koodali

Wednesday, March 27, 2013

కొన్ని విషయాలు....ఇందులో కాన్సర్ వంటి రోగాలను తగ్గించే ఔషధగుణాలు ఉన్నాయని చెప్పబడుతున్న ఒక అద్భుతమైన చెట్టు గురించి కూడా...


దైవానికి  వందనములు.  అందరికి  హోలి  శుభాకాంక్షలు.


ఈ  టపాలో   కాన్సర్ ను  తగ్గించే  లక్షణాలు  ఉన్న ఒక   పండును  గురించి  చెప్పుకుందాము.. 


 ఈ  పండును   లక్ష్మణ  ఫలం  లేక  హనుమంతుని  ఫలం  అంటారట.  ఈ  పండును  ఇంగ్లీష్  లో  Soursop fruit    అంటారట.


  కొన్ని  వివరాలు.........

సీతాఫలం, రామఫలం వలె కాకుండా లక్ష్మణ ఫలంలో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. కనుక హనుమంతుని ఫలాన్ని  నేరుగా తినడం కంటే జ్యూస్ చేసుకొని సేవించడం మేలు.


ఔషధ గుణాలు


హనుమంతుని ఫలంలో 12 రకాల కేన్సర్ కారక కణాలను నిర్మూలించే ఔషధగుణాలు ఉన్నట్లు పరిశోధకులు తెలుసుకున్నారు. పెద్ద ప్రేగు కేన్సర్, రొమ్ము కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్, శ్వాసకోస కేన్సర్, క్లోమ గ్రంధి కేన్సర్ వంటి మరణాంతక కేన్సర్ చికిత్స ఈ వృక్షంలోని ఔషధ గుణాల వల్ల సంభవమని తెలుసుకున్నారు. పెద్ద ప్రేగు కేన్సర్ చికిత్సలో వినియోగించే ఖీమో ధెరఫీ కన్నా 10,000 రెట్లు అధికంగా ఈ చెట్టులోని ఔషధ గుణాలు కేన్సర్ కణాలను నిర్మూలించగలవని తెలుసుకున్నారు. ఈ వృక్షభాగంలో ఔషధ గుణాల గురించి దాదాపు 22 పరిశొధనలు జరిగాయి. కేన్సర్ వ్యాధినుండి గ్రావియోలా వృక్షంలోని ఔషధ తత్వాలు రక్షించడమే కాక శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

అమెరికాలోని కొందరు వైద్యులు, కేన్సర్ వ్యాధి గ్రస్తులు ప్రస్తుతం ఈ చెట్టు సారంతో ఉత్పత్తి చేసిన ఔషధాలనే వాడుతున్నారు. అమెరికాలోని అమెజాన్ అడవుల్లో నివసించే ఆటవికులు వందల సంవత్సరాలుగా ఈ చెట్టు బెరడును, ఆకులను, వ్రేళ్ళను, పూలతో సహా విత్తనాలను సైతం వివిధ వ్యాధుల చికిత్సకు వినియోగిస్తున్నారు.

 కడుపులో పురుగులను హరించుటలోను, జ్వరాలు తగ్గించుటలోను, తల్లిపాలు పెరుగుటకు, జిగట విరేచనాలకు హనుమంతుని ఫలాల జ్యూస్ ఉపయోగపడుతుంది.  నిద్రలేమికి, కండరాల సమస్యలకు, అల్ప రక్తపోటు కు వీటి చెట్టు బెరడు, ఆకులు ఉపయోగపడతాయి. అమెరికాలో హనుమంతుని ఫలాల గుజ్జును ఐస్ క్రీములు, పానీయాలు, స్వీట్లు మొదలగువాటిలో వాడతారు.

కేన్సర్ కు వాడే విధానం

కేన్సర్ ఉన్నవారు హనుమంతుని ఆకులను నీడలో పూర్తిగా ఆరబెట్టి కత్తెరతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని గాజు సీసాలో దాచుకొని ప్రతి రోజు 5 గ్రాములు 200 మిల్లీ లీటర్ల నీటిలో వేసి మరిగించి ఒక గ్లాసు అయిన తర్వాత దించి వడబోసుకొని త్రాగాలి. దీనిని ఎప్పటికప్పుడు తయారుచేసుకోవాలి. రోజుకు కనీసం 2 లేక 3 సార్లు త్రాగాలి ..... 
 

* ఏ మందులైనా ఏ విధంగా వాడాలో వైద్యుల సలహాతో వాడాలి.
..................................................

పూర్వం  ఇప్పుడున్నంతగా  కాన్సర్  కేసులు  ఉండేవి  కాదు.    ఈ  రోజుల్లో  కాన్సర్  వ్యాధిగ్రస్తుల  సంఖ్య  పెరిగింది.   


 పర్యావరణాన్ని  కలుషితపరిచి  కాన్సర్  వంటి  రోగాలు  రావటానికి  కారణమవుతున్న  వాటిని  గురించి జాగ్రత్తలు  తీసుకోవాలి. 


వ్యాధి  వచ్చినప్పుడు  మందులు  వాడటంతోపాటు   కొన్ని  జాగ్రత్తలు  కూడా  తీసుకోవాలి  కదా!  

