koodali

Monday, May 24, 2010

అనుకున్నది ఒకటి .......జరుగుతున్నది ఒకటి........

 

నేను ఒక విషయం చెప్పాలను కుంటున్నానండి. నేటి శాస్త్రవేత్తలను అగౌరవపరచాలని నా ఉద్దేశ్యం ఎంతమాత్రం కాదండి. వారిలో కూడా దైవభక్తులు, ప్రజలకు మంచి చేయాలని తాపత్రయ పడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు.


ఆ మద్య ఒక న్యూస్ లో కరెంట్ వల్ల కూడా మనుష్యులకు స్కిన్ కాన్సర్ వస్తుందని చెప్తున్నారు. ఇలా కరెంట్ వల్ల కాన్సర్, సెల్ ఫోన్ వల్ల బ్రైన్ కాన్సర్ ఇలా అంటే మాలాంటి సామాన్యులకు భయమే కదండీ. ఇవన్నీ కనిపెట్టటం ఎందుకు అని ఒక ఆలోచన కూడా వస్తుంది మరి..


అయినా కాన్సర్ కు కూడా ఎవరూ భయపడనంత స్టేజ్ కి ఈ వస్తువులు మనకి అలవాటు అయిపోయాయి లెండి.

నాకు తెలిసినంతలో ఇంకో ఉదాహరణ చెప్పాలనుకుంటున్నానండి.మొక్కలు బ్రతకడానికి నత్రజని , కాల్షియం ఇలాంటివి అవసరం. భూమిలో ఉండే నత్రజనిని మొక్కలు స్వయముగా పీల్చుకోలేవు. భూమిలో, వాతావరణములో ఉండే బాక్టీరియా, వైరస్, ఇలాంటివి రాలిన ఆకులు వేరే వ్యర్ధపదార్దములు వీటిని కుళ్ళపెడతాయి. వాటి ద్వారా మొక్కలు నత్రజని స్వీకరిస్తాయి. అలా మొక్కలు, బలంగా పెరుగుతాయి. బలంగా ఉన్న మొక్కలు గాని, మనుష్యులు గాని త్వరగా జబ్బు పడవు. ఒకవేళ ఆకులను తినే పురుగులు ఆశించినా ఆ పురుగులను తినటానికి చిన్న, చిన్న పక్షులు వస్తాయి. ఇలా ప్రక్రుతిలో ఒక సహజమయిన రక్షణ సర్కిల్ ఏర్పడి ఉంది. పాత కాలం ప్రజలు కూడా వేప, పసుపు ఇలాంటి సేంద్రియ ఎరువులు వాడేవారు.


ఇక ఇప్పుడు మనం రసాయనిక ఎరువులు వాడుతున్నాము. దానివల్ల ఏమవుతోంది....మొక్కలపైన చీడ పీడలతో పాటు, నత్రజని లాంటి పోషకాలను అందించే మంచి బాక్టీరియా కూడా చనిపోతోంది.ఈ మద్య పక్షులు కూడా పెద్దగా కనిపించటము లేదు. ఆశ్చర్యకరమయిన విషయమేమిటంటే మొక్కలకు హాని కలిగించే పురుగులు మాత్రం ఆ మందులకు తట్టుకుని విపరీతంగా పెరిగిపోవటం. ఇలా మనం ఒకటనుకుంటే ఇంకోటి జరుగుతోంది. మొక్కలకు సహజమయిన నత్రజని ఇచ్చే బాక్టీరియా చనిపోవటం వల్ల రసాయనిక నత్రజని, యూరియా వాడుతున్నాము.ఇలా మొక్కల ప్రక్రుతిలోని సహజమయిన సైకిల్ అంతా డిస్ట్రబ్ చేశాం గదా..



ఇక పాత కాలం నాటి మనుష్యులు ఎంత బలంగా ఉండేవారో, నేడు మనం ఎలా ఉన్నామో అలోచిచండి. అప్పుడు పెరట్లో గోంగూర తెచ్చి ఒక పచ్చడి, ఒక కూర తో భోజనం చేసినా అప్పటి వాళ్ళు ఈజీగా 5,10 కిలోమీటర్లు నడిచేవారు. ఇప్పుడు మనం రోజూ రకరకాల జ్యూసులు, కాలరీస్ లెక్కపెట్టుకుని ఎంత ఆహారం తిన్నా ఒక కిలోమీటర్ నడవటం కష్టంగా ఉంది.


ఆ ఆహారం కొంచెమయినా బలమయినది. ఇప్పుడు హైబ్రీడ్ పంటల వల్ల ఎన్ని టన్నులు పంట తిన్నా లావు అవ్వటం తప్ప ఓపిక రాని ఆహారం. మరి ఎక్కడ ప్రాబ్లం ఉందో అందరం ఆలోచించాలి.


