koodali

Wednesday, February 19, 2014

తెలుగువాళ్ళలో ఐక్యత ...

 
ఆంధ్రప్రదేశ్ లో  సీమాంధ్ర...తెలంగాణా  అనే  రెండే  ప్రాంతాలు  ఉండి  ఉంటే  బహుశా  విభజన  వ్యవహారం  ఇంత  క్లిష్టంగా  తయారయ్యేది  కాదేమో ? తెలంగాణా  విడిపోతే  సీమాంధ్రకు  ఒక  రాజధానిని  ఏర్పాటు  చేస్తే  అభివృద్ధి  చేసుకునే వారు. 

 మన  దురదృష్టం  ఏమిటంటే  ,   తెలుగువారిలో  ....తెలంగాణా  వారు ,  రాయలసీమ వారు ,  కోస్తా  వారు,  ఉత్తరాంధ్ర  వారు  అనే  భేదాలు  ఉన్నాయి.  అలా   ఎందుకు  ఉన్నాయో  ? 


 తెలుగువారు  అందరూ  ఒకటే  అనుకుంటే  ఈ  బాధలు  లేకుండా  ఒకే  రాజధానితో  విశాలాంధ్రగా  ఉండేవాళ్ళం.

 తెలంగాణా  కోసం , సమైక్యాంధ్ర  కోసం  అంటూ... ఉద్యమాలు,  బందులతో  ఇప్పటి  వరకూ  చాలా కాలం  గడిచిపోయింది.


  ఇక  సీమాంధ్రలో  కొత్త  రాజధాని  కోసం   ఉద్యమాలు,  బందులూ  మొదలవుతాయేమోనని  భయంగా  ఉంది. 

 రాజధానిని  మా  ప్రాంతంలో  పెట్టాలంటే  మా  ప్రాంతంలో  పెట్టాలంటారు. మా  ప్రాంతంలో  రాజధాని  ఏర్పాటు  చేయకపోతే  మేము  వేరే  రాష్ట్రం  కోరతామని  కొందరు  అంటూన్నారు.


మళ్ళీ  ప్రత్యేక  రాష్ట్రవాదాలు   వచ్చే  అవకాశం  కూడా  ఉంది. ఈ  గొడవలతో  ఎంతకాలం  వేగాలి  ? 


ప్రజాసమస్యలకు  పరిష్కారం  లేకుండా  విభజన  ఉద్యమాలతోనే  సంవత్సరాలు  గడిచిపోయేలా  ఉన్నాయి.  ఇక  ప్రజాసమస్యలను   పట్టించుకునేదెప్పుడు   ? 


ఎలాగూ  తెలంగాణా  విడదీస్తామంటున్నారు.  పనిలోపనిగా  కోస్తాను,  రాయలసీమను,  ఉత్తరాంధ్రానూ  కూడా  విడదీసెయ్యండి.  విడిపోయి  రాజధానులను  ఏర్పాటు  చేసుకుని  ఎవరి  బ్రతుకులు  వారు  బ్రతుకుతారు.    



అంతేకానీ ,  మళ్ళీ  సీమాంధ్రకు  ఎక్కడో  ఒక  దగ్గర  రాజధానిని  ఏర్పాటు చేయటం,  దానిని  అభివృద్ధి  చేయటం...కొంతకాలానికి,  అదిమాదే  మీరు  వేరే  రాజధానిని  వెతుక్కోండి .... అని  ఎవరైనా  అంటే  తట్టుకునే  శక్తి  జనాలకు  లేదు.


ఇలా  జరగకుండా  ఉండాలంటే  కొత్త రాజధానిని  ఎక్కువగా  అభివృద్ధి  చేయకుండా   రాష్ట్రంలోని  అన్ని  ప్రాంతాలనూ  సమానంగా   అభివృద్ధి  చేయాలి. అవసరమైతే  ఉపరాజధానులను    ఏర్పాటు చేయాలి . 


  ప్రజలు  రాష్ట్రంలోని  ఇతర  ప్రాంతాలకు  ఎక్కువగా  వలస  పోకుండా  ఎక్కడికక్కడ  ఉపాది  అవకాశాలను  కల్పించాలి.

ఉమ్మడి  రాజధాని  మాదే ... అని  ఇకమీదట  ఎవరూ  అనకుండా  ముందే  ఖచ్చితంగా  మాట్లాడుకోవాలి.

............................


ఈ  రాష్ట్రం  విషయంలో  బీజేపీ..కాంగ్రెస్  దొందూదొందే  అని   మరోసారి  నిరూపించుకున్నాయి.
.....................................

  పార్లమెంట్లో  జరిగిన  గొడవలు చూసి  దేశంలో  చాలా  మందికి   మనస్సు  బాధతో  నిండిపోయిందట.  


 నిజమే  పార్లమెంటులో  జరిగిన  విషయాలు   బాధాకరమైనవే.  అయితే  పరిస్థితి  ఇంతవరకూ  వచ్చేలా  చేసిందెవరు ?

 దేశానికి  చెందిన   లక్షల  కోట్ల  సంపద  విదేశాల్లో  మూలుగుతున్న  వార్తలను,  దేశంలో  జరిగిన  లక్షల  కోట్ల  రూపాయల  అవినీతి  స్కాముల  గురించి  తెలుసుకున్నప్పుడు  కూడా   దేశ  ప్రజల  మనస్సు   ఎంతో   బాధతో  భారంగా  ఉంటోంది.

