koodali

Friday, January 7, 2011

సాయి సత్యవ్రతం గురించి నాకు ఈ విధంగా తెలిసిందండి.



ఈ విషయం కొంతకాలం క్రితం జరిగిందండి. అప్పుడు మాకు చిన్నచిన్న కష్టాలు వచ్చాయండి .

అప్పుడు ఒకరోజు రాత్రి నాకు ఒక కల వచ్చిందండి. ఆ కలలో నేను ఒక ఎర్రరంగు కారుని వంకరటింకరగా ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నానట . ( అప్పట్లో మాకు కారు లేదు . )

తరువాత కారు ఒక దగ్గర ఆగింది . అక్కడ శ్రీ సత్యనారాయణ వ్రతం పూజ జరుగుతున్నట్లు కలలో కనిపించిందండి . అక్కడ శిరిడీసాయిబాబా విగ్రహం కూడా కనిపించిందండి .


అయితే ఈ కల అర్ధం నాకు తెలియలేదు. నాకు అప్పటికి సాయిసత్యవ్రతం గురించి తెలియదండి. నాకు మామూలుగా మనము చేసే శ్రీ సత్యనారాయణ వ్రతం గురించి మాత్రమే తెలుసు. మేము అన్నవరంలో కూడా ఈ వ్రతం చేసుకున్నామండి .


అందుకని నేను ఏమనుకున్నానంటే, ఇదేమిటి ? కలలో సత్యనారాయణవ్రతం దగ్గర సాయిబాబా విగ్రహం కూడా కనిపించారు అనుకున్నానండి .

ఆ కల అర్ధం కాక సరే ఏమైనా దేవునికి సంబంధించిన కల రావటం మంచిదే కదా ! అని సంతోషించామండి .


తరువాత కొంతకాలానికి మేము శిరిడి వెళ్ళామండి . అక్కడ గుడి పరిసరాల్లో అన్నీ చూస్తోంటే , ఒక దగ్గర సాయిసత్యవ్రతం గురించిన వివరాలున్నాయండి .అలా సాయిసత్యవ్రతం గురించిన వివరాలు తెలుసుకున్నామండి .

నాకు నా కల గుర్తు వచ్చింది. ఆ కలకు సాయిసత్యవ్రతానికి సంబంధమున్నదేమో అని నాకు అనిపించిందండి. తరువాత దైవం దయవల్ల మేము సాయిసత్యవ్రతం ఆచరించుకున్నామండి.

అంతా భగవంతుని దయ ...

మనము దైవభక్తిని కలిగి ఉండటంతోపాటు దైవానికి ఇష్టమయిన మంచిపనులు చేస్తేనే మనకు మంచి జరుగుతుంది.


మనము దైవభక్తి , సత్ప్రవర్తన కలిగిఉన్నప్పుడు , మన కష్టాలు తీరే మార్గాన్ని దైవం చూపిస్తారు. నేను ఇలా ఉన్నప్పుడు నాకు గొప్ప ఆలోచనలు రావటం, మంచి జరగటం జరుగుతోంది .................అదే ఎప్పుడయినా నేను అనవసరంగా ఆవేశపడితే అప్పుడు నా ఆలోచనలలో పొరపాట్లు రావటం, నాకు ఏదైనా ఇబ్బంది కలగటం నేను గ్రహించానండి.


అందుకే ఇవన్నీ చూశాక నాకు ఏమని అనిపించిందంటేనండి, మనము ఇతరులకు మంచి చేస్తే మనకూ మంచి జరుగుతుంది.........చెడు చేస్తే మనకూ ఇబ్బందులు వస్తాయని ....


క్రితం జన్మలో చెడు చేసినా ...ఇప్పుడు మంచిగా ప్రవర్తించటం ద్వారా ఆ చెడు ఫలితాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని పెద్దలు చెబుతున్నారు కదండి. .......


నాకు మా ఇంటి ఫోన్ నంబరే ఒకోసారి గుర్తు రాదండి. అలాంటి నేను ఈ మాత్రం తోచిన విషయాలు రాస్తున్నానంటే అంతా భగవంతుని దయయే . నేను వ్రాస్తున్న వాటిల్లో మంచి ఆలోచనలను భగవంతుని దయగానూ , పొరపాట్లను నా తప్పులుగానూ భావిస్తున్నాను...

