koodali

Wednesday, January 4, 2012

ఈ ప్రపంచం ఒక పద్దతి ప్రకారం దైవం చేత....



* మత్శ్యావతారం గురించిన ఒక కధలో.... ..ప్రళయానికి ముందు విష్ణుమూర్తి మత్శ్యావతారం ధరించి భూమిపై ఉన్న అన్ని జీవజాతులను కొన్నికొన్ని చొప్పున ఒక పడవలో దాచి ...... ఆ పడవను తాను సంరక్షించటం ,....... తిరిగి సృష్టి ఆరంభమయినప్పుడు అన్ని జీవజాతులను వృద్ధి చెందించటం ఇలా జరిగినట్లుగా చెబుతారు.


* నాకు తెలిసినంతలో బైబిల్ లో కూడా ఒక కధలో ..ప్రళయానికి ముందు దైవం భూమిపై ఉన్న అన్ని జీవజాతులను కొన్నికొన్ని చొప్పున ఒక పడవలో దాచి..... ఆ పడవను తాను సంరక్షించటం ,...... తిరిగి సృష్టి ఆరంభమయినప్పుడు అన్ని జీవజాతులను వృద్ధి చెందించటం ఇలా జరిగినట్లుగా చెప్పబడిందనుకుంటున్నాను.

...................................

ఈ ప్రపంచం ఒక పద్దతి ప్రకారం దైవం చేత సృష్టించబడింది. ఉదా.... మొక్కలు ఉన్నాయి. అవి విపరీతంగా పెరిగిపోకుండా వాటిని ఆహారంగా తీసుకునే కుందేలు, మేకలు వంటి శాకాహార జంతువులు సృష్టించబడ్డాయి అనిపిస్తుంది .


ఈ శాకాహార జంతువులు ఎక్కువగా పెరిగిపోయి మొక్కలను బాగా తినేస్తే మొక్కలు గణనీయంగా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. అందుకని ఈ జంతువులు విపరీతంగా పెరిగిపోకుండా వాటిని ఆహారంగా తీసుకునే మాంసాహార జంతువులు సృష్టించబడ్డాయి అనిపిస్తుంది.


పులి వంటి కొన్ని జీవులను పరిశీలిస్తే ......పులి పిల్లలకు జన్మ ఇచ్చాక వెంటనే తన పిల్లలను తానే చంపుతుంది అని ఒక దగ్గర చదివానండి, అలా చంపబడకుండా మిగిలిఉన్నవి జీవిస్తాయట.


లేకపొతే పులులవంటి బలమైనక్రూర జంతువుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతే మిగిలిన జీవులకు అపాయం కాబట్టి సృష్టిలో ఇలాంటి ఏర్పాటు జరిగిఉంటుంది అని కూడా చదివానండి.


యిలా ఏది ఎంతలో ఉండాలో అంతలో ఉండేలా దైవం ఏర్పాటు చేశారు.

ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది . మరి మొక్కలు వంటి జీవులు విపరీతంగా పెరిగితే తప్పేమిటని ? మొక్కలు విపరీతంగా గుబురుగా పెరిగిపోతే వాటికి ఆహారసమస్య ఎదురవుతుంది. అంటే, వాటికి నేలనుండి అందే పోషకాలు సరిపోవు.

ఉదా...మన ఇళ్ళలో కూడా మొక్కలు ఏపుగా పెరగాలంటే మొక్కకుమొక్కకు నడుమ కొంచెం దూరంగా నాటాలి.

ఇలా సృష్టిలో ఒక క్రమం ఉంది. మనుషుల్లో కూడా జనాభా విపరీతంగా పెరగకుండా ప్రకృతిలో ఏర్పాట్లు ఉన్నాయి.

ఇంకా నాకు ఏమనిపిస్తుందంటే ............

మొక్కలను , శాకాహార జంతువులను ఒకే సారి........ ఒకే నిష్పత్తిలో సృష్టించి ఉన్నట్లయితే , శాకాహార జంతువులు మొక్కలన్నింటినీ తినివెయ్యటం వల్ల....... మొక్కలు పూర్తిగా నశించి తరువాత ఆహారం దొరకక శాకాహార జంతువులూ అంతరిస్తాయి.


అందుకని ..... మొక్కలు, శాకాహార జీవులు, మాంసాహార జీవులు వీటన్నింటినీ ఒకే నిష్పత్తిలో కాకుండా మొక్కలను ఎక్కువగా,......... శాకాహార జీవులను కొంచెం తక్కువగా,..... మాంసాహార జీవులను వాటికన్నా తక్కువగా ఉండేట్లు చూస్తే జీవుల మధ్య సమతుల్యత చక్కగా ఉండి అన్ని జీవులూ చక్కగా జీవించగలవు అనిపిస్తుంది.


దీనివల్ల మనకేం తెలుస్తుందంటే , వివిధ జీవుల సంఖ్యలో పెరుగుదల.. ఒకే నిష్పత్తిలో కాకుండా వివిధ నిష్పత్తులలో ఉండాలి అని.

............................

.ఈ నాటి శాస్త్రవేత్తలు ప్రపంచంలోని అన్నిరకాల మొక్కల, జంతువుల బీజములను శీతలీకరణ చేసిన ఒక నేలమాళిగలో భద్రపరుస్తున్నారని ...అవి చాలాకాలం నిలువ ఉండేటట్లుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.
........................