మనం అంతులోని ఆశలతో మన భావితరా అంటే మన పిల్లలకు నిజంగా మంచి చేస్తున్నామా.....లేక ప్రక్రుతిని అంతా గందరగోళం చేసి అస్తవ్యస్తమయిన భావి జీవితాన్ని వాళ్ళ కిస్తున్నామా అన్నది నాలాంటి సామాన్యుల బాధ...శాస్త్రవేత్తలు ఈకోఫ్రెండ్లీ టెక్నాలజీ తయారు చేస్తే ఎంత బాగుంటుందో. వాళ్ళు ఆ ప్రయత్నాలలో ఉన్నట్లు న్యూస్ లో చెబ్తున్నారు లెండి.. . .

మీ ప్రయత్నాలు సఫలం కావాలని ఆ దైవాన్ని కోరుకుంటున్నాను అండి.


నేను ఒక ముఖ్యమయిన పని వల్ల ఒక వారం బ్లాగ్ రాయటం కుదురుతుందో లేదో తెలియటం లేదండి. ఇంతకు ముందు ఇలా నా అభిప్రాయములు చెప్పుకోవాలని ఎంతో అనుకోవటం జరిగేది. ఏదో ఇలా మీ అందరి దయవలన నా బాధలు మీ అందరితో చెప్పుకుంటున్నాను. దీనికి సహాయం చేస్తున్న ప్రతిఒక్కరికి నా క్రుతజ్ఞతలు.మా ఇంట్లో వారు కూడా విన్నా వారందరికి నా మీద జాలి దేశం లోని సమస్యలు అన్నీ నెత్తి మీదకు తెచ్చుకుని బాధ పడతానని.అయితే నేను కూడా అప్పుడప్పుడు ఆనందముగా ఉంటానండోయ్..మా బంధువులు ఏమటారంటేనండీ, నీకు దేవుడు అన్ని ఇచ్చినా సంతోషముగా ఉండటం చేతరాదని.

 నిజమే భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు. కోట్ల కొద్ది రూపాయలు లేకపోయినా మాకు మరీ అత్యాశ లేదు కాబట్టి అన్నీ ఉన్నట్లే.ఇంతకు ముందు ఒక ఊర్లో అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళం. వారిలో కొందరు ఏమని అనేవాళ్ళంటే ఇక్కడ ఉన్న అందరికంటే మీరు అద్రుష్టవంతులని.

 

 అయితే నేను ఎందుకు బాధగా ఉంటానని మీ సందేహము కాబోలు ....నాకున్న చిన్న బాధలను పెద్దవిగా ఆలోచించటం ,మళ్ళీ దేశం లోని సమస్యలను గురించి బాధపడటం అనే అలవాట్ల వల్ల మా బంధువులు నా మీద అలా జాలిపడుతుంటారండి. సంతోషంగా లేకపోవటం నా ఖర్మ అని . ఇంకా దేశం లోని సమస్యలు నువ్వు ఏమయిన తీర్చగలవా అనికూడా కోప్పడతారు.ప్రపంచములోని ప్రతి జీవి ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని కొరుకుంటున్నాను.

 

3 comments:

  1. మనలో కూడా మంచి బాక్టీరియా ఉన్నది. అవి లేక పోతే మనము జీవించ లేము. చెడ్డ బాక్టీరియా ని చంపుదామని మందులు వేసుకుంటే అవి మంచి బాక్టీరియా ని కూడా చంపుతాయి. అందుకని మంచి బాక్టీరియా ఉండే Probiotics వేసుకోవాలి. సింపుల్ గ అవి మన పెరుగు మజ్జిగలో ఉంటాయి. అందుకనే విదేశాలలో యోగర్ట్ కి ప్రాముఖ్యత ఎక్కు వయ్యింది.వంద రకాల యోగర్ట్ లు. ఇదంతా ఒక విష వలయం.
    చక్కటి వ్యాసం వ్రాసారు. థాంక్స్.

    ReplyDelete
  2. >> "ఇక పాత కాలం నాటి మనుష్యులు ఎంత బలంగా ఉండేవారో, నేడు మనం ఎలా ఉన్నామో అలోచిచండి"

    వాళ్ల సగటు ఆయుర్దాయం ఎంతుండేదండీ?

    చాలా తక్కువ.

    ఎందుకు?

    ReplyDelete
  3. >> "ఇక పాత కాలం నాటి మనుష్యులు ఎంత బలంగా ఉండేవారో, నేడు మనం ఎలా ఉన్నామో అలోచిచండి"

    బ్రతికినంత కాలం బలంగా బ్రతికారని నేను అర్ధము చేసుకున్నాను.

    ReplyDelete