koodali

Wednesday, June 13, 2018

ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది......


పాతకాలంలో స్త్రీలు వంట చేసేటప్పుడు  క్రింద కూర్చుని  వంటచేసేవారు. పొయ్యిగట్టు  క్రింద ఉండేది. గట్టు  చుట్టూ వంటకు  అవసరమైన  వస్తువులు ఉండేవి. 


ఈ రోజుల్లో కొందరు  క్రింద  కూర్చో లేకపోతున్నారు. దైవం దయవల్ల నాకు ఆ సమస్య లేదు.  


ఈ రోజుల్లో పొయ్యిగట్టు  ఎత్తుగా ఉంటోంది. ఎన్ని గంటలైనా నిలబడే వంట చేయవలసి వస్తుంది. ఇందువల్ల    చాలామంది  స్త్రీలు  కాళ్ళనొప్పులతో   బాధపడుతున్నారు. 


పొయ్యిగట్టు   క్రింద కాకుండా, ఎత్తుగా కాకుండా మధ్యస్తంగా ఉంటే బాగుంటుంది. 

ఉదా..  ఈ   టీవిలో..  అమ్మ చేతి వంట … వంటి  ప్రొగ్రాం లో పొయ్యిగట్టు  ఉండే విధానం  బా గుంది. కుర్చీ  వేసుకుని  కూర్చుని  వంట చేయవచ్చు. 

*********************

ఇస్త్రీ చేసేవాళ్ళు గంటల తరబడి నిలబడి ఇస్త్రీ చేస్తుంటారు.

 అలా కాకుండా  వెడల్పు బల్ల ముందు క్రింద కూర్చుని   ఇస్త్రీ   చేసే విధంగా ఏర్పాటు చేసుకుంటే  కాళ్ళు నొప్పులు ఉండవు.

**************

రోడ్డుప్రక్కన పండ్లు, ఫలహారాలు అమ్మేవారు కూడా గంటల తరబడి  ఎండలో నిలబడి వ్యాపారం చేస్తుంటారు.  

ఎండ  తగలకుండా గొడుగు కానీ,   టోపీ కానీ , తుండుకానీ   వేసుకుని  ఎండ తగలకుండా చూసుకోవాలి. వీటికి పెద్ద ఖర్చేమీ అవదు.

గంటలతరబడి నిలబడటం కాకుండా,   ఒక కుర్చీ  వేసుకుని   అప్పుడప్పుడైనా కూర్చోవాలి.

స్టూల్ పైన కూర్చుంటే పొరపాటున పడిపోయే అవకాశం ఉంది. కుర్చీలో కూర్చోవటమే మంచిది. 

****************


  వేసవిలో మిట్టమధ్యాహ్నం  మండుటెండలో తలపై ఏ ఆచ్చాదన లేకుండా బయటకు వెళ్తుంటారు కొందరు. 

పని హడావిడి వల్ల కావచ్చు, ఏమవుతుందిలే అనే అశ్రద్ధ వల్ల కావచ్చు, కొందరు జాగ్రత్తలు తీసుకోరు.  

ఎండాకాలంలో బయట తిరిగేవారు తలకు, చెవులకు వస్త్రం కట్టుకుంటే మంచిది.

    **************

  ఇక,   స్కూల్ పిల్లలను    క్లాస్ రూములో   కుర్చీలో   గంటల తరబడి   కూర్చోబెట్టి,   ఒక క్లాస్ తరువాత వెంటనే మరొక  క్లాస్     చెప్పడం కాకుండా, 

ఒక క్లాసుకు మరొక క్లాసుకు పది నిముషాలు గాప్ ఇస్తే,   పిల్లలు  కొంత సేద తీరుతారు . 

బాత్రూం  కు  వెళ్లడానికి కూడా అనువుగా ఉంటుంది. 

ప్రొద్దున్ననగా  ఇంటి  నుండి   బయలుదేరిన పిల్లలకు   క్లాసుల మధ్యలో కొంత విరామం ఇవ్వాలి.

**************


ఇవన్నీ చిన్నచిన్న ఏర్పాట్లే.   తరువాత అనారోగ్యం   వచ్చి  బాధపడేకన్నా ,  ముందే   కొన్ని   జాగ్రత్తలు   తీసుకుంటే మంచిది.


No comments:

Post a Comment