koodali

Thursday, January 12, 2012

ఈ పోస్ట్ నిన్నటి పోస్ట్ కు వచ్చిన కామెంట్ కు ...



రోజు వివేకానందుల వారి జయంతి. చిత్రమైన పరిస్థితిలో
వివేకానందుల వారి జయంతి అయిన ఈ రోజు నాకు టపా ప్రచురించే భాగ్యం కలిగింది. . అంతా దైవం దయ.
............................

అజ్ఞాత గారు మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

రైతుల ఆత్మహత్యలు, పేదల ఆకలిచావులు వీటిగురించి మీకన్నా నాకే ఎక్కువ బాధగా ఉంది అని నేను గట్టిగా చెప్పగలను. కావాలంటే నా పాత టపాలు చదవండి.

ఈ రోజుల్లోని టెక్నాలజీ చాలావరకూ పేదల సమస్యలు పరిష్కరించటం కన్నా ధనవంతులకు విలాసవస్తువులను తయారుచెయ్యటానికే ఎక్కువగా ఉపయోగపడుతోంది అని కూడా నా అభిప్రాయం.

దైవసంబంధమైన విషయాలలో కూడా నా అభిప్రాయాలను మీరు సరిగ్గా అర్ధం చేసుకోలేదు అనుకుంటున్నాను. దయచేసి మీరు నా అభిప్రాయాలను సరిగ్గా అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించండి.

టెక్నాలజీ వద్దని నేను అనటం లేదు. సహజవనరుల రీసైక్లింగ్ గురించి శాస్త్రవేత్తలకూ తెలుసు . అయినా సహజవనరులను పొదుపుగా వాడుకోవాలి అని శాస్త్రవేత్తలే చెబుతున్నారు.

   ఆధునికటెక్నాలజికి అవసరమైన కాపర్, నికెల్..వంటివి ఇప్పటికే తక్కువగా ఉన్నాయంటున్నారు.

.............
పట్టణాలు,పారిశ్రామిక వాడలు ఎక్కువగా ఉన్న దేశాలలో భూగర్భనీటివనరులను తోడివేయటం  ఎక్కువయిందని, ప్రపంచ ఆర్ధిక వృద్ధికి ఆలంబనగా ఉన్నది భూగర్భజలాలేనని, ఆ నీళ్ళే లేకపోతే పరిశ్రమలు మూతపడతాయి, అన్ని ప్రాంతాలూ నీటిఎద్దడితో విలవిలలాడతాయి.. విపరీతమైన వాడకం వల్ల పర్యావరణ సమస్యలు కూడా వస్తున్నాయి. దీనివల్ల సరస్సులు, నదులు కూడా ఎండిపోతాయని, పచ్చటి మైదానాలూ అంతరిస్తాయని.. శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారట.

మరికొన్ని విషయాలు ఈ లింక్ వద్ద చూడగలరు..

 ..మితిమీరిన పారిశ్రామీకరణవల్ల నిరుద్యోగం , ...

 

No comments:

Post a Comment