koodali

Friday, January 27, 2012

రాములవారు కరుణించారు కానీ ఆగ్రహించలేదు.



ఈ రోజు టపా వ్రాయాలనుకోలేదండి. . కానీ, నిన్నటి టపా విషయంలో కొందరు బాధను వ్యక్తపరిచారు. అందుకే ఈ రోజు కూడా టపా వ్రాయవలసి వచ్చింది.

చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారం పూర్వీకుల జీవన విధానం గురించి నాకు అంతగా పాండిత్యం లేదండి.

నిన్నటి టపాలో నాకు తెలిసినంతలో వ్రాయటం జరిగింది. అంతే. అందులో పొరపాట్లు కూడా ఉండి ఉండవచ్చు.

సమాజం సజావుగా సాగటం కోసం పెద్దలు
చాతుర్వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేశారనిపిస్తుంది. పూర్వీకులు వర్ణాశ్రమ ధర్మాలను చక్కగా పాటించేవారు.

అయితే,... ఆ రోజుల్లో కూడా కొందరు ఇతర ధర్మాలను అవలంబించినట్లుగా తెలుస్తుంది. ఉదా...విశ్వామిత్రులవారు.

విశ్వామిత్రులవారు క్షత్రియులు . కానీ తరువాత కాలంలో వారు క్రమంగా
బ్రహ్మర్షిగా మారటం జరిగింది.

విశ్వామిత్రుని శ్రీ రాముల వారు గురువుగా గౌరవించారు కదా!

యుగ లక్షణాలను బట్టి కూడా మనుషుల తీరు మారుతుందని అంటారు. .ఈ రోజుల్లో చాలామంది అన్ని రకాల వృత్తులను స్వీకరిస్తున్నారు.

నాకు ఏమనిపిస్తుందంటే.......ఎవరైనా ధర్మబద్ధమయిన .ఏ ధర్మాన్ని అయినా సక్రమంగా నిర్వహిస్తున్నప్పుడు దైవానుగ్రహం తప్పక ఉంటుంది అనిపిస్తుంది.
..................

శబరి విషయంలో ....ఆమె కూడా తపస్సు చేస్తున్నట్లే ( తపస్విని ) అని అనుకోవచ్చు.

మరి శూద్ర కులానికి చెందిన శబరిని రాములవారు కరుణించారు కానీ ఆగ్రహించలేదు.

వ్రాసిన విషయంలో పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.




17 comments:

  1. మాజం సజావుగా సాగటం కోసం పెద్దలు చాతుర్వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేశారనిపిస్తుంది. పూర్వీకులు వర్ణాశ్రమ ధర్మాలను చక్కగా పాటించేవారు>>>>>>

    :ఎప్పుడు చూసి వచ్చారు? నిన్న రాత్రా??

    శబరి కూడా తపస్సు చేస్తున్నట్లే ( తపస్విని ) అని అనుకోవచ్చు.>>>>>

    :మీ ఇష్టానికి మీరు అనేసుకొంటారా?

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      నా ఇష్టానికి నేను అనుకోవటం లేదు. గ్రంధాలలో చదివిన విషయాలు , తెలిసిన వాళ్ళు చెబుతున్న దాన్ని బట్టే వ్రాశాను.

      తపస్సులలో చాలా రకాలుంటాయి. భగవద్గీతలో చెప్పారు కదా ! అలా చూస్తే శబరి చేసింది కూడా తపస్సే...

      Delete
    2. సరేనండి, నేను యజ్ఞం అని వ్రాసి ఉండవలసింది. తపస్సు అని వ్రాశాను . పొరపాటే. ఈ పొరపాటును దైవం క్షమించాలని ప్రార్ధిస్తున్నాను.

      భగవద్గీతలో ఏ విషయాన్ని నేను చెప్పాలనుకున్నానంటే..............జ్ఞానయోగంలో భగవానుడు అర్జునునితో చెప్పటం జరిగింది.

      ....కొందరు ద్రవ్యమును దానధర్మాది సద్విషయములందు వినియోగించుటయే యజ్ఞముగ గలవారును, కొందరు తపస్సే యజ్ఞముగగలవారును, కొందరు ( ప్రాణాయామాద్యష్టాంగ ) యోగమే యజ్ఞముగ గలవారు నయియున్నారు. వారందరున్ను ప్రయత్నశీలురును, ధృఢవ్రతములు కలవారునయి యొప్పుచున్నారు....ఇలా ఎన్నో రకమైన యజ్ఞములను భగవానుడు చెప్పటం జరిగింది.

