koodali

Monday, August 3, 2015

శంభూక వధ...

 
శ్రీరాముల వారు..శబరి ఇచ్చిన పండ్లను చక్కగా స్వీకరించారు.  గుహునితో  స్నేహం  చేసారు. పక్షి అయిన జటాయువు యొక్క అంత్యక్రియలను నిర్వహించారు. అలాంటి రాములవారిని అపార్ధం చేసుకోవటం పొరపాటు.


 శూద్ర కులానికి చెందిన భక్తురాలైన శబరిని కరుణించిన రాముడు శంభుకుని తపస్సు చేసినంత మాత్రాన్నే వధించటం ఎందుకు జరుగుతుంది ?
........................ 

రాముడు.. శూద్రుడైన శంభూకుని సంహరించటం  గురించి ...నాకు ఏమనిపిస్తోందంటే..

కొందరు మంచి కోరికలతో, ఉద్దేశ్యాలతో తపస్సులు చేస్తారు.

 కొందరు మనసులో స్వార్ధపరమైన కోరికలతో తపస్సులు చేస్తూ పైకి మంచిగా కనిపిస్తారు.
........................ 

బహుశా శంభుకుడు విపరీతమైన  కోరికలతో  తపస్సును చేస్తూ ఉండి ఉంటాడు ..  అందుకే రాములవారు వధించి ఉంటారు.
....................... 
 
రాక్షసులు కూడా తపస్సులు చేయటం, దేవతలు వరాలు ఇవ్వటం జరుగుతుంటుంది.

రాక్షసులే తపస్సు  చేసి వరాలను పొందుతుంటే  ..   మానవులలో కొన్ని కులాల వాళ్ళు తపస్సులు చేయకూడదు...  అనే విధానం   ఉంటుందని అనుకోనవసరం లేదు.
.........................
ప్రహ్లాదుని వంటివారు రాక్షస జాతికి చెందినా..  దైవ భక్తులై దైవానుగ్రహాన్ని పొందారు. 

 కానీ కొందరు రాక్షసులు స్వర్గాన్ని , దేవతలను జయించాలని తపస్సులు చేసారు... శిక్షించబడ్డారు. 
....................... 

 శంభూకుడు బొందితో స్వర్గానికి వెళ్ళాలని తపస్సు చేస్తున్నట్లుగా ఒక దగ్గర చదివాను.

హరిశ్చంద్రుని తండ్రి అయిన త్రిశంకుడంతటి వారినే బొందితో స్వర్గానికి రావటానికి .. ఇంద్రుడు అంగీకరించ లేదు.

 ఇవన్నీ గమనిస్తే, శంభూకుని వధించటానికి కులం అన్నది కారణం కాదనిపిస్తుంది.

ఈ విషయంలో మనకు తెలియని మరికొన్ని కారణాలు కూడా ఉండి ఉండవచ్చు.
...................... 

Shudra Hindu saints అని అంతర్జాలంలో చూస్తే ఎందరో భక్తుల వివరాలు ఉన్నాయి.  


నందనార్ అనే శూద్ర భక్తుని దైవం కరుణించటం ....వంటి విషయాలను గమనిస్తే , దైవం దృష్టిలో అందరూ సమానులే అన్న విషయం అర్ధమవుతుంది.



No comments:

Post a Comment