షమించమని దైవాన్ని కోరుకుంటున్నాను.

    ReplyDelete