      ఇవన్నీ గమనిస్తే, శబరి కూడా యజ్ఞం చేసినట్లే కదా ! నేను అనటం కాదు. శబరిని , తపస్వి అని వర్ణించారు కొందరు.

      అసలు ఈ విషయం ఎందుకు వచ్చిందంటే, శంభుకుని శూద్రుడు అన్న కారణంతో శ్రీ రాముడు వధించారు అని కదా ! హేతువాదులు అంటున్నారు. యజ్ఞమయినా తపస్సయినా శూద్రులు చేయటం ఇష్టం లేకే రాముడు సంహరించారు అన్నట్లుగా వారు అంటున్నారు.

      మరి శబరి మాతంగ ముని చెప్పినదాని ప్రకారం రాముని రాక కోసం , రామానుగ్రహం కోసం ఎదురు చూస్తూ గడపటం ఇదంతా ఒక రకమైన యజ్ఞమే.

      శూద్ర కులానికి చెందిన శబరిని కరుణించిన రాముడు శంభుకుని తపస్సు చేసినంత మాత్రాన్నే వధించటం ఎందుకు జరుగుతుంది ?

      శంభుకుని వధించటానికి కారణం కులం కాదు అన్నది ఇక్కడ గమనించాలి అన్నది అసలు విషయం..

      Delete
    3. శబరి గురించి ..... ఆమె తపస్వి ... అని అంతర్జాలంలో చదివానండి. .శారద కందుల అనే ఆమె ఈ విషయం గురించి ఎన్నో వివరాలు తెలియజేశారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు చదవవచ్చు..

      Delete
    4. This comment has been removed by the author.

      Delete
    5. మీరు రాస్తున్నవన్నీ కరెక్టే.. ఎవరో ఏదో అనినంత మాత్రాన మన అభిప్రాయాలు మార్చుకో నక్కర్లేదు... అడ్డగోలుగా వాదించే వాళ్ళను మనం పట్టించుకో నక్కర్లేదు..

      Delete
    6. మీరు రాస్తున్నవన్నీ కరెక్టే.. ఎవరో ఏదో అనినంత మాత్రాన మన అభిప్రాయాలు మార్చుకో నక్కర్లేదు... అడ్డగోలుగా వాదించే వాళ్ళను మనం పట్టించుకో నక్కర్లేదు..

      Delete
    7. మీరు రాస్తున్నవన్నీ కరెక్టే.. ఎవరో ఏదో అనినంత మాత్రాన మన అభిప్రాయాలు మార్చుకో నక్కర్లేదు... అడ్డగోలుగా వాదించే వాళ్ళను మనం పట్టించుకో నక్కర్లేదు..

      Delete
    8. నేను ఒక్క సారే ఎంటెర్ కొట్టాను.. కాని మూడు సార్లు పబ్లీష్ అయ్యింది.. ఇందులో నా తప్పేవీ లేదని మనవి..

      Delete
    9. ఫరవాలేదులెండి. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి..

      అంతర్జాలంలో రకరకాల అభిప్రాయాలు కనిపిస్తున్నాయి.

      women in epics అనే దగ్గర చూస్తే...... అందరు అనుకుంటున్నట్లే శబరి శూద్ర కులానికి చెందిన స్త్రీ అని వ్రాశారు.

      ఇవన్నీ చూస్తుంటే శంభుకుడు శూద్ర కులానికి చెందిన వ్యక్తేనా ? కాదా ? అని సందేహం వస్తోంది.

      రాక్షసులు కూడా తపస్సులు చేయటం, దేవతలు వరాలు ఇవ్వటం జరుగుతుంటుంది.

      అలాంటప్పుడు మానవులలో కొన్ని కులాల వాళ్ళు తపస్సులు చేయకూడదు అని ఉంటుందని నాకు అనిపించటం లేదండి....

      Delete
    10. List of Shudra Hindu saints అని అంతర్జాలంలో చూస్తే ఎందరో భక్తుల వివరాలు ఉన్నాయి. నందనార్ అనే శూద్ర భక్తుని దైవం కరుణించటం ....... ఇవన్నీ చూస్తే తపస్సులు చేయటం మాట ఎలా ఉన్నా దైవం దృష్టిలో అందరూ సమానులే అన్న విషయం అర్ధమవుతుంది.

