అత్తగారి సాధింపులు అనే సమస్య వల్ల చాలామంది స్త్రీలు నరకం అనుభవిస్తున్నారు.. అనే విషయం గురించి ఇంతకు ముందు వ్రాయటం జరిగింది.
..........
స్త్రీల ఇంకొక ముఖ్యమైన సమస్య ఏమిటంటే, ఒక స్త్రీ యొక్క కాపురంలో సమస్యలు రావటానికి ఇంకొక స్త్రీ కారణం కావటం...
ఈ సమస్య వల్ల కూడా ఎంతో మంది స్త్రీలు నరకం అనుభవిస్తున్నారు...ఈ సమస్య వల్ల కొందరు స్త్రీలు ఆత్మహత్య చేసుకోవటం కూడా జరిగింది.
..........................
ఈ మధ్య కొందరు స్త్రీలు ఏమంటున్నారంటే, మా ఇష్టం ప్రకారం స్వేచ్చగా తిరిగితే తప్పేమిటి ? అని ప్రశ్నిస్తున్నారు.
ఇష్టం వచ్చినట్లు తిరగటం అంటే , ఇతరుల జీవితంలోకి ప్రవేశించి వాళ్ల జీవితాలను పాడుచేయటం జరుగుతుంది .
స్త్రీలైనా, పురుషులైనా కట్టుబాట్లు లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించటం తప్పే.
భార్య పిల్లలు ఉన్న పురుషుడు భార్యకు అన్యాయం చేసి ఇంకొక ఆమెతో జీవితం గడపటం చూస్తున్నాము.
ఇలాంటి సంఘటనలలో.. పురుషుడు కట్టుకున్న భార్యకు అన్యాయం చేస్తుండగా.. సాటి స్త్రీ కాపురాన్ని కూలదోసి ఆమె స్ఠానాన్ని పొందటానికి ప్రయత్నించే స్త్రీని ఏమనాలి ?
సాటి స్త్రీ కాపురాన్ని కూలదోసి ఆమెకు మానసికవేదన కలగటానికి కారణ
మయ్యే స్త్రీలు ఎందరో ఉన్నారు.
..............................
ఇవన్నీ గమనిస్తే ఏం తెలుస్తుందంటే, స్త్రీల కష్టాలకు .. కొందరు పురుషులు మరియు కొందరు స్త్రీలు కూడా కారణం అని స్పష్టంగా తెలుస్తుంది.
స్త్రీల కష్టాలలో సాటి స్త్రీల పాత్ర ..అనే సమస్య గురించి కూడా అందరూ ఆలోచించవలసిన అవసరం ఎంతో ఉంది .
*****************

mari konni vishayaalu..
ఈ రోజుల్లో కొందరు సెలెబ్రిటీలు కూడా భార్యభర్తతో విడాకులు ఇవ్వకపోయినా
వేరేవాళ్ళతో తిరుగుతున్నారు. వాళ్ళను చూసి ఆహా ఓహో, ఆదర్శమైన దంపతులంటూ
మీడియా కూడా ఆకాశానికి ఎత్తేయటం జరుగుతోంది.
భార్యభర్త విడాకులు జరగకుండా
వేరొకరితో తిరగటం చట్టవ్యతిరేకం. మరి, అలా తిరుగుతున్నవారిని, వారిని
సపోర్ట్ చేసేవారిని ఏం చేయాలి?
స్త్రీలకు ఆర్ధిక స్వాతంత్ర్యం ఉండటం మంచిది. అందుకే పాతకాలంలో అమ్మాయి తల్లితండ్రి తమ కూతురుకు వివాహ సమయంలో కొంత బంగారమో, ధనమో, ఆస్తో.. ఇచ్చేవారు.
స్త్రీలకు ఆర్ధిక స్వాతంత్ర్యం ఉండటం మంచిది. అందుకే పాతకాలంలో అమ్మాయి తల్లితండ్రి తమ కూతురుకు వివాహ సమయంలో కొంత బంగారమో, ధనమో, ఆస్తో.. ఇచ్చేవారు.
స్త్రీ
ధనాన్ని మగవాళ్లు వాడకూడదని గ్రంధాలలో కూడా తెలియజేసారు. ఇప్పుడు చాలామంది
కట్నం పేరుతో స్త్రీలను బాధించి వాళ్ల డబ్బు లాక్కోవటం వల్ల ఆ పద్ధతికి
చెడ్డ పేరు వచ్చింది.
ఈ రోజుల్లో చాలామందిలో ఇన్సెక్యూరిటి పెరిగింది. పాతకాలంలో స్త్రీలు కొందరు అత్తింటివారి వల్ల చంపబడేవారు. ఈ రోజుల్లో కొందరు స్త్రీలు కూడా భర్తలను చంపుతున్నారు. పరిస్థితి ముందుముందు ఎటుపోతుందో?