 

5 comments:

  1. మనము ఇతరులకు మంచి చేస్తే మనకూ మంచి జరుగుతుంది.........చెడు చేస్తే మనకూ ఇబ్బందులు వస్తాయని ....
    Very True

    ReplyDelete
  2. నిజమేనండి. మీకు ధన్యవాదములండి..

    ReplyDelete
  3. " చిల్లర రాళ్ళకు మొక్కుతువుంటే చెడిపోదువురా ఒరే ఒరే
    ఒక్కసారి ఆ సర్వేశ్వరునికి మొక్కిచూడరా హరే హరే " అని అన్నారు అండి. చిల్లరరాళ్ళు అంటే బాబాలు, దొంగ స్వాములు అండి. వీళ్ళకు గుళ్ళు కట్టి, స్త్రోత్రాలు కట్టి భజనలు చేయడమేమిటో అండి! అభిమానము, గౌరవము వుంటే వుండవచ్చు అండి. కాని ఇలా అభిషేకాలు, స్త్రోత్రాలు, అర్చనలకు తెగబడటం, చైన్-మైల్స్ రాసి పుణ్యమొస్తుందని అనుకోవడం అండి.. హుహ్ .. వెర్రి అని నా అభిప్రాయమండి, వీర బాబా ఆరాధకులకు నచ్చక " నీకు వారం రోజుల్లో ఏదో కీడు జరుగుతుంది" అని శాపాలుపెడితే నేనొప్పుకోను, బాబా మీద ఆన. - మొత్తం ఎన్ని అండీలో చెప్పుకోండి (దీనితో సహా) :)
    'అండి' అన్నది మలయాళంలో బూతు మాట అని నా మలయాళ మిత్రుడనేవాడు, మీరూ అవసరమైతే తప్ప, తగ్గించేయడం బెటర్. లేదటే పాపం అలా పెరిగిపోతూ వుంటుంది, బాబాకు కోపమొచ్చి విభూతి కళ్ళలో చల్లగలడు.
    :D

    ReplyDelete
  4. 'వర్డ్ వెరిఫికేషన్ బాబాకు ' అస్సలు నచ్చేది కాదంట అని బాబా భక్తుడైన ఓ మిత్రుడు చెప్పేవాడు. మరి మీరిలా వర్డ్ వెరిఫికేషన్ వుంచి జనహింసకు పాల్పడం! .. తీసేయండి, ప్లీజ్. :)

    ReplyDelete
  5. ధన్యవాదములండి.
    ఈ పోస్ట్ లో ' అండి ' లు కొంచెం మితిమీరి వచ్చాయని రాస్తున్నప్పుడే నాకు అనిపించి , కొన్ని తీసివేయటం జరిగిందం......... మళ్ళీ ఎక్కువగా ' అండి ' అని వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ......... ఎదుటివారిని గౌరవిస్తే సంతోషిస్తారు కదా ! అని నా తాపత్రయం.


    ఇక , దొంగస్వాములంటే నాకూ కోపమే. నేను చిన్నప్పుడు బాగా నాస్తికవాదిని. ఇప్పుడు ఇంత ఆస్తికవాదిని అయ్యానంటే అంతా దైవం దయయే.

    ఇక శిరిడి సాయిబాబా గురించి నేను చెప్పటంకన్నా తెలిసేరోజు వచ్చినప్పుడు ఎవరికయినా బాబానే తెలియజేస్తారు.

    మేము శ్రీ సాయి సత్యవ్రతం ఆచరించటం గురించి ....... ఆ సంఘటన కొన్ని సంవత్సరముల క్రిందట జరిగిన సంగతి నాకు చెప్పాలనిపించి నాకు గుర్తు ఉన్నంతవరకు చెప్పటం జరిగింది అంతే. అలా చెప్పుకోవటం వల్ల నేను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు కదా !

    చాలామంది భక్తులు కూడా నేను చెప్పినట్లే తమ అనుభవాలని చెబుతున్నారు కదా ! ఇందులో తప్పేమిటో అర్ధం కావటం లేదు ..

    ఇక వర్డ్ వెరిఫికేషన్ తీసివెయ్యటం ఎలా అన్నది నాకు నిజంగానే తెలియదు మరి ........ మీకు ఇబ్బంది లేకపోతే చెప్పవలయును......... . .

    ReplyDelete