koodali

Saturday, June 28, 2014

పురాణేతిహాసాలలో కొన్ని సంఘటనలు...

 
 
పరాయి  స్త్రీని  తల్లిగా  గౌరవించమని  పెద్దలు   గట్టిగా   తెలియజేశారు. అలాంటప్పుడు  ఇతరుల   భార్యను   కోరటం  అనేది  పెద్దలు  ఏర్పరిచిన  ఆచారం  కాదని  గట్టిగా  చెప్పవచ్చు.  అలాంటప్పుడు పరాయి స్త్రీని కోరుకునే ఆచారాలు సమాజంలో ఏర్పడటానికి కారణం ప్రజల ఆశలు, కోరికలే......

ప్రజలు తమ కోరికలకు అనుగుణంగా ఆచారాలను మార్చివేస్తారని అర్ధమవుతోంది.

పురాణేతిహాసాలలో  కొన్ని  సంఘటనలు   గిట్టనివాళ్ళు  చేర్చిన  ప్రక్షిప్తాలు  కూడా  కావచ్చు.  పోనీ  నిజమే  అనుకుంటే   ఇలా  కూడా  ఆలోచించవచ్చు....


  ఆ నాటి సంఘటనల నుంచీ ..... ఈ నాటి టెస్ట్ ట్యూబ్ బేబీలు , సర్రొగేట్ మదర్స్ వరకు ...... సంతానం కొరకు తరతరాల నుంచి ....ఎన్నో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయని తెలుస్తోంది...
 
ఈ  రోజుల్లో  కొందరు  స్త్రీలు    స్పెర్మ్  బేంకుల  సాయంతో  సంతానాన్ని  పొంతుదున్నారు.  అరుదుగా  కొందరు   మగవారు    సరోగేట్ మదర్  సాయంతో    సంతానాన్ని  పొందారని  వార్తలలో  విన్నాము. ( విదేశీ  సెలబ్రిటీ )

పూర్వం  కూడా  కొందరు  పురుషులు  సంతానం  కోసం   స్త్రీల  అద్దెగర్భాల  పద్ధతిలో  సంతానాన్ని  పొందేవారేమో  ?
........................


బృహస్పతి  వారి  విషయంలో  దేవరన్యాయం  అనేమాట  ఉపయోగించారు.  కాబట్టి  సంతానం  కోసమే  బృహస్పతి  మమత  అనే  ఆమెను  అడిగి  ఉంటారు.

అయితే,  బృహస్పతి    ఎందుకు  అలా  అడిగారో  తెలియదు.  అప్పుడు  నిజంగా  ఏం  జరిగిందో  మనకు  తెలియదు.  ఈ  కధ  గురించి  విభిన్నమైన  కధనాలు  ఉన్నట్లున్నాయి.  ఒక్కొక్కదగ్గర  వేరేవేరేగా  ఉంది.  ఏది  నిజమో  తెలియటం  లేదు.

 ఉదా.. ( గర్భిణిఅయిన యుతద్యుడనే ముని భార్య మమతను దేవరన్యాయంగా బృహస్పతి సంతతికోసం సంగమం కోరుతాడు. గర్భస్థుడైన బాలకుడిది అన్యాయమని ఎదిరిస్తాడు. .)  అని    ఒక  దగ్గర     చదివాను.

ఇక్కడ  నాకు  ఒక  సందేహం  వచ్చింది.    అప్పటికే  గర్భవతిగా  ఉన్న  స్త్రీ వల్ల  మరల సంతానాన్ని ఎలా పొందగలరో తెలియటం లేదు.

పోనీ  బృహస్పతి  మమతను   వాంచించారు  అనుకుంటే ?

 గొప్ప  వ్యక్తులలో  కూడా  కొందరు ,  కొన్నిసార్లు  తప్పులు  చేసే  అవకాశం  ఉందనీ  .. అందువల్ల  జాగ్రత్తగా  ఉండాలనే  నీతిని  మనము  తెలుసుకోవచ్చు.

......................

12  రకాల  పుత్రులలో  కొందరి  విషయం...

  స్త్రీకి కు  వివాహం  కాక  పూర్వమే  సంతానం  కలిగినా  ఫరవాలేదు  అని  పూర్వీకుల  అభిప్రాయం  కాదని  గట్టిగా  చెప్పవచ్చు.

ఉదా..  వివాహానికి  పూర్వమే   సంతానాన్ని  పొందటానికి   స్త్రీకి  సమాజంలో  హక్కు    ఉండి   ఉన్నట్లయితే ,  కుంతీదేవి  కర్ణుని   చక్కగా  పెంచుకునేది  కానీ,   బయట  వదిలేసేది  కాదుకదా  ! 

వివాహానికి  పూర్వమే  సంతానాన్ని  పొందటమనేది  ఆ  రోజుల్లో  కూడా  నిషిద్ధమే  అని  తెలుస్తోంది.