ఈ రోజుల్లో చాలామందిలో ఇన్సెక్యూరిటి పెరిగింది. పాతకాలంలో స్త్రీలు కొందరు అత్తింటివారి వల్ల చంపబడేవారు. ఈ రోజుల్లో కొందరు స్త్రీలు కూడా భర్తలను చంపుతున్నారు. పరిస్థితి ముందుముందు ఎటుపోతుందో?
.............................................
ఈ రోజుల్లో స్త్రీలకు ఉద్యోగాలు వచ్చాక పరిస్థితి చాలా మారిపోయింది. ఉద్యోగం డబ్బుతో బోలెడు వస్తువులు కొనుక్కోగలరు కానీ, చాలామందికి మనశ్శాంతి, ఆరోగ్యం ఉండటం లేదు.
కొందరు, చిన్న పిల్లల్ని చదువు పేరుతో హాస్టల్స్లో వేస్తారు. హాస్టల్స్ లో పిల్లల జీవితం పిల్లలది. తల్లితండ్రిని పెద్దవయస్సులో వృద్ధాశ్రమంలో వేస్తే మాత్రం పెద్దవాళ్ళను వదిలేసారంటారు.
...................................
అస్తమాను సతాయించే అత్తమామలతో..భర్తతో.. భార్యతో ఉండి, వాళ్ల వేధింపులను భరిస్తూ ఉండాలన్నా చాలా కష్టమే. కొంతవరకు ఓర్చుకోగలరు కానీ, తట్టుకోలేని పరిస్థితిలో వేధింపులు ఉంటే మాత్రం విడిపోక చేయగలిగింది లేదు. ఇక, పిల్లల కర్మ పిల్లలది.
విడిపోయిన తరువాత ఉండే కష్టాలు అప్పుడూ ఉంటాయి. ఏం చేయాలనేది ఎవరి పరిస్థితిని బట్టి వారు ఆలోచించుకుని చేయాలి. ఎవరి కర్మ వారిది.
ఈ రోజుల్లో ప్రతి వారికి ఈగో ఎక్కువయ్యింది. అందరూ తమ మాటే వినాలన్నట్లు అనుకుంటున్నారు. కొందరు తాము ఎదుటివారిని బాధపెడుతూ కూడా, ఎదుటివారే తమను బాధపెడుతున్నారని అంటారు.
కొన్నిసార్లు ఇరువైపుల వాళ్ళు తప్పులు చేస్తారు. ఎవరికి వాళ్లు తామే కరెక్ట్ అని వాదిస్తారు.
కొందరు బాధ్యత పట్టకుండా ఉంటారు. అలా బాధ్యత లేకుండా ఉన్నారని భార్య కానీ, భర్త కానీ అంటే, వాళ్లు సతాయిస్తున్నారని అందరితో చెబుతారు.
కొందరు వేరే వాళ్లతో అక్రమసంబంధాలతో తిరుగుతారు. ఆ మాట అంటే, సతాయిస్తున్నారని అందరితో చెబుతారు. ఇలాంటి వాళ్ళను ఏం చేయాలి...
.....................
పాతకాలంలో చతురాశ్రమ ధర్మాలను పాటించేవారు. పెద్ద వయస్సు వచ్చాక వానప్రస్తం, సన్యాసాశ్రమం కూడా ఉండేవి. అడవులకు వెళ్లకపోయినా, తమ ఇంట్లోనే ఉండి పిల్లల విషయంలో అతిగా కలగజేసుకోకుండా, ప్రశాంతంగా ఉంటూ దైవస్మరణ కూడా చేసుకుంటూ ఉండేవారు.
ఈ రోజుల్లో కొందరు పెద్దవాళ్ళు కూడా తమ పిల్లల కాపురాల్లో అతిగా కల్పించుకుంటూ గొడవలు తెస్తున్నారు. వివాహమైన పిల్లలు కొందరు, సర్దుకుపోయే పెద్దవాళ్ళను కూడా గౌరవించటం లేదు.
......................................
భార్యాభర్త గొడవలు పడినప్పుడు చాలా సమస్యలు వస్తాయి.
పిల్లలు కూడా బాధలు పడతారు.. భార్యా భర్త విడాకులు తీసుకుని, తరువాత వాళ్లు వేరే వాళ్లను వివాహం చేసుకుంటే, పిల్లల్ని అమ్మమ్మ తాత వద్ద, నాన్నమ్మ తాత వద్ద, కొందరు హాస్టల్స్లో కూడా ఉంచుతారు.
ఆ వయస్సులో పెద్దవాళ్ళు తమ పనులే తాము సరిగ్గా చేసుకోలేరు. ఇక చిన్నపిల్లల్ని సరిగ్గా చూడగలరో? లేదో?

