koodali

Monday, October 22, 2018

కేదారక్షేత్రం కొన్ని విషయాలు..



ఓం .. 

శివపురాణం – వికీపీడియా..


బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచన భాష్యంగా..


కేదారక్షేత్రం వెళ్ళినవారు తెలియక ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. కేదార లింగమును తిన్నగా కంటితో చూడకూడదు. వలయమును పట్టుకు వెళ్ళాలి. వలయము అంటే చేతికి వేసుకునే కంకణం వంటి గుండ్రని వస్తువును తీసుకువెళ్ళాలి. అంతరాలయంలో ప్రవేశించగానే కంటిముందు ఆ వలయమును పెట్టుకుని అందులోంచి చూడాలి. కేదారము దర్శనము చేత మోక్షమీయగలిగిన క్షేత్రం గనుక సమస్త బ్రహ్మాండము నిండినవాడు వీడే అని తెలుసుకోవడానికి కంటికి అడ్డంగా ఒక వలయాకరమును పెట్టుకుని అందులోంచి కేదార లింగమును చూడాలి. అలా చూసిన వలయ కంకణమును అక్కడ వదిలిపెట్టి వచ్చెయ్యాలి. మన చేతికి వున్నా ఏ బంగారు కంకణమునో ఉపయోగించినట్లయితే దానిని అక్కడ వదిలిపెట్టేయడానికి మనసొప్పదు. కాబట్టి ముందే ఒక రాగి కంకణమును పట్టుకుని వెడితే రాగి చాలా ప్రశస్తము కనుక, ఆ కంకణములోంచి కేదార లింగమును దర్శనం చేసి దానిని అక్కడ వదిలిపెట్టి రావచ్చు. ఇకముందు వెళ్ళేవారు ఒక వలయంలోంచి కేదారలింగమును దర్శనం చేసే ప్రయత్నం చేస్తే మంచిది.



2 comments:

  1. ఎందుకు బయ్యా ఇలాంటివి చెబుతున్నారు. ఏ శాస్త్రంలో చెప్పారు. చాగంటి గారు మహాపురుషులే కానీ అప్పుడప్పుడు 'ఇటువంటి' 'అటువంటి' విషయాలు చిలవలు పలవలు గా చెబుతుంటారు.

    ReplyDelete

  2. కంకణం విషయం ముందు తెలియకుండా, యాత్ర చేసి వచ్చిన తరువాత తెలిస్తే..

    అయ్యో! కంకణం గురించి ముందే తెలియలేదని కొందరికి బాధ కలగవచ్చు.

    అయితే, కొత్తగా వెళ్ళేవారికి ఉపయోగకరంగా ఉంటుంది కదా! అనిపించింది.
    ..............

    వ్యాఖ్య చదివిన తరువాత ఏమనిపించిందంటే,

    తెలిసిన విషయాన్ని చెప్పకపోతే తమకు చెప్పలేదని కొందరు భావించే అవకాశం కూడా ఉంది.

    ఎన్నో విషయాలుంటాయి. అయితే, ఏ విషయం సనాతనమో? ఏ విషయం మధ్యలో వచ్చి చేరిందో? తెలియటం లేదు.

    తీర్ధయాత్రకు వెళ్ళే వారందరికీ ఎన్నో విషయాలు తెలియకపోవచ్చు.

    తెలిసినవాటిలో కూడా అన్నింటినీ ఆచరించలేకపోవచ్చు.

    ఎవరి శక్తిమేరకు వారు వీలున్నంతలో పాటించి, పొరపాట్లు ఉంటే క్షమించమని దైవాన్ని ప్రార్ధించుకోవటం మంచిదని నాకు అనిపిస్తున్నది.

    ReplyDelete