తెలుగుభాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలండి.
.................................
ఆధునికవిజ్ఞానం...".Matter and energy cannot be created or destroyed "......అని వివరించటం జరిగింది. ఈ సూత్రం ప్రకారం చూసినా జన్మలు, పునర్జన్మలు ఉండే మాట వాస్తవమే అనిపిస్తుంది.
ఉదాహరణకు... ఎవరైనా వ్యక్తి యొక్క జీవితం ముగిసినప్పుడు , పంచభూతాలతో తయారైన శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది. ...... మరి, ఎన్నో భావాలతో కూడిన మనస్సు ( ఆత్మ ) ఏమవుతుంది ?
జీవించి ఉన్నప్పుడు మనిషి మనస్సుతో ఎన్నో ఆలోచనలు ( పనులు ) చేస్తాడు. అంటే, మనస్సు కూడా శక్తే కదా !.... Matter and energy cannot be created or destroyed ... అన్న సూత్రం ప్రకారం..... మరి మరణించిన వ్యక్తి యొక్క మనస్సు ఏమవుతుంది ?
మనస్సు ( ఆత్మ ) మరో శరీరాన్ని ధరిస్తుంది. మరో జన్మనెత్తుతుంది. పరమాత్మను చేరేవరకూ (మోక్షాన్ని పొందేవరకూ) ఈ జన్మపరంపర కొనసాగుతుంది. ఇదంతా చూస్తే , ప్రాచీనులు చెప్పినట్లు జన్మలు, పునర్జన్మలు ఉన్నమాట నిజమే అనిపిస్తుంది.
జీవికి తాను చేసిన పూర్వకర్మల ఆధారంగా భవిష్యజన్మ ఉంటుంది... మనిషి చేసిన కర్మలు ఉంటాయి...వాటి ఫలితమూ ఉంటుంది. వాటిని బట్టి మరుజన్మో లేక మోక్షమో..అలా ఉంటాయి.
జీవి పుట్టినప్పుడు ఆ జీవి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలుసుకుని , తగిన జాగ్రత్తలు తీసుకోవటానికి ( వీలయినంతలో భవిష్యత్తును సరిదిద్దుకోవటానికి ) జ్యోతిషం ఉపయోగపడుతుంది. అందుకే దయామయులైన దైవం, పెద్దలు జ్యోతిషశాస్త్రాన్ని లోకానికి అందించారు.
జ్యోతిషం నిజమా ? కాదా ? అని ప్రపంచంలో చర్చలు జరుగుతుంటాయి. దైవాన్ని , వేదాలను నమ్మని నాస్తికులు జ్యోతిషాన్ని నమ్మకపోవటంలో ఆశ్చర్యం లేదు.
కానీ, దైవాన్ని నమ్ముతాము . అని చెప్పేవాళ్ళలో కూడా కొందరు , జ్యోతిషం అనేది అబద్ధం అనటం బాధాకరం.
*జ్యోతిషం వేదాంగాలలో ఒకటి అని మహర్షులే తెలియజేసారు.
జ్యోతిషం శాస్త్రమే. ఉదా..... ఏవిధమైన ఆధునిక టెక్నాలజీ సాయం లేకుండానే, పంచాంగం ద్వారా లెక్కలువేసి , ఎప్పుడో రాబోయే సూర్య,చంద్ర గ్రహణాలను సంవత్సరానికి ముందే చెప్పగలుగుతున్నారు కదా ! పంచాంగ కర్తలు.
అంతదూరంలో ఉన్న సూర్యచంద్రుల వంటి గ్రహాలు, నక్షత్రాల ప్రభావం మనుష్యుల మీద ఎలా ఉండగలదు ? అని కొందరు సందేహిస్తారు. సూర్యుడు కూడా ఒక విధమైన నక్షత్రమేనట. సూర్యచంద్రుల ప్రభావం ప్రపంచం మీద ఎంతో ఉంది.
సూర్యుని నుంచి వచ్చే సూర్యరశ్మి వల్ల పంటలు పండుతున్నాయి .సూర్యరశ్మి, చంద్రుని వెన్నెల వల్ల మొక్కలు, వృక్షాలు శక్తిని పొందుతాయి.
చాలా దూరంలో ఉన్నా కూడా , సూర్యుని వేడి తగిలితే శరీరం చురుక్కుమనటం, చంద్రుని చల్లదనం తగిలితే మనసుకు హాయిగా ఉండటాన్ని మనం ఫీలవుతున్నాము కదా ! ఇవన్నీ గమనిస్తే , సూర్యచంద్రుల యొక్క ప్రభావం మన మీద ఉంటుందని తెలుస్తోంది కదా !
చంద్రుని వృద్ధిక్షయాలను బట్టి సముద్రపు ఆటుపోట్లలో హెచ్చుతగ్గులు ఉండటం అనేది మనకు తెలిసిన విషయమే.
