koodali

Thursday, June 28, 2018

ఓం ..
శుభప్రదమైన 2018 సంవత్సరపు  శ్రీ అమర్ నాధ్ యాత్ర ప్రారంభమయింది. ..అందరికీ శుభాకాంక్షలు.Monday, June 25, 2018

కొన్ని విషయములు...మరియు ప్రధానాంశసంభవలైన ప్రకృతి కళారూపిణుల గురించి.....

* ఓం. శ్రీ ఆంజనేయస్వామివారికి ప్రణామములు. 

*బ్రహ్మ దేవుడు , నారదునితో పరమాత్మను గురించి చెప్పిన సందర్భంలో..ఈ విషయములు " శ్రీ దేవీ భాగవతము " గ్రంధము లోనివండి....*సర్వప్రాణికోటిలోనూ కనిపించే చైతన్యమే 
 ఆదిశక్తి-ఆదిపురుషుల తత్వం.అది తేజస్సు....
ఆ జంటలేని వస్తువు ఈ సంసారంలో లేదు.సర్వ ప్రాణికోటిలోనూ మిశ్రాభూతులై ఏకరూపులై అవ్యయులై నిర్గుణులై నిర్మలులై చిదాత్మలై ఉంటారు. పరాశక్తియే పరమాత్మ.పరమాత్మయే పరాశక్తి. ఏమీ భేదం లేదు. అంటూ ఎన్నో విషయాలను చెప్పటం జరిగింది.
....................................

  *  ప్రధానాంశసంభవలైన ప్రకృతి కళారూపిణుల గురించి నారాయణుడు నారదునితో చెప్పిన విషయాలు............


స్వాహాదేవి అగ్నికి ఇల్లాలు. ఆవిడ లేకుండా దేవతలు సైతం హవిర్దానాన్ని స్వీకరించరు.దక్షిణా దేవి యజ్ఞపత్ని
.


స్వధాదేవి పితృదేవతా పత్ని. ఈవిడను పూజించకుండా చేసిన పితృదానాలు నిష్ఫలమవుతాయి.స్వస్తి దేవి వాయుపత్ని. ఆదానప్రదానాలను సఫలం చేస్తుంది.


పుష్టిదేవి గణపతికి పత్ని. ఈవిడను అర్చించకపోతే స్త్రీపురుషులు క్షీణించిపోతారు.తుష్టిదేవి అనంత పత్ని. సకలదెవతలూ సకల లోకాలూ సంతుష్టి చెందేది ఈవిడ అనుగ్రహంతోనే.


సంపత్తిదేవి ఈనాశ పత్ని.
 ఈవిడ అనుగ్రహం లేకపోతే లోకాలన్నీ దారిద్ర్యంతో అలమటిస్తాయి. (( ఇలాగే ఉందండి . .) మరి ఈశాన పత్ని . సరైనదో . లేక ఈనాశ పత్ని. సరైనదో నాకు తెలియదండి. )
  

ధృతిదేవి కపిలపత్ని. ఈవిడను అర్చించకపోతే అధైర్యంతో వొణికిపోవాల్సివస్తుంది.


సతీదేవి సత్యపత్ని. ముక్తులు ఈవిడను అర్చిస్తారు. ఈవిడ ఆగ్రహిస్తే లోకం బంధుత్వరహితమై పోతుంది.దయాదేవి మోహ పత్ని.ప్రతిష్ఠాదేవి పుణ్య పత్ని. వీరి అనుగ్రహం లేకపోతే జగత్తు జీవన్మృతమై పోతుంది.కీర్తిదేవి సుకర్మ పత్ని. ఈవిడ కటాక్షం లేకపోతే జగత్తు యశోహీనమై పోతుంది.క్రియాదేవి ఉద్యోగపత్ని. ( ఉద్యోగం=ప్రయత్నం ) ఈవిడ అనుగ్రహం లేకపోతే లోకాలన్నీ విధిహీనాలై పోతాయి.
మిథ్యా దేవి అధర్మ పత్ని. ధూర్తులు ఈవిడను పూజిస్తారు. ఈవిడ అనుగ్రహిస్తే ( ఆగ్రహిస్తే ) విధి నిర్మితమైన సృష్టి అంతావిచ్ఛిన్నమవుతుంది. సత్యయుగంలో ఈవిడ కనిపించదు. త్రేతాయుగంలో సూక్ష్మరూపిణిగా ఉంటుంది. ద్వాపరంలో సగం శరీరంతో దాగి ఉంటుంది. కలియుగంలో మాత్రం మహాప్రగల్భురాలై బలవంతురాలై స్పష్టంగా సర్వత్ర వ్యాపించి ఉంటుంది. ఇంటింటా కపటరూపంతో సోదరులతో సమానంగా సంచరిస్తూ ఉంటుంది.శాంతదేవి లజ్జాదేవులిద్దరూ సుశీల పత్నులు. వారు లేకపోతే జగత్తు ఉన్మత్తమై పోతుంది.

బుద్ధి మేధా ధృతిదేవులు ముగ్గురూ జ్ఞాన పత్నులు.వీరి అనుగ్రహం లేకపోతే జగత్తు మూఢమవుతుంది.మూర్తిదేవి ధర్మపత్ని. కాంతి స్వరూప. మనోహర. ఈవిడ లేకపోతే విశ్వాత్మకుడైన పరమాత్మ 
కూడా నిరాధారుడై పోతాడు. ఈవిడ శోభారూప. లక్ష్మీకళారూప. శ్రీ రూప. మూర్తిరూప.మాన్య. ధన్య.


ఇక నిద్రాదేవి కాలాగ్నిరుద్రపత్ని. రాత్రిపూట యోగశక్తితో లోకాలను ఈవిడ ఆశ్రయిస్తుంది.


కాలానికి రేయి పగలు సంధ్య అని ముగ్గురు భార్యలు. వీరు లేకపోతే బ్రహ్మదేవుడు కూడా కాలాన్ని లెక్కించలేడు.


క్షుత్పిపాసలు లోభ పత్నులు. వీరి వల్లనే లోకం చింతాతురమవుతోంది.