పార్లమెంటులో  జరిగిన  గొడవ  వల్ల   దేశం  పరువుపోయిందంటూ  గగ్గోలు  పెడుతూ  తెలుగువాళ్ళను  నిందిస్తున్న  మిగతారాష్ట్రాల  వాళ్ళు ,  జర్నలిస్టులు...దేశంలో  జరిగిన  అవినీతి  స్కాముల  పట్ల  ఎందుకు  గట్టిగా  మాట్లాడరు ? 


దేశంలో  జరిగిన  అవినీతి  స్కాముల   వల్ల  దేశం  పరువు  పోలేదా  ?  అందరికీ  తెలుగువాళ్ళే  అలుసైపోయారా  ?

సీమాంధ్రులు   కూడా   కొన్ని  విషయాలను  గ్రహించాలి.    గత  కొన్ని  సంవత్సరాల  నుంచీ  సమస్యను  సరిగ్గా  పట్టించుకోకుండా ,  ఇప్పుడు   చట్టసభల్లో  గొడవలు  చేయటం  వల్ల  సమస్య  పరిష్కారం  అవ్వకపోగా  సీమాంధ్రుల  సమస్య  ప్రక్కకు  వెళ్ళి,  సానుభూతిని  కోల్పోయే  అవకాశం
  ఉంది .

అయితే, సీమాంద్రులు  తమ  సమస్యల  పరిష్కారం  కోసం  సరైన పద్ధతిలో  ప్రయత్నించుకోవటంలో  తప్పులేదు.    

  తెలుగువాళ్ళలో  ఐక్యత  తక్కువని  ఇప్పటికే  అందరికీ  తెలుసు. ఈ  విషయం  మళ్ళీ  మరొకసారి  నిరూపితమయింది  అంతే.





6 comments:

  1. స్వార్ధమే పరమార్ధం గా ఉన్న మన రాజకీయ నాయకులు చేసేదేమీ లేదు. అసలు రాజకీయాల గురించి ఆలోచించడం చాలా వ్యర్ధం అనిపిస్తోందేమో కూడా! అంత నీచంగా ఉన్నారు, ఎవరు? మనవారే!

    ReplyDelete
    Replies

    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      అసలు రాజకీయాల గురించి ఆలోచించడం చాలా వ్యర్ధం అని అనుకోకూడదండి.

      దేశంలో ఇప్పుడు ఉన్నది ప్రజాస్వామ్యం కదా! సమాజ నిర్మాతలు, నిర్ణేతలు ప్రజలే.

      ఇలాంటప్పుడు రాజకీయాల గురించి ప్రజలు పట్టించుకోకపోతే రాజకీయనాయకులు వారి ఇష్టప్రకారం వ్యవహరిస్తారు. అప్పుడు నష్టపోయేది ప్రజలే.

      Delete
  2. శ్రీబాగ్ ఒడంబడిక గురించి మీకు తెలుసా?

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      శ్రీబాగ్ ఒడంబడిక గురించి కొంతవరకూ తెలుసండి.

      కొన్ని ఇతర రాష్ట్రాలలో రాజధాని కన్నా ఎక్కువగా ఇతర నగరాలు అభివృద్ధి చెందాయి. ఇలాంటి పరిస్థితి ఉంటే రాజధానికి ప్రాముక్యత ఎక్కువగా ఉండదు.

      గుజరాత్, మహారాష్ట్ర, కేరళ ... వాళ్ళు తెలివిగా తమ రాష్ట్రాల లోని ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసుకున్నారు.

      తెలుగువాళ్ళేమో రాజధాని మాత్రమే ఎక్కువ అభివృద్ధి అయ్యేలా చేసుకుని ఇప్పుడు తీరికగా బాధపడుతున్నారు.

      రాజధాని ఏర్పాటు విషయంలో ఎన్నో విషయాలను పరిశీలించాలి. లేకపోతే భవిష్యతులో సమస్యలు రావచ్చు.

      రాజధాని రాష్ట్రానికి బోర్డర్స్ వద్ద ఉండకూడదు. బోర్డర్లో ఉంటే భవిష్యత్తులో పక్క రాష్ట్రాలలో కలిసే ప్రమాదముంది.

      ఇప్పటికే కొన్ని ప్రాంతాలు ఇతర రాష్ట్రాలలో కలిసిపోయాయి, ఉదా..బళ్ళారి కర్ణాటకలో కలిసింది, ఒరిస్సాలో కూడా కొన్ని ప్రాంతాలు కలిసాయి.

      ఆధునిక కాలంలో రాజధాని అంటే ఎన్నో పరిశ్రమలు, కట్టడాలు ఉంటున్నాయి. అందుకు వందల ఎకరాల స్థలం అవసరం అవుతుంది.

      రాజధాని వల్ల , సారవంతమైన పంటపొలాలను పరిశ్రమలకు, భారీ కట్టడాలకు వినియోగిస్తే పంటలు పండించటానికి భూమి కరువవుతుంది.

      ఇలా ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకోవాలి.


      Delete
  3. ఇది ప్రజల విజయం. ఈ చార్తిత్రిక క్షణం అమరవీరులకు అంకితం.

    Jai Telangana

    ReplyDelete
  4. తెలంగాణా ఉద్యమంలో యువత చనిపోవటం అన్నది అత్యంత బాధాకరమైన విషయం.

    ReplyDelete