koodali

Friday, May 7, 2010

జీవులు ఆహారము లేకుండా బ్రతుకలేవా................

 

ఈ మద్య దేవుని గురించి , జీవులు ఆహారము లేకుండా బ్రతుకలేవా అన్నదానిపైన చర్చలు జరుగుతున్నవి కదా.ఇప్పుడు ఒక పెద్ద ఆయనను చూపిస్తున్నారు గదా ఉదాహరణగా ........ అదేమో నమ్మరు. ఆర్మీ వాళ్ళు గానీ , తిండి లేని పేదలుకి గాని ఆ టెక్నిక్ చెప్పమంటున్నారు. సరే మరి వాళ్ళందరూ పనులు మానేసి హఠ యోగం గాని మెడిటేషన్ గానీ చెయ్యగలరా? .చాలా కాలం చేస్తే గానీ ఆ విద్యలు అందరికీ రావు మరి..


.. నాకూ పూర్తిగా తెలియదు గాని కొన్ని మంచు గడ్డ కట్టే ప్రాంతములలో చేపలు ఇంకా కొన్ని జంతువులు కొన్ని నెలలు ఆహారము లేకుండా నిద్రాణ స్తితిలో ఉంటాయట. మంచు కరిగిపోయి మొక్కలు ఆహారము దొరికే సమయములో ఆ స్తితి నుంచి లేస్తాయని ఎక్కడో చదివాను.


అసలు సైన్స్ అంటే ఏమిటి? నీరు, గాలి, పర్వతములు, భూమి , జంతువులు, గ్రహములు ఇలాంటి వాని గురించి తెలుసుకోవటము. ఇవన్నీ మీరో నేనో కనిపెట్టలేదు కదా....సైన్సే మాకు దేవుడు అని కొంతమంది అంటున్నారు. ఆ సైన్స్ను స్రుష్టించిన ఆ సూపర్ పవర్ ని మా లాంటి ఆస్తికులు దేవదేవుడని అంటున్నాము ...........

..మనము చెయ్యలేకపోతే పెద్ద పూజలు చెయ్యక్కరలేదు. మనస్సులో భగవంతుని ఆప్యాయముగా తలచుకుంటే చాలు అదే పెద్ద భక్తీ.

మా నమ్మకము వల్ల మీకు ఏమి నష్టం? మీరు ఏమయినా భూకంపములు, సునామీలు,అగ్నిపర్వతములు,ఆక్సిడెంట్స్ వాటిని ఆపగలరా? సత్ప్రవర్తనతో ఆ భగవంతుని నమ్మితే ఆయన ఆపదల నుండి తప్పించే అవకాశము ఉంది అని మేము నమ్ముతున్నాము. మనము మంచు పర్వతాలను ,మహా సముద్రాలను ,కొత్త గ్రహాలను సృష్టించ లేము కదండి........

పూర్వ జన్మలో మనము మహాపాపాలు చేశామనుకోండి...దానికి దేవుడుని అని ఏమి లాభం. ఈ జన్మలో సత్ప్రవర్తనతో ఉంటే కనీసం శిక్ష తగ్గుతుందని ఆశ.



మీరు ఎన్నని ఎప్పుడు కనిపెట్టగలరు? ఒక బెర్ముడా ట్రయాంగిల్ ......ఒక క్రాప్ సర్కిల్స్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మీరు మలేరియాకు,పోలియోకు మందులు కనిపెడితే కాన్సర్, ఎయిడ్స్ ,స్వయిన్ ప్లూ, బర్డ్ ఫ్లూ,,,ఒకదానితరువాత ఒకటి వస్తూనే ఉంటాయి........... దేవుడు కూడా మీకు సరదాగా సవాల్ విసురుతూ ఉంటాడు.దేవుడు స్రుష్టించిన స్రుష్టిలో ఉంటూ ఆయన ఇచ్చిన గాలి,నీరు పీలుస్తూ ఆయనతో ఆప్యాయముగా ఉండటము మన కనీస కర్తవ్యము. .


. దేవుడు కనిపించలేదని మీరు అంటారు. ఎందుకు కనిపించటము లేదు.... .. ఎన్నో వేల సంవత్సరములనుండి వెలుగుతున్న సూర్యుడు, చంద్రుడు భూము, ఆకాశము దేవునిగా మేము నమ్ముతున్నాము. ఇంకా ఆయన విశ్వరూపం మీరు చూడాలనుకుంటే మీరు కొన్ని నియమాలతే దేవుని ఆరాధించండి..... కొన్ని సంవత్సరములకు తప్పక కనిపిస్తాడు.


మీరు ఏదయినాచూడాలనుకున్నా, తినాలనుకున్నా మీ శరీరముతోనే కదా ప్రయత్నించాలి. మనము ఆలోచించాలంటే మన మనస్సు ద్వారానే ఆలోచించాలి ....ప్రక్క వాళ్ళ మనస్సు ద్వారా ఆలోచించలేము కదా .......అలాగే మీరే ప్రయత్నించాలి. ........ 

 ఒక డాక్టర్ చదవాలంటేనే కొన్ని సంవత్సరములు ఎన్నో త్యాగాలు చెయ్యాలి. మరి ఆ పరమాత్మను తెలుసుకోవాలంటే కొంచెము శ్రమపడాలి మరి.....


.విదేశముల వారే నయము మన ప్రాచీన సైన్స్ సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేనిదని తెలుసుకుని పసుపు,వేప ఇంకా ఇలాంటి వాని గురించి తిరిగి మనకు చెప్తున్నారు. నాకు పెద్దగా ఏమి తెలియదు. మా ఫోన్ నంబర్ కూడా నాకు గుర్తు ఉండదు ఒకోసారి .. అలాంటి నేను ఈ కొంచెము అయినా రాయగలుగు తున్నాను అంటే ఆ భగవంతుని దయే...

 

2 comments:

  1. >>అసలు సైన్స్ అంటే ఏమిటి? నీరు, గాలి, పర్వతములు, భూమి , జంతువులు, గ్రహములు ఇలాంటి వాని గురించి తెలుసుకోవటము. ఇవన్నీ మీరో నేనో కనిపెట్టలేదు కదా

    ఎంత చక్కగా చెప్పారు. ఆ సృష్టి ని సృష్టించిన వారిని ప్రార్దిన్చట మే కదా దేముడిని ప్రార్దిన్చట మంటే. "దేవా స్వతంత్రం గా వాడుకోమని నాకు నువ్విచిన మనసుతో తప్పులు చేస్తే క్షమించు నీ సృష్టి లో ఒక భాగామే కదా నేను." అని చెప్పటం. ఏ రూపములో ప్రార్ధించినా ఆ సృష్టి కర్తనే.

    ReplyDelete
  2. ఈ పోస్ట్ పై మీ అబిప్రాయములు చెప్పినందుకు థాంక్స్ అండి. రాసిన విషయము నచ్చినందుకు మెనీ మెనీ థాంక్స్ అండి.

    ReplyDelete