.తేజస్సుకి ప్రభా - దాహికలిద్దరూ భార్యలు.కాలకన్యలైన మృత్యుజరాదేవులిద్దరూ ప్రజ్వర పత్నులు. వీరివల్లనే జగత్తు క్షీణిస్తోంది.నిద్రా తంద్రా ప్రీతి దేవులు ముగ్గురూ సుఖ పత్నులు. సకల ప్రాణికోటిని అలసట నుంచి తేర్చి ఉత్తేజపరుస్తారు.శ్రద్ధాభక్తులు వైరాగ్య భార్యలు. వీరు కారణంగానే లోకం జీవన్ముక్తమవుతోంది.* ఇలా పెద్దలు చెప్పటం జరిగింది.
.....................
* నాకు అర్ధం అయినంతలో .........

౧. పుష్టిదేవి గణపతికి పత్ని. ఈవిడను అర్చించకపోతే స్త్రీపురుషులు క్షీణించిపోతారు. .......

అంటే ,
పుష్టిదేవితో కూడిన గణపతి దేవుని అనుగ్రహం వల్ల స్త్రీపురుషులు క్షీణించకుండా ఉంటారు....

( పుష్టిగా ఉంటేనే క్షీణించకుండా బలంగా ఉంటారు కదా !. )


౨. ధృతిదేవి కపిలపత్ని. ఈవిడను అర్చించకపోతే అధైర్యంతో
వొణికిపోవాల్సివస్తుంది.......

అంటే , (..ధృతి అంటే ధైర్యం .ధైర్యం లేకపోతే అధైర్యమే కదా !. )


౩ . ప్రతిష్ఠాదేవి పుణ్య పత్ని. వీరి అనుగ్రహం లేకపోతే జగత్తు జీవన్మృతమై పోతుంది. ........

అంటే ,( ..పుణ్యాలు చేస్తే ప్రతిష్ఠ పెరుగుతుంది. పుణ్యాలు చేసేవారు లేకపోతే జగత్తు జీవన్మృతమై పోతుంది కదా ! )


౪.కీర్తిదేవి సుకర్మ పత్ని.
 ఈవిడ కటాక్షం లేకపోతే జగత్తు యశోహీనమై పోతుంది......

అంటే , (.మంచి కర్మలు చేసే వారు లేకపోతే జగత్తు యశోహీనమైపోతుంది కదా ! )


౫ . క్రియాదేవి ఉద్యోగపత్ని. ( ఉద్యోగం=ప్రయత్నం ) ఈవిడ అనుగ్రహం లేకపోతే లోకాలన్నీ విధిహీనాలై పోతాయి. .............

అంటే ,. (. పద్ధతిగా పనులు చేసేవారులేకపోతే లోకాలన్నీ సోమరులతో నిండి విధిహీనాలైపోతాయి కదా ! )


౬ . 
మిథ్యా దేవి అధర్మ పత్ని. ధూర్తులు ఈవిడను పూజిస్తారు. ఈవిడ అనుగ్రహిస్తే ( ఆగ్రహిస్తే ) విధి నిర్మితమైన సృష్టి అంతావిచ్ఛిన్నమవుతుంది .......

అంటే ,. ( మిధ్యావాదులైన అధర్మపరులయిన ప్రజల వల్ల సృష్టి
విచ్ఛిన్నమవుతుంది కదా !. )


౭ . శాంతాదేవి లజ్జాదేవులు సుశీల పత్నులు.........వీరు లేకపోతే జగత్తు ఉన్మత్తమైపోతుంది. .........

అంటే , ( శాంతం, లజ్జ ( సిగ్గు ) లేని ........ సుశీలత లేని వ్యక్తుల వల్ల జగత్తు ఉన్మత్తమైపోతుంది కదా !. )


౮ 
బుద్ధి మేధా ధృతిదేవులు ముగ్గురూ జ్ఞాన పత్నులు.వీరి అనుగ్రహం లేకపోతే జగత్తు మూఢమవుతుంది. ......

అంటే ,....( బుద్ధి మేధా ధృతి కలిగిన జ్ఞానులు లేని లోకం మూఢులతో నిండిపోతుంది కదా !.)


౯ .. మూర్తిదేవి ధర్మపత్ని........

అంటే ,...( ధర్మం , ధర్మమూర్తులు లోకంలో పెరిగినప్పుడు లోకంలో ధర్మానికి బలం పెరిగి , అధర్మానికి బలం తగ్గిపోతుంది . అప్పుడు
పరమాత్మ కృపకు పాత్రులమవుతాము కదా ! )


౧౦ . క్షుత్పిపాసలు లోభ పత్నులు. వీరి వల్లనే లోకం చింతాతురమవుతోంది......

అంటే , (.క్షుత్పిపాసలతో కూడిన లోభబుద్ధి కలవారి వల్లే లోకం చింతాతురమవుతోంది కదా ! )౧౧. కాలకన్యలైన మృత్యుజరాదేవులిద్దరూ ప్రజ్వర పత్నులు. వీరివల్లనే జగత్తు క్షీణిస్తోంది. ..........

అంటే ,...( జరా ( ముసలితనం ), మృత్యువు వల్లనే జీవులు మరణిస్తారు. అలా జగత్తు క్షీణిస్తోంది కదా !. )


౧౨. నిద్రా తంద్రా ప్రీతి దేవులు ముగ్గురూ సుఖ పత్నులు. సకల ప్రాణికోటిని అలసట నుంచి తేర్చి ఉత్తేజపరుస్తారు..........

అంటే ,....(. నిద్రా ......... సుఖం వల్ల అలసటనుంచి తేరుకుంటారు కదా ! )


౧౩. శ్రద్ధాభక్తులు వైరాగ్య భార్యలు. వీరు కారణంగానే లోకం జీవన్ముక్తమవుతోంది.................

అంటే ,. ( శ్రద్ధా భక్తులు ఉన్నవారికి వైరాగ్యం కుదురుకుంటుంది. వారికి మోక్షం లభించే అవకాశం ఉంది కదా !.)
ఇలా నాకు అర్ధమయింది వ్రాసానండి. నాకు పెద్దగా పాండిత్యం లేదు. ఇందులో పొరపాట్లు ఉన్నయెడల దైవం క్షమించాలని కోరుకుంటున్నానండి.

Monday, May 28, 2012


మరి కొన్ని విషయములు....