      Delete
    11. మీకు దగ్గరలో రామకృష్ణ వారి మఠం వుంటే అక్కడ లైబ్రరీ లో దొరుకుతుంది ఓ పుస్తకం.. అందులో తక్కువ కులంలో పుట్టిన గొప్ప భక్తుల కథలు వుంటాయి.. (పుస్తకం పేరు మర్చిపోయాను)..

      Delete
  2. ఇక్కడ కులం సమస్య కాదు. అసలు కులాల ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు?
    నిష్కారణంగా చంపడం తప్పు(వాడు ఎవడైనా.. అంటే యే కులమైనా?).(మీరు విశ్లేషించినట్టు) వాడు చేయవలసిన పని చేయలేదని చంపడం ఎంతవరకూ న్యాయం?. పిల్లాడు హోమ్ వర్క్ చేయకుంటే మీరు చంపేస్తారా? పెళ్ళాం వంకాయ కూర చెయ్యలేదని పాతేస్తావా? ఏది ఏమైనా అక్కడ, తపస్సు చేయడంలో తప్పేముంది. ఈ రోజుల్లో కూడా కొన్ని గ్రామాలలో తక్కువ కులంలో పుట్టిన వారిని గుళ్ళకు రానివ్వడం లేదు. రాముడి(ఇలాంటి ) సంస్కృతి యుగాలుగా తక్కువ కులంలో పుట్టిన వారిని వేధిస్తూనే ఉంది.
    సమాజం సజావుగా సాగడం కోసం వర్ణాలను ఏర్పాటు చేసి వ్యవస్థను గబ్బు పట్టించిన మన పూర్వీకులకు చెప్పుతో కొట్టాలి. ఏం ? రాజైతే బట్టలు ఉతుక్కోకూడడా? వంట చేసుకోకూడదా? ముడ్డి కడుక్కోకూదడా? కొందరికి మాత్రమే మంచి హోదాలు ఎందుకు కల్పించారు. సామర్థ్యం , శక్తీ , నిబద్ధత గల వ్యక్తులకు పట్టం ఎందుకు గట్టలేదు.
    మీకు మీ ఫ్రెండుకు ఒకే అర్హత ఉండి ఒకే ఉద్యోగం వచ్చి, వాడికి ఆఫీసర్ పదవి ఇచ్చి మీకు ఆఫీస్ లో బాత్రూం ఊడ్చే ఉద్యోగం ఇస్తే కాలుతుందా? లేదా? సమాజం సజావుగా అంటూ చెత్త నాటకాలోకటి?
    ఒక్కసారి మీ ఊళ్ళో ఉండే కాలనీలు పరిశీలించండి. ప్రశాంత్ నగర్, జి.కే స్ట్రీట్, గాందీ బజార్ ...... కాకుండా S.T. కాలని, హరిజన వాడ లాంటివి ఊరికి అవతల ఉంటాయ్.
    సిగ్గులేకుండా వర్ణ వ్యవస్థను సమర్థించే టపాలోకటి.?

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      అన్ని విషయాల్లోనూ ఇదే ప్రాబ్లం. . ఎదుటి వారిని సరిగ్గా అర్ధం చేసుకోకపోవటం.

      కులాల ప్రస్తావన నేను తీసుకురాలేదండి. ఎవరో ఒకాయన...శంభుకుడు శూద్రులన్న కారణంతో రాముడు చంపేసారని వ్రాసారు.

      రాముడు ఎందుకు చంపారో ఎవరికి తెలుసు ? శంభుకుడి వ్యక్తిత్వం మనకు తెలియదు.

      ప్రహ్లాదుని వంటివారు రాక్షస జాతికి చెందినా దైవ భక్తులై దైవానుగ్రహాన్ని పొందారు. . కానీ కొందరు రాక్షసులు స్వర్గాన్ని , దేవతలను జయించాలని తపస్సులు చేసారు.

      మరి శంభుకుడు ఎందుకు తపస్సు మొదలుపెట్టాడో ఎవరికి తెలుసు ?