.......................................

 కొంతకాలం  క్రిందట    లక్కరాజు  గారు   బ్లాగ్ లో    కాన్సర్  వ్యాధి  గురించి  ఎన్నో  వివరాలను  తెలియజేసారు.

ఈ  మధ్య  కష్టేఫలి బ్లాగ్   శర్మ  గారు    ఒక  టపాలో    రామాఫలం  గురించి  వ్రాస్తూ....

రామాఫలం లో గింజలు తక్కువగా ఉంటాయి, పండు నిండా తీయని గుజ్జే. కొద్ది వాసన ఉంటుంది. మంచి పండు. సీతాఫలం లాటిదే, లక్ష్మణ ఫలం కూడా ఉంది, ఈ సారి దొరికితే పొటో తప్పక పెడతా....అని  వ్రాసారు.

 వారు  వ్రాసిన వివరాలను  చదివాను.   నాకు  సీతాఫలం,  రామాఫలం  గురించి  తెలుసు.  లక్ష్మణ  ఫలం  గురించి  తెలియదు  .

ఈ  మధ్య  జిలేబి  గారి  బ్లాగులో  ఒక  టపాలో   మొక్కలు, చెట్ల  శాఖల  గురించి  ప్రస్తావన  వచ్చింది.  


 నేను  ఆ  టపాను  చదివిన  తరువాత  వ్యాఖ్యను  వ్రాసి,  చెట్ల  గురించి    మరిన్ని  వివరాల  కోసం   అంతర్జాలంలో   చదువుతుండగా  ఒక దగ్గర   హనుమంతుని  ఫలం  అని  ఉంది. 

వర్గం:వృక్ష శాస్త్రము ...

  హనుమంతుని  ఫలం  ఏమిటో  చూద్దామని  వివరాలను  చూశాను.

ఈ   విధంగా  నాకు  ఈ  
చెట్టు  గురించి  తెలిసింది.
...........................


ఈ పండును  గురించిన మరిన్ని   వివరాలను తెలుసుకోవాలంటే  లింకులు   క్రింద   ఇచ్చాను. 

Soursop Fruit - Natural Cancer Killer - Why Don't You Try This?


హనుమంతుని ఫలం - వికీపీడియా..........

....................  

 ఎన్నో  వ్యాధులను  నివారించే  లక్షణాలున్న   ఈ చెట్టు   గురించి  తెలియజేసినందుకు  దైవానికి  కృతజ్ఞతలు  తెలియజేసుకుంటున్నాను.  

అంతా  దైవం  దయ.



7 comments:

  1. అనురాధ గారు, చక్కటి టపా.
    Very informative పోస్ట్ అండి. మీరిచ్చిన లింక్స్ కూడా చూసాను. మీకు ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. జలతారు వెన్నెల గారు, మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      మీ వ్యాఖ్యను కొద్దిసేపటి క్రితమే చూశాను. ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు దయచేసి క్షమించండి.


      Delete
  2. లక్ష్మణ ఫలం ఉందండి. ఈ మధ్య కనపడలేదు. ప్రయత్నం చేస్తా.మంచి సంగతే చెప్పేరు. కేన్సర్ నివారకమా? ఎంత గొప్ప మాట.

    ReplyDelete
    Replies
    1. సర్ ! మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      మీ వ్యాఖ్యను కొద్దిసేపటి క్రితమే చూశాను. ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు దయచేసి క్షమించండి.

      Delete
  3. అనురాధ గారు,మంచి సమాచారం.ఈ రోజు నోరి దత్తాత్రేయుడు గారి ఇంటర్వ్యూ పేపర్ లో చూసారా!కాన్సర్ గురించి చాలా విషయాలు చెప్పారు.

    ReplyDelete
  4. సర్ ! మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    మీ వ్యాఖ్యను కొద్దిసేపటి క్రితమే చూశాను. ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు దయచేసి క్షమించండి.

    నిజమేనండి. డాక్టర్ గారు ఎన్నో చక్కటి విషయాలను తెలియజేసారు.

    ఈ రోజుల్లో కాన్సర్ వ్యాధి ఎక్కువగా పెరగటానికి గల కారణాలను గుర్తించి జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఎంతో ఉంది.

    ReplyDelete
  5. ఈ రోజుల్లో కాన్సర్ వంటి వ్యాధుల నివారణలో రేడియేషన్ ధెరఫి ఉపయోగిస్తున్నారు

    . రేడియేషన్ ట్రీట్మెంట్ గురించి వింటుంటే నాకు కొన్ని సందేహాలు వస్తుంటాయి.

    నాకు ఏమనిపిస్తుందంటే రేడియేషన్ ధెరఫి వల్ల కాన్సర్ బాధితులకు వ్యాధినివారణ జరిగే అవకాశముండే మాట నిజమే కావచ్చు.

    అయితే ట్రీట్మెంట్ సందర్భంగా వెలువడి , వాతావరణంలో కలిసే రేడియేషన్ వల్ల ఆరోగ్యంగా ఉన్న వారికి కాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నవా ? లేవా ? అనే సందేహాలు కలుగుతుంటాయండి.

    ReplyDelete