koodali

Monday, January 22, 2024

వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. 1

 


 వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్...లింక్స్ పైన క్లిక్ చేసి చదవగలరు..

 పోస్టులు అన్నీ నాకు ముఖ్యమేనండి. అయితే, కొన్ని పోస్టులను ఇక్కడ ఇస్తున్నాను.

 

 ఒకరి సంపద 100 కోట్లు.....ఒకరి సంపద 100 ..

 

 రోబోట్లు వచ్చినా ..ఉద్యోగాలు ఎన్నో ఉంటాయి...

 

 ఓం..కొన్ని సందేహాలు..సమాధానాలు..

 

 .భగవంతుడా నాకు ఇంతే ఓపిక దయచేసి ...

 

 ఈ ఆక్సిజన్, హైడ్రోజన్ లు అన్నీ కలిసి శరీరం.

 

 డబ్బు బాగా ఉన్నవాళ్ళలో కూడా పేదవాళ్ళు ఉంటారు.


 సమాజంలో సతీసహగమనం.. వ్యాపించటానికి .. 

 

ఆలోచన రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది...

 

 దైవం గురించి ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్ స్టీన్ ...

 

 ఇలాంటి విషయాలలో మనకు తెలియని ఎన్నో అర్ధాలు ద...

 

 

4 comments:

  1. ప్రపంచంలో కొన్ని ప్రాంతాలను బ్లూ జోన్లు అని అంటారు. అక్కడ ఉండే ప్రజలు చాలా సంవత్సరాలు ఆరోగ్యంగా జీవిస్తున్నట్లు చెబుతున్నారు.
    కారణాలను పరిశీలించగా వారు స్వచ్చమైన ప్రకృతిలో వళ్ళువంచి కాయకష్టం చేసుకుంటూ, గాలి, వెలుతురు చక్కగా తగిలేలా జీవిస్తారట. ఎక్కువగా నడుస్తారట. ఎక్కువగా శాకాహారం తింటారట. ఆధునికతకు దూరంగా ఉంటారట.

    ఆధునికకాలంలో శరీరానికి పనిలేదు. యంత్రాలే అన్నీ చేస్తాయి. ఎండ, గాలి తగలకుండా ఏసి గదుల్లో ఉంటారు. కొద్దిదూరం కూడా నడవకుండా వాహనాలు ఉపయోగిస్తారు. ఇక, టెన్షన్లు సంగతి చెప్పనే అక్కర్లేదు. చిన్నపిల్లలనుంచి వృద్ధుల వరకూ అందరికీ టెన్షనే. దైవపూజల విషయంలో కూడా ప్రశాంతత లేకుండా ఎన్నో సందేహాలు.

    పాతకాలంలో ప్రకృతికి అనువైనవాతావరణంలో జీవించేవారు. పాతకాలంలో కొందరు వృద్ధులు కూడా సునాయాసంగా ఎన్నో మైళ్లు నడిచేవారు. భారతదేశంలో అడవుల్లో నివసించే వారిలో కూడా కొందరికి అనారోగ్యాలు రావట. అయితే ఇప్పుడు కొందరు అడవులనూ కలుషితం చేస్తున్నారు.

    ఇప్పుడు కూడా హిమాలయాల్లో కొందరు సాధువులు ఎంతో గడ్దకట్టే చలిలో శరీరంపైన ఏ విధమైన స్వెట్టర్లు లేకుండా బూడిద పులుముకుని వెళ్ళేవారు ఉంటారు. ధ్యానము, యోగం, మంత్రం..వంటివాటివల్ల వారికి ఆ శక్తులు వస్తాయట.

    చక్కటి ప్రకృతి, కాలుష్యంలేని వాతావరణం, స్వచ్ఛమైన మనస్సు, పురుగుమందులు లేని ఆహారం, స్వచ్ఛమైన నీరు, ఎక్కువ టెన్షన్లు లేని జీవితం..వంటివి ఉంటే సామాన్యులు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఈ రోజుల్లో ఆధునికత పేరుతో పర్యావరణకాలుష్యం, నీరు, గాలి, వాతావరణం ..వంటివి కలుషితం చేసారు. ఆహారంలో కూడా కల్తీ ఎక్కువయ్యింది.

    మంచి ఆహారపు అలవాట్లు ఉంటే అనారోగ్యాలు ఎక్కువ రావు. మంచి కూరగాయలు, పండ్లు..వంటివి తినటం మంచిది. అంబలి వంటివి.. సుమారు పదిగంటలు లేక ఇంకా తక్కువ సమయం..పులవబెట్టిన ఇడ్లి, దోసె పిండితో చేసిన వాటిని తింటే కూడా మంచిదని అంటున్నారు.

    ఈ రోజుల్లో ఆహారం సరిగ్గా వండుకుని తినటానికి కూడా చాలామందికి సమయం లేదు. ఉరుకులపరుగుల జీవితాలు అంటూ ..కొందరు ఇంట్లో వంట సరిగ్గా చేయకుండా ఏదిపడితే అది.. ఎక్కడబడితే అక్కడ తింటున్నారు. తరువాత అనారోగ్యాలు వస్తే, ఉరుకులుపరుగులు పెట్టడానికి కూడా ఎవరికీ ఓపిక, సమయం ..కూడాఉండదు.

    టెక్నాలజి ఎంతవరకో అంతవరకే వినియోగించుకోవాలి. ప్రపంచం పాడయ్యే స్థాయి లో కాదు. మనుషులు తమ కోరికలను అదుపులో ఉంచుకోవాలి. కూర్చున్నకొమ్మనే నరుక్కున్నట్లు పరిస్థితిని తెచ్చుకోకూడదు.

    ReplyDelete
  2. విపరీతంగా పెరిగిన ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి ఎంతో నష్టం కలుగుతోంది. ప్లాస్టిక్ బ్యాగులు వంటివి వాడి ఎక్కడబడితే అక్కడ పడేయటం వల్ల అవి గాలికి ఎగిరిపోయి, ఏరటానికి కూడా చాలా కష్టమవుతుంది. ప్లాస్టిక్ చెత్తను పడేయటానికి ప్రత్యేకమైన డస్ట్ బిన్లను పెట్టినా జనం వాటిలో వేయటం లేదు. అందువల్ల పరిసరాలు ఎంతో అపరిశుభ్రంగా ఉంటున్నాయి.

    మనము ఇప్పటికిప్పుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపే పరిస్థితి లేదు కాబట్టి, ప్లాస్టిక్ ఎక్కడబడితే అక్కడ కనిపించకుండా ప్రభుత్వాలు, ప్రజలు కొన్ని చర్యలు తీసుకోవచ్చు. ఇళ్ళలో, షాపులలో వచ్చే ప్లాస్టిక్ వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా చర్యలు తీసుకోవాలి. డస్ట్ బిన్ కవర్లు పెద్దవి, చిన్నవి అమ్ముతున్నారు. డస్ట్ బిన్ కవర్లు మట్టిలో కలిసేవి కూడా ఉన్నాయి. ఇండ్లలో రోజూ వచ్చే వంటగది చెత్తకు.. మట్టిలో కలిసిపోయే కవర్లు వాడవచ్చు. ప్లాస్టిక్ చెత్తకు.. పెద్ద కవర్లు ప్లాస్టిక్ వి వాడవచ్చు.

    ప్రతి ఇంటికి నెలకు రెండు పెద్ద ప్లాస్టిక్ కవర్లను ఇవ్వాలి. వాడిపడేసే ప్లాస్టిక్ వ్యర్ధాలను పెద్ద ప్లాస్టిక్ కవర్లో పడేసి, ఆ కవర్ ను ఇంట్లో ఒక మూల ఉంచాలి. 15 రోజులకొకసారి ఆ కవర్ నిండగానే ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిండిన కవర్ ను మూటకట్టి, బయట ప్లాస్టిక్ చెత్తకుండీలో పడేయవచ్చు. పాలప్యాకెట్లు..వంటివి కొద్దిగా నీటితో కడిగి వేస్తే వాసన రాకుండా ఉంటాయి.అందరూ ఇలా చేసేలా ప్రభుత్వాలు కఠినచర్యలు తీసుకోవాలి. అప్పుడు బయట ఎక్కడా ప్లాస్టిక్ కనిపించదు. పరిసరాలు శుభ్రంగా ఉంటాయి.మూతలేని బకెట్లో కవర్లు వేస్తే గాలికి కొట్టుకుపోతాయి. అందువల్ల కవర్లోవేసి క్లోస్ చేయాలి.

    కాలువలు, చెరువులు గాలికి కొట్టుకొచ్చిన ప్లాస్టిక్ కవర్లతో నిండిపోతున్నాయి. ప్లాస్టిక్ అడ్డుపడి నీరు సరిగ్గా ప్రవహించటం లేదు. వీటిని శుభ్రం చేయటానికి కూడా చాలా ఖర్చవుతుంది. కొద్దిగా ఖర్చుచేసి ఇంటింటికీ డస్ట్ బిన్ కవర్లను అందిస్తే పెద్ద ఖర్చులు తగ్గుతాయి. ఇలా వచ్చిన ప్లాస్టిక్ ను రీసైక్లింగ్ చేసి వాడవచ్చు. పెట్రోల్ కూడా తయారుచేయవచ్చట.

    ReplyDelete
    Replies
    1. ఈ రోజుల్లో గిన్నెలు శుభ్రం చేయడానికి రసాయనాలతో చేసిన పొడులు, లిక్విడ్ వచ్చాయి. గిన్నెలను ఎంత నీటితో శుభ్రం చేసినా కూడా, ఎంతోకొంత రసాయనాలు గిన్నెలపై ఉంటుంది. ఆ గిన్నెలలో ఆహారాన్ని వండటం, తినటం వల్ల భయంకరమైన జబ్బులు వస్తాయి. అందువల్ల పాతకాలంలో లా ప్రకృతి సహజమైన పొడులు, లిక్విడ్ వాడి పాత్రలను శుభ్రం చేయటం చేయాలి.

      Delete

  3. ప్రపంచంలో ఎన్నో విషయాలున్నాయి..
    రోజులో కొద్దిసేపయినా మనస్సులో..
    దైవాన్ని స్మరించే అదృష్టాన్ని పొందాలి.దైవకృపను పొందాలి.
    దైవప్రీతి కొరకు..జీవప్రీతికొరకు..అంతా దైవందయ.

    ReplyDelete