*******************

ఆసక్తి ఉన్నవారు ఈ టపాను కూడా చూడవచ్చు . 


Wednesday, May 16, 2012

సూర్య ప్రభ, చంద్ర శోభ ....సూర్యప్రభ, చంద్ర ప్రభ.
ఓం.. పేర్లను గమనిస్తే..మరి కొన్ని విషయాలు...సూర్యభగవానుని భార్యల పేర్లను గమనిస్తే...  సంధ్య, ఛాయ, ఉష, పద్మిని, ప్రభ...ఇవన్నీ సూర్యునితో సంబంధం ఉన్న విషయాలే.

సూర్యుని భార్యల పేర్లను గమనిస్తే,  

సంధ్య.. అంటే ఉదయ, మధ్యాహ్న, సాయంసంధ్యలు. 

ఛాయ..  సంధ్యాసమయాలలో పొడుగైన  ఛాయ ( నీడ ) ఏర్పడుతుందట. 

 ఉష ..అంటే ఉషస్సు.

 పద్మిని.. పద్మాలు సూర్యకాంతి వల్ల విచ్చుకుంటాయి. 

ప్రభ..సూర్యుని కాంతి. ఇలా సింబాలిక్ గా అనుకోవచ్చు. 

 సూర్యునికి సంధ్య, ఛాయ.. ఇద్దరు భార్యలని కొన్ని చోట్ల ఉంది. మరికొన్నిచోట్ల ఎక్కువమంది భార్యల పేర్లు ఉంటాయి.

***************

దేవతల చర్యలు మానవులకు ఉన్నటువంటి రాగద్వేషాలను పోలి ఉండవు. దేవతల చర్యలను మానవ ధర్మాలు,గుణముల కోణం నుండి చూడకూడదు.


ఉదా....ఇంద్రుడు తపస్సు చేసే వారి వద్దకు అప్సరసలను పంపి వారి తపస్సులను భగ్నం చేయటానికి ప్రయత్నిస్తారు అని కొందరు అంటారు.


కానీ ఇంద్రుడు అప్సరసలను పంపటం ద్వారా .. తపస్వుల పట్టుదలను పరీక్షిస్తారు .. అని కూడా అనుకోవచ్చు.

************

ఇంకా , చంద్రునికి తన భార్యలలో రోహిణి అంటే ఎక్కువ ఇష్టం అని చెబుతారు.


చంద్రునికి ఉచ్ఛస్థానం వృషభరాశి . అందులో కృత్తిక ,మృగశిర నక్షత్రములు పూర్తిపాదములతో ఉండవు. రోహిణి నక్షత్రం మాత్రమే అన్ని పాదములతో ఉంటుంది.


అందుకని, చంద్రునికి ఉచ్ఛస్థానమయిన వృషభంలో రోహిణి నక్షత్రం పూర్ణంగా ఉంటుంది కాబట్టే... అని కూడా అర్ధం చేసుకోవచ్చు.


అందుకే దేవతల చర్యలను మానవగుణముల కోణం నుండి చూడకూడదు.


దేవతలు మానవులుగా అవతరించిన సందర్భంలో మాత్రము ,.. వారి చర్యలను కొంతవరకు , మానవధర్మముల కోణము నుండి చూడవచ్చు అనిపిస్తుంది.

**************


అప్సరసల గురించి నాకు తోచిన మరి కొన్ని విషయాలు..

ఎవరైనా తపస్సులు చేస్తుంటే వారి వద్దకు ఇంద్రుడు అప్సరసలను పంపటం అంటే.....  తపస్సు చేసే వారి  పట్టుదలను , ఇంద్రియ నిగ్రహాన్ని పరీక్షించడం కోసం అనుకోవచ్చు. 


అప్సరసలను చూసి మోహపడని వారు స్త్రీవ్యామోహం అనే  పరీక్షలో గెలుస్తారు.

 ఈ అప్సరసలు వ్యక్తులలోని వ్యామోహాలకు పరీక్షలు. 


ఇంద్రుడు ఇంద్రియాలపై ఆధిపత్యం ఉన్నవారు అయినప్పుడు...  

వ్యక్తులలోని వ్యామోహ  భావాలకు ప్రతీకలు  అయిన  అప్సరసలు,  ఇంద్రియాలకు  సంబంధం  ఉన్న  దేవత  అయిన ఇంద్రుని ఆధీనంలో ఉండటంలో అనే విషయంలో ఆశ్చర్యం  ఏమీ లేదు. 
-------------------------


ఇలాంటి విషయాలలో మనకు తెలియని ఎన్నో అర్ధాలు దాగుంటాయి.


ప్రతి 
దాన్ని అపార్ధంచేసుకోవటం కాకుండా , దైవం దయ కోసం ప్రయత్నించాలి అందరూ .అప్పుడే ప్రశాంతత లభిస్తుంది.


ఇందులో పొరపాట్లు ఉన్నచో భగవంతుడు క్షమించవలెనని ప్రార్ధిస్తున్నానండి.Friday, June 22, 2018

పురాణేతిహాసాలలోని పాత్రలు, సంఘటనల ద్వారా ... చక్కటి దిశానిర్దేశం.....శకుంతల,కుంతీదేవి, ధర్మరాజు ..


పురాణేతిహాసాలలోని  పాత్రలను  కొందరు  అపార్ధం  చేసుకుంటారు.  అంత  గొప్ప  వాళ్ళు  కూడా   కొన్ని  పొరపాట్లు   చేసారు  కదా !  అంటారు.  నిజమే  ,  గొప్పవారు  అయినా  కొన్నిసార్లు  పొరపాట్లు  చేసే  అవకాశం  ఉంది.


ఇతరులు  చేసిన  గొప్పపనులను  మనం  ఆదర్శంగా  తీసుకోవాలి.  ఇతరులు  చేసిన  పొరపాట్ల  నుంచి  మనం   పాఠాన్ని  నేర్చుకోవాలి.


 ( మనం  అలాంటి   పొరపాట్లు  చేయకూడదనే   పాఠాన్ని   నేర్చుకోవాలి. )

..........................................


సమాజం అన్నాక ఎంతో వైవిధ్యం గా ఉంటుంది. భిన్న మనస్తత్వాల వారు ఉంటారు.

