koodali

Friday, August 10, 2012

శ్రీ కృష్ణ.... ....

ఓం.
శ్రీ  కృష్ణ  స్తుతి
...........................

కస్తూరీతిలకం  లలాటఫలకే
        వక్షస్థలే  కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే
       వేణుం  కరే  కంకణం
సర్వాంగే  హరిచందనం  చ  కలయన్
      కంఠే  చ  ముక్తావళిం
గోప  స్త్రీ  పరివేష్టితో  విజయతే
      గోపాల  చూడామణిః

ఆదౌ  దేవకిదేవి  గర్భ  జననం  గోపీగృహే  వర్ధనం
మాయాపూతన  జీవితాపహరణం  గోవర్ధనోద్ధారణం
కంసచ్ఛేదన   కౌరవాది  హననం   కుంతీసుతా  పాలనం
హ్యేతద్భాగవతం  పురాణకధితం  శ్రీకృష్ణలీలామృతం....
........................................


కృష్ణజయంతి  సందర్భంగా  ఉట్లోత్సవం  జరుగుతుంది.  ఎందరో  భక్తులు  ఉత్సాహంగా  పాల్గొంటారు.   ఈ  ఉత్సవాన్ని  గమనిస్తే,  మనకు  అనేక   విషయాలు  తెలుస్తాయి. 

 ఉదా......   సమాజాన్ని   చక్కగా  తీర్చిదిద్దుకోవటంలో  వ్యక్తులు   కొన్నిసార్లు   విఫలమైనా  కూడా  ,  అందరూ  కలిసి,    మరలమరల  ప్రయత్నిస్తే  , చక్కటి   సమాజాన్ని    సాధించుకోవచ్చని     మనం  గ్రహించవచ్చు.

 

6 comments:

  1. కలౌ సంఘే శక్తిః అన్నారు పరమాత్మ.

    ReplyDelete
  2. చక్కటి విషయాన్ని తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు.

    ReplyDelete
  3. మీరు చెప్పారని , ఈ మధ్య వ్యాఖ్యల్లో .. అండి .. అన్న పదాన్ని తక్కువగా వాడటానికి ప్రయత్నిస్తున్నానండి.

    ReplyDelete
  4. శిరసున కమనీయ శిఖి పింఛముల వాడు
    చెవుల కుండల దీప్తి చెలువు వాడు
    నుదుటిపై కస్తూరి మృదు తిలకముల వాడు
    ఉరమున కౌస్తుభం బొలయు వాడు
    నాసాగ్రమున గుల్కు నవ మౌక్తికము వాడు
    కరమున వేణువు మెరయు వాడు
    చరిత మైపూతల హరి చందనము వాడు
    గళమున ముత్యాల కాంతి వాడు

    తరుణ గోపికా పరి వేష్ఠితముల వాడు
    నంద గోపాల బాలు డానంద హేల
    లీల బృందావనము రాస కేళి దేల
    వచ్చు చున్నాడు కన్నుల భాగ్య మనగ .

    ----- సుజన-సృజన

    ReplyDelete
  5. ' కస్తూరీ తిలకం ' శ్లోకం లోని కృష్ణుని ' ముగ్థ మోహన ' రూపాన్ని తెలుగు పద్యంగా రాయాలని పించింది మీ బ్లాగులో చూస్తూనే -
    ఆనందంగా రాసేశాను .
    ----- సుజన-సృజన

    ReplyDelete
  6. శ్రీ కృష్ణ పరమాత్మను గురించి చక్కటి పద్యం , అద్భుతంగా రాసారండి.

    మీరు వ్రాసిన పద్యాన్ని ఇప్పుడే చూశాను. రిప్లై ఇవ్వటం ఆలస్యం అయినందుకు దయచేసి క్షమించండి.

    ReplyDelete