koodali

Monday, May 10, 2010

మన ప్రాచీన కాలం నాటి పెద్దలు జ్ఞానులే, ఈ నాటి శాస్త్రవేత్తలను కూడా మనము గౌరవించాలి.

మన ప్రాచీన కాలం నాటి పెద్దలు జ్ఞానులే.ఈ కాలం నాటి పెద్దలను కూడా మనము గౌరవించాలి. ఇక్కడ పెద్దలు అంటేనండి సమాజమునకు మంచిని చేసేవారని నా ఉద్దేశ్యము.


ఇవన్నీ రాయటములో నా ఉద్దేశ్యము కొంతమంది, దేవుని,ప్రాచీన సైన్స్ ను ఎగతాళి చేస్తున్నారు కాబట్టి భాధతో రాస్తున్నాను. మన ప్రాచీన కాలము నాటి సైన్స్ గొప్పతనము గురించి ఈ నాటి శాస్త్రవేత్తలు కనిపెట్టి చెబుతున్నందుకు నిజముగా ఈ నాటి సైంటిస్ట్స్ ను మనము గౌరవించాలి ..........

ఇక ఆ మద్య ఒక బ్లాగ్ లో కొన్ని కామెంట్స్ చదివాను ,నేను రాసిన టపా చదివినందుకు అందరికీ థాంక్స్ అండి. ఆ బ్రదర్స్ రాసిన దానిగురించి నా అబిప్రాయములు ఏమంటే......


1.గ్రహణము సమయములో గంగా స్నానము చెయ్యటము గురించి నా ఉద్దేశ్యము ఏమంటే గ్రహణము టైంలో వెలువడే హానికరమయిన కిరణముల ఎఫ్ఫెక్ట్ తగ్గుతుందని కావచ్చు. గంగా నది నీరు చాలా రోజులు నిలువ ఉంచినా తొందరగా చెడిపోదని పాపం విదేశాల శాస్త్రవేత్తలు కనుక్కున్నారు కదండీ.ఆ సమయములో దర్భ కూడా వాడుతారు పెద్దలు. దర్భలో రేడిఏషన్ తగ్గించే గుణం ఉందని విదేశా........ మనము ఇంకా ఎక్కువ పరిశోధన చేసి కొత్త విషయములు తెలుసుకోవచ్చుకదా.ఎంతకూ మనలను మనము తక్కువ చేసుకునే బదులు....



2.ఇంకా మీరు గ్రహణసమయములో పుట్టిన మీ ఫ్రెండ్స్ కొందరి గురించి చెప్పారు. వాళ్ళు ఆరోగ్యముగానే ఉన్నారని, బహుశా ఆ సమయములో వారి మదర్స్ జాగ్రత్తలు తీసుకుని ఉండవచ్చు. కొందరు రెసిస్టెంట్ పవర్ ఎక్కువ ఉన్నవాళ్ళు తట్టుకోవచ్చు. ఇంకా కొత్త రకము జబ్బులు రాకూడదని పెద్దలు జాగ్రత్తలు చెప్పిఉండవచ్చు.


3.ఇంకా కణాదుల వారు కణమును కనిపెట్టారు. పంచభూతముల యొక్క అంశ కణములో ఉంటేనే కణము నుండి పంచభూతములతో కూడిన శరీరము ఏర్పడుతుందని పెద్దల ఉద్దేశ్యము కావచ్చు కదండి..


4. భూమి ఒకప్పుడు బల్లపరుపుగా కూడా ఉండి ఉండవచ్చు. ఆతరువాత భగవంతుడు గుండ్రముగా మార్చి ఉండవచ్చు. దేవుని గుడులలో వరాహ స్వామి వారి ప్రతిమలలో భూమి గుండ్రముగానే ఉండటము మనకందరికి ఎప్పుడో తెలుసు. మన పెద్దలు పూర్వ కాలములో విశ్వములో జరిగిన సంఘటనలు కధతో పాటు సింబాలిక్ గ మనకు చెప్పారేమో.

 

 ఆ ప్రకారము ఇలా ఆలోచిస్తే ......ఒకప్పుడు హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టి సముద్రములో వేశాడని ఒక పుస్తకములో చదివినట్లు గుర్తు.... ఆ తరువాత వరాహస్వామివారు భూమిని రక్షించి పైకి తీస్తారు. ఇవన్నీ విశ్వములో జరిగిన ఒక సంఘటనను సూచిస్తున్నాయేమో. 

 

ఒకప్పుడు యూరోప్,ఆసియా కలిసే ఉండేవని ....గోండ్వానా ల్యాండ్ అనేది ఉండేదని నూతన పరిశోధనలు చెప్తున్నారు. కొన్ని లక్షల సంవత్సరముల కాలములో భూమి ఆకారం మారి ఉండవచ్చు. ఇది నా ఊహ మాత్రమే. భగవంతుడు క్షమించాలి. తోచింది రాస్తున్నందుకు...


5.బ్రదర్ నచికేత గారు జనం దేవుని గురించి ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నారని బాధ పడ్డారు. ఈ రోజుల్లో చాలా మంది తమ విలాసాలకు కోట్లలో డబ్బు ఖర్చుపెడుతున్నారు మరి.


6. ఈ నాటి సైన్స్ యొక్క సైడ్ ఎఫ్ఫెక్ట్స్ గురించి కూడా అందరూ ఆలోచిస్తే బాగుంటుంది కదండి. ...........

తప్పులను అందరూ దయచేసి క్షమించాలండి..

 

3 comments:

  1. very good analasys, keep it up.
    manam bharateeyulam manaku vunnadi okkate vaakswatantram adi ippudu verri talalu vestundi ante brother.
    hindutwam gurinchi so called prajna vantulu chestunna vimarsalu veroka matam pai chesi chudamanandi "chamadalu valichi chetilo pedataru" manaloni anaikyata bhavaaniki prateeka ituvanti vaalla vipareeta pokadalaku.

    ReplyDelete
  2. మీరు ఈ టపా చదివినందుకు చాలా చాలా థాంక్స్ బ్రదర్.

    ReplyDelete
  3. నేను ఈ మాత్రం అభిప్రాయములు చెప్పగలగటం ఆ భగవంతుని దయ. ఇందులో తప్పులను దయ చేసి ఆ దైవం క్షమించాలి. మీరు కూడా అందరూ బాగా రాస్తున్నారు అండి.

    ReplyDelete