ఒకే వ్యక్తి ( వివిధ కారణాల వల్ల ) ఒకోసారి ఒకోరకంగా కూడా ప్రవర్తిస్తాడు.

ఇప్పుడు సమాజంలో చూడండి ........ ఎన్నో నేరాలు,  ఘోరాలు జరుగుతున్నాయి. మంచి సంఘటనలూ జరుగుతున్నాయి.మంచివారూ ఉన్నారు ........ చెడ్డవారూ ఉన్నారు.

 మరి వీటన్నిటి మధ్య మనం ఎలా జీవించాలి ? ఏది ధర్మం ? ఏది అధర్మం ? ఎవరు చెబుతారు ? ....... అని అయోమయంలో పడకుండా , దైవం, పెద్దలు ... పురాణేతిహాసాలలోని పాత్రలు, సంఘటనల ద్వారా.....ఈ జగన్నాటకంలో మనం ఎలా ప్రవర్తించాలో ,ఎలా ప్రవర్తించకూడదో , .......ఎలా ప్రవర్తిస్తే పర్యవసానం ఎలా ఉంటుందో .......మనకు   చక్కటి  దిశానిర్దేశం  చేశారు    అనిపిస్తుంది.అందుకే ఈ గ్రంధాలలో, లోకంలో ఉండే విభిన్న వ్యక్తిత్వాలూ, విభిన్న సంఘటనలు కనిపిస్తాయి.

...........................................

పురాణేతిహాసాలలోని    పాత్రల  నుంచి  మనం  ఎన్నెన్నో  విషయాలను  నేర్చుకోవచ్చు.  


ఉదా...వివాహం  కాని  అమ్మాయిలు  ఉన్న  తల్లితండ్రులకు  కొంత  భయం  ఉంటుంది.  అమ్మాయికి  జాగ్రత్తలు  చెప్పాలంటే   ఎలా  చెప్పాలో  తెలియక  మొహమాటంగా  కొంత   ఇబ్బందిగా  ఉంటుంది.  అలాంటప్పుడు  శకుంతలదుష్యంతుల  కధను  అమ్మాయికి  తెలియజేస్తే , తల్లితండ్రులకు  తెలియకుండా  రహస్య  వివాహాలు  చేసుకుంటే  కలిగే  ఇబ్బందులు  వంటి  వాటిని  శకుంతల  పాత్ర  ద్వారా  తెలుసుకుని   అమ్మాయిలు  జాగ్రత్తగా  ఉండే  అవకాశం  ఉంది.


........................................


కుంతీదేవి  కధను  తెలుసుకోవటం  ద్వారా    పిల్లలు,  పెద్దలు  కూడా  ఎన్నో  విషయాలను   నేర్చుకోవచ్చు.  జీవితంలో  ఎన్ని  కష్టాలు  వచ్చినా  కుంతీదేవి  సహనంతో, దృఢత్వంతో  జీవించటం  జరిగింది.  కుంతీదేవి    వ్యక్తిత్వంలోని    సహనం,  దృఢత్వం  వంటి   ఎన్నో  గొప్ప  విషయాలను  మనము  నేర్చుకోవచ్చు. అయితే  తెలిసితెలియని  చిన్నతనంలో ,  మహర్షి  ప్రసాదించిన  వరాన్ని    పరీక్షించకోరిన సందర్భములో  సంభవించిన  కర్ణజననం ,  లోకోపవాదానికి  భయపడి  కర్ణుని  వదిలిపెట్టడం  వంటి  సంఘటనల  వల్ల  కుంతీదేవి  జీవితాంతం  వరకు  మానసిక  క్షోభను   అనుభవించింది.  కర్ణునికి  తాను  అన్యాయం  చేశానని  కుమిలిపోయింది.  కుంతీదేవి  జీవితంలోని  ఈ   సంఘటన  ద్వారా  వివాహానికి  పూర్వమే  బిడ్డలను  కంటే  ఎన్ని  కష్టాలు  ఉంటాయో  అమ్మాయిలకు   వివరంగా  తెలుస్తుంది.

 .....................................

 ధర్మరాజు  ఎంతో  గొప్పవ్యక్తి.   ధర్మాన్ని  చక్కగా   ఆచరించిన    వ్యక్తి.  వారు  పాటించిన  నైతిక  విలువలతో  కూడిన  గొప్ప  జీవితం  ద్వారా  మనం  ఎన్నో  మంచి  విషయాలను  నేర్చుకోవచ్చు. 


అయితే,  జీవితమంతా  ధర్మాన్ని  పాటిస్తూ   జీవించినా  కూడా  జూదం  వంటి  ఒక్క  చర్య   వల్ల  వారు   వనవాసం  వంటి  కష్టాలను  అనుభవించవలసి  వచ్చింది.


 ఈ విషయం  గురించి  మనం  ఏం  నేర్చుకోవాలంటే , ప్రతి  విషయంలోనూ  మనం  జాగ్రత్తగా  ఉన్నప్పుడే  జీవితంలో  కష్టాలు  రాకుండా  ఉంటాయి  అని  తెలుసుకోవాలి.


Wednesday, December 11, 2013


******************


దయచేసి  ఈ  లింక్  కూడా  చదవగలరు. 


ఆలోచన రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది...


ఒకరితో ఒకరు గొడవలు పడకూడదు...క్రిస్టియన్లు, హిందువులు, ముస్లిం మతం వారు ఒకరితో ఒకరు  గొడవలు పడకూడదు.


ఒకరి గ్రంధాలలోని విషయాల గురించి ఇంకొకరు తప్పుగా మాట్లాడకూడదు.


 ఎవరి మార్గంలో వారు దైవాన్ని ఆరాధించుకోవచ్చు. దైవం అందరికీ ఒకే శక్తి. 


వేరువేరు దేవుళ్లుంటే ఈ ప్రపంచాన్ని ఏ దేవుడు సృష్టించినట్లు?


 కొందరు నీరు అన్నా, కొందరు వాటర్ అన్నా కొందరు పానీ అన్నా ఉండేది నీరు అనేది  ఒక్కటే. 


అలాగే ఎవరు ఏ విధంగా విధమైన పేరుతో  పిలుచుకున్నా, ఏ విధంగా ఆరాధించుకున్నా దైవం అనేది ఒక మహాశక్తి.