* రోజు అంధులకు లిపిని కనిపెట్టిన లూయిస్ బ్రెయిల్ జయంతి . వారు ఈ లిపిని కనిపెట్టడం అంధులకు ఒక వరమని చెప్పుకోవాలి. లూయిస్ బ్రెయిలి ఎంతవరకు చదువుకున్నారో నాకు అంతగా తెలియదు. కానీ ఆయన చిన్నతనంలో ఒక ప్రమాదంలో చూపు కోల్పోయారట. తరువాత ఆయన అంధులకు లిపిని కనుగొన్నారట. ఇలాంటి మహానుభావులు ఎంతో గొప్పవారు.


5 comments:

  1. ఇందాక మా అమ్మాయి(8సం.)ని పడుకోబెడుతున్నపుడు, దేవుడిగురించి ప్రస్తావన వస్తే - తను అడిగింది...ఈ ప్రపంచాన్ని ఎవరు చేశారు(సృష్టించారు), మొదట పుట్టిన మనిషి ఎవరు, అసలు దేవుడిని ఎవరు చేశారు(సృష్టించారు) అని.

    దేవుడే ఇదంతా సృష్టించాడు అని చెప్పాను.

    తనను పడుకోబెట్టి కంప్యూటర్ ముందుకు వచ్చి బ్లాగులు చూస్తుంటే అదే టాపిక్ మీద మీరు రాసిన పోస్టు కనిపించడంతో ఆనందం వేసింది.

    ReplyDelete
  2. ఈ టపాలో మీరు చెప్పిన దానితో నూటికి నూరు పాళ్ళూ ఏకీభవిస్తున్నాను. ఒక సమతుల్యత అనేది ఉండాలి కచ్చితంగా! మొక్కలు ఏపుగా పెరగటానికి నడుమ కొంత దూరం అనేది తప్పనిసరి! లేకపోతే వాటిమధ్య పోరాటం జరిగి survival of the fittest మాత్రమే బ్రతుకుతుంది. మీరు చెప్పిన ఈ మొక్కలు, వాటిని తినే జంతువులూ సరయిన నిష్పత్తిలో ఉంటుంది అని మన శాస్త్రవేత్తలు కూడా చెప్పారు కదా! దీనినే వారి పరిభాషలో ecological pyramids, food chains and food webs మొదలయిన పేర్లతో చెప్తారు.

    ReplyDelete
  3. తేజస్వి గారూ, రసజ్ఞ గారూ మీ వ్యాఖ్యలకు కృతజ్ఞతలండి.

    ఏదో నాకు తెలిసినంతలో అభిప్రాయాలు చెప్పాలని ఇలా రాస్తున్నాను. కొందరైనా బ్లాగును చదువుతున్నందుకు నాకు సంతోషంగానే ఉంది.

    అయితే, బ్లాగుల్లోనూ, బయట కూడా ఎంతో విషయపరిజ్ఞానం ఉన్న మీ వంటి వారు ఎందరో ఉన్నారు. నాకు తెలిసిన విషయాలు తక్కువ. అందుకే ఎక్కడయినా పొరపాట్లు వస్తాయేమోనని జంకుగా కూడా ఉంది. ఈ మాత్రం రాస్తున్నానంటే అంతా దైవం దయేనండి...

    ReplyDelete
  4. తేజస్వి గారూ, జిజ్ఞాసతో చిన్నవయసులోనే చక్కటి ప్రశ్నలు అడుగుతున్న మీ అమ్మాయికి అభినందనలండి.

    ReplyDelete
  5. రసజ్ఞ గారూ, ఒక బ్లాగులో ....... దేవుడు అన్ని జీవజాతులను ఒకేసారి సృష్టించారా ? లేక ఒకదానితరువాత ఒకటిగా జీవజాతులను సృష్టించారా ? అనే విషయం గురించి చదివిన తరువాత ఇలా రాశానండి.
    కొందరు శాస్త్రవేత్తలేమో తమ పరిశోధనల ద్వారా జీవజాతులు ఒకదాని తరువాత ఒకటి సృష్టించబడ్డాయి అని చెబుతున్నారు కదా !.

    ప్రాచీన గ్రంధాలలో కూడా పాములు ముందు పక్షులు తరువాత జన్మించినట్లుగా ఉందని తెలిసిన వారు అంటున్నారు,

    దైవం అన్ని జీవులను ఎలా సృష్టించారన్నది సరిగ్గా తెలియదు కదా !

    .అలా రెండు విధాలుగా ఆలోచిస్తే.....

    1 .దేవుడు అన్ని జీవులను ఒకేసారి , ఒకే నిష్పత్తిలో కనుక సృష్టిస్తే .....వాటికి ఆహారం సరిపోక అవి నశించే ప్రమాదముంది కాబట్టి ...ఒకదాని తరువాత ఒకటిగా జీవజాతులను సృష్టించారేమో ? ( ఒకరకం జీవజాతి కొంచెం అభివృద్ధి అయ్యాక ఇంకో రకం జీవజాతి...అలాగ...)

    2. ఒకవేళ అన్ని జీవులనూ ఒకేసారి సృష్టిస్తే గనుక ...... పెద్దమొత్తంలో మొక్కలను, మొక్కలకన్నా తక్కువ నిష్పత్తిలో శాకాహార జంతువులను, ..... వాటికన్నా కొంచెం తక్కువగా మాంసాహార జంతువులను సృష్టించి ఉండవచ్చేమో ? ఇలా అనిపించిందండి.....

    ReplyDelete