      రాముడు శూద్రులను చంపే వ్యక్తే అయితే శబరి తపస్సు చేసినప్పుడు చంపలేదు కదా ! శబరి కూడా శూద్ర స్త్రీయే.

      ఇదంతా చెప్పినా మళ్ళీ మీరు ఇలా అనటం ఏమిటి ?

      తపస్సు చేయడంలో తప్పేముంది. ఈ రోజుల్లో కూడా కొన్ని గ్రామాలలో తక్కువ కులంలో పుట్టిన వారిని గుళ్ళకు రానివ్వడం లేదు............


      నేను కూడా అన్నదిదే. ఎవరైనా తపస్సు చెయ్యవచ్చు అన్నాను. .

      తక్కువ కులంలో పుట్టిన వారిని గుళ్ళకు రానివ్వకపోవటం తప్పు అనే నేనూ అన్నాను. .

      అందుకే ఎందరో శూద్ర భక్తుల లిస్ట్ ఇచ్చాను. చూడలేదాండీ ? ఏ కులం వాళ్ళయినా దైవం దృష్టిలో అందరూ సమానులే అనే నేనూ అన్నాను. .


      ఇక చేయవలసిన పని చేయకపోతే చంపరు కానీ. దండిస్తారు. ఇంట్లో పిల్లలు చదవకపోతేనే చాలామంది తల్లిదండ్రులు. దెబ్బలు కొడతారు కదా !. ఆఫీసువాళ్ళయితే ఉద్యోగులు సరిగ్గా పనిచేయకపోతే ఉద్యోగం నుంచీ పీకేస్తారు. రాజు అయితే శిక్ష విధిస్తారు..

      Delete
    2. మీరు కొందరికే మంచి హోదాలు కల్పించారు అన్నారు. ఏ వృత్తిలో ఉండే కష్టాలు వారికున్నాయి.

      బ్రాహ్మణులకు ఎక్కువ భాగం పూజలు చేయటం , ఎన్నో నియమనిష్ఠలు , చెప్పారు. ( ఇవన్నీ పాటించటం చాలా కష్టం. ) వీరికి కుటుంబానికి సరిపడా సంపాదించుకోవటానికి కూడా సమయం చాలదు.

      అందుకే పూజలు, వ్రతాలు చేయించుకునేటప్పుడు బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వటాన్ని ఆచారంగా ఏర్పాటు చేసారు. కొందరు సంపన్నులు బోలెడు ఖర్చుపెట్టి పూజలు చేయించుకుని బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చే విషయంలో బేరాలాడతారు. అలా వచ్చిన కొద్ది చాలీచాలని డబ్బుతోనే జీవించే బ్రాహ్మణులెందరో ఉన్నారు.

      రాజులయితే ఎప్పుడు ఏ యుద్ధంలో మరణిస్తారో వారికే తెలియదు. వారి కుటుంబానికి ఎప్పుడూ శత్రు భయమూ, విషప్రయోగ భయాలే.

      శూద్రులకు సంఘంలో బ్రాహ్మణులకు, క్షత్రియులకు ఉన్నంత హోదా లేకపోయినా జీవితంలో స్వేచ్చ ఉంది.

      శూద్రులకు బ్రాహ్మణులకు లాగా నియమనిష్ఠలు పాటించనవసరం లేదు. క్షత్రియులకు లాగా యుద్ధాలు, శత్రుభయం ఉండదు. ( కొద్దిమంది సైనికులకు తప్ప ) ఇలా అన్ని వృత్తులలోనూ కష్టాలు, సుఖాలు ఉన్నాయి.

      శూద్రులకు అంటరానితనాన్ని పాటించే విషయాన్ని నేనూ తీవ్రంగా వ్యతిరేకిస్తాను. ఆదిశంకరుల జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి, రాముడు శూద్ర జాతికి చెందిన గుహుని, శబరిని ఆదరించిన సంగతి నిన్నటి టపాలో వ్రాయటం జరిగింది.....

      ఇవన్నీ చూస్తే అంటరానితనం విషయంలో పెద్దలు చెప్పినదాన్ని మనం సరిగ్గా అర్ధం చేసుకోలేదు అనిపిస్తుంది.....

      Delete
    3. కృతజ్ఞతలండి.
      అంతా దైవం దయ. వసంత పంచమి సందర్భంగా మీకు , మరియు అందరికి శుభాకాంక్షలండి.

      Delete