koodali

Monday, June 18, 2012

దేవతలు, వారి యొక్క వాహనాల విషయంలో.... 2వ భాగము.


 దేవతల యొక్క వాహనాల విషయంలో ఎన్నో అంతరార్ధాలు ఉంటాయట.

    ఉదాహరణకు .... సరస్వతీ దేవి వాహనమైన హంసకు నీటిని , పాలను వేరు చేసి పాలను స్వీకరించే శక్తి ఉంటుంది అని ,....అలా మానవులు కూడా చక్కటి జ్ఞానాన్ని కలిగి జీవించాలి అంటారు.

 

    ఇలా కొంతవరకూ దేవతల వాహనముల గురించి సింబాలిక్ గా మనం ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు అంటారు.

 
    Hindu vehicles, Hindu gods vahana's, Ganesh, Shiva, Lakshmi ...    ఈ లింకులో దేవతల వాహనాల గురించి కొన్ని వివరములు   ఉన్నాయి.

 

  శని  దేవుని  వాహనం  గురించి   ఇలా  చెప్పారు.....    Raven / Vulture / Crow.....అని.

 ఇంకా  ,గృధృ  వాహనాయ  అని  గ్రంధములో  ఉన్నది.


  శనిదేవుడు  జంతువాహనాన్ని  కూడా  అధిరోహించి  ఉండటం  కొన్ని  చిత్రాల్లో  కనిపిస్తుంది.
 

శని  భగవానుడు న్యాయమూర్తిగా కూడా పిలువబడతాడు. ఈయన, వ్యక్తి చేసిన పాప కార్యములకు తన దశలో శ్రమ పెట్టును. శని దోషం ఉన్న సమయంలో కూడా వ్యక్తి ధర్మంగా మరియు భక్తితో ఉన్నచో ఖచ్చితంగా చెడు ప్రభావములనుండి బయటపడగలడు.

 

 శని దేవుడు గొప్ప పరిశుద్ధుడు, అసత్యమైనదంతా నశించిపోయి సత్యమైనది మాత్రమే ప్రకాశిస్తుంది అనేది ఆయన సందేశం. అని   పెద్దలు  తెలియజేసారు..

 
 
సుబ్రహ్మణ్య స్వామికి  నెమలి  వాహనం.  ఆ  నెమలి  ఒకప్పుడు  శూరపద్ముడనే  రాక్షసుడట.  తారకాసుర  వధ  సమయంలో  సుబ్రహ్మణ్యస్వామి  శూరపద్ముని  జయించి  అతనిని  నెమలిగా  తన  వాహనంగా  చేసారని  చెబుతారు.  ఈ  విషయంలో    మరికొన్ని  కోణాలలో  కూడా  అర్ధములు  చెప్పారు  కొందరు.. 

 

   పురాణేతిహాసాల్లో  ప్రతి  విషయానికి  ఎన్నో   కోణాలు,  ఎన్నో అంతరార్ధాలు  ఉంటాయి.  అందుకే  పురాణేతిహాసాలు  ఎంతో  గొప్పవి.

 

శ్రీ  దత్తాత్రేయ  స్వామి  వారు  పశుపక్ష్యాదుల  నుంచి  కూడా  మనం  ఎన్నో  విషయములను  నేర్చుకోవచ్చని  చెప్పటం  జరిగింది..



ఈ  లింక్ లో  ఆ  వివరములు  ఉన్నాయి........

24 Preceptors of Shri Dattatreya


******************

3 comments:

  1. నమస్కారం,
    చాలా చక్కని విషయాలు పొందుపరుస్తున్నారు, చాలా సంతోషం.
    చిన్న సవరణ - గ్రహాలను "ఈశ్వర" శబ్దంతో సంభోదించకూడదు. శనీశ్వరుడు కాదు శనైశ్చరుడు- నెమ్మదిగా కదులువాడు అని అర్ధము..

    ReplyDelete
  2. కళ్యాణిగారు, మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు.
    గ్రహాలను "ఈశ్వర" శబ్దంతో సంభోదించకూడదు. ..అని నాకు తెలియదు. విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదములండి.

    ReplyDelete
  3. శ్రీ శనీశ్వర, శ్రీ శనేశ్వర అని కూడా పుస్తకాలలో వ్రాసారు మరి.

    ReplyDelete