koodali

Monday, January 22, 2024

వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్....2

 

వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. లింక్స్ పైన క్లిక్ చేసి చదవగలరు..

 

*దైవం నిత్యం.. దైవానికి ఆది, అంతము లేవు ..ఉదాహరణ.....

 

 *పురాణేతిహాసాలలోని పాత్రలు, సంఘటనల ద్వారా ... చక్కట...

 

* మహాభారతం గురించి కొన్ని విమర్శలు...నా అభిప్రాయ...

 

 *ముహూర్తాలు...మరి కొన్ని విషయాలు.

 

* జీవితంలో సంపాదన ఉంటే చాలా ?

 

*".Matter and energy cannot be created or destroyed...

 

* అప్పుడు ..ఇప్పుడు .. కొన్ని విషయాలు ...

 

 *వేదం ఒప్పుకున్నదే సద్ధర్మం.......

 

 *ఆడవాళ్ళ మధ్యే ఇన్ని గొడవలు ఉండగా..

 

* ఎలా జీవించాలి ? ఎలా జీవించకూడదు ? కొన్ని విషయా...

 

* ఈ రోజుల్లో ఆహారం గురించి కొన్ని విషయాలు.. మరియు స...

 

 

 

5 comments:

  1. పాతకాలంలో కొందరు స్వదేశీయులు కూడా కొన్ని పొరపాట్లు చేసారు. భారతీయులలో ఐకమత్యం ఉంటే విదేశీయులు ఈ గడ్దపై వ్రేళ్ళూనుకునేవారా? ఈ దేశాన్ని పాలించేవారా? అయితే, పాతకాలం వారు ఎందరో చేసిన త్యాగాల వల్ల దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఇప్పుడు కూడా భారతీయులలో ఐకమత్యం లేదు. ఇప్పుడు కూడా కొందరు ఎన్నో పొరపాట్లు చేస్తున్నారు.

    మతం విషయంలో.. ఎవరిమతాన్ని వారు చక్కగా ఆచరించుకోవచ్చు. అయితే, కొందరు ఇతరులను మతం మార్చటానికి నయానా, భయానా ప్రయత్నించటం సరైనది కాదు. మన మతాన్ని మనం కాపాడుకోవాలి. దైవం దయవల్ల తిరుమలలో ..వాదవివాదాలు సమసిపోవాలి.

    ఇతరమతాల వారు కొందరు ఎన్నో పాఠశాలలు స్థాపించారు. చాలామంది హిందువుల పిల్లలు కూడా అక్కడ చదువుతుంటారు. ఆసుపత్రులు కూడా పెట్టారు. ఎందరో అక్కడకు వెళ్ళి వైద్యం చేయించుకుంటారు.
    దేవాలయాల ఆధ్వర్యంలో.. ప్రజలకు ఉచితం కాకపోయినా, తక్కువ ఖర్చుతో విద్య, వైద్యం అందించగలిగితే బాగుంటుంది.
    ...........
    ప్రపంచంలో అధికారం, డబ్బు కొరకు, కొందరు వ్యక్తులు ..కుల, మత, ప్రాంత..విభేదాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోటానికి ప్రయత్నిస్తారు. అలాంటప్పుడు గొడవలు, యుద్ఢాలు.. జరిగే అవకాశం ఉంది. కొందరి వల్ల అందరికీ కష్టనష్టాలు కలుగుతాయి. అందువల్ల అందరూ విచక్షణతో ఆలోచించుకుని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి.

    డబ్బు, అధికారం కొరకు గొడవలు, యుద్ధాలు జరిగితే అంతగా ఆశ్చర్యం అనిపించదు. కానీ, దైవం అంటేనే శాంతి. మరి, దైవం విషయంలో కూడా ప్రజలు గొడవలు పడటం బాధాకరం. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో ? ప్రపంచం ఎప్పుడు శాంతిగా ఉంటుందో? ఎక్కడైనా, ఎవ్వరైనా చిన్నపిల్లలు, మంచివారు కష్టాలు లేకుండా ఉండాలి.

    ప్రపంచంలో అందరూ, అన్నిజీవులు మంచిగా ఉండాలి.

