డబ్బు సంపాదనే ధ్యేయంగా, అక్రమ సంబంధాలు అనేవి తప్పే కానట్లుగా, మద్యాన్ని సేవించటం అనేది అత్యంత సహజంగా మారిన సమాజంలో నేరాలు జరగకుండా ఎలా ఉంటాయి ?
నేరాలు జరిగిపోతున్నాయంటూ గగ్గోలు పెట్టడం ఎందుకు ?
మద్యపానం, అసభ్యకర దృశ్యాలను అదేపనిగా చూడటం.... వంటి వాటివల్ల మనుషులు తమ విజ్ఞతను, వివేకాన్ని కోల్పోయే అవకాశం ఉందని అందరికీ తెలిసిందే.
ఈ రెండింటిని కట్టడి చేస్తే అసభ్యకరమైన ప్రవర్తనకు సంబంధించిన నేరాలు చాలా వరకూ తగ్గుతాయి.
.................
పాతకాలం వాళ్ళు.. శృంగార చర్యలు ఇతరులు చూడకుండా జాగ్రత్తపడేవారు. ఇతరుల కంటపడితే సిగ్గుపడేవారు. ఇప్పుడు సిగ్గుపడటం తగ్గిపోయింది.
శృంగారం అంటే చాటుగా ఉండవలసిన విషయం. ఇప్పుడు అది బహిరంగం అయిపోయింది. (బరితెగింపు అనుకోవచ్చు.)
ఇంట్లో టీవీని ఒక్క నొక్కు నొక్కితే చాలు.. ఆడమగ ఒకరినొకరు కౌగలించుకోవటం, ముద్దులు పెట్టుకోవటం ..వంటి దృశ్యాలు కనిపిస్తుంటాయి.
ఇలాంటి దృశ్యాలు చూసేవాళ్ళ మనస్సు చెదిరే అవకాశం ఉంది.
చిన్న పిల్లల మనస్సు మీద , టీనేజ్ పిల్లల మనస్సు మీద ఇలాంటి దృశ్యాలు ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి.
................
ఇలాంటి దృశ్యాలలో చూస్తుంటే..కొందరు భారతీయ స్త్రీలు కూడా పైన ఒక చిన్న గుడ్డపేలిక, క్రింద ఒక చిన్న చెడ్డీ ధరించి కనిపిస్తుంటారు. ఇలా తిరగటానికి కొందరు ఏ మాత్రమూ సిగ్గుపడటం లేదు.
సిగ్గుపడక పోగా, మేము తక్కువ దుస్తులే వేసుకుంటాము... సరిగ్గా దుస్తులు వేసుకోమని మాకు చెప్పే హక్కు ఎవరికీ లేదు..అంటూ గొడవ చేయటం అత్యంత బాధాకరం .
...................
సమాజంలో ఎక్కువమంది ద్వంద్వ ప్రవృత్తితో ప్రవర్తిస్తున్నారు. ఒక ప్రక్క నీతులు చెబుతూనే మరో ప్రక్క పాపపు పనులు చేస్తున్నారు.
ఎన్నో అసభ్యకరమైన దృశ్యాలున్న సినిమాలు తీసేవాళ్ళు కూడా సమాజం చెడిపోతూందని స్పీచ్లు ఇస్తుంటారు.
మనుషులను పాడు చేసే మద్యాన్ని అమ్మే వాళ్ళు కూడా సమాజం చెడిపోతూందని నీతులు చెబుతుంటారు.
ఇతరులను మోసం చేసి డబ్బు సంపాదించేవాళ్ళు కూడా సమాజం చెడిపోతూందని గోల పెడుతుంటారు.
కొన్ని వార్తాపత్రికలలో ఒక పేజీలో నీతులు ఉంటాయి. ప్రక్క పేజీ తిప్పితే అసభ్యకర చిత్రాలు కనిపిస్తాయి. ( అంటే అర్ధనగ్న చిత్రాలు, స్త్రీపురుషుల ఆలింగనాది బొమ్మలను వేస్తుంటారు.)
కొన్ని చానల్స్ కూడా ఇంతే. ఒక వంక సమాజంలో జరుగుతున్న నేరాల పట్ల బోలెడు జాలి చూపిస్తూ .. నీతులు వల్లిస్తూనే... ఇంకొక వంక అసభ్యకర చిత్రాల దృశ్యాలను ప్రదర్శిస్తుంటారు.
ఇవన్నీ గమనిస్తే, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియటం లేదు.
ఎన్నో నీతులు చెబుతూ ధర్మాధర్మాలు తెలిసినవాళ్ళు కూడా సమాజానికి హాని కలిగించే పనులు చేయటం అత్యంత బాధాకరం .
.............
నేరాలు తగ్గాలంటే....పోర్న్ సైట్లకు నిషేధం విధించటం, అసభ్యకరమైన సినిమాలను, సీరియల్స్ను, దృశ్యాలను ప్రదర్శించకుండా నిషేధం విధించటం, మద్యాన్ని నిషేధించటం..వంటి చర్యలను పటిష్టంగా అమలుపరచినప్పుడు చాలా నేరాలు తగ్గుతాయి.
నేరాలు తగ్గాలంటే.... ఆర్ధిక అసమానతలు తగ్గే విధంగా కఠినమైన చర్యలు తీసుకోవటం కూడా చాలా అవసరం.
ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా నేరాలు జరిగితే నేరస్తులను కఠినంగా శిక్షించాలి. మళ్ళీ అలాంటి నేరం ఎవరూ చేయటానికి భయపడేంత కఠినంగా శిక్షించాలి.
..............................
నేరాలు ఎవరు చేసినా తప్పు తప్పే. పేద..ధనిక అనే తారతమ్యం ఉండకూడదు.
అయితే , నేరాలు జరగటానికి ప్రేరణ కలిగించిన మూలకారకులైన వ్యక్తులను కూడా చాలా కఠినంగా శిక్షించాలి.
........................
సమాజానికి హాని చేసే విధంగా ప్రవర్తించే వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే. ఒకవేళ వాళ్ళు ఇక్కడి న్యాయస్థానం ముందు నుంచి తప్పించుకున్నా భగవంతుని తీర్పు నుండి తప్పించుకోలేరు.

No comments:
Post a Comment