koodali

Monday, May 3, 2010

మన పెద్దలు తెలివి తక్కువ వారు కాదు కదా....

సైంటిస్త్స్ ల కే సైంటిస్ట్ అయిన ఆ భగవంతునికి నమస్కారములు.

మనలో కొందరు మన ఆచారములను, మన పురాతన విద్యలు అయిన ఆయుర్వేదం, సంగీతము,,జ్యోతిష్యం,యోగా,మంత్రములు, గొప్పతనమును నమ్మరు. మన మహర్షులు,పెద్దలు మనకు అందించిన ఇలాంటి గొప్ప సైన్స్ ని ఎగతాళి చేస్తుంటారు.ఈ విధముగా చెయ్యటము నా ఉద్దేశ్యములో మన పెద్దలను మనం మిగతా దేశముల వారి ముందు అవమానించటమే. అంటే మనలను మనము అవమానించుకోవటమే.


పెద్దలు ఎన్నో త్యాగములతో మనకు అందించిన సైన్స్ను మనము పూర్తిగా అర్ధము చేసుకోలేకపోవటము మన అజ్ఞానము. ఎన్నో తరముల నుండి రావటము వల్ల ఒకటి,రెండు ఆచారములలో కొంత చాదస్తము అనిపించవచ్చు.

కొంతమంది అమాయకులు కూడా కొన్ని ఆచారములు ప్రవేశపెడుతుంటారు. అలాంటి వాటిని పట్టుకుని వీరు మిగతా అన్నింటిని కూడా ఎగతాళి చేస్తుంటారు. మన ఆయుర్వేదం, యోగా ఎంత గొప్పవో ఇప్పుడు అందరికి తెలిసిందే. మన సంగీతము వలన చాలా ఉపయోగములు ఉన్నాయని ఇప్పుడు చాలా మంది అంగీకరిస్తున్నారు కదా!


,జ్యోతిష్యం అయితే ఏ టెక్నాలజీ సహాయము లేకుండా పండితులు గ్రహణములు ,గ్రహముల సంచారము ఇవన్ని ముందే పంచాంగములో చెప్పటము మనము చూస్తూనే ఉన్నాము. ఎక్కడో ఉన్న గ్రహములకు మానవుల జీవితమునకు ఏమిటి సంబంధము అని వీళ్ళు అడుగుతారు. మరి ఎక్కడో ఉన్న సూర్యుని ఎండ మనకు తగిలి చురుక్కుమనటము లేదా!

పౌర్ణమి,అమావాశ్య రోజులలో సముద్రం యొక్క ఆటు,పోటులు మారటము లేదా? సూర్య,చంద్రులను బట్టి సన్‌ఫ్లవర్,తామర,కలువ పువ్వులు యొక్క రియాక్షన్ మనం చూస్తూనే ఉన్నాము.మరి మనుస్యుల జీవితముల మీద వాటి ప్రభావం ఉండటములో సందేహము ఏమిటి?


శబ్ద తరంగములకు చాలాశక్తి ఉన్నది నేటి చాలా సైన్సు పరికరములు ఆ సూత్రము వల్లనే పనిచేస్తున్నాయి కదా. మంత్రములు కూడా కొన్ని బీజాక్షరములు ఏర్చి కూర్చి తయారుచేసిన అధ్భుత శబ్ధతరంగములు. వాటి శక్తి అసమానం.


ఇంకా మనకు తెలియని రహస్యములు ఎన్నో ఉన్నవి. మనకు తెలియనంత మాత్రాన అవి అన్నీ మూడాచారములు అనటము మోడర్న్ మూఢత్వము.


అసలు విదేశములవారు వారి కట్టడములను ,ప్రాచీనమయిన వారసత్వమును బాగా గౌరవించుతారు. మనము వారినుంచి అలాంటి మంచి అలవాట్లు నేర్చుకోవాలి.


ఇప్పుడు మన తిరుమలలో అనంత స్వర్ణమయము, ప్రాజెక్ట్ పేరుతో జరుగుతున్న విషయము మనకు తెలిసినదే. ఆ శాసనములకు రంధ్రములు పెట్టి బంగారు తాపడము ఎందుకు చెయ్యాలో అర్ధము కావటము లేదు. సామాన్య ప్రజల మాట ఎవరూ వినరు. అక్కడి పండితుల ను సంప్రదించి దాని ప్రకారము చెయ్యటము మంచిది కదండి. .

దయచేసి నా తప్పులను ,పెద్ద మనస్సుతో అందరూ క్షమించాలి అండి. ...మిడిమిడి జ్ఞానముతో ఏదేదో రాసాను.............................

థాంక్స్, కామెంట్స్ చదివాక నాకు తెలిసినంతలో ఇలా చెప్పాలనిపించింది

కరెక్టో కాదో తెలియదు మరి.

kనాకు గొప్ప నాలెడ్జ్ లేదు కాని నాకు తెలిసినంతవరకు చెప్పటానికి ప్రయత్నిస్తాను అండి.జ్యోతిష్యము లో గ్రహములు వాటి సంచారము బట్టి మన జాతకమలు చెప్పబడుతాయి. రెండవ స్తానమును బట్టి కుటుంబము, పంచమములో ఉన్న గ్రహములను బట్టి సంతానము, 12వ స్తానమును బట్టి మోక్షమును ఇలా చెప్పవచ్చును.


ఇంకా పౌర్ణమి,అమావాస్యలలో మనుష్యుల మనస్సు మీద ప్రభావము ఉంటుందని శాస్త్రవేత్తలు ఒప్పుకున్నారు.కొన్ని నేరములు కూడా ఆరోజులలో ఎక్కువ జరుగుతున్నాయని వారు చెప్పినట్లు పేపర్స్లో చదివాను.


ఇక ultrasoundఅన్నది నేడు మెడిసినల్ గా స్కానింగ్ చెయ్యటానికి,,మరియు ఇండస్ట్రీస్ లో బాగా ఉపయోగపడుతోంది net లో చాలాinformationఉన్నది. . కొన్ని శబ్ద తరంగములు మనము వినలేము.చిన్నపిల్లలు,వినగలరు.కుక్కలు ,ఆవులు,దాల్ఫిన్స్,ఇలాంటి జంతువులకు ఆ శక్తి ఉంటుంది.అందువల్లనే భుకంపములు లాంటివి అవి ముందుగా గుర్తించగలవు.మెడిటేషన్ అవి బాగా చేసే వారికి కొన్ని గొప్ప శక్తులు ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. థాంక్స్ ....

6 comments:

  1. లేదు బాగా వ్రాసారు. మీరు చెప్పిన విషయాలు మంచివే. తెలుసుకోగలిగితే వేదాలలో శాస్త్ర విజ్ఞాన విషయాలు చాలా ఉన్నాయి.

    శ్రీవాసుకి
    srivasuki.wordpress.com

    ReplyDelete
  2. జ్యోతిష్యం అయితే ఏ టెక్నాలజీ సహాయము లేకుండా పండితులు గ్రహణములు ,గ్రహముల సంచారము ఇవన్ని ముందే పంచాంగములో చెప్పటము మనము చూస్తూనే ఉన్నాము.

    అయ్యా జ్యోతిష్యం వేరు. ఖగోళ శాస్త్రం వేరు. గమనించగలరు. ఖగోళ శాస్త్రాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు కదా.

    పౌర్ణమి,అమావాశ్య రోజులలో సముద్రం యొక్క ఆటు,పోటులు మారటము లేదా? సూర్య,చంద్రులను బట్టి సన్‌ఫ్లవర్,తామర,కలువ పువ్వులు యొక్క రియాక్షన్ మనం చూస్తూనే ఉన్నాము.మరి మనుస్యుల జీవితముల మీద వాటి ప్రభావం ఉండటములో సందేహము ఏమిటి?

    అయితే అందరి మనుష్యుల మీదా(అమావాస్య కి పున్నమికి) ఆ ప్రభావం ఉండాలి కద. మరి ఎందుకు ఉండటం లేదు.

    శబ్ద తరంగములకు చాలాశక్తి ఉన్నది నేటి చాలా సైన్సు పరికరములు ఆ సూత్రము వల్లనే పనిచేస్తున్నాయి కదా. మంత్రములు కూడా కొన్ని బీజాక్షరములు ఏర్చి కూర్చి తయారుచేసిన అధ్భుత శబ్ధతరంగములు. వాటి శక్తి అసమానం.

    దీన్ని నిరూపించె పరిశొదన ఎమైనా జరిగిందా ?

