స్త్రీల కష్టాలకు పురుషులతో పాటు సాటి స్త్రీలు కూడా కారణమే.
ఉదా..చాలామంది అత్తాకోడళ్ళకు పడకపోవటం ఎప్పటినుంచో ఉంది.
మంచిమనిషి అని పేరు తెచ్చుకున్న అత్త గారు కూడా కోడలి విషయంలో రాక్షసంగా ప్రవర్తించే అవకాశముంది.
మంచిమనిషి అని పేరు తెచ్చుకున్న కోడలు కూడా అత్తగారి పట్ల రాక్షసంగా ప్రవర్తించే అవకాశముంది.
...............................
ఒకరంటే ఒకరికి పడని అత్తాకోడళ్ళు ఒకే ఇంట్లో ఉండటం కష్టమే . అదొక నరకం.
సూటిపోటిమాటలతో కోడలిని చిత్రవధ చేసే అత్తగారితో కలిసి ఉండటం అంటే మహా నరకమే.
..............................
పురుషులు స్త్రీలను తెగ కష్టాలు పెట్టేస్తున్నారని అంటారు కానీ,
ఇంటి నాలుగు గోడల మధ్య ... అత్తలు అనబడే కొందరు నరరూప రాక్షసులు కోడళ్ళను పెట్టే చిత్రహింసల గురించి ఎందుకు మాట్లాడరు ?
..................................
కొడుకుకోడలు మధ్య గొడవలు సృష్టించి కోడలిని కొడుకుతో తిట్టించి, కొట్టించి రాక్షసానందాన్ని పొందే అత్తలు ఎందరో ఉన్నారు. అత్తకు వంతపాడే ఆడబిడ్దలూ ఉంటారు.
..............................
ఇక, కొందరు కోడళ్లు కూడా అత్తలకు నరకం చూపిస్తుంటారు.
మాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. అత్తగారికి అతి శుభ్రం ఎక్కువ. కోడలికేమో అతి బద్ధకం.
వారి కోడలు రోజూ ఆఫీసు నుంచీ ఆలస్యంగా వచ్చేదట. సెలవు రోజుల్లో కూడా స్నేహితురాళ్ళతో షాపింగుకు వెళ్ళటం, పార్టీలు, ఫంక్షన్స్ అంటూ తిరగటం, ఇంటిపని పట్టించుకోకపోవటం...అలా గొడవలు అయిపోయాయి.
అత్తగారి గురించి కోడలు ఆఫీసులో ఆడవాళ్ళతో చెప్పగా.. వాళ్లు ఇంటికి ఫోన్ చేసి అత్తగార్ని తిట్టారట. గొడవ చిలికిచిలికి గాలివాన అయి... అత్తాకోడళ్లు విడిపోయి వేరే ఇళ్ళలో ఉంటున్నారు.
........................
అయితే, విడిపోయినా అత్తాకోడళ్ళ మధ్య శత్రుత్వం తగ్గలేదు.
అత్తగారేమో తన కోడలి వల్ల తాను ఎన్ని కష్టాలు పడిందో అదేపనిగా ఇరుగుపొరుగు వారితో చెప్పుకోవటం..కోడలేమో తన అత్తగారి వల్ల తాను ఎన్ని కష్టాలు పడిందో అదేపనిగా ఆఫీసు వాళ్ళతో చెప్పుకోవటం కొనసాగించారు.
అలా .. కొంతకాలానికి ఇద్దరికి అనారోగ్యం కలిగింది.
అత్తగారికి పక్షవాతం వచ్చింది. కోడలికి గర్భసంచి అనారోగ్యానికి గురయ్యి పిల్లలు పుట్టకుండానే గర్భసంచి తీసివేయవలసి వచ్చింది.
.............................
అభిప్రాయాలు కలవని వాళ్ళు ఎందరో లోకంలో ఉంటారు.పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు కలిగిన వాళ్ళు కూడా స్నేహంగా ఉండటం కనిపిస్తుంది.
అయితే, కుటుంబసభ్యుల మధ్య మాత్రం గొడవలు తారాస్థాయికి వెళ్ళటమే బాధాకరం.
........................
ఆడవాళ్ళ మధ్యే ఇన్ని గొడవలు ఉండగా..
స్త్రీల కష్టాలకు పురుషులు మాత్రమే కారణం, పురుషాధిక్యత నశించాలి..అంటూ గొంతులు చించుకోవటాలు ఎందుకో ?
స్త్రీల పట్ల సాటి స్త్రీల ఆధిక్యత నశించ నవసరం లేదా ?

మంచి విషయం ప్రస్తావించేరు. ధన్యవాదాలు. ఓ పురుషుడికి భార్యగా ప్రవేశించిన ఒక స్త్రీని పరాయి మనిషిగా చూడడమే గొడవలకు మూలకారణం. స్త్రీలు స్త్రీలకే శత్రువులు అని మీరు బాగా వివరించేరు.
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Deleteనిజమేనండి, అత్తా ఒకప్పుడు కోడలే.
తాను ఆ ఇంటికి ఎలా వచ్చిందో కోడలూ అలాగే వచ్చింది.
స్త్రీల పట్ల సాటి స్త్రీల ఆధిక్యత ఈ మాట వింటే ఫెమినిస్ట్ లు మీ వెంటపడతారు. సారంగ,విహంగ ల లో మగవాళ్లు అణచివేస్తారు అని అబద్దాల హోర్రెత్తే కథలు రాస్తూంటారు.
ReplyDelete
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
స్త్రీల పట్ల సాటి స్త్రీల ఆధిక్యత..అనేది నిజమే.
ఈ సమస్య గురించి కూడా అందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది.