koodali

Wednesday, January 12, 2011

తల్లిదండ్రుల బదిలీల వల్ల విద్యార్ధులు తమ సొంత రాష్ట్రంలో ................

 

శ్రీ రామకృష్ణ పరమహంస , శారదా మాత , వివేకానందులు వీరంతా పూజ్యులు, గౌరవనీయులు. ఈ రోజు వివేకానందుని జయంతి.

నాకు హైదరాబాద్ లోని శ్రీ రామకృష్ణ మఠంతో బాగానే పరిచయం ఉందండి. అక్కడ నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.

అంతే కాదు కర్నూల్, విశాఖపట్టణం, విజయవాడ ఇలా రాష్ట్రం లోని నాలుగు ప్రాంతములలోను, ఇంకా చెన్నై ......... ఇలా నివసించటం వల్ల అన్ని ప్రాంతములతోను మంచి అనుబంధం ఉంది.

ఇలా చుట్టుప్రక్కల దేవాలయములతో అనుబంధం, ప్రాంతం వాళ్ళతో మంచి స్నేహసంబంధాలు జీవితంలో భాగాలవుతాయి.

పూర్వం రోజుల్లో వ్యవసాయం ,వ్యాపారం వల్ల ఎక్కువగా ఒకే ఊరిలో నివసించేవారు. ఇప్పుడు ఉద్యోగాలు, ట్రాన్స్ఫర్స్ వల్ల అనేక ప్రాంతాలు , ఒకోసారి విదేశాలు కూడా వెళ్ళవలసి వస్తోంది.

ఇలాంటి రాకపోకల వల్ల ప్రజల మధ్య స్నేహసంబంధాలు పెరుగుతాయి. అయితే వెళ్ళే శాతం విపరీతంగా ఉంటే అపార్ధాలు పెరిగే అవకాశం కూడా ఉంది. ఉద్యోగాల కోటా ఇలాంటి విషయాలలో అపార్ధాలు రావచ్చు.


అందుకే విద్యార్ధులకు కాలేజీలలో సీట్ల కొరకు లోకల్......నాన్......లోకల్ ఇలా నిబంధనలు ఏర్పరిచారేమో !

నాకు రూల్స్ గురించి పూర్తిగా తెలియదు కానీ ఒక విద్యార్ధి ఇంటర్ చదువుకు ముందు అయిదు సంవత్సరములు ఎక్కడ చదివితే ప్రాంతము అతనికి లోకల్ అని ఒకరూల్ ఉందనుకుంటాను.


గ్రూప్ .......ఒన్ లాంటి ఉద్యోగాల్లో కూడా లోకల్ నిబంధనప్రకారం నియామకాలు ఉంటాయనుకుంటా ! మిగతా రూల్స్ నాకు అంతగా తెలియవు.

మాకు చెన్నై నుండి ఇక్కడకు బదిలీ అయినప్పుడు మా అబ్బాయికి ఒక ప్రాబ్లం వచ్చిందండి.

తనని మాతో తీసుకువచ్చి ఇక్కడ కాలేజీలో జాయిన్ చెయ్యాలని అనుకున్నాము. తను చెన్నై లోనే చదువుతానన్నాడు. తన ఫ్రెండ్స్ అక్కడ ఉండటం వల్ల.

ఇంకా ,.......... తను అక్కడ ఆరు సంవత్సరములు చదవటం వల్ల అక్కడ లోకల్ కోటా సీట్ వస్తుంది . అయితే మాకు తనని మాకు హాస్టల్లో ఉంచటం ఇష్టం లేదు. ( వేరే దారి లేనప్పుడు హాస్టల్లో ఉంచవలసిందే . )

మాకు తెలిసిన వాళ్ళు కూడా అదేమిటి ? అందరూ చెన్నై వెళ్ళి చదువుతుంటే మీరు అబ్బాయిని ఇక్కడ చదివిస్తానంటారు ......అని ఆశ్చర్యం వ్యక్తం చేసారు.

అక్కడ మాకు బాగా దగ్గర బంధువులు ఉన్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు.


ఎవరి పిచ్చి వారికి ఆనందం కదా ! హాస్టల్లో ఉంచటం ఇష్టం లేక మేము అబ్బాయిని ఇక్కడకు తీసుకువచ్చి చదివిస్తున్నాము. దైవం దయ వల్ల అబ్బాయి బాగానే చదువుతున్నాడు. క్లాస్ లో ఫస్ట్ రావటం కూడా జరిగింది.


సరే, అయితే మాకు బాధ కలిగించిన విషయమేమిటంటే , మేము ' .పి ' లో నాన్....లోకల్ అట.

మా అబ్బాయి రాష్ట్రంలో చదవలేదు కాబట్టి తనకి ఇక్కడ లోకల్ కోటాలో సీట్ రాదన్నారు. తెలుగువాళ్ళం అయిఉండీ మేము నాన్..లోకల్ అంటే బాధనిపించింది.

ట్రాన్స్ఫర్ వల్ల మేము ఇతర ప్రాంతానికి వెళ్ళాము కానీ........ మేము కావాలని వెళ్ళలేదు కదా !

అదే తమిళనాడులో అయితే విద్యార్ధులు పుట్టుకతో తమిళులు అయితే చాలు ,.............. వారు ఇతర రాష్ట్రములలో చదివినా కూడా వారికి తమిళనాడులో ......... లోకల్ కోటాలో సీట్ వస్తుంది. పద్ధతి బాగుంది. మరి మన రాష్ట్రంలో ఇలా ఎందుకు లేదో ?


మన రాష్ట్రంలో కూడా రూల్ అమలుపరిస్తే పిల్లలు చాలా మందికి ఉపయోగంగా ఉంటుంది. అంటే, ........... లోకల్, నాన్....లోకల్ పద్ధతి వల్ల పెద్దవాళ్ళు ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు పిల్లలను తమతో తీసుకు వెళ్ళలేక ఇక్కడే హాస్టల్స్ లో ఉంచేస్తున్నారు......... తీసుకువెళ్తే లోకల్ కోటాలో సీటు రాదేమోనన్న భయంతో.

అందుకే , బైబర్త్ తెలుగువాళ్ళయినప్పుడు వారు ఎక్కడ చదివినా కూడా ' . పి ' లో లోకల్ కోటాలో సీట్ వస్తే బాగుంటుంది అనిపించింది.

2 comments:

  1. బయట ఎక్కడ అయిన స్టేట్ మొత్తం ఒక లోకల్, ఒక నాన్ లోకల్. ఆంధ్ర లో ఆంధ్ర తెలంగాణా రాయల సీమ ఎవడికి వాడె లోకల్... బయట వాళ్ళు మరీ దూరపు నాన్ లోకల్. మీరు ఆ బయట లోకల్.

    ReplyDelete
  2. ధన్యవాదములండి. ఈ లోకల్, నాన్.లోకల్ దేని ఆధారంగా చూస్తారన్నది నా బోటి వాళ్ళకు కొంచెం గందరగోళంగా ఉంటుంది. చదువుకున్న ప్రదేశాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయిస్తే , అనేక ప్రాంతములలో చదివినప్పుడు , ఒకే కుటుంబంలోని పిల్లలు వేరేవేరే లోకల్ ఏరియాలకు సంబంధించే చిత్రాలు కూడా జరుగుతాయి....

    ReplyDelete