    ReplyDelete
  3. పెద్దల మీద గౌరవం ఉంటే మంచిదే. అయితే పెద్దలు చెప్పినవన్నీ నిజమని మనం అనుకుంటే మన అభివ్రుద్ధి అక్కడే ఆగుతుంది. అసలు మన పెద్దలు కూడా ఇప్పుడూ మీరు ఆలోచించినట్లు ఆలోచించి వాల్ల పెద్దలు చెప్పింది నిజమని భావిస్తే మనం ఇంకా అడవుల్లో ఆటవికుల్ల ఉండే వాల్లం. కాబట్టి మన పెద్దలని నిజంగా గౌరవించాలంటే వాల్లు మనకు అందించిన విగ్న్యానాన్ని సరి చేసి తప్పులని వదిలేసి మనవంతుగా కొత్తవి కనిపెట్టాలి.

    ఇక మీరు చెప్పిన జ్యోతిషాలు, మంత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు వీలయితే వాటిని సమర్ధించే పరిశిధన చేసి చూపించండి.

    ReplyDelete
  4. >>అయితే పెద్దలు చెప్పినవన్నీ నిజమని మనం అనుకుంటే మన అభివ్రుద్ధి అక్కడే ఆగుతుంది.
    Nachiket గారూ మీరు చెప్పింది కరెక్ట్ కాదు.పాతవన్నీ తప్పు అనుకుని కొత్త ప్రయోగాలు చెయ్యలేము. పాత శాస్త్రాన్ని ఇంప్రూవ్ చేయ్యటానికి ప్రయత్నిస్తాము.ఇన్ని విద్యా సంస్థలు ఇన్ని డాక్టరేట్లు రావు. పాత విజ్ఞానం తప్పు అని వారిని కించ పరచట ము కూడా తప్పే. నీల్సు భోర్ ఎలాక్ట్రోన్స్ గుండ్రంగా తిరుగు తాయని చెప్పాడు. అసలు ఇప్పుడు ఎలోక్ట్రోన్స్ కనపడవు అవి తరంగాలు అంటున్నారు.
    మీ వ్యాఖ్య బహుశ వేద పండితులు వ్రాసిన దాన్ని మీద అయ్యుంటుంది. అది కూడా తప్పే. మన యోగా చెప్పడం ఇప్పుడు అమెరికా లో ఒక నాగరికమయి పోయింది. అల్లాగే గొడ్డు కారం ఆయింటు మెంటు ని, పసుపు కాప్సుల్స్ ని అమ్ము తున్నారు. మన ఆయుర్వేదము మీద మనకు నమ్మక ముంటి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎవ్వరో మన పూర్వులు వ్రాసినవి చదివి నేర్చుకుని (పతంజలి యోగా శాస్త్రము, ఆయుర్వేదము) మనకే అమ్మితే కోనోక్కో వలసిన దుర్గతి పట్టింది.
    మిగతా వాటికి కూడా రంగు పూసి మనకే అమ్ముతారు చూస్తూ ఉండండి. మన తెలివి తేటలమీద మనకే నమ్మకము లేక మిడి మిడి జ్ఞానం తోటి ప్రతీది ప్రశ్నిస్తుంటే చివరికి జరిగేదదే.
    థాంక్స్ ఫర్ ది పోస్ట్.

    ReplyDelete
  5. Rao S Lakkaraju గారికి

    ప్రశ్ననుంచే విఙ్న్యానం ఉదయిస్తుంది. మన అయుర్వేదాన్ని, యోగాని తెల్లవాడు ముందు ప్రశ్నించి అది సరి అయినదే అని తెలుసుకుని ఇప్పుడు మనకే అమ్ముతున్నాడు. మనం గుడ్డిగా నమ్మే అలవాటు చేసుకున్నం కనుక మనం ఎందుకు నమ్ముతున్నామో అది ఎందుకు మంచిదో బయటివారికి చెప్పలేక మన శాస్త్రంలో కూడా వెనుక పడ్డాము.

    ఇక పోతే నేనన్నది..అది దేనిగురించీ కాదు, జెనెరిక్ స్టేట్మెంట్. పెద్దలు వాల్లకి తెలిసిన నాలెడ్జి ని ఉపయోగించి చెప్పిన విషయాలని ఇప్పుడు మనకు తెలిసిన సైన్సుతో చూసి సరి అయినవాటిని తీసుకుని, కాని వాటిని వదిలి వేయాలి. అంతే కానీ పెద్దలు చెప్పారు కాబట్టి ఇంకా రాహువు కేతువు మింగితేనే గ్రహణాలు వస్తాయి, ఆ సమయంలో గుడులు మూసుకోవాలి, గర్భినులు బయట తిరగవద్దు లాంటి వాటిని ఇంకా నమ్మగలమా?

