అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలండి.
ఈ క్రింద వ్రాసిన పాట..... సాయిబాబా మహాత్మ్యం చిత్రం లోని పాట .
ఈ పాటను రచించిన వారు ఆచార్య ఆత్రేయ గారు, పాడినవారు బాలసుబ్రహ్మణ్యం గారు. విజయచందర్ గారు, జెవి సోమయాజులు గారు, చంద్రమోహన్ గారు..మొదలైనవారు నటించారు.
చిత్రం : షిర్డి సాయిబాబా మహాత్మ్యం ( 1986 )
రచన : ఆచార్య ఆత్రేయ.
సంగీతం: ఇళయరాజా.
గానం: బాలసుబ్రహ్మణ్యం, బృందం.
సాకీ:
సాయి బాబా ....సాయిబాబా....
సాయినాధా....సాయిదేవా....
సత్యం నిత్యం నీవేకావా
పల్లవి :
నువ్వులేక అనాధలం
బ్రతుకంతా అయోమయం ..నువ్వు..
బాబా...ఓ....బాబా
ఇకనీ పరీక్షకు మేమాగలేము ..నువ్వు..
చరణం : 1
మాపాలి దైవమనీ మాదిక్కు నీవేననీ
కొలిచాము దినం దినం సాయి....
మా ఆర్తి చూస్తావని సాక్షాత్కరిస్తావని
వేచాము క్షణం క్షణం సాయి....
శ్రీరాముడైనా....శ్రీకృష్ణుడైనా....
ఏ దైవమైనా ....ఏ ధర్మమైనా ....
నీలోనేచూచాము సాయి....
రావా....బాబా....రావా....
రక్షా....రక్షా నీవేకదా మా బాబా .. నువ్వు..
చరణం : 2
మా ఏసు నీవేనని మా ప్రభువూ నీవేనని
ప్రార్ధనలు చేశామయా నిన్నే...
అల్లాగ వచ్చావని చల్లంగ చూస్తావని
చేశాము సలాం సలాం నీకే
గురునానకైనా ....గురుగోవిందైనా....
గురుద్వారమైనా...నీ ద్వారకేననీ
నీ భక్తులైనాము సాయి....రావా .. నువ్వు..
కృష్ణసాయి కృష్ణసాయి రామసాయి ( 2 )
అల్లాసాయి మౌలాసాయి ( 2 )
నానక్ సాయి గోవింద్ సాయి
ఏసు సాయి షిర్డి సాయి ఓం... నానక్ ..
సాయి సాయి బాబా సాయి.....
.............
మరికొన్ని విషయాలు..ఈ విషయాలను ఈ పోస్ట్ వ్రాసిన చాలాకాలం తర్వాత వ్రాసి పోస్ట్ చేయటం జరిగింది.
సమాజంలో రకరకాల మనస్తత్వాలవారుంటారు. కొందరు తమ మతంప్రకారం దైవాన్ని ప్రార్ధించుకుంటారు. కొందరు అనేకమతాలదేవతలను కూడా ప్రార్ధించుకుంటారు. కొందరు దైవాన్ని నమ్మని నాస్తికులుంటారు.
.....................
అసలు దత్తాత్రేయుల వారు, హనుమంతుల వారు ఉండగా..ఇంకా ఎందుకు బాధ...దత్తాత్రేయస్వామివారిని, ఆంజనేయస్వామివారిని పూజిస్తే సాయిబాబాను కూడా పూజించినట్లే.....అలా వద్దనుకుంటే సాయిబాబాను పూజించుకోవచ్చు.
సాయిరాం, సాయి కృష్ణ అని సాయిబాబాకు రామ, కృష్ణ పేర్లను కలిపి అంటున్నారు కదా.. శ్రీరాముని, శ్రీకృష్ణుని పూజిస్తే సాయిని కూడా పూజించినట్లే. దైవము ఒకే శక్తి.
...........................
హిందువులు చాలా నియమాలను పాటించగలిగిన వాళ్లు పాటించవచ్చు. అందరూ అలా పాటించాలి, లేకపోతే కష్టాలు మీదపడిపోతాయని చెప్పకూడదు. కలికాలంలో దైవస్మరణ..దైవనామస్మరణ చేసినా తరించుతారని ప్రాచీనులు తెలియజేసారు.
పూజ అంటే చాలా నియమాలు పాటించలేమో? అని భయపడకండి. ఎక్కువ నియమాలతో కాకుండా, సరళంగా కూడా హిందూదేవతలను పూజించుకోవచ్చు....చాలా నియమాలతో పూజించగలిగే వారు అలా పాటిస్తూ పూజించుకుంటారు.
ఎవరైనా కూడా, దైవము పట్ల ప్రేమతో చక్కగా పూజించుకుంటే మంచిది.
**********
వ్రాసిన విషయాలలో పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
oka link.....ప్రాచీనకాలంలో ప్రపంచంలో చాలావరకు ఒకే పోలికలున్న మ...
No comments:
Post a Comment