koodali

Friday, August 31, 2012

పంచాంగం..మరి కొన్ని విషయాలు...



జన్మలు,  పునర్జన్మలు  ఉన్నాయని   దేశవిదేశాల్లో  జరిగిన   ఎన్నో    సంఘటనల  ద్వారా    తెలిసింది. జన్మలు,  పునర్జన్మల  గురించి  జ్యోతిష్యం  ఆధారంగా  తెలుసుకోవచ్చని   పూర్వీకులు    తెలియజేసారు. 

జ్యోతిష్యం   వేద  పురుషునికి  కన్ను  వంటిదని  పండితులు  చెబుతున్నారు.  జ్యోతిషం  సహాయంతో   ఎన్నో  విషయాలను  తెలుసుకోవచ్చట.  



గ్రహాలు  నక్షత్రాల  స్థితిగతులను  బట్టి    వాతావరణాన్ని,  ప్రకృతివైపరీత్యాలను,   పంటలు  పండే  విధానాన్ని  ,  వంటి   ఎన్నో  విషయాలను   కూడా    చెబుతుంటారు.    జ్యోతిషశాస్త్రంలో  చెప్పిన  విధంగా  మంచి  ముహూర్తంలో  పనులు  ప్రారంభిచటం  వల్ల  శుభ  ఫలితాన్ని  పొందే  అవకాశం  ఉంది. 


అయితే,    ఈ  రోజుల్లో    పంచాంగాలలో    కొన్ని    తేడాలుంటున్నాయి.  ఉదాహరణకు..  ఒకే  ఊరికి  చెందిన  ఒక  పంచాంగంలో ,   ఫలానా  నక్షత్రం  మధ్యాహ్నం  12  గంటలవరకు  ఉంటుందంటే ,  ఇంకొక  పంచాంగంలో   వేరే   సమయం   వ్రాస్తారు.  ఇలా    తేడాలు    ఉండటం  వల్ల    ఎవరు  వ్రాసినది  సరైన  సమయమో  అర్ధం  కాదు. 



   నాకు  జ్యోతిషం  గురించి  కొద్దిగా  బేసిక్స్  మాత్రం  తెలుసు.  కొన్ని  సందర్భాలలో  మేము  ముహూర్తాల  కోసం  పండితులను  సంప్రదిస్తాము  కానీ ,  గౌరీ  పంచాంగం  కూడా  ఎంతో  గొప్పది.    మేము  చాలాసార్లు     గౌరీపంచాంగం    పాటిస్తాము.   



గౌరీపంచాంగం    గౌరీదేవిచే  తెలుపబడియుండుటచే  దీనికి  గౌరీ  పంచాంగమను  పేరు  కలిగినదని,     తిధి,  నక్షత్రము, యోగ కరణములు  హోరలు  యోగినీలు   లగ్నము యొక్క   శుభాశుభత్వములతో  పనిలేకుండా   ఆ దినము  గుణరహితమైనప్పటికీ    వ్యతీపాత  సంక్రాంతభద్రాది  అశుభ లక్షణములతో   కూడి యున్నప్పటికి   పరమేశ్వరుని  పూజించి  ఈ గౌరీ   పంచాంగకాలముల  ననుసరించు  వారికి  అన్ని  విషయములందు  విజయము  చేకూరగలదని  ప్రమాణము  కలదని ,ఇది    యెల్లరకు    ఉపయోగార్హమైన   సులభకాల   నిర్ణయ విధానమని    పండితులు  వ్రాసారు. 
 
 
    జ్యోతిషం,  జన్మలు,   పునర్జన్మలు   వంటి    అనేక  విషయాల  గురించి ,  2002 లో  ఆంధ్రభూమి  వీక్లీ లో    "సాత్విక్  "  అనే  రచయిత     " హిమయోగి,   అగ్నిసూర్య " అనే    నవలలలో  చక్కగా   వ్రాసారు.   మహాయోగి   " బాబాజీ "   వారి   గురించిన   వివరాలు   కూడా " హిమయోగి "  అనే  నవలలో    ఉన్నాయి. 


  ఈ  నవలలు  ఆంధ్రభూమిలో  వచ్చిన  సమయంలో  రచయిత  పాఠకుల  ప్రశ్నలకు  ఇచ్చిన  సమాధానాలు  కూడా  ఆసక్తిదాయకంగా  ఉన్నాయి. 


 ఒక  మహాభక్తుని  మరణానంతరం  వారి  చితిమంటలలో  అమ్మవారి  రూపం  కనిపించిన  చిత్రాన్ని  కూడా  అప్పట్లో  ప్రచురించారు. 

 ఇంకా, జన్మలు,   పునర్జన్మలు   గురించి  పరిశోధించిన     Ian Stevenson గురించి  కూడా   తెలియజేసారు.

   జన్మలు,   పునర్జన్మలు   గురించి   ఈ  లింకులో    కొన్ని  వివరములు  ఉన్నాయి. ....

Ian Stevenson - Wikipedia, the free encyclopedia

.....................................

వ్రాసిన    విషయాలలో   అచ్చు   తప్పుల  వంటి    ఏమైనా   పొరపాట్లు   ఉంటే   దయచేసి   క్షమించమని   దైవాన్ని   ప్రార్ధిస్తున్నాను.



No comments:

Post a Comment