 దైవాన్ని ఎవరి పద్ధతి ప్రకారం వారు ఆరాధించుకుంటారు. నేను హిందు మతం దేవతలను, ఏసుక్రీస్తును, అల్లాహ్ ను కూడా దణ్ణం పెట్టుకుంటాను.కొన్ని సంఘటనలు... ఆధునిక సైన్స్ వల్ల  కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి..


ఆ మధ్య ఒక వార్త వచ్చింది. ఒక భార్యా భర్తకు ఎంతకూ సంతానం కలుగలేదట. 

అమ్మాయికి గర్భసంచి లో అనారోగ్యం కారణమని తెలిసింది. 

సరోగసి విధానం ద్వారా వారు సంతానభాగ్యం  పొందే వీలుందని వైద్యులు చెప్పగా …


అద్దెగర్భం విధానం ద్వారా తాను గర్భాన్ని  మోస్తానని అమ్మాయి తల్లి ముందుకు వచ్చిందట. 


కూతురు అల్లుడు యొక్క పిండాన్ని టెస్ట్ ట్యుబ్   ద్వారా  పెంచి  అమ్మమ్మ గర్భంలో ప్రవేశపెట్టారట.


 ఆ విధంగా ఒక తల్లి తన కూతురు యొక్క బిడ్డను తాను గర్భంలో ధరించి కూతురుకు సహాయం చేసిందట. అయితే ఇక్కడ ఎవరూ అపోహపడనక్కరలేదు.  కూతురు అల్లుడు యొక్క సంతానాన్ని  అత్త గారు గర్భంలో  ధరించడం ఏమిటీ?

 అందులో కూతురు అంశతో పాటు అల్లుడు అంశ కూడా ఉంటుంది కదా !  అనుకోకూడదు. 


ఈ సంఘటనలో  అత్తగారు ఏమీ అపవిత్రం కాలేదు కదా . కూతురు కోసం జస్ట్ ఆమె తన గర్భాన్ని అద్దెగా ఇచ్చింది అంతె.

*******************


ఈ రోజుల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య  ఎక్కువగా పెరిగింది.ఒకరి కిడ్నీ ఇంకొకరికి అమర్చటమూ జరుగుతోంది. 


ఇలాంటప్పుడు..  విపరీత ధోరణి తో  ఆలోచించేవాళ్ళకు కొన్ని సందేహాలు వస్తాయి. 


ఉదా..ఇద్దరు అక్కచెల్లెళ్ళలో  చెల్లెలుకు కిడ్నీ వ్యాధి ఉండి అక్క ఒక కిడ్నీ చెల్లెలుకు ఇచ్చిందనుకుందాము. చెల్లెలు భర్త  అతిగా ఆలోచించి , అయ్యో! 
 పూజ్యునీయులైన వదిన గారి అంశ అయిన కిడ్ని నా భార్య శరీరంలో ఉంది. నేను నా భార్యతో కాపురం చేయవచ్చో లేదో ? అని ఆలోచిస్తే అది విపరీత ధోరణి అవుతుంది.


అలాగే ఇద్దరు అన్నాదమ్ముల్లో  తమ్ముడికి వ్యాధి ఉండి అన్న తన ఒక కిడ్నీ తమ్ముడికి ఇచ్చారనుకుందాము. తమ్ముడి భార్య అతిగా ఆలోచించి,  అయ్యో! పూజ్యునీయులైన బావగారి  అంశ అయిన కిడ్ని నా భర్త శరీరంలో ఉంది. నేను నా భర్తతో కాపురం చేయవచ్చో లేదో ? అని ఆలోచిస్తే అది విపరీత ధోరణి అవుతుంది.


-------------------------


మగవాళ్లు.. ...పూజ్యనీయులైన  తమ అత్త,మామగారి అంశలు తన భార్యలో ఉంటాయి కాబట్టి ,  భార్యతో కాపురం చేయవచ్చో లేదో ? అని ఆలోచిస్తే  అది విపరీతధోరణి అవుతుంది.స్త్రీలు ......పూజ్యనీయులైన  తమ అత్త,మామగారి అంశలు తన భర్తలో ఉంటాయి కాబట్టి , భర్తతో కాపురం చేయవచ్చో లేదో ? అని ఆలోచిస్తే  అది  విపరీత ధోరణి అవుతుంది.అశుచి అంటూ పదేపదే స్నానాలు చేయటం వంటివి కూడా విపరీతధోరణి అవుతుంది. ఇందువల్ల జలుబు వంటివి రావటంతో పాటు నీటివృధా చేసిన పాపం అంటుకుంటుంది.


పెద్దవాళ్ళు చెప్పినట్లు  పసుపు నీళ్లను చిలకరించుకున్నా   అశుచి  పోతుంది.  


****************

   లౌకిక విషయంలోనైనా, పురాణేతిహాసాలను అర్ధం చేసుకునే విషయంలోనైనా విపరీత ధోరణి తో ఆలోచించటం సరైనది కాదు.

పురాణేతిహాసాలలోని ఎన్నో అంతరార్ధాలు ఉంటాయి. 


వీటిని విపరీత ధోరణితో ఆలోచించి  అపార్ధం చేసుకోకుండా  సక్రమంగా అర్ధం చేసుకోవాలి. పురాణములు, ఇతిహాసములు, మరియు ప్రాచీన గ్రంధములు ఇవన్నీ చాలాగొప్పవి.....అందులోని ధర్మమును తెలుసుకోవటం మన ధర్మం.ఓం.
సుధా సముద్రములోమణిద్వీపములో,చింతామణిగృహములో నివసించేఆదిదంపతులైన  పరమాత్మకు{శ్రీమన్మహాదేవుడుశ్రీమన్మహాదేవివందనములు.శ్రీకృష్ణార్జునులకు వందనములు.

