koodali

Wednesday, August 22, 2012

కురువపురం గురించి మరి కొన్ని వివరములు. .



ఓం.

శ్రీ అనఘాదేవీ సమేత శ్రీ  దత్తాత్రేయుల  వారికి  అనేక  నమస్కారములు.

   శ్రీపాదశ్రీవల్లభస్వామి వారు   పిఠాపురంలో  జన్మించారు.  పిఠాపురంలో  వారి  దేవస్థానం  ఉంది.  కురువపురం , శ్రీపాదశ్రీవల్లభ స్వామి  వారు  తపస్సు  చేసిన  ప్రాంతం .

 కురువపురం  వెళ్ళటానికి  కుదరని  వారు .... పిఠాపురం  వెళ్ళి కూడా  దైవ  దర్శనం  చేసుకోవచ్చును.

  కురువపురం (  కురుంగడ్డ  )  కృష్ణా  నది  మధ్యలో  ఒక  ద్వీపంలో   ఉంది.  ఇక్కడ   శ్రీపాదశ్రీవల్లభస్వామి వారి  దేవస్థానం,  వారు  తపస్సు  చేసిన..  వటవృక్షం  .....మొదలైన    దర్శనీయ  స్థలాలున్నాయి.


 ఈ  ద్వీపంలో ,    దేవస్థానానికి   దూరంగా    చాలా  ఇళ్ళు  ఉన్నాయట. 

  దేవస్థానం  ఉన్న  ప్రదేశంలో  మాత్రం   ఎక్కువ  ఇళ్ళు  ఉండవు.  వెళ్ళిన  భక్తులకు  మోడర్న్  సదుపాయాలు లేని   కొన్ని  గదులు  మాత్రం  అందుబాటులో   ఉన్నాయి.

 వెళ్ళే  ముందు  పూజారి  గారికి  ఫోనులో   సమాచారాన్ని   తెలియజేస్తే  గదులు  ఖాళీగా   ఉంటే  ఇస్తారు.


నదికి  ఇవతలి  ఒడ్డున   పంచదేవ్  పహాడ్  అనే  ఊరు  వద్ద  , ( శ్రీ  క్షేత్ర  శ్రీ వల్లభాపురము లో  )  నది  ఒడ్డున    శివాలయం  ఉంది.

 శివాలయం  బయటే  నది   వద్ద  అనేక  తెప్పలు  ఉంటాయి.  వాటిలో  వెళ్ళి   శ్రీపాదశ్రీవల్లభస్వామి  వారి  దర్శనం  చేసుకు  రావచ్చు.


   ఈ  శివాలయం  వారి  వద్ద  భక్తులు  బస  చేయటానికి  గదులు   లభిస్తాయి. సొంతవాహనం  మీద  వెళ్ళినవారు    శివాలయం   వద్ద  వాహనం  నిలుపుకుని  నది  దాటి  వెళ్ళి  దైవదర్శనం  చేసుకురావచ్చు. లేక  రాత్రికి   శివాలయం  వద్ద  గదిలో  విశ్రాంతి  తీసుకుని  ఉదయాన్నే  నది  దాటి  వెళ్ళి  దర్శనం  చేసుకురావచ్చు.


శివాలయంలోని  ఆవరణలో   కాలభైరవ  ఆలయం  కూడా  ఉంది.

  శివాలయంలో  స్వామి  వారు  కూర్చున్న  ఆసనాన్ని  దర్శించుకోవచ్చు.   (వారు  కూర్చున్న రాయిని (ఆసనం)  సింహాసనం   క్రింది  బాగాన    తాపడం  చేసారు. ....)

 శివాలయ  ఆవరణంలోని  ఒక  దేవాలయంలో,  ఒక  రాయిలో  త్రిశూలం  ఆకారం   కనిపిస్తుంది.  ఔదుంబర  వృక్షం  ఉన్న  ఈ  దేవాలయం  చుట్టూ    "  దిగంబరా  !  దిగంబరా  !!  శ్రీ  పాద  వల్లభ  దిగంబరా  !!!  " అనుకుంటూ  27  ప్రదక్షిణలు  చేస్తే  కోరికలు  తీరతాయని  అక్కడి  వాళ్ళు  చెప్పారు.  


 నాకు   అర్ధమయినంతలో  విషయాలను  వ్రాసానండి.  వ్రాసిన  దానిలో  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.  
 .......................................

 ఈ  బ్లాగ్  ను  ప్రోత్సహిస్తున్న  అందరికీ  అనేక  కృతజ్ఞతలండి.
................................................

