koodali

Friday, June 29, 2012

వివేకానందుల వారి గురువైన రామకృష్ణ పరమహంస గురించి.....

శ్రీ రామకృష్ణ  పరమహంస,  శ్రీ  శారద  మాత ,  
  శ్రీ వివేకానందుల వారికి  అనేక  నమస్కారములు,

 శ్రీ  వివేకానందుల  వారి    గురువైన  రామకృష్ణ  పరమహంస జీవితంలో   జరిగిన  ఒక  సంఘటన  ఇది.  

ఒక  తల్లి  తన  చిన్న  కొడుకును  తీసుకుని  రామకృష్ణ పరమహంస  వద్దకు  వస్తుంది. 

ఆ  బాబు  తీపి   పదార్ధాలను  అతిగా  తింటుంటాడు.  అది   అనారోగ్యం  కాబట్టి,  ఆ    అలవాటును   ఎలా  మానిపించాలో  సలహా  చెప్పమని  ఆ  తల్లి   రామకృష్ణుల  వారిని  అడుగుతుంది.


 అప్పుడు  రామకృష్ణులు ,  వారిని    మరునాడు  రమ్మని  చెబుతారు.   ఈ  విధంగా    కొద్దిరోజులు  గడిచిన  తరువాత  ,  ఒక  రోజు  రామకృష్ణుల  వారు  ఆ  బాబుతో .... తీపి  అతిగా  తినవద్దని  చెబుతారు.  



  ఈ    విషయం  చెప్పటానికి  ఇన్నిరోజులు  ఎందుకు  ?  ముందు రోజే  చెప్పవచ్చు  కదా  !  అని  ఆ  తల్లికి  సందేహం  వచ్చి అడిగితే,


  రామకృష్ణుల  వారు  ., ..తల్లీ  నాకూ  తీపి  అతిగా  తినే  అలవాటుంది.  ఆ  అలవాటును  నేను  తగ్గించుకోకుండా  ఇతరులకు  ఎలా  సలహా  ఇవ్వగలను  ?  ఆ  అలవాటును  తగ్గించుకోవటానికి  నాకు  ఇన్ని  రోజుల  సమయం  పట్టింది  .  అని  చెబుతారు. 
  

5 comments:

  1. రామకృష్ణ కధామృత౦ చదవండి. ఎన్నో కొత్త విషయాలు మీకు తెలుస్తాయి. మీకు వీలయితే రామకృష్ణ జీవిత చరిత్రలు మూడు రకాల సైజులలో వున్నాయి మొత్తం చదవ తగ్గవే.వివేకానందుడి కన్నా రామకృష్ణుడి జీవిత చరిత్ర లే బాగుంటాయి. మీరు కారణాలు చెప్ప గలరేమో ప్రయత్ని౦చ౦డి లేక పొతే ఆనాడు మీకు ఏది ఏమిటో ఎలానో మీకు వివరణ చెపుతాను.

    ReplyDelete
  2. మీలో ఏదో వ్రాయాలనే తపన వున్నది భావ గాఢత లేదు అందు వలన కొన్ని పోస్ట్ లు సగం మాత్రమే బాగుంటున్నాయి.దీనికి పెద్ద ఉదాహరణలు మీరు నా పోస్టులో పెట్టిన పెద్ద కామెంట్, మరొకటి సతిసహగమనం మీద మీ పోస్ట్.
    ఏమి అనుకోకమ్మ బాగా రాయాలని ప్రయత్నం చేస్తున్నావని. అవి అర్ధప్రయోగాలు గా వుండక అర్ధవంత ప్రయోగాలు గా మారాలి అని నా భావాన.
    నా కామెంట్ వలన నీకు అర్ధం లభించు కాక.

    అర్ధ : మూడు రకాల ప్రయోగాలు

    ReplyDelete
    Replies
    1. మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు కృతజ్ఞతలండి. నాకు తెలిసినది చాలా తక్కువ. నాకు తెలిసినంతలో వ్రాస్తున్నాను అంతేనండి. నాకు చాలా విషయాలు తెలుసని నేను అనుకోవటం లేదు.

      నేను వ్రాసిన విషయాలలో పొరపాట్లు ఉంటే తప్పక సరిదిద్దుకుంటాను. పొరపాట్లను ప్రపంచానికి అందించకూడదు కదా !

      నేను కొద్దికాలం శ్రీరామకృష్ణమఠంలో స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ తీసుకున్నాను. చాలావరకు తెలుగు మీడియంలో చదివిన నేను ఈ మాత్రం ఇంగ్లీష్ చదవగలుగుతున్నానంటే రామకృష్ణ మఠం వల్లనేనండి. తద్వారా M.A. HisTory లో డిగ్రీ పట్టా అందుకున్నాను.