ఆ ఆదిదంపతులైన శ్రీమన్మహాదేవీశ్రీమన్మహాదేవులు ఇద్దరూ వేరువేరుకాదట . వారు అర్ధనారీశ్వర తత్వంలా ఒకరేనట. నన్ను క్షమించాలి. ఈ విషయం వివరించటానికి నాకు శక్తి చాలదు. దేవతలు రాగద్వేషాలకు అతీతులు కారట. త్రిమూర్తులు సత్వ, రజో, తమో గుణ ప్రధానులు. ఆ పరమాత్మయే రాగద్వేషములకు అతీతులు. ఇంకాశ్రీ దేవీభాగవతములో ఎన్నో విశేషములుచెప్పబడ్డాయి పరమాత్మ గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే.
శ్రీకృష్ణులవారిని గురించి కొన్ని విషయములు చెప్పుకుందాము. ఆయన శ్రీమహావిష్ణువు అవతారం. ఆయన అష్టభార్యలగురించి నాకుఏమనిపిస్తుందంటే వారు అష్టలక్ష్మీదేవీఅవతారములకు సంకేతమేమోనని. కొంతమంది అయనయొక్క పదహారువేలమంది భార్యలగురించి అపార్ధం చేసుకుంటారు. దానికి ఒక కారణం ఉంది.పూర్వం ఒకానొకప్పుడు శ్రీకృష్ణులవారు, అర్జునులవారు నారాయణుడు, నరుడు గా అవతరించిన రోజులలో ఇద్దరూ గొప్పతపస్సు చేస్తున్నారు. అప్పుడు ఇంద్రుడు వారివద్దకు అప్సరసలను పంపించారు. ఇక్కడ నేను అనుకోవటం ఇంద్రుడు తపస్వుల ఇంద్రియనిగ్రహాన్ని పరీక్షిమిచుట కొరకు, ఇంకా వారు ఇంద్రియములను ఎంతవరకూ జయించారు ఇవన్నీ పరీక్షించటానికి అలా వారిని పంపిస్తారేమోనని అనిపిస్తుంది.


సరే ఆ అప్సరసలు ఎంతోకాలం అలా ఆడి, పాడినా నరనారాయణులు అలా నిశ్చలంగా తపస్సు చేసుకుంటూనేఉన్నారట.. కొంతకాలం తరువాత వారికివారే కండ్లు తెరచి అంతాగ్రహించి ............. ఆడి పాడి అలసిన అప్సరసలతో వారిని వారిలోకం తిరిగి వెళ్ళమనీ, వెళ్ళేముందు తమ ఆతిధ్యం స్వీకరించివెళ్ళవలసిందిగా మర్యాదకోసం కోరారట.


అప్పుడు నారాయణుడు తన తపశ్శక్తితో కొత్త అప్సరసలను, ఊర్వశిని కూడా సృష్టించి వారికి అతిధిమర్యాదలు జరిపారు. వీరి తపశ్శక్తికి , నిగ్రహశక్తికి ఆ అప్సరసలు ఆశ్చర్యపడి వారు తమలోకం వెళ్ళబోమని, తమందరిని వివాహం చేసుకోవలసినదిగా వరమడగటం జరిగింది.


అప్పుడు నారాయణుడు ఎంతో ఆవేదన చెంది వారిని శపించబోగా నరుడు కోపం మరింత అనర్ధకమని వారించటం జరుగుతుంది. అప్పుడు నారాయణుడు ఈ జన్మలో వారిని వివాహమాడటం జరగదని, భవిష్యత్తులో అది జరుగగలదని తెలియపరిచి వారిని పంపివేస్తారు.


ఆ తరువాత ఆయన ఎంతో ఆవేదనతో తాను ఎంతో తపశ్శక్తిని వ్యయపరిచి అప్సరసలను సృష్టించటం, ఆతిధ్యమివ్వటం , వరం ఇవ్వవలసిరావటం ,వీటన్నిటికి ఎంతో బాధపడి తాను అసలు వారిని పట్టించుకోకుండా గౌరవమర్యాదలు చెయ్యకుండా మౌనంగా ఉండిపోతే ఎంతబాగుండేది... వారి మానాన వారు వెళ్ళి పోయేవారు కదా అనుకుంటారు.అదిగో.....ఆవిధముగా  పదహారువేలమందినిశ్రీకృష్ణుల వారు వివాహం చేసుకొనవలసివచ్చింది.దీని గురించి నాకు ఏమని అనిపిస్తుంది అంటే ....ఎవరైనా ఇలా కొన్ని సందర్భాలలోమర్యాదలు అంటూ మొహమాటాలుపోకుండా........... ముభావంగా వ్యవహరించటమేఅందరికీ శ్రేయస్కరమని.....


ఇంకా ఒకసారి వైకుంఠములో శ్రీలక్ష్మీదేవికి, సవతులతో సంవాదం జరిగిన సందర్భములో విష్ణుమూర్తి లోకమునకు ఒక ఉపదేశం చేస్తూ....పురుషునికి బహుపత్నులు ఉండటంధర్మ విరుధ్ధమని కూడా తెలియచేశారు


ఒకప్పుడు శ్రీకృష్ణులవారు సంతానార్ధియై శివుని కొరకు తపస్సు చేయటం జరిగింది. అంటే రుక్మిణి దేవికి వారికి సంతానం కలిగి తనకు ఇంకా సంతానం లేనందుకు జాంబవతీదేవి కృష్ణుని ప్రార్ధించటం జరిగిందట . (  జాంబవతీ దేవి యేనా కాదా అని నాకు సరిగ్గా గుర్తులేదు. దయచేసి క్షమించాలి.)

అప్పుడు పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమయి సంతానవరాన్ని అనుగ్రహించటం జరుగుతుంది. దానికి ముందు కృష్ణులవారు వారితో తాను వారిని లౌకికమైన కోరికల కోసం ఆరాధించినందుకు బాధను వ్యక్తపరచటం జరుగుతుంది.


సరే ఆ తరువాత పార్వతీపరమేశ్వరులు కృష్ణులవారితో భవిష్యత్తులో జరగబోయే సంగతులు తెలియచేస్తారు. అందులో యాదవుల యొక్క నాశనంగురించి ,ఇంకా పదహారువేల యాభై మంది భార్యలు దొంగలవల్ల అవమానములు పొందటం ఇలా ఎన్నో విషయములు తెలియజేస్తారు.


ఇక భారత యుధ్ధములో అధర్మం జరిగిందనికొందరంటారుఇంతకుముందు ఒకసారి మనంధర్మం అనేది సందర్భమును బట్టి మారుతుందనిఅనుకున్నాము కదండి.