ఈ రోజుల్లో..కొందరు పెద్దవాళ్లు సెల్ఫోన్లు, టీవీ ఎంతసేపైనా ఓపికగా చూస్తారు. కానీ, కన్న పిల్లల్ని సరిగ్గా చూసుకోకుండా పిల్లలను కొట్టే తల్లితండ్రి, మనుమలను, మనుమరాళ్లను విసుక్కునే అమ్మమ్మ, నాన్నమ్మ, తాతలు కూడా కొందరు ఉన్నారు.
కొందరు, ఆఫీసుల్లో ఎంత పని చెప్పినా కిమ్మనకుండా చేస్తారు కానీ, కన్నబిడ్దల్ని చూసుకోమంటే మాత్రం మా వల్ల కాదంటారు.
చిన్నపిల్లలను ఎంతో ఓపికగా పెంచాలి. చంటి పిల్లలకు ఏమీ తెలియదు. వాళ్ల పనులు వాళ్లు చేసుకోలేరు. పాతకాలంలో తల్లి ఇంటిపని,వంటపని, పిల్లల పని చేసుకుంటే, పెద్దవాళ్లు కొంతసేపు పిల్లలను ఆడించేవారు.
ఇప్పుడు కూతుర్లు, కోడళ్లు ఉద్యోగాలు చేస్తూ రాత్రికి ఇంటికి వస్తే, పెద్దవాళ్లే ఇంటిపని, వంటపని, పిల్లల పని చేయాలంటే అంతా చేయలేరు. మరి, పిల్లల పరిస్థితి ఏమిటి?
కొందరు చంటి పిల్లలను డేకేర్ సెంటర్లలో ఉంచుతారు. అక్కడ పిల్లల్ని సరిగ్గా చూస్తారో? లేదో? ఎవరికి తెలుసు. కొన్ని డేకేర్ ల గురించి కొన్ని సంఘటనలు విన్నాక చాలా భయమేస్తుంది.
తల్లి దగ్గర చక్కగా పెరగవలసిన పిల్లల్ని ఎక్కడో వేరే వాళ్ల దగ్గర పెంచటం పిల్లల ఖర్మ. అమ్మనాన్నతో తమ ఇంట్లో చల్లగా ఉండవలసిన పిల్లలు ఎక్కడో ఉండవలసి వస్తుంది.
తల్లితండ్రిని పెద్దవయస్సులో వృద్ధాశ్రమంలో వేస్తే మాత్రం పెద్దవాళ్ళను వదిలేసారంటారు.

........................................
పిల్లల విషయం అలా ఉండదు కదా..పసిపిల్లలకు సరిగ్గా మాటలు రావు కాబట్టి తమ సమస్యలను చెప్పలేరు. కొంచెం పెద్దయిన పిల్లలు తమ సమస్యలను చెప్పినా, అర్ధంచేసుకునే పేరెంట్స్ ఎందరు?
ఉదా..పాతకాలంలో పసిపిల్లలకు పల్చటి నిక్కర్ వంటివి వేసేవారు. వాళ్ళు యూరిన్ పోసినప్పుడల్లా ఆ చెడ్డిలను మార్చి ఉతికి ఆరేసేవారు. యూరిన్ నేలమీదపడితే క్లాథ్ తో తుడిచేవారు. ఈ రోజుల్లో పెద్దవాళ్లు ఆ పనులన్నీ చేయలేక, సోఫాలు, మంచాలు పాడవుతున్నాయని చెప్పి, పసిపిల్లలకు రోజంతా పెద్ద నాప్కిన్స్ వేస్తున్నారు.
ఆ నాప్కిన్స్ తో చాలా ఇబ్బందిగా ఉంటుంది. పిల్లల చర్మానికి రాషెస్ కూడా వచ్చే అవకాశముంది.. దురద, మంట వచ్చినా పిల్లలు చెప్పలేరు. గోక్కోటానికి నాప్కిన్ ఉండి గోక్కోలేరు. ఆ బాధతో పిల్లలు ఏడుస్తుంటే, పిల్లల్ని పెంచటం చాలా కష్టం అంటారు.
పిల్లలు ఇబ్బంది పడినా ఏంకాదు కానీ, సోఫాలు, మంచాలు పాడవ్వకూడదని, తమకు అస్తమాను శుభ్రం చేసే పని ఉండకూడదని పెద్దవాళ్ల ఉద్దేశం కాబోలు.పిల్లలను అలా ఇబ్బంది పెట్టటం చాలా పాపం.
ఇక కొందరు పసిపిల్లలను డేకేర్ సెంటర్లలో వేస్తారు. కొన్ని విదేశాల్లో పసిపిల్లలకు ఎప్పుడూ షూస్ వేసి ఉంచుతారు. పిల్లలను డేకేర్ సెంటర్లలో మధ్యాహ్నం నిద్రపుచ్చుతారు. నిద్రపోయేటప్పుడు కూడా షూస్ తీయకూడదని అక్కడ రూల్స్ అట.
ఇబ్బందిగా ఉండి పిల్లలు షూస్ తీయటానికి ప్రయత్నించినా కూడా, అక్కడిసిబ్బంది మళ్లీ షూస్ వేసేస్తారట. ఇంట్లో అయితే అలా ఉండదు కదా. పెద్దవాళ్లు నిద్రపోయేటప్పుడు షూస్ వేసుకుని పడుకోగలరా?
కొందరు స్త్రీలు తాము ఉద్యోగాలు చేసి సమాజాన్ని ఉద్ధరిస్తున్నామని చెబుతారు. ఇంట్లో సరిగ్గా చూసుకోలేని వారు సమాజాన్ని ఏం ఉద్ధరిస్తారు. ఎవరి కుటుంబాన్ని వారు సరిగ్గా చూసుకుంటే సమాజం దానికదే బాగుంటుంది.
చిన్నతనం నుంచి పిల్లలకు శుచిశుభ్రతను నేర్పించాలి. రోడ్లపైన ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకూడదని, పబ్లిక్లో ఒకరినొకరు తోసుకోకుండా లైన్లో వెళ్లాలని,గట్టిగా సౌండ్ చేయకూడదని, జీవితంలో న్యాయంగా జీవించాలని నేర్పించాలి.ఇవన్నీ పిల్లలకు ఓపికగా చెప్పటానికి చాలా పెద్దవాళ్ళకు సమయం లేదు. చాలామంది పెద్దవాళ్లే ఇవన్నీ పాటించరు.
ఈ రోజుల్లో కుటుంబాలలో గొడవలు ఎక్కువయ్యాయి. ఎవరైనా కొంతైనా ఎడ్జస్ట్ అయితే బాగుండు. అందరికి మంచి బుద్ది ఉంటే బాగుండు.
కొందరు స్త్రీలు తాము ఉద్యోగాలు చేసి సమాజాన్ని ఉద్ధరిస్తున్నామని చెబుతారు. ఇంట్లో సరిగ్గా చూసుకోలేని వారు సమాజాన్ని ఏం ఉద్ధరిస్తారు. ఎవరి కుటుంబాన్ని వారు సరిగ్గా చూసుకుంటే సమాజం దానికదే బాగుంటుంది.
చిన్నతనం నుంచి పిల్లలకు శుచిశుభ్రతను నేర్పించాలి. రోడ్లపైన ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకూడదని, పబ్లిక్లో ఒకరినొకరు తోసుకోకుండా లైన్లో వెళ్లాలని,గట్టిగా సౌండ్ చేయకూడదని, జీవితంలో న్యాయంగా జీవించాలని నేర్పించాలి.ఇవన్నీ పిల్లలకు ఓపికగా చెప్పటానికి చాలా పెద్దవాళ్ళకు సమయం లేదు. చాలామంది పెద్దవాళ్లే ఇవన్నీ పాటించరు.
......................................
ఉద్యోగాలలో
పనితో చాలామంది స్త్రీలు అనేక అనారోగ్య సమస్యలతో బాధలు పడుతున్నారు.
స్త్రీలు ఉద్యోగాలని ఉదయం వెళ్లి రాత్రి ఇంటికి వచ్చి వంటపని సరిగ్గా
చేయలేకపోతున్నారు. బయట ఆహారం తిని అందరికి అనారోగ్యాలు పెరుగుతున్నాయి.
స్త్రీలు ఇంటి పట్టున ఉండి ఇల్లు శుభ్రంగా సర్దుకోవటం, పుష్టికరమైన, ఆరోగ్యానికి మంచిగా ఉండేలా ఆహారాన్ని కుటుంబసభ్యులకు వండిపెడితే చాలా అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. హాస్పిటల్స్ కు వెళ్లవలసిన అవసరం అంతగా ఉండదు.
ఇంటిని చక్కదిద్దుకునే స్త్రీల పట్ల పురుషులు, ఇంట్లో వారందరూ గౌరవంగా ఉంటే, స్త్రీలు బయట ఉద్యోగాలకు వెళ్లటం గురించి అంతగా ఆసక్తి చూపించరు..
ఇంటిపని త్వరగా అయి, ఏదైనా ఉపాధి పొందాలనుకుంటే, ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 వరకు కొందరు స్త్రీలు కలిసి ఏదైనా చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందవచ్చు.
.....................................

No comments:
Post a Comment