koodali

Tuesday, January 17, 2012

ఏది ప్రచురించవచ్చో ? ఏది ప్రచురించకూడదో ?



ఈ విషయం గురించి నేను గత కొంతకాలంగా వ్రాయాలనుకుంటున్నానండి. అయితే నాబ్లాగులో వేరే విషయాలు నడుస్తున్నందువల్ల ఈ విషయం వ్రాయలేకపోయాను.

ఏ విషయమంటే, ఈ మధ్యన ఆంధ్రజ్యోతిలో కొందరు తెలుగుబ్లాగరుల యొక్క రచనలను ప్రచురించారు కదా !


దీనిగురించి కొందరు బ్లాగర్లు ......ఒకసారి తమను సంప్రదించి అలా ప్రచురిస్తే బాగుండేదని అనుకోవటం కూడా జరిగింది.



ముందు అనుమతి తీసుకోకుండా ప్రచురించటం అనేది. రచయితల కోణం నుంచి చూస్తే సరిగ్గానే అనిపిస్తుంది. రచయితలు చెప్పేది వింటుంటే వారివాదనా సరైనదే అనిపిస్తుంది.

అయితే ఈ రోజుల్లో ఇతరుల రచనలలో అర్ధాలను వక్రీకరించటం , ఇంకా ఇతరుల రచనలను కాపీ కొట్టటం వంటివి జరుగుతున్నప్పుడు రచయితలకు కొన్ని సందేహాలు ఉండటం సహజమే.


అయితే , ఇదంతా చూసి నాకు చాలా సందేహాలు వచ్చాయి.

ఈ విషయం గురించి నాకు ఎందుకు సందేహాలు ? అంటే ....నేను కూడా కొన్నిసార్లు ఇతర బ్లాగులలోని కొన్ని విషయాలను (నా బ్లాగులో ప్రచురించటం జరిగింది కాబట్టి .

అయితే ఈ విషయం ... ఫలానా బ్లాగు లోనిది..... అని వ్రాసే ప్రచురించాను. అయినా కూడా .... వారు నన్ను కూడా తప్పుగా అర్ధం చేసుకున్నారేమో ? అనిపించింది.
అయితే, ఈ సంఘటన తరువాత నేను ఇతరుల బ్లాగుల పేర్లు వ్రాయలేదు..


అలా ప్రచురించేముందు వారి పర్మిషన్ తీసుకోవాలేమో ..అనుకున్నా ...కానీ ప్రతీసారీ ఇలా పర్మిషన్ అడగాలంటే కష్టం కదా! అదీకాక వారి బ్లాగు పేరు వ్రాశాను కదా అని ఊరుకున్నాను.

పై సంఘటన తరువాత ఏది ప్రచురించవచ్చో ? ఏది ప్రచురించకూడదో ? అర్ధం కావటం లేదు.

ఉదా... మిధునం కధ నాకు చాలా ఇష్టం. కధ ఏదైనా పత్రికలో చదివాననుకోండి. పత్రికలో చదివిన తరువాత కధలోని డైలాగులు తెలిసిన వారికి చెప్పాలనిపించి బ్లాగులో వ్రాయాలనుకున్నాననుకోండి. రచయిత లేక పత్రిక వారి అనుమతి లేనిదే కధలోని వాక్యాలు బ్లాగులో వ్రాయొచ్చో ? లేదో ? ఇలా అనేక సందేహాలు వస్తున్నాయి.


ఏంటో అంతా గందరగోళంగా ఉంది. ఏమైనా రోజుల్లో చాలా విషయాలు సంక్లిష్టంగానే మారిపోతున్నాయి .

.....................
చాలా బ్లాగులో చక్కటి విషయాలు ఉంటాయి. వాటిని అందరితో చెప్పాలనిపిస్తుంది. అయితే ఆ రచయితల భావాలకూ, హక్కులకు భంగం కలగని రీతిలో వాటిని ఇతరులకు చెప్పటం బాగుంటుందని నాకు అనిపించింది.