అంటే ఉదా.....మీ స్నేహితుడు ఒకసారి మీ ఇంటికి వచ్చాడని అనుకుందాము. ఆయన చాలా మంచి వ్యక్తి. మీ ఇద్దరు లోపల మాట్లాడుకుంటున్నారు. ఇంతలో బయట పెద్దగా మీస్నేహితుడిని పిలుస్తూ , కొంతమంది ఆయన శత్రువులు మీఇంటిముందు గోల చేస్తున్నారు. అప్పుడు మీరు ఏమి చేస్తారు?


మన పెద్దలు అసత్యం చెప్పటం పాపం అన్నారుకదా అని .... ఆయన ఇక్కడే ఉన్నాడని వారికిఅప్పగిస్తారా ? అప్పుడు మీరు ఏమి చేస్తారంటే అబధ్ధం చెప్పనవసరంలేదు అప్పటికి యుక్తియుక్తముగా మాట్లాడి, ఏదో విధముగా తెలివిగా తప్పించి ఆయనను కాపాడుతారు. అదే కదా అప్పటికి ధర్మం.


శ్రీకృష్ణుల వారు ధర్మపరులైన పాండవులనుఇలాగే రక్షించారని నా అభిప్రాయంమనముఆయనను స్నేహితునిగాలేక గురువుగాఎలాభావిస్తే అలా ఆయన మనలను రక్షిస్తారు.


ఇక శ్రీ భగవద్గీత గురించి ఎంత చెప్పుకున్నాతక్కువే .అది అందరికి తెలిసిన విషయమే.ఇంకా ధర్మాత్ములైన భీష్మాచార్యులు,, ద్రోణాచార్యులు, కర్ణుడు వీరు అలా జీవితాలు చాలించటం బాధాకరమే, కానీ మరి వారు అధర్మ పక్షములో చేరటంవల్ల అధర్మపరుడైన దుర్యోధనుడినికి శక్తి పెరుగుతోంది కదామరి. ... అయితే ఆ పెద్దలు అలా వారి పక్షాన ఉండటానికి వారి కారణములు వారికి ఉన్నాయి లెండి.


ఇక భారతయుధ్ధం తరువాత శ్రీకృష్ణులవారు, ,వారి అష్టభార్యలు అందరి అవతారసమాప్తి జరిగింది.తరువాత ఇన్నో సంగతులు జరిగాక దొంగలు వారి పదహారువేలమంది భార్యల ఆభరణములు దోచుకుంటారు. నేను అనుకోవటం అప్సరసలు ఒక తపస్విని అడగకూడని వరంఅడిగినందుకే  జన్మలో ఆఖరికి అలాఅవమానించబడ్డారేమోనని..


ఇక కొన్ని విశేషాలు చెప్పుకుంటే శంకరుడుపార్వతీదేవి సలహాతో లోకహితం కొరకు విషమునుకంఠములో దాచుకున్నారుమరి ఈనాడు మనముమనసుఖం కోసం లోకాన్ని విషంతోనింపుతున్నాము.ఇంకా ప్రాచీన గ్రంధములనుండి మనము ఎన్నో సంగతులు నేర్చుకోవచ్చు. ఒకప్పుడు కైలాసములో విఘ్నాధిపత్యం కొరకు శివుడు వినాయకుడు, కుమారస్వామికి మధ్యన ఒక పోటీ పెట్టిన కధ మనకు తెలుసుకదా....అందులో శివుడు మీ ఇద్దరిలో ఎవరు ముల్లోకములలో అన్ని పుణ్యనదులలో స్నానం ఆచరించి ముందుగా తిరిగి నా వద్దకు వస్తారో వారికి విఘ్నాధిపత్యం ఇస్తాను అని అనటం జరిగింది.


అప్పుడు కుమారస్వామి వెంటనే బయలుదేరి వెళ్ళగా వినాయకుడు తన అసక్తతను తల్లిదండ్రులవద్ద తెలిపి బాధపడినప్పుడు వారు కుమారా ! ఒక్కసారి నారాయణమంత్రంజపించినంతమాత్రమున మూడువందల కల్పములు సకల పుణ్యనదులలో స్నానమాచరించిన ఫలం లభిస్తుంది. ఒక్కసారిజననీజనకులకు ప్రదక్షిణ చేసినంతనే మూడులోకములు చుట్టివచ్చినంత ఫలితం కలుగుతుందని బోధించగా వినాయకుడు అలా ఆచరించి ఆ పోటీలో గెలుపొందిన సంగతి మనకు తెలిసిందే. ఆతరువాత కుమారస్వామి కూడా ఈ రహస్యమును తెలుసుకుంటారు.దీన్నుంచి నాకేమనిపించిందంటే మనము ఓపికఉండి తీర్ధయాత్రలు అలా చేయటం మంచిదేగానిఒకవేళ కుదరనప్పుడు బాధపడక దైవాన్నిమనశక్తిమేరకు ప్రేమభక్తితో పూజించినా  దైవందయ లభిస్తుంది అనిఇంకా మనము ఎప్పుడుఎలా ప్రవర్తించాలో  కదల ద్వారా మనముతెలుసుకోవచ్చు .


1. రావణాసురుని దుష్ట బుధ్ధికి సహకరించి వారి సంతానం మరణించారు.


2. దైవాన్ని ఎదిరించమన్న తండ్రి మాట వినక ధర్మమార్గములో నడిచి  దైవసహాయముతో ప్రహ్లాదుడు రక్షించబడ్డారు.


3.చెడ్డవాడైన వరునితో పెద్దలు వివాహం నిశ్చయించటం .... తరువాత రుక్మిణిదేవి శ్రీకృష్ణులవారిని వివాహమాడటం అందరికి తెలిసిన కధే. .

4. పెద్దలకు తెలియకుండా దుష్యంతునితో సంతానము పొందిన శకుంతల పడ్డ కష్టాలు మనకు తెలిసినవే.