1............Shripad Shri Vallabha. 

2...Glory of Kurugadda(Kuruvapuram)--Please hurry to visit this place.

 

3..Shripada Shrivallabha Devasthan (sripada Srivallabha).............

 

మా కురువపుర యాత్ర ౨౦౦౮ - YouTube

  ఈ  వీడియోలో  ఉన్నవారు  బ్లాగుల్లో....  తాడేపల్లి  గారేనా  ? కాదా  ?  అనే వివరములు   నాకు  తెలియదండి.

  ...........................

*  Kuravpur - Sreepada Sreevallabha Maha Samasthan  

 దేవ స్థానం  గురించి  ఎన్నో  వివరములు  ఈ  లింకులో  ఉన్నాయండి.

 ....................

జగద్గురు  శ్రీశ్రీశ్రీ  దత్తాత్రేయ స్వామి  మహా సంస్థాన  పీఠం.
శ్రీ క్షేత్ర  శ్రీ వల్లభాపురము
పంచ దేవ పహాడ్ ( పోస్ట్ )....509208.
మఖ్తల్  (  మండలం ) మహబూబ్  నగర్  జిల్లా..

ఇక్కడ   నది  దాటి  కొద్ది  దూరం  వెళ్తే   శ్రీపాదశ్రీవల్లభస్వామి  వారి  దేవాలయాన్ని  చేరుకోవచ్చు.

 


8 comments:

  1. రూట్ కూడా తెలియపరిస్తే వెళ్ళేవారికి అనుకూలంగా ఉంటుంది

    ReplyDelete
  2. కురువపురం గురించి, అక్కడకు వెళ్ళే మార్గాల గురించి మరి కొన్ని విషయాలు ఉన్న లింక్స్....

    * పైన టపాలో కూడా ఈ లింక్స్ ఇస్తున్నానండి.

    1...Glory of Kurugadda(Kuruvapuram)--Please hurry to visit this place.

    2...Shripada Shrivallabha Devasthan (sripada Srivallabha)

    ReplyDelete
    Replies
    1. * Kuravpur - Sreepada Sreevallabha Maha Samasthan

      దేవ స్థానం గురించి, అక్కడకు వెళ్ళే మార్గాల గురించి ఎన్నో వివరములు ఈ లింకులో ఉన్నాయండి. ఈ క్షేత్రం కర్ణాటకలోని రాయచూర్ వద్ద ఉంది. అయితే మహబూబ్ నగర్ కు, గద్వాల కు దగ్గర.
      ....................................
      మా కురువపుర యాత్ర ౨౦౦౮ - YouTube

      ఈ వీడియోలో ఉన్నవారు బ్లాగుల్లో.... తాడేపల్లి గారేనా ? కాదా ? అనే వివరములు నాకు తెలియదండి. మేము కురువపురం వెళ్ళేముందు మార్గాల గురించి వెదుకుతూ నెట్ లో ఈ వీడియో కూడా చూశాము.....ఈ క్షేత్రం పాలమూరు జిల్లా పక్కన ఆంధ్ర-కర్ణాటక సరిహద్దుల్లో కృష్ణా నదీమధ్యంలో ఉంది.

      Delete
  3. Chala baga rasaru andi meeru. Meeru rasinavanni correct unnai.

    Jai Saigopal

    ReplyDelete
    Replies

    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      మీ వ్యాఖ్యను కొద్దిసేపటి క్రితమే చూసానండి.
      ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు దయచేసి క్షమించండి.
      Jai Saigopal

      Delete
    2. కురువపురం పూజారి గారి ఫోన్ నంబర్ దయచేసి తెలియజేయగలరు.

      Delete
  4. Oka vela meeru petapuram velite akkada meeku
    Gopal baba gari darsadam kuda avutundi ayana kaliyuga avaduta. Vellina vari kastalu teratayi

    ReplyDelete
    Replies
    1. కొంతకాలం క్రిందట మాకు తెలిసిన వారి ఇంట్లో ఫంక్షన్ కు వెళ్తే , వారు మాకు
      .... శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము .... గ్రంధాన్ని మరియు గోపాల్ బాబా గారి క్యాలెండర్ ను ఇవ్వటం జరిగింది.

      అప్పటి వరకు నాకు శ్రీపాదశ్రీవల్లభ స్వామి గారి గురించి, గోపాల్ బాబా గారి తెలియదండి.
      ఆ తరువాత నాకు ఇవన్నీ తెలిసాయి.

      అంతా దైవం దయ.

      Delete