koodali

Wednesday, January 11, 2012

మీ భవితకు మీరే బాధ్యులు .



స్వామి వివేకానందుల వారు.. మీ భవితకు మీరే బాధ్యులు. అని చెప్పటం జరిగింది.

వివేకానందుల వారి జయంతి రేపు జాతీయ యువజన దినోత్సవం.

........................................................

ఈ రోజుల్లో సహజవనరులైన బొగ్గు, పెట్రో, సహజవాయువు వంటి ఇంధన వనరులు తరిగిపోవటం అనే సమస్య ఉందని అందరికి తెలిసిందే. అందువల్లే సౌరశక్తి వంటి వాటిని తక్కువఖర్చుతో పొందటానికి పరిశోధనలు జరుగుతున్నాయి.

ఇంకా సముద్రపు అలల నుండి కూడా విద్యుత్ ను పొందే విధానం గురించి కనుగొన్నట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటివి కనిపెట్టిన వారికి అభినందనలు.

ఇంకా భూకంపం వంటివి వచ్చినప్పుడు ఆ శిధిలాల్లో చిక్కుకున్న వారిని కనిపెట్టానికి ఒక పరికరాన్ని తయారు చేశారట కొందరు. ఇంకా అంధులకు చూపు తెప్పించటం కోసం కూడా పరిశోధనలు జరుగుతున్నాయట. ఇవన్నీ ఎంతో ఉపయోగపడే పరిశోధనలు. ఇలాంటివి కనుగొంటున్న శాస్త్రవేత్తలకు అభినందనలు.
..................................................

టెక్నాలజీని అతిగా కాకుండా అవసరమైనంత వరకూ ఉపయోగించుకుంటే మంచి జరుగుతుంది.
అంటే వాహనాలు అవసరమే కానీ, వాటి వాడకం విపరీతంగా పెరిగిపోయి బొగ్గు, పెట్రోలు వంటి వనరులు ,ఇంకా ఖనిజాలు తరిగిపోయేంతవరకు వాహనాల వాడకం అవసరం కాదు.

మనకు వస్తువులు అవసరమే..అయితే.. ఖనిజసంపద తరిగిపోయే స్థాయిలో..వస్తువుల వాడకం అవసరం కాదు.

ఖనిజాల కోసం అతిగా గనులను తవ్వటం వల్ల ఖనిజ సంపద ముందుతరాలకు లేకుండా పోవటం ఒక సమస్య అయితే...ఇలా తవ్వటం వల్ల భూమి డొల్ల అయ్యి భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

బాక్సైట్ వంటి కొన్ని ఖనిజాలు భూమిలో తేమను పట్టి ఉంచే గుణాన్ని కలిగి ఉంటాయట. వీటిని విచ్చలవిడిగా తవ్వితీయటం వల్ల భూమిలో జలధారలు ఇంకిపోతాయని తెలిసిన వారు అంటున్నారు.
 
 ఆధునికటెక్నాలజికి అవసరమైన కాపర్, నికెల్..వంటివి తక్కువగా ఉన్నాయంటున్నారు.

ఇంకా ఇప్పుడు చూస్తున్నాము కదా .. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ వంటివి బాగా పెరిగిపోవటం వల్ల ఎన్నో విపరీతమైన వాతావరణ మార్పులు వస్తున్నాయి. వచ్చే వేసవి ఎంతో వేడిగా ఉంటుందని చెబుతున్నారు.

........................

ప్రపంచంలో ఇప్పుడు అభివృద్ధి పేరుతో దేశాల మధ్య విపరీతమైన పోటీ జరుగుతోంది. ఇప్పుడు కొన్ని దేశాలు పోటీలో దూసుకుపోతున్నట్లుగా కనిపిస్తుంది. కానీ వారు ఇదే వేగంతో వస్తూత్పత్తి చేస్తూ పోతే ఈ దూసుకుపోవటం ఎంతవరకంటే..వారి దగ్గర ఖనిజసంపద వంటివి తరిగిపోయేవరకూ.. తరువాత?