 అయితే,  12  రకాల  పుత్రుల  విషయంలో  వీరిని  ఎందుకు  చేర్చారంటే,  అభంశుభం  తెలియని  పిల్లలు  అనాధలు  కాకూడదనే  ఉద్దేశంతో    అలా  చెప్పి  ఉంటారు.  చాటుగా  పిల్లల్ని  కని  వదిలేస్తే  పిల్లలు  అనాధలుగా  పెరగవలసి  వస్తుంది. ఇలాంటి  పరిస్థితి  వల్ల  సమాజంలో  ఎన్నో  సమస్యలు  వస్తాయి.  ఇవన్నీ  ఆలోచించి  వాళ్ళనూ  పుత్రులుగా  చెప్పి ఉంటారు. 

స్త్రీలు  శారీరికంగా  బలహీనులు. అరటాకు  ముల్లు  సామెత  ప్రకారం  స్త్రీలు  ఏదో  కారణం  వల్ల (  బహుశా  పురుషుల  బలవంతం  వల్ల   కూడా  )   గర్భాన్ని  ధరిస్తే  ఆ  పుట్టిన  సంతానం  అనాధలు  కాకూడదనే  ఉద్దేశంతో  పూర్వీకులు  12  రకాల  సంతానంలో  కొందరిని ( ఉదా..  కానీనుడు,  సహోఢుఢు..వంటి వారిని  ) చేర్చి   ఉంటారు. 

అంతేకానీ,  స్త్రీలు  వివాహం  కాకముందే  పిల్లల్ని  కనవచ్చు,  లేక  వివాహం  తరువాతా   పరాయి  సంబంధాల  ద్వారా  పిల్లల్ని  కనవచ్చు ... అని  పెద్దల  అభిప్రాయం  కాదు.
.......................

ఇక,  సత్యవతీ,  కుంతి మొదలైన  వారి  విషయంలో  మాతృస్వామ్యం  కనిపిస్తోందని  కొందరంటున్నారు.  

 మాతృస్వామ్యం  అంటే  స్త్రీలకు  రాజ్యపాలన  ఉండాలి  కదా ! 

మరి,   సత్యవతి లేక  అంబా,  అంబాలికలు   రాజ్యపాలన  చేయలేదు  కదా  ?   ఇవన్నీ  గమనిస్తే , మాతృస్వామ్యం, పితృస్వామ్యం  అని  వేరేగా  లేవని  తెలుస్తుంది.

..............................


దయచేసి ఈ  లింకునూ  చూడగలరు..గోవు ...గృహప్రవేశం.

 
దయచేసి
గోవు ...గృహప్రవేశం.  పోస్ట్  వ్యాఖ్యలనూ  చూడండి.
.......................

ఇంకా,  ఏమనిపిస్తుందంటే,

వివాహం జరిగిన తరువాత స్త్రీ " అర్ధాంగి " అవుతుంది. .......అంటే భర్తలో అర్ధ భాగం అని. పెద్దలు చెప్పటం జరిగింది.
సనాతనమైన వేదాలలోనే ఏకపత్నీ, ఏకపతీ........గురించి చెప్పబడిందట.
వివాహమంత్రాలు ఇంకా " నాతిచరామి ........ " వంటివి గమనిస్తే భార్యాభర్తలు విషయంలో పెద్దల అభిప్రాయం అర్ధమవుతుంది.

పర స్త్రీని తల్లిలా గౌరవించాలని కూడా పెద్దలే తెలియజేసారు.
అలాంటప్పుడు పరాయి స్త్రీని కోరుకునే ఆచారాలు సమాజంలో ఏర్పడటానికి కారణం ప్రజల ఆశలు, కోరికలే......

ప్రజలు తమ కోరికలకు అనుగుణంగా ఆచారాలను మార్చివేస్తారని అర్ధమవుతోంది.
..................


* ' ఈ పురాణాలు మధ్య యుగం లో జరిగిన కొన్ని ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది. " .....అని కొందరు అంటారు.

* ఏది అసలైన విషయమో భగవంతునికే తెలియాలి....





2 comments:

  1. కొన్ని కొన్ని వైరుధ్యాలున్న మాట వాస్తవం. ఒక నిజం, మీరన్నట్లు పుట్టిన పసివాళ్ళని అనాధలుగా వదిలేయకూడదనే, పన్నెండు రకాల సంతానాన్ని ఒప్పుకున్నారు. ఇప్పటి స్త్రీ కంటె నాటి స్త్రీకి ఎక్కువ స్వాతంత్ర్యం ఉందన్న మాట నిజం.

    ReplyDelete
  2. మీకు కృతజ్ఞతలండి.

    అప్పటి స్త్రీల సంగతి ఎలా ఉన్నా, ఇప్పటి స్త్రీలలో చాలామందికి స్వాతంత్ర్యం ఎక్కువగానే ఉందిలెండి.

    ReplyDelete