మనకు ఒకోసారి ఏమనిపిస్తుందంటే , జీవులు పుట్టడం , కష్ట సుఖాలు అనుభవించటం అసలు ఇదంతా ఎందుకో ? అని .
* అయితే ఇదంతా ఎందుకో భగవంతునికి మాత్రమే తెలుస్తుంది.
అయితే మనం ఇలా కూడా అనుకోవచ్చేమో !
ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంలో చాలా మంది పిల్లలున్నారట. వాళ్ళకు వేసవి సెలవులు వచ్చాయి.
పిల్లలూ అందరూ ఆట స్థలానికి వెళ్ళి ఆడుకోవాలనుకుని ఇంటి పెద్ద అయిన తాత గారు, బామ్మ గారిని పర్మిషన్ అడుగుతారు. వారు సరేనని పంపిస్తారు.
ఆటలంటే గెలుపుఓటములుంటాయి. ఓడిపోయిన వారికి బాధ,........గెలిచిన వారికి సంతోషం కలగటం సహజమే కదా !
ఇంకా , ఆటలలో అనుకోకుండా దెబ్బలు కూడా తగలవచ్చు.
ఆటలలోని ఈ కష్టసుఖాలన్నీ ముందే తెలిసినా పిల్లలు ఆటలు ఆడుకోవటానికే ఇష్టపడతారు.
కొందరు పిల్లలు కొంచెం సేపు ఆడుకుని విసుగొచ్చి తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు.
సాయంత్రం అయ్యేసరికి పిల్లలను తీసుకుని వెళ్ళటానికి తాతగారు వస్తారు. పిల్లలను బుజ్జగించి ఇంటికి తీసుకువెళ్తారు.
ఇంటికి రానని మారాము చేసే పిల్లలను ఒక చిన్న దెబ్బ వేసయినా ఇంటికి తీసుకు వెళ్తారు.
* ఎందుకంటే ఎప్పటికీ ఆటస్థలంలోనే ఉండిపోవటం పధ్ధతి కాదు కదా ! ఇంటికి తిరిగి వెళ్ళటమే పధ్ధతి.
* అలాగే మనమందరము మన ఇల్లు అయిన ........ పరమాత్మ ( జగన్మాతా పితరుల ) ఇంటినుంచి ఈ లోకమనే ఆట స్థలానికి వచ్చాము.
ఇక్కడా గెలుపు..ఓటములు , కష్టసుఖాలూ ఉంటాయి.
ఈ జీవితమనే ఆటలో చెంప దెబ్బలూ పడవచ్చు. . పూలదండలూ పడవచ్చు. .
* అయితే ఎప్పటికయినా అందరమూ తిరిగి మన ఇంటికి వెళ్ళవలసిన వాళ్ళమే. ( అదే మోక్షమేమో ! )
మనం దాని గురించి మరిచి పోతే భగవంతుడు గుర్తు చేస్తూ ఉంటారు.
ఎందుకంటే ఇల్లే అందరికీ భద్రమైన ప్రదేశం.
* ఏ చిన్న కష్టమూ సోకని పరమానంద స్థానం ..... మన పరమాత్మ ఇల్లు.
* ( క్రమముగా నాలుగు రకాలైన మోక్షాలు ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు. )....
.ఏదో తోచింది వ్రాశానండి. తప్పులున్నచో దైవం క్షమించాలని కోరుకుంటూ.........
* అలాగే మనమందరము మన ఇల్లు అయిన ........ పరమాత్మ ( జగన్మాతా పితరుల ) ఇంటినుంచి ఈ లోకమనే ఆట స్థలానికి వచ్చాము.
ReplyDelete-----
oh Boy. New way of thinking. Different concept.
.థాంక్యూ సార్ !
ReplyDeleteఈ ఇంటికి తిరిగివెళ్ళటమనే ఐడియా నాది కాదండి. " ఒక యోగి ఆత్మ కధ " గ్రంధంలో చదివానండి..... అది గుర్తొచ్చి..........మరి కొంత ఇలా.. ......
నేను ఆ పుస్తకం చదవ లేదు. మీరు చదివి కొత్త కోణంలో ఈ విధంగా చూడవచ్చు అని చెప్పారు. దానికి ధన్యవాదాలు. As far as I am concerned you are the one who introduced this concept to me. క్రొత్త దృక్కోణం లో చూడటం నేర్చుకుంటే జీవితం లో చాలా బాధలు తగ్గుతాయి.
ReplyDelete