koodali

Wednesday, January 26, 2011

యధా ప్రజా తథా రాజా.................

 

అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి.........

ఏం చెప్పుకుంటాములెండి ....... గతవైభ
వం గురించి. . ఏం సాధించాము అనుకుంటే అంతా అయోమయం.. అసలు దేశంలో ఏం జరుగుతోందో తెలియని గందరళగోళం............

పూర్వం భారతదేశం చాలా సంపన్నంగా ఉండేదట. అందుకేగా విదేశాలనుంచి వ్యాపారానికి వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. ఇప్పటికి రెండు తరాల క్రిందట ........ ఇప్పటిలా కాక చిన్నచిన్న రాజ్యాలు ఉండేవి. అందుకని వాటికి చాలామంది పాలకులు ఉండేవారు.


బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించేవారుగా చరిత్రలో పేరు తెచ్చుకున్నారు. కానీ నాకు అనిపిస్తుంది ........... అది నిజమే అయినా ...... అప్పటి మన పెద్దవాళ్ళు అందరూ కలసి ఎదుర్కొంటే దేశం పరాయి పాలకుల చేతుల్లోకి వెళ్ళేదా అని ?


సరే ఆ తరువాత తరం వాళ్ళు గాంధీగారు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఇంకా............. మనకు పేరు తెలియని ఎందరో త్యాగమూర్తులు తమ జీవితాల్లో ఎన్నో కష్టాలు అనుభవించి స్వాతంత్ర్యమును తెచ్చారు.



ఇక దేశం ఇప్పటికీ పేదరికంలో ఎందుకు ఉందో ? ఒక దేశం అభివృధ్ధి చెందాలంటే చిత్తశుధ్ధితో పనిచేస్తే 61 సంవత్సరాలు ఎంతో ఎక్కువ సమయం.


ప్రజల సంక్షేమం పాలకుల కర్తవ్యం. పాలకులు ఎన్నికలప్పుడు ఎన్నో వాగ్ధానాలు చేస్తారు............. దేశాన్ని అభివృధ్ధి చేసేస్తామని......... తరువాత ప్రజలు దాని గురించి అడిగితే మాత్రం మాట మార్చి , దానికి కారణాలు ఏవేవో చెప్పి తప్పించుకుంటారు...........అలాకాక ప్రజల కష్టాలను తీరిస్తే వారిని ప్రజలు ఎంతగానో మెచ్చుకుంటారు. ఆ సంతోషం ఎంత గొప్పదో వాళ్ళు తెలుసుకుంటే బాగుండు.


ఇక సైనికులు........... వారు కుటుంబాలకు దూరంగా , వాళ్ళ ప్రాణాలకు తెగించి సరిహద్దులలో కాపలా ఉంటారు. కానీ వారికి స్ఫూర్తి ఏదీ ........ ?

చాలామంది ప్రజలు తమ స్వార్ధంతో డబ్బు సంపాదనే ధ్యేయంగా బ్రతుకుతున్నారు......... ఇక చాలా మంది యువత విదేశీ నాగరికత మోజులో కొట్టుకుపోతున్నారు. ఇవన్నీ చూసి సైనికులకు కూడా ఒక నిరాశ, నిస్పృహ కలగదంటారా ? ఇలాంటి ప్రజల కోసమా ......... తాము ప్రాణాలకు తెగించి సరిహద్దుల దగ్గర బాధ్యతలు నిర్వహించాలి అని.....


సైనికులు , ప్రాణాలకు తెగించి కాపలా కాస్తుంటారు. ............ మనం ఏమో నిశ్చింతగా నిద్రపోతున్నాము, మన స్వార్ధం మనం చూసుకుంటున్నాము.
ఇంకా , కులాసాగా అర్ధనగ్న చిత్రాలున్న సినిమాలు చూస్తున్నాము.

సరే.......అది అలా
ఉంచుదాము.

ఒకప్పుడు ......వాల్మీకి మహర్షి మహర్షిగా మారకముందు అడవిలో బాటసారులను ఆటకాయించి వారి వద్ద సొమ్మును
తీసుకోవటము , ఒకోసారి వారిని చంపటం కూడా చేసేవారట.


ఒకసారి నారదులవారు వారిని అడిగారట. నువ్వు నీ కుటుంబం కోసం ఇన్ని పాపాలు చేస్తున్నావు కదా ! నీ సంపాదన వాళ్ళు అనుభవిస్తున్నారు, మరి ........... నీ పాపంలో వాటాను కూడా వారు అనుభవిస్తారా అని ? అప్పుడు వారి కుటుంబసభ్యులు ............. నీ పాపంలో మేము భాగం పంచుకోము .......... అని ఖచ్చితంగా చెప్పారట.


తరువాత వారి మనసు మారి రామనామ జపం చెయ్యటం అలా ........... వాల్మీకి మహర్షిగా మారటం జరిగిందని...........ఆ మహర్షి గురించి చెప్పటం జరిగింది.
( వ్యాసమహర్షి కధకు పూర్వాపరాలు చాలా ఉన్నాయి. వారు ఒక గొప్ప ప్రయోజనం కొరకు భూమిపై జన్మించారు. )


చాలామంది, ఇక్కడి ప్రజల సొమ్ము దోచుకుని విదేశాల్లో దాచుకుంటారు.....
రోజూ ఎంతమందో చనిపోవటం చూస్తూనే ఉన్నారు ............ అయినా తాము,............ తమవిదేశాల్లో దాచుకున్న సొమ్ముమాత్రం ......... భధ్రంగా ఉంటుందని వారి వెర్రి ఆశ ............. ఆ సొమ్ము వారు చనిపోయాక వారితో వెళ్తుందా ?ఎంత వెర్రి ?


ప్రజల సొమ్ము తీసుకున్న పాపానికి తగిలే పాపఫలితాన్ని అనుభవించవలసి వచ్చినప్పుడు ఎంతో బాధపడవలసి వస్తుంది.

ఎంత డబ్బు సంపాదించినా తినటానికి లేకుండా........ సుగర్, బి.పి జబ్బులు ఉన్నప్పుడు ఎంత సంపాదించి ఏం లాభం. మీ పెద్దవయస్సులో మీ పిల్లలే మిమ్మల్ని గౌరవించకపోవచ్చు.


అంతే కాక........ పిల్లల సుఖం కోరుకునే పెద్దలు ఎవరైనా పాపాలు చెయ్యరాదు. ఎందుకంటే పెద్దలు చేసిన పాపపుణ్యాలు పిల్లలు అనుభవించాల్సి వస్తుందట.

పెద్దవాళ్ళు పాపాలు చేస్తే ఆ పాపఫలితాన్ని పిల్లలు అనుభవించాల్సివస్తుంది ..

No comments:

Post a Comment