౧ విచక్షణ, వివేకం, విలువలతో కూడిన జీవితం గడిపే కొందరు.. తాము కొద్దిగా తగ్గినా సరే ప్రపంచం బాగుండాలని భావిస్తారు . ఇలాంటివారు ప్రపంచ సుఖం కోసం తమ కోరికలను కొద్దిగా తగ్గించుకోవటానికి కూడా వెనకాడరు. ఇలాంటివారికి దైవానుగ్రహం లభిస్తుంది.

ప్రపంచం ఏమైపోయినా సరే, తమ సుఖమే ముఖ్యం అనుకుంటారు కొందరు. ఇలాంటివారికి దైవానుగ్రహం లభించదు.
...............................................

మనలో కొందరు ఏమనుకుంటారంటే , మంచివారికి కష్టాలు వస్తున్నాయి... అధర్మంగా ప్రవర్తించేవారికి సుఖాలు కలుగుతున్నాయి .....అనుకుంటారు.

సీతారాములు కష్టాలను అనుభవించారు .కానీ వారి సంతానం చక్కగా ఉండి భోగభాగ్యాలను అనుభవించారు.

మరి రావణాసురుడు కొంతకాలం భోగభాగ్యాలను అనుభవించినా .....తరువాత అతని వారసులు, బంధువులు కూడా చాలావరకూ నాశనం అయ్యారు.


పాండవులు కష్టాలను అనుభవించారు . యుద్ధంలో కొంతవరకూ సంతాన నష్టాన్ని కూడా పొందారు. కానీ తరువాత .. దైవకృప వల్ల వారి వారసత్వం మిగిలి భోగభాగ్యాలను అనుభవించారు.

మరి దుర్యోధనాదులు కొంతకాలం భోగభాగ్యాలను అనుభవించినా తరువాత.... వారి వారసులతో సహా యుద్ధంలో నాశనం అయ్యారు.

.....................................
ప్రపంచంలో అభివృద్ధి కోసం దేశాల మధ్య విపరీతమైన పోటీ జరుగుతోంది. ఆ పోటీలో మనమూ పాల్గొందాము.( తప్పదు కదా )

మరి ఈ పోటీలో మనం ఏ మార్గాన్ని ఎంచుకోవాలి ? విచక్షణ, వివేకం, విలువలతో కూడిన అభివృద్ధి మార్గాన్నా? లేక ....?

మనం ఏ మార్గాన్ని ఎంచుకోవాలనేది ఎవరిష్టం వారిది. మీ భవితకు మీరే బాధ్యులు అని వివేకానందులు
చెప్పటం జరిగింది.


2 comments:

  1. gravity defying telugu cinema lo ne jarugutundi...bayata kaadu..

    pandavulu....ramudu...etc... telugu cinema kova ke vastaayi..

    nijam maatladadaaamaaa??

    Unna khanijaalanu... metals noo recycle chese padhatulu scientist lu work out chestunnaru...... alaage power kooda recyclable sources nunchi techikovadaaniki...na na kashtaaaloo padutunnaru.....

    Ikkada ramudu...ravanudu help cheyyaru.puranaalu...vedaalu..gitaaaa????aaaaaaa????..reason and logic help chestundi!
    intuition kanna important rationale. intuition work ayye place lu vere unnay!!!

    meeru assalu worry avvaddu, salahalu assalu ivvoddu, evariki emi cheyyalo variki telusu.

    abhivrudhi kosam competition aaaaa???? India inka aa stage ki raledu sir!! ikkada inkaa akali chaavulooo, rythu chaavulooo unnai...okkasari aa pallelloki velli choodandi!!!!!

    maargaaanni already choose chesukunnaru sir.....go to america....get some dollars...and thats all!!!! or work for some foreign based company..and draw the money......this is today's youth line up.

    Do something to INDIA??? how?? is their first question!! can you explain it in your next blog???

    I mean...what an engineer shud do,a doctor...a lawyer....an arts person....????? CAN YOU?????
    Just shut up otherwise!

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్య గురించి నా అభిప్రాయం క్రొత్త టపాలో వ్రాశానండి.

      Delete