koodali

Friday, April 30, 2010

కల కానిది నిజమయినది.....

ఈ మద్య నాకు ఒక కల వచ్చిందిలెండి.అందులో మా పొరుగూరి పెద్ద న్యాయమూర్తి ఒకరు ఒక సంచలన తీర్పు ఇచ్చారు. అది ఏమిటంటే నండి,మరి టీనేజ్ లోని పిల్లలు కలిసిమెలిసి ఎలా తిరిగినా చట్టప్రకారం తప్పు లేదని .నేను ఇలాంటి తీర్పు ఎప్పుడూ వినలేదు మరి.కల కాదేమో అనుకున్నాగాని కలయే.


ఇంకా మన సమాజములో చాలా జాతులలో ఇలాంటి అలవాట్లు ఉన్నాయి అని ఉదాహరణలు కూడా చెప్తున్నారు.... సమాజములో నేడు చాల మంది టినేజ్ వాళ్ళు కలిసి సహజీవనం చేస్తున్నారని కూడా సెలవిచ్చారు.

మరి నేటి సమాజములో చాల మంది నేరాలు,ఘోరాలు. కూడా చేస్తున్నారు. అలా అని అవి కూడా చట్టప్రకారము తప్పు కాదు అని .......దయచేసి అనవద్దు... అని నేను అంటున్నట్లు ...........................


నా భయం ఏమిటంటేనండీ చాలా జాతులలో ఇంకా చాలా విచిత్రమయిన అలవాట్లున్నాయి కదా...ఉదాహరణకు .:..దొంగతనము చేస్తే కాలో ,చెయ్యో విరిచెయ్యటము, ఇంకా కొన్ని తప్పులు చేస్తే జాతిబహిష్కారం ...... ఇలాంటివి అన్నమాట. మన పాత కాలములో ఇలాంటివి అమలులో ఉండేవి..మరి పెద్దలుసమాజములో ఇలాంటి వాటిని,ఉదాహరణలుగా తీసుకుంటే ,............ ముందు ముందు ఎలాంటి తీర్పులు చెప్తారో మా పొరుగూరి పెద్ద న్యాయమూర్తి...... ....


అప్పుడు నేను ఏమని అనుకున్నాను అంటే మోరల్ వాల్యూస్ కు,విలువ లేనప్పుడు ఇక న్యాయం , ధర్మం ,నైతికవిలువలు అన్న పదాలకు అర్ధం ఏమిటి! అప్పుడు ఇక న్యాయ మూర్తులు ఎందుకు అని... . ఇదండి నాకల.


నాకు ఏమని అనిపిస్తుందంటే అన్నింటికి ఆ సర్వోత్తమ న్యాయమూర్తి ఆ భగవంతుడే దిక్కు అని......... .. ..........

3 comments:

  1. >>మన పాత కాలములో ఇలాంటివి అమలులో ఉండేవి..మరి పెద్దలుసమాజములో ఇలాంటి వాటిని,ఉదాహరణలుగా తీసుకుంటే ,............ ముందు ముందు ఎలాంటి తీర్పులు చెప్తారో మా పొరుగూరి పెద్ద న్యాయమూర్తి...... ....
    Good thought.Nijam gaa dongatanaalaki etc neraalaki sikshalu kathinam gaa amalu chesthe anta kannaa emi kaavaali.oka manchi parinaamame adi.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete