koodali

Monday, January 22, 2024

వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. .3

 

వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్..   లింక్స్ పైన క్లిక్ చేసి చదవగలరు..

 

అమ్మవారు అయిన ఆదిపరాశక్తి ప్రహ్లాదునికి తెలియజేస...

 

 ఓం.. పేర్లను గమనిస్తే..మరి కొన్ని విషయాలు...

 

సంతోషంగా మనసారా నవ్వటానికి బోలెడు డబ్బు అవసర...

 

హేతుబద్ధత...........

 

 స్త్రీ పుట్టింటినుంచి తెచ్చుకునే ధనం విషయంలో చట్టబ... 

 

అద్భుతమైన విజ్ఞానమ్..

 

 కొన్ని విషయాలు.... (ETERNALLY TALENTED INDIA -...

 

 మనశ్శాంతి కరువైతే బోలెడు డబ్బున్నా సంతోషం ఉ...

 

 సమాజం కూడా , న్యాయంగా సంపాదించిన సొమ్ముతో జీ..

 

 పోలీసు అమరవీరుల సంస్మరణ సందర్భంగా....

 

 మనం భగవంతుడిని విసిగిస్తు..

 

5 comments:

  1. కొన్ని విషయములు..
    మనుషులు చేసే ప్రతి చర్యకు ఫలితాలు ఉంటాయి. మంచి అయితే మంచి ఫలితం..చెడు చేస్తే చెడ్డ ఫలితం ఉంటాయి.కొంత మంచి కొంతచెడు చేస్తే..మంచిచెడు ఫలితాలుంటాయి.

    ఇప్పటి ప్రపంచంలో డబ్బు, అధికారం, స్త్రీలుపురుషుల సంబంధాల విషయాలకు ప్రజలు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారనిపిస్తుంది.

    ఇంట్లోఅయినా, బయట అయినా ఇన్సెక్యూరిటి, తమమాటే నెగ్గాలనుకోవటం..అనే విషయాల వల్ల మనుషుల మధ్య ఎక్కువ గొడవలు వస్తాయి.

    ఈ రోజుల్లో చాలా విషయాల్లో చాలా సమాచారం లభిస్తోంది.
    .......
    ఆహారం విషయంలో ప్రపంచంలోని అనేకరకాల వంటకాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. అవన్నీ చూసి బోలెడువంటలు వండుకుని తింటే అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. కాబట్టి, మనస్సును అదుపులో పెట్టుకుని కొన్ని నచ్చినవి సెలెక్ట్ చేసుకుని వండుకుంటే సరిపోతుంది.

    (ఇక్కడ ఇంకొక విషయమేమిటంటే, యూట్యూబ్లో వంటల తయారీ వల్ల ఎందరో ఆడవాళ్ళు చక్కగా వంటలు నేర్చుకుని వంటలు చేస్తున్నారు. కొత్తగా వివాహమైన అమ్మాయిలూ వంట చేయటానికి ఉత్సాహపడుతున్నారు. కొంతకాలం క్రితం కొన్ని సినిమాలు, కొన్ని రచనల వల్ల కొందరు స్త్రీలు వంటలు వంటివాటికి దూరమయ్యారు. యూట్యూబ్లో వంటలు నేర్పిస్తున్న వారి వల్ల మరల స్త్రీలు వంటలు చేయటం నేర్చుకుంటున్నారు. ఇది ఎంతో మంచి విషయం.)
    ..........
    టెక్నాలజీ విపరీతంగా అందుబాటులోకి వచ్చి, అనేక వస్తువులు లభిస్తున్నాయి. అవన్నీ కొనాలనుకుంటే, డబ్బు సంపాదించటానికి ఎంతో కష్టపడాలి. ఇల్లంతా సామానుతో నింపేస్తే ఆ వస్తువులను శుభ్రం చేయటం పెద్దపని.
    విపరీత వస్తువినియోగం వల్ల పర్యావరణసమస్యలూ వస్తాయి. లోహనిల్వలూ తరిగిపోతాయి.అందువల్ల ఎంతవరకు అవసరమో అంతవరకే కొనుక్కోవాలి.
    .......
    ఉదా..అంతర్జాలం, సెల్ఫోన్లు ద్వారా విపరీతమైన విషయపరిచయం కలుగుతోంది. అదేపనిగా అవిచూస్తే శరీరానికీ, మనస్సుకూ అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. అందువల్ల ఎంతవరకూ అవసరమో అంతవరకే వాడుకోవటం మంచిది.

    ప్రతివిషయంలోనూ విచక్షణతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏంచేయాలో అర్ధంకాకపోతే దైవాన్ని శరణువేడుకోవటం మంచిది.

    ReplyDelete
  2. పిల్లలు ప్రయోజకులయి గొప్పవారుగా అవ్వాలని పెద్దవారు అనుకుంటారు.జీవులు ప్రయోజకులయ్యి, గొప్పగా అవ్వాలని దైవం భావిస్తారు. అంతేకానీ, భక్తులమని చెప్పుకుంటూ.. ప్రతిదానికీ దైవాన్ని అదేపనిగా కోరికలు అడుగుతూ ఉంటే ఏం బాగుంటుంది. తాము కోరుకున్నవి దక్కాలంటే మనుషులు కూడా అర్హతలను సంపాదించుకోవాలి. మానవప్రయత్నం కూడా సరిగ్గా ధర్మబద్ధంగా చేయాలి.

    పాపాలు చేస్తూ ఉంటే మంచి ఎలా కలుగుతుంది. గతంలోనో, ఇప్పుడో పాపాలు చేస్తే కష్టాలు వస్తాయి. కొందరు ఇప్పుడు మేమేమీ పాపాలు చేయట్లేదంటారు. పాపాలు చేసినా అవి పాపాలుగా అనిపించవు కొందరికి.

    ప్రకృతికి హాని కలిగేలా పనులు చేసి డబ్బును సంపాదించటం, సమాజంలో పెడధోరణులు వ్యాప్తి చెందేలా చిత్రాలు, రచనలు చేసి డబ్బు సంపాదించటం, మద్యపానం అమ్మి డబ్బు సంపాదించటం, ఇతరులను మాటలతో చేతలతో హింసించటం, జీవులను చంపి తినటం..ఇలా చెప్పాలంటే చాలా ఉంటాయి.

    ReplyDelete
  3. మనకు ఎవరైనా చిన్నసాయం చేస్తేనే థాంక్స్.. అంటూ కృతజ్ఞతలు చెబుతాము. వారిని సంతోషపెట్టడానికి ఎంతో ప్రయత్నిస్తాము. మరి, దైవం మనకు ఎన్నింటినో ఇచ్చారు.సూర్యరశ్మి, అగ్ని, గాలి, నీరు..ఇవన్నీ జీవులమనుగడకు ఎంతో అవసరం. ఇలా ఎన్నో ఇచ్చిన దైవానికి కృతజ్ఞతలు తెలియజేయటం పూజ. దైవప్రీతికొరకు పూజ చేయాలి. మనస్సును అదుపులో ఉంచుకునే శక్తికొరకు కూడా ప్రార్ధిస్తూ పూజలు చేయవచ్చు.

    ReplyDelete
  4. అయితే, చాలామంది ఎన్నోకోరికలకొరకు, కష్టాలు పోవటానికి కూడా పూజలుచేస్తుంటారు. పూజలు చేయవచ్చు. అయితే, ఎప్పుడో పాపాలు చేస్తేనే కష్టాలు వస్తాయి. కష్టాలుపోవాలంటే పాపాలుచేయటం ఆపి, పుణ్యకార్యాలు చేయగాచేయగా పాపకర్మ తగ్గి కష్టాలు తగ్గే అవకాశముంది. అంతేకానీ, ఎటువంటి పశ్చాత్తాపం కూడా లేకుండా పాపాలను కొనసాగిస్తూనే కష్టాలు పోవాలంటూ పరిహారాలను చేయటంవల్ల ఏం ప్రయోజనం ఉంటుంది.

    సరిగ్గాచదవకపోయినా గొప్పడిగ్రీలు, గొప్ప ఉద్యోగాలువచ్చి బోలెడుడబ్బు రావాలని కోరుకోవటం ఎంతవరకు సరైనది?