      నాకు శ్రీ రామకృష్ణపరమహంస, శారదామాత, వివేకానందుల వారంటే ఎంతో గౌరవం.....

      Delete
  3. మీ అభిప్రాయాలను వ్రాసినందుకు నేను తప్పుగా అనుకోవటం లేదండి. సద్విమర్శల వల్ల మంచే జరుగుతుంది.

    మీరు చక్కటి టపాలను రాస్తారు. ఇక మీ పోస్ట్ లో పెట్టిన కామెంట్ అంటే , ...... ఆ టపాలో మీరు వ్రాసిన అతిధి సత్కారాల గురించి నేను ఇంతకు ముందు చదవలేదు.

    పూర్వం ఇలాంటి ఆచారాలు ఉండేవి కాబోలు ...... అని గిట్టనివాళ్ళు హేళన చేస్తారని అనిపించి నా అభిప్రాయాలను వ్రాసానండి.

    పాపమో ? పుణ్యమో ? నాకు తెలియదు కానీ, అలాంటి ఆచారాలను నేను సమర్ధించను. ....పెద్దలు కూడా ఇలాంటి ఆచారాలను ప్రోత్సహించారని నేను అనుకోవటం లేదు.

    సతీసహగమనం గురించి నేను రాసిన టపాలో మీకు ఏ అంశాలు తప్పుగా అనిపించాయో దయచేసి చెప్పగలరు.

    ReplyDelete
  4. నేను సుభద్ర కీర్తి గారి టపాలో వ్రాసిన వ్యాఖ్యను గురించి మరికొన్ని వివరాలు రాయాలనుకుంటున్నానండి.

    సుభద్రకీర్తి గారు , మీరు మీ బ్లాగులో " శ్వేతకేతు అనే వాడు బహుభర్త వ్యవస్థ ని రద్దు పరచి ఏకపత్ని వ్యవస్థను ప్రారంభించాడు. " అని రాసారు.

    శ్వేతకేతు మహా భారత కాలం నాటి వ్యక్తి అనుకుంటున్నాను. ( నాకు తెలిసినంతలో ) .

    కానీ, మహాభారతం కన్నా ప్రాచీనకాలం నాటి రామాయణ కాలంలోనే ఏకపత్నీవ్యవస్థ ఉంది . ఇంకా సనాతనమైన వేదాల్లోనే చక్కటి కుటుంబవ్యవస్థ గురించి , భార్యాభర్తల విధుల గురించి చెప్పబడిందంటారు.

    బహుశా శ్వేతకేతు వారి సమయంలో పరిస్థితుల ప్రాబల్యం వల్ల సమాజంలో కొన్ని వింత ఆచారాలు ఉండి ఉండవచ్చు. అప్పుడు శ్వేతకేతువు ఏకపత్నీవ్యవస్థను పునరుద్ధరించి ఉండవచ్చు.

    అంతేకానీ, ఏకపత్నీవ్రతం అనేది శ్వేతకేతువు నుంచే ప్రారంభమవలేదు అన్నది నా అభిప్రాయం.

    ( నాకు తెలిసినంత వరకు , ఈ శ్వేతకేతు తాతగారు అయిన అరుణుడు ధౌమ్యుని శిష్యులట. ధౌమ్యుడు పాండవుల కాలం నాటి వారని అంటారు కదా ! )

    ఇంకా మీ టపాలో ఈ బహు భర్త వ్యవస్థ పై చార్వాకులు ( దేవుణ్ణి నమ్మని వారు ) తమదైన అలోచన చేశారు. ...............అంటూ శివపార్వతుల గురించి .............కొన్ని బాధాకరమైన విషయాలను రాసారు.

    నా అభిప్రాయాలను కొద్దిగానైనా వివరించకపోతే అందరూ నన్ను అపార్ధం చేసుకుంటున్నారు. అందుకే ఇవన్నీ రాయవలసి వచ్చింది. ఇదంతా మళ్ళీ వివరించటం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అయినా తప్పనిసరి పరిస్థితిలో ఇవన్నీ వివరించవలసి వచ్చింది. దయచేసి అపార్ధం చేసుకోవద్దని కోరుకుంటున్నానండి.

    నా అభిప్రాయాలను తెలపటానికే కానీ ఎవరినీ నొప్పించటానికి ఇవన్నీ రాయలేదని మనవిచేసుకుంటున్నాను...

    మీరు దయచేసి ఒకసారి " Rahul Sankrityayan " గారి గురించి వికీపిడియాలో చదవండి..

    ReplyDelete