5.అన్నదమ్ములు ఐకమత్యముగా ఉంటే వచ్చే లాభములు శ్రీరాముడు,లక్ష్మణుడు,భరతుడు,శత్రుఘ్నుడు కధ ద్వారాతెలుసుకోవచ్చు.6.అన్నదమ్ములు వైరభావం కలిగిఉంటే వచ్చే ఫలితములు వాలి,సుగ్రీవుల కధ ద్వారా తెలుసుకోవచ్చు.


ఇలా ఎన్నో మనం తెలుసుకోవచ్చు.

ఇంకా నాకు ఏమనిఅనిపిస్తుందంటేనండి......ఎంతో విజ్ఞానం కూడాప్రాచీన గ్రంధములలో ఉన్నదని....ఉదా....రోజుల్లో స్టెంసెల్స్ అని మూలకణముల ద్వారాఎన్నో ప్రయోజనముల గురించి నేటి శాస్త్రవేత్తలుచెబుతున్నారువిష్ణుమూర్తి బొడ్డు నుండి పద్మంద్వారా బ్రహ్మ జన్మించి సృష్టిని చేస్తారు అంటే...

..ఒకవేళ మూలకణములు వీటి ప్రయోజనములు, వాటిద్వారా కొత్త సృష్టిని సృష్టిచవచ్చు ఇవన్నీ ఇలా సంకేతముగా కూడా నాకు అనిపించింది. పిల్లలు పుట్టినప్పుడు వచ్చే బొడ్డుత్రాడు నుండి ఈ మూలకణములు సేకరిస్తారు. ఇంకా బ్రహ్మ బొటన వ్రేలు నుండి దక్షుడు పుట్టారు ఇలా కూడా మూలకణములు అన్నవి వారికి తెలుసునని నాకనిపించింది.చాలా త్వరగా వ్రాయవలసి వస్తోంది.క్షమించండి.


ఇంకా త్రిమూర్తులు వారివారి పదవీబాద్యతలప్రకారం వారి వస్త్రధారణ ఉన్నట్లు కూడానాకనిపించింది

సృష్టిని చేసే బ్రహ్మ ఈ నాటి శాస్త్రవేత్తల వలె గడ్డం కలిగిఉండటం ...


మహావిష్ణువు స్థితి కి సూచనగా ఆభరణములు ధరించుట ఇలా అలంకారప్రియులు.


పరమశివుడు లయకారత్వానికి చిహ్నమైన భస్మమును ధరించుట, ఇంకా అభిషేకప్రియులు. ఇలా మనపెద్దలు ఎంత బాగా చెప్పారు... ఇలా ఎన్నో విషయములు మనము తెలుసుకుని ఆచరించవలెను. అపార్ధం చేసుకోవటం తప్పు.


శ్రీ గాయత్రీ మాతకు వందనములు.

ఇక ఇవన్నీ నేను వ్రాయటం జరిగింది అని చెప్పుకుంటే అంతకన్నా అహంకారం, హాస్యాస్పదమైన విషయం మరి ఇంకొకటి ఉండదు. సంస్కృతం కూడా చదవటం రాదు నాకు. వేదములు అసలే తెలియదు. నేనసలు ఇంత క్లిష్టమైన టాపిక్ ఎందుకు తీసుకున్నాను. అని ఎంతోబాధపడ్డాను.


ఒకోసారి ఏమి వ్రాయాలో తెలియక బెంబేలెత్తి ఇకనావల్లకాదు బాబోయ్ ... ఇక నీదే భారం అని దైవం పై భారం వేసేసి చేతులెత్తేసినప్పుడు .... నాయందు  దైవం జాలిపడి  మాత్రంవ్రాయటానికి సహాయం చేసినందుకు దైవమునకు నేనెలా కృతజ్ఞతలు తెలుపుకోగలను?అంతా  భగవంతుని దయ.


చిన్నప్పటినుంచి పెద్దలు, పిన్నలు ద్వారా తెలుసుకున్నవి ,ఇంకా దత్తాత్రేయుల వారుచెప్పినట్లు ఎన్నో జీవులనుండి కూడా మనము ఎన్నో విషయములు నేర్చుకోవచ్చు. ఇంకా నాకు సహాయపడిన మీ అందరికీ నా కృతజ్ఞతలండి.ఇందులోని తప్పులను నేను చేసినవి గాను,ఒప్పులను భగవంతుని దయగాను పాఠకులుగ్రహించవలెనని నా మనవి.

.పరమాత్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేఅంతా భగవంతుని దయ.

 


పరమాత్మార్పణమస్తు...........


Friday, July 30, 2010 

ఆని అతితెలివిగా ప్రశ్నిస్తారు. ...


శ్రీ కృష్ణుని 16 వేల.. మంది భార్యల గురించి  కూడా  చాలామంది  అదొకరకంగా మాట్లాడుతుంటారు. 

కొందరు ఏమంటారంటే , కృష్ణుడు అంతమందిని వివాహం చేసుకున్నప్పుడు మేమెందుకు చేసుకోకూడదు? ఆని  అతితెలివిగా ప్రశ్నిస్తారు. 

మరి, కృష్ణుడు ఒకే సమయంలో 16వేల ..రూపాలు ధరించి అందరి వద్ద భర్తగా ఉండటాన్ని నారదుల వారు చూశారట. 


కృష్ణుడు అంతమందిని వివాహం చేసుకున్నప్పుడు మేమెందుకు చేసుకోకూడదు?  అనే  వాళ్లు అలా ఒకేసారి రెండు, మూడు అవతారాలు ధరించి ఇద్దరు లేక ముగ్గురి వద్ద ఉండగలరా?


కృష్ణుని  16 వేల ..భార్యల విషయంలో   ఎన్నో అంశాలున్నాయంటారు. 

కృష్ణుని 16వేల..మంది భార్యలు ..గోపికలని కొందరు, గత జన్మలో మునులని కొందరు అంటారు.

ప్రాచీనులు గ్రంధాలలో చెప్పిన అంశాలలో ఎన్నో అంతరార్ధాలుంటాయని  పెద్దలు తెలియజేసారు.

 ఈ విషయాల గురించి తెలుసుకోవాలంటే శ్రీ పాద  శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం గ్రంధం చదవ వచ్చు.


***************

ఆసక్తి ఉన్నవారు మరికొన్ని విషయములను ఇక్కడ చూడగలరు... 

Friday, July 30, 2010