    అలాగే మనస్సును అదుపులో ఉంచుకోలేము, పాపాలు చేయకుండాఉండలేము కానీ, మాకష్టాలన్నీ తక్షణమే తొలగిపోవాలంటూ పూజలు చేయటం ఎంతవరకు సరైనది?

    కొన్నిసార్లు తప్పనిపరిస్థితిలో పొరపాట్లు చేస్తే, పశ్చాత్తాపంపొంది, మంచిగాఉంటూ దైవాన్ని ప్రార్ధించుకోవాలి.

    అయితే, కొందరు చెడ్దవాళ్లవల్ల మంచివాళ్ళకు కూడా కష్టాలు వస్తాయి. కొందరివల్ల పర్యావరణసమస్యలు వచ్చి మిగతావారికి కూడా కష్టాలు వస్తాయి. ఇలాంటప్పుడు చేయగలిగినంత మానవ ప్రయత్నం చేస్తూ దైవాన్ని వేడుకోవాలి.

    ప్రజలు అందరూ దైవభక్తి కలిగి.. సత్ప్రవర్తనతో జీవించటానికి ప్రయత్నిస్తూ.. అంతా శాంతిగా సంతోషంగా ఉండాలని గట్టిగా దైవాన్ని ప్రార్ధిస్తే ఫలితం తప్పకుండా ఉంటుంది.
    దైవానికి అన్నీ తెలుసు. అంతా దైవం దయ.

    ReplyDelete


  5. ప్రాచీనగ్రంధాలలో అనేక ప్రక్షిప్తాలు ఉన్నాయని పండితులే అంటుంటారు. ఈ రోజుల్లో గమనిస్తే .. ప్రాచీనగ్రంధాలలో ఉన్న విషయాల గురించి కొందరు ఎవరికి తోచినట్లు వారు చెబుతున్నారు. ఇక తరతరాలనుండి ఎందరు తమకు తోచినట్లు గ్రంధాలలో మార్పులుచేర్పులు చేసారో చెప్పలేము.

    కొందరు తెలిసితెలియని వాళ్లు, స్వార్ధపరులు కూడా ..గ్రంధములలో మార్పులుచేర్పులు చేసే అవకాశముంది. అందువల్ల ప్రతిదీ గుడ్దిగా నమ్మటం కాకుండా విచక్షణతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

    సమాజంలో రకరకాల అభిప్రాయాల వారు ఉంటారు కాబట్టి, ప్రక్షిప్తాలను సరిదిద్దాలంటే కష్టమైనపని...ఏవి ప్రక్షిప్తాలో? తెలియదు కాబట్టి, గ్రంధాలలో ప్రక్షిప్తాలు ఉన్నాయని అంగీకరించి, వాటి విషయంలో విచక్షణతో ఉండాలి.

    గ్రంధములు ఏవి ప్రామాణికమయినవో పెద్దలు నిర్ణయించి చెబితే అవి ప్రామాణికమని అందరికీ తెలుస్తుంది. పురాణేతిహాసాల గురించి రచనలు చేయటం, వ్యాఖ్యానించే స్వేచ్చ.. భక్తులు అందరికీ ఎప్పుడూ ఉంటుంది. అయితే, ఆ రచనలు, వ్యాఖ్యలు.. అభ్యంతరకర పద్ధతిలో ఉండకూడదు. ప్రామాణికమైన గ్రంధాల ప్రకారం చక్కగా ఉండాలి.

    ప్రాచీన గ్రంధాలలోని కొన్ని విషయాలు పైకి కనిపించేవి ఒకలా ఉంటే, అంతరార్ధాలు అనేకం ఉండవచ్చు. అందువల్ల అన్నింటిగురించి గబుక్కున ఒక నిర్ణయానికి రాకూడదు.

    ఇంతకుముందు ఏం జరిగిందో తెలియదు. భవిష్యత్తులోఅయినా..ఎవరికి తోచినట్లు వారు గ్రంధాలలో మార్పులుచేర్పులు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టాలి.

    ReplyDelete