ఈ రోజుల్లో కొందరు జ్యోతిష్కులకు జ్యోతిషం గురించి సరైన ప్రావీణ్యత లేకపోవటం, సరైన ఉపాసనా బలం లేకపోయినా జ్యోతిషం చెప్పటం వంటి.....కొన్ని కారణాల వల్ల ..జ్యోతిషం చెప్పటంలో తప్పులు వస్తుండవచ్చు. అందుకు జ్యోతిషాన్ని తప్పు పట్టడం , జ్యోతిషమే తప్పు అనటం సరైన పద్ధతి కాదు.
గ్రహాలు, నక్షత్రాలు మానవులపై ఎలా ప్రభావాన్ని చూపించగలవు ? అని కొందరు ఆశ్చర్యపోతారు. ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. ఉదా...మొక్కలు, ఖనిజాల నుంచి తీసిన రసాయన ఔషధాలను వాడిన రోగుల జబ్బులు తగ్గటం కూడా ఆశ్చర్యకరమైన విషయమే. మొక్కలేమిటి ? అవి తింటే మన రోగాలు తగ్గటమేమిటి ? వాటికి మనకు ఏమిటి సంబంధం....
కొన్ని రకాల మూలికలను కలిపి ఔషధంగా తీసుకుంటే జబ్బులు తగ్గుతాయి. ఇదంతా వైద్యశాస్త్రం . అని మనకు తెలుసు. అయితే, సృష్టిలో ఇలాంటి ఏర్పాటు ఎవరు చేసారు ? .....అని ఆలోచిస్తే .....
* దైవం జీవులకు అవసరమైన వాతావరణం, ఆహారం, మొక్కలు, పశుపక్ష్యాదులు.....ఇలా ఎన్నింటినో ఏర్పాటుచేసారు. అలాగే జీవులకు వచ్చే శారీరిక, మానసిక అనారోగ్యాలకు మందుగా మూలికలను కూడా ఏర్పాటు చేసారు.
ఆ మూలికలను ఒక క్రమపధ్ధతిలో కలిపితే మందుగా తయారయ్యే విధానాన్ని ఏర్పాటుచేసారు. ఉదా...వామును ఉప్పును కలిపి తీసుకుంటే అజీర్ణం తగ్గుతుంది. ఉసిరికాయ మరికొన్ని వనమూలికలతో కలిపి తయారుచేసిన చ్యవనప్రాశ తయారుచేసి తింటే జలుబు వంటివి తగ్గుతాయి.
ఈ మందులకు రోగాలను తగ్గించే శక్తి లేకపోతే సృష్టిలోని జీవులు నశించిపోయేవి. జీవులు నశించకుండా దైవం..... ఔషధాలను ప్రకృతిలో ఏర్పరిచారు .
ఏ మాత్రం సంబంధం లేని రకరకాల మొక్కల, ఖనిజాల ,పదార్ధాలతో తయారైన రసాయనాలను ఒక క్రమ పద్దతిలో కలిపితే , ఆ విధానం వల్ల ఔషధం తయారయి , ఆ ఔషధం మనిషి శరీరంపై , మనస్సుపై ప్రభావాన్ని చూపిస్తోంది కదా !
* అలాగే కొన్ని గ్రహాలు, నక్షత్రాలు ఒక పద్ధతిలో ఉంటే ఆ విధానం వల్ల ఏర్పడే శక్తి మనిషిపై ప్రభావాన్ని చూపిస్తుంది.
మొక్కల నుంచి తీసిన రసాయన ఔషధాలు మానవులపై ప్రభావాన్ని చూపించగలిగినప్పుడు , గ్రహాలు, నక్షత్రాల నుంచి వచ్చే శక్తి మానవులపై ప్రభావాన్ని చూపించగలగటంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
గ్రహాలు, నక్షత్రాలు ఉండే విధానం యొక్క ప్రభావం , ఆ సమయంలో జన్మించిన వ్యక్తుల జీవితంపై ఉండటంలో ఆశ్చర్యం ఏముంది.
మనిషి పూర్వజన్మలలో చేసిన కర్మలను బట్టి , అతని జన్మసమయం ఉంటుందని పెద్దలు చెబుతారు. జాతకం అనేది ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో సూచన చేస్తుంది.
జాతకం లోని సూచనలను బట్టి ఒకవేళ భవిష్యత్తులో కష్టాలు ఉండే సూచనలు కనిపిస్తే , వర్తమానంలో సత్ప్రవర్తనతో జీవించటం, ఎక్కువగా పూజలను, పుణ్యకర్మలను ఆచరించటం, ఇతరులకు సహాయం చేయటం , వంటి పద్ధతులను ఆచరించటం ద్వారా ..... భవిష్యత్తులో వచ్చే కష్టాలను అధిగమించే అవకాశాలను కూడా పెద్దలు తెలియజేసారు.
సతీసావిత్రి, మార్కండేయుడు వంటి వారు పట్టుదలగా ప్రయత్నించి తమ జీవితాలను మార్చుకోగలిగారు.
ఈ విషయంలో నా అభిప్రాయాలను ఇతరులకు సరిగ్గా అర్ధమయ్యేటట్లు వ్రాయటం కష్టంగానే ఉంది. కానీ, అర్ధమయ్యేటట్లు వ్రాయటానికి వీలయినంత ప్రయత్నించానండి..
వ్రాసిన విషయాలలో పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
ReplyDeleteమీ వ్యాఖ్యకు ధన్యవాదాలు మరియు మానససరోవరం గురించి తెలియజేసినందుకు కృతజ్ఞతలండి.
మీరన్నట్లు , ఆధ్యాత్మికత ప్రకారం చూస్తే ఆత్మ, మనస్సు, బుద్ధి .....ఒకరకంగా వేరని కూడా చెబుతారు. ఆత్మ, మనస్సు, బుద్ధి.....వీటికి మధ్య గల భేదం గురించి నాకు అంతగా తెలియదండి. అయితే, ఆత్మ, మనస్సు, బుద్ధి.. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం......ఇలా లోతుగా వెళ్తే . విషయం అర్ధం చేసుకోవటం కొంచెం కష్టంగా ఉంటుంది. నాకు అంత ఎక్కువ విషయ పరిజ్ఞానం లేదండి.
నాకు ఏమనిపించిందంటే, మరణించిన మనిషి శరీరం శిధిలమై పంచభూతాల్లో కలిసిపోతుంది. ..".Matter and energy cannot be created or destroyed "..... అన్న సూత్రం ప్రకారం , మరి మనస్సు, బుద్ధి, లేక ఆత్మ .... ( ఇవి కూడా శక్తి స్వరూపాలే కాబట్టి ) ఇవి ఏమవుతాయి ? అన్నది నా అభిప్రాయం.
మీ వ్యాఖ్యను చదివిన తరువాత , ఈ విషయాల గురించి మరింతగా తెలుసుకోవటానికి కొన్ని వ్యాసాలు చదవగా , నాకు కొన్ని కొత్త ఆలోచనలు వచ్చాయండి. ఎప్పుడో చదివిన కొన్ని సంగతులు కూడా గుర్తువచ్చాయి.
ఆత్మ తిరిగి జన్మను ధరిస్తుందని పెద్దలు తెలియజేసారు. ఇంకా,
వ్యక్తి జన్మించకముందు, మరణించిన తరువాత కూడా ఆ జీవాత్మకు తన క్రితం జన్మ లోని సంగతులు గుర్తు ఉంటాయట. ఉదా....బిడ్డ జన్మించక ముందు తల్లి గర్భంలో ఉన్నప్పుడు , ఆ బిడ్డకు తన గత జన్మ జ్ఞాపకాలు గుర్తు వస్తాయట. తాను క్రితం జన్మలో చేసిన పనులను తలుచుకుని , మళ్ళీ గర్భవాస దుఃఖాన్ని అనుభవిస్తున్నందుకు బాధపడుతుందట. మళ్ళీ జన్మ ఎత్తిన తరువాత ఇక పాపాలు చేయకూడదని అనుకుంటుందట. కానీ, మాతృగర్భం నుంచి బయటపడ్డాక గత జ్ఞాపకాలను మర్చిపోతుందట.
మరణించిన వ్యక్తుల జీవాత్మలకు కూడా గత జ్ఞాపకాలు గుర్తుంటాయని పెద్దలు చెబుతారు.
ఈ ఉదాహరణలను గమనిస్తే , మరణం తరువాత శరీరం శిధిలమై పంచభూతాల్లో కలిసిపోయినా , గతజన్మ ఆలోచనలు మాయమైపోవని తెలుస్తుంది. అందుకు కారణం మనస్సా ?, బుద్ధి నా ?, లేక ఆత్మనా ? వీటిలో ఏది కారణం ? అన్నది నాకు సరిగ్గా అర్ధం కాలేదు.
అయితే, ప్రపంచంలో అంతటా చైతన్యం ( శక్తి ) నిండి ఉంది. అంటే ఆత్మ కూడా శక్తి రూపమే కదా ! కాబట్టి .. .....m..a..e..c..b..c..o..d.. అన్న సూత్రం ప్రకారం చూసినా జన్మలు...పునర్జన్మలు అనేవి ఉండటం నిజమే అనిపిస్తుంది. పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మలు తిరిగి పరమాత్మను చేరేవరకూ ( మోక్షాన్ని పొందేవరకూ ) జన్మపరంపర ఉంటుందని అనిపిస్తుంది.
వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
ReplyDeleteమీ వ్యాఖ్యను కొద్దిసేపటి క్రితమే చూశాను.
రిప్లై ఇవ్వటం ఆలస్యం అయినందుకు దయచేసి క్షమించండి.
ఎన్నో విషయాలను వివరంగా తెలియజేసినందుకు కృతజ్ఞతలండి.