    ReplyDelete
  2. వేదములలో అపారమైన విజ్ఞానం ఉంటుంది. మరి, అంతటి గొప్ప విజ్ఞానం నేర్చుకోవాలంటే ఎన్నో నియమాలు ఉంటాయి. లౌకికమైన విద్యలు నేర్చుకోవాలంటేనే ఎన్నో ఆంక్షలు ఉంటాయి.
    ఉదా.. లౌకికమైన చదువులు చదవాలంటేనే ఎన్నో అడుగుతారు. నేర్చుకోవాలని ఉన్నా అందరికీ ప్రవేశం ఇవ్వరు. మరి ఎంతో గొప్పదైన వేదవిద్య నేర్చుకోవాలంటే ఎన్ని చూడాలి.

    వేదవిద్యను దుర్వినియోగం చేయకూడదు. దుష్టులకు ఆ విద్యలు అందకూడదు. ఇవన్నీ ఆలోచించి ఎన్నో కట్టుబాట్లను విధించారు. సాత్వికతతో కూడిన నియమాలు ఉంటాయి. దినచర్య పద్ఢతిగా ఉండాలి. ఇలా ఎన్నో ఉంటాయి. దైవభక్తి, ఉపాసనాబలం, సత్ప్రవర్తన..వంటివి ఉన్నప్పుడు విద్య బాగా అర్ధమవుతుంది.

    కొన్ని కుటుంబాల్లో వంటల తయారీవిధానాల గురించి కూడా ఇతరులకు చెప్పరు. తరతరాలుగా వారి కుటుంబాల్లోని వారికే ఆ విషయాలను చెబుతుంటారు. ఈ రోజుల్లో కూడా కొన్ని సంస్థలు.. వారి సంస్థకు సంబంధించిన ఫార్ములాలు, రహస్యాలు బయటకు తెలియనివ్వరు. మరి, అత్యంతవిలువైన వేదవిద్యను తెలుసుకోవాలంటే ఎన్నో నియమాలుంటాయి కదా..

    వేదములు ఎంతోగొప్పవి.. ఎంతో ప్రయత్నిస్తే, కొద్దిగా తెలుసుకోవచ్చు అంటారు.. అన్నింటికీ మూలమైన దైవకృపను పొందటానికి ప్రయత్నించి సఫలమైన వారికి, అన్నీ లభిస్తాయి. ఈ విధంగా ఎవరైనా ప్రయత్నించవచ్చు.

    ReplyDelete
  3. రాజ్యానికి చెందిన గోప్యంగా ఉంచవలసిన అత్యంతరహస్యాలను అన్నీ పూసగుచ్చినట్లు ప్రతిఒక్కరికి చెప్పేస్తారా? కొన్నివిషయాలను మాత్రం చెబుతారు అంతే. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. అయినా సరే పార్లమెంట్లోకి వెళ్ళి కూర్చుంటామంటే ఎప్పుడుపడితే అప్పుడు అందరినీ వెళ్ళనిస్తారా ? ఈ విషయంలో కొన్ని ఆంక్షలుంటాయి.అంతమాత్రాన వివక్ష అంటారా ?

    ReplyDelete
  4. కొన్ని విషయాల గురించి బయటకు చెప్పవచ్చుకానీ, సమాజక్షేమాన్ని దృష్టిలోఉంచుకుని కొన్నివిషయాలగురించి అందరికీ తెలియనీయరు. ఎవరుఎటువంటివారో తెలియదు కదా..

    ReplyDelete
  5. ఇంకొక విషయం..ఒక సంస్థలో పనిచేసే శాస్త్రవేత్తకు అనారోగ్యం వస్తే, ఎందరో వైద్యులను సంప్రదించినా వ్యాధి తగ్గలేదట. అప్పుడు ఆయుర్వేదవైద్యులు త్రిఫల వాడినా వ్యాధి తగ్గలేదట. త్రిఫల పాళ్ళు కొద్దిగా మార్చి వాడగా వ్యాధి పూర్తిగా నయమయిందట. రాజీవ్ దీక్షిత్ గారు ఉన్నరోజుల్లో ఈ విషయం జరిగిందని విన్నాను. త్రిఫల, అశ్వగంధ వంటివాటిని ఎవరికి తోచినట్లు వారు వాడటంకన్నా, ఆయుర్వేద వైద్యులను సంప్రదించి వాడుకుంటే మంచిది.

    Link..Arogya Rahasya 22.. fruits given by nature for our health.. Rajiv Dixit ..8.10 min.. వద్ద వినవచ్చు.

    ReplyDelete