నేపాల్ భూకంపం లో , ఉత్తరాఖండ్ లో వచ్చిన ఆకస్మిక వరదలలో కొన్ని వేలమంది ప్రాణాలు కోల్పోయారు.
జపాన్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ మధ్య వచ్చిన జపాన్ సునామీ లో కూడా వేల మంది ప్రాణాలు కోల్పోయారు కదా!
.............................
దురదృష్టం ఏమిటంటే , విపత్తులు వచ్చి వేలమంది ప్రాణాలు కోల్పోయినప్పుడు కొంతకాలం పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడటం, తరువాత అవన్నీ మర్చిపోవటం ఎక్కువగా జరుగుతోంది.
.................
భగవంతుని దయవల్ల మరింత ఎక్కువ స్థాయిలో భూకంపాలు, వరదలు, హుధుహుద్ తుపాన్లు వంటివి ఎక్కువగా రావటం లేదు కానీ,
ఒక స్థాయికి మించి ప్రకృతి చెలరేగితే మనిషి ఎంత ? మనుషులకు తెలిసిన టెక్నాలజీ ఎంత ?
ప్రకృతి ముందు మనుషుల గొప్పలు .. హనుమంతుని ముందు కుప్పిగంతుల వంటివి.
...............
అభివృద్ధి పేరుతో మనుషులు చేస్తున్న ఎన్నో చర్యల వల్ల పర్యావరణానికి చేటు జరిగి ఎన్నో విపత్తులు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలే అంటున్నారు.
నీటికోసం విచ్చలవిడిగా బోర్లు తవ్వటం, పెద్దపెద్ద డ్యాములు నిర్మించటం, సహజవాయువు వంటి వాటిని వెలికి తీయటం..వంటి వాటివల్ల కూడా భూకంపాలు వచ్చే అవకాశాలు అధికమవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
.................
ఎంతో కష్టపడి అభివృద్ధి చేసుకున్నదంతా ఒక్క దెబ్బతో నేలమట్టమై పోతే కలిగే బాధ చెప్పనలవికానిది. ప్రాణనష్టం కూడా ఉంటే మరింత బాధాకరం.
ఇలాంటప్పుడు ముందే జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.
(జాగ్రత్తలంటే.. పర్యావరణాన్ని పాడుచేయకుండా ఉండటం వంటివి...)
.................
మన దేశంలో ఎన్నో అపార్ట్ మెంట్స్ క్రింది భాగాన పార్కింగ్ కు వదిలి పైన ఇళ్లు కడుతుంటారు.
స్థంబాల మీద నిలిచినట్లు ఉండే అపార్ట్మెంట్స్ అత్యంత ప్రమాదకరం. కొంచెం పెద్ద స్థాయిలో భూకంపాలు వస్తే ఏం జరుగుతుందో చెప్పలేం.
అపార్ట్మెంట్స్ పార్కింగ్ స్థలం వద్ద ఉన్న స్థంభాలను (పిల్లర్స్) కలుపుతూ గోడలు కట్టడం వల్ల చిన్నపాటి భూకంపాలు వచ్చినప్పుడు కొంతయినా తట్టుకునే అవకాశం ఉంటుంది .
..................................
పర్యావరణాన్ని పాడుచేసుకోవటం అంటే , కూర్చున్న కొమ్మను నరుక్కోవటం వంటిదని తెలుసుకుంటే మంచిది.

No comments:
Post a Comment