    మీరన్నట్టు పాత విఙ్యానాన్న్ని అంతటినీ తప్పని నేనట్లేదు, అలాగే అన్నింటినీ పెద్దలు చెప్పారు కదా అని నమ్మొద్దని చెబుతున్నాను. అలా నమ్మితే మనం ఇంకా భూమి బల్లపరుపుగా ఉంది, విశ్వానికి భూమి కేంద్రమని నమ్మేవాళ్ళం. ఈ విషయాలు మన పెద్దలు చెప్పలేదు, తెల్లవారి పెద్దలు చెప్పారు అని మాత్రం అనకండి. అవి మనవారు చెప్పారో లేదో నాకు తెలియదు కానీ ఎవరి పెద్దలయినా వారు చెప్పిన విషయాలని అనీ డిఫాక్టో స్టాండర్డ్ గా తీసుకోకుండా వెరిఫై చేసుకోవాలి.

    ReplyDelete
  6. Nachiket గారూ నేను శాస్త్రాలు చదవలేదు. ఆ చదివే జ్ఞానం కూడా నాకు లేదు. కాకపోతే తెలుసుకుంటాను. ప్రతీది తప్పో ఒప్పో తెలుసుకుని ఆచరించ డానికి మన జీవితం సరిపోదని నేను అను కుంటాను. అందుకని విజ్ఞులు చెప్పింది నేను నమ్మటానికి ప్రయత్నిస్తాను వాటి వలన మనకు నష్టము కలుగదు అని అనుకుంటే.ఎవరు విజ్ఞులు అనేది వారి వారి సంస్కారాముని బట్టి వారు నిర్ణయించు కుంటారు.
    చాలా మంది మరచి పోయేది, ఏ కాలంలో మన సంస్క్రు తికి సంభందించిన విషయాలు వ్రాసారు (వేదాలు మొదలయినవి.). ఆ కాల పరిస్థుతులలో మన పరిజ్ఞానము తో చూస్తె చదువు తక్కువ. ఎవరి గ్రూప్ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వేదాలు శాస్త్రాలు వ్రాసే వాళ్ళు వ్రాసు కుంటున్నారు. పంటలు పాండిచ్చే వాళ్ళు పండిస్తున్నారు. గ్రూప్స్ మధ్య పరిజ్ఞానము పంచుకోవటము(information exchange) కూడా వుంది. వేదాలు శాస్త్రాలు వ్రాసే వాళ్ళు ఇతరులకి చెప్పాలంటే ఎలా చెబుతారు. వాళ్ళ కి అర్ధమయ్యే భాషలో. అప్పుడు కాగి తాలు కాలాలు ఏమీ లేవు DNA టెస్ట్లు బ్లడ్ టెస్టులు లేవు.తెలిసినదల్లా కనపడేవి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, రాల్లు రప్పలు. మన పెళ్లి సాంప్ర దాయాదులు చక్కగా ఉన్నాయి. మన జాతిని చక్కగా అభివృద్ధికి తెచ్చుకున్నాము(reproduction) వాటి కోసమే గుడి మీద బొమ్మలు.
    కాగా పోగా అలనాటి ఆ సంస్కృతిని ప్రపంచానికి ఇచ్చాము. యోగా క్లాస్స్ కు వెళ్ళండి ఓం లు ఎలా వినపడు తయ్యో.అవి మంత్రాలు కావా? పురాతన నాగరికత ఈ నాటి ప్రపంచానికి ఇంకెవరు ఇచ్చారో చెప్పండి.
    నాకు తెలియదు.
    నేను ఇందాకే చెప్పినట్లు పెద్దలు చెప్పినవి వెరిఫై చేసుకుంటూ బతకాలంటే మన జీవితం సరిపోదు. మన చదువు విజ్ఞత జ్ఞానం అక్కడే ఉపకరించేది.
    క్షమించండి కొంచం ఇమ్మోషనల్ అయిపోయాను.

    ReplyDelete