ఇంకో విషయం ఏమంటే, ప్రాచీన గ్రంధాల ద్వారా మనకు ఎన్నో విలువైన విషయాలను పూర్వీకులు అందించారు. పురాణేతిహాసాలలో ఒక్క అక్షరాన్ని తప్పుగా వ్రాసినా అర్ధం మారిపోయే పదాలు, వ్యాక్యాలు ఉంటాయని తెలిసినవారు చెబుతున్నారు.


అందుకని ప్రాచీన గ్రంధాలలోని విషయాలను ఇతరులకు చెప్పేటప్పుడు ఆ రచయితల భావాలకూ, గౌరవానికి భంగం కలగని రీతిలో వాటిని ఇతరులకు చెప్పటం బాగుంటుందని నాకు అనిపించింది.


ఈ రోజుల్లో కొందరు ప్రాచీన గ్రంధాలలోని విషయాలను అపార్ధం చేసుకుని వక్రీకరించించి చెబుతున్నారు. ఇది అన్యాయం. ప్రాచీన గ్రంధాలలో చాలా విషయాలలో పైకి ఒకరకంగా అర్ధం కనిపిస్తూ అంతరార్ధం వేరేగా ఉంటుందని పెద్దలు చెబుతున్నారు. ఆ రచనల్లోని అంతరార్ధం మనకు తెలియదు కాబట్టి వాటిని అపార్ధం చేసుకోవటం తప్పు..



నేను వ్రాసే విషయాలు చాలావరకు ..... పెద్దలు, పిన్నలు, పండితులు, పామరుల నుంచి తెలుసుకున్న విషయాలే. మాత్రం వ్రాస్తున్నాను అంటే అంత దైవం దయ.


దయచేసి టపాను అపార్ధం చేసుకోవద్దు. నన్ను తప్పుగా అర్ధం చేసుకున్నారేమో ?అని ఇలా వ్రాయటం జరిగింది. అంతేనండి..



4 comments:

  1. నా ద్రుష్టిలో ఒక బ్లాగు పోస్టును వేరే బ్లాగులో ప్రచురించడం తప్పేమీ కాదు, కనీసం ఆ బ్లాగు లింక్ ఇస్తే.
    ఎందుకంటే బ్లాగులనేవి మన మనసులో ఆలోచనలు,భావలు,అభిప్రాయాలు తెలుపుకోడానికి. ఒకవేళ అదే భావంగల విషయంతారస పడితే దాన్ని పంచుకోడానికి మనసు ఉబలాట పడడంలో తప్పు లేదు.. So go ahead

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      ఏది ఎంతవరకూ ప్రచురించవచ్చో ఏది ప్రచురించకూడదో ? అర్ధం కాక ఈ టపా రాశానండి.

      అయితే, నన్ను అపార్ధం చేసుకోవటానికి కావలసినంత విషయం ఉంది ఇందులో. .అందరి అభిప్రాయాలూ ఒకలా ఉండవు కదా !

      అయితే ప్రచురించేటప్పుడు .... మీరన్నట్లు ఆ బ్లాగు లింక్ ఇవ్వటం . బాగుంటుంది అనిపిస్తోంది.

      Delete
  2. ఈ రోజుల్లో కొందరు ప్రాచీన గ్రంధాలలోని విషయాలను అపార్ధం చేసుకుని వక్రీకరించించి చెబుతున్నారు. ఇది అన్యాయం. ప్రాచీన గ్రంధాలలో చాలా విషయాలలో పైకి ఒకరకంగా అర్ధం కనిపిస్తూ అంతరార్ధం వేరేగా ఉంటుందని పెద్దలు చెబుతున్నారు

    Yeah..while the Ashwamedha Yaga in the vedas asked the queen to imitate the copulation with the horse in yaga..and her colleague wives to chant obscene words.........these days people interpret it entirely something else....as if ...mind is like a horse, restless...etc,,,,then, why a wife came into the scene...if it is really so???...

    by seeing this kind of rituals only...world has a downgraded view on INDIA!!!! yeah...your own VEDAs!!!

    ReplyDelete
    Replies
    1. Friday, January 20, 2012
      అశ్వమేధ యాగాన్ని గురించి .......మరి కొన్ని విషయాలు.

      Delete