ఒక గురువు గారు అబూబకర్ అనే తన శిస్యునితో కలసి ఒక అడవిమార్గంలో ప్రయాణిస్తున్నారట.
శిస్యుడు కొంచెం భయపడి గురువుగారితో .........మనం ఇద్దరమే వెళ్తున్నాము . దారిలో దొంగలు దోచుకొంటే ఎలాగండి ? భయంగా ఉంది అన్నాడట.
అప్పుడు గురువుగారు ..లేదు , మనం ముగ్గురము ఉన్నాము. అన్నారట.
శిష్యుడు ఆశ్చర్యపడి ముగ్గురమా ! ఎవరండి ఆ మూడో వ్యక్తి ? అని అడగగా ..........
మనము ఇద్దరము, మరియు పరమేశ్వరుడు. అని గురువుగారు సమాధానమిచ్చారట.
( నిజంగా ఇంతగా భగవంతుని యందు నమ్మకముంచితే ఇక లోటేముంటుంది....ఈ నమ్మకం ఏర్పడటమే మోక్షానికి మార్గము.(నిష్కామ కర్మ యోగం ) ఈ నమ్మకాన్ని పొందటమే అత్యంత కష్టసాధ్యం కూడా. )
ఈ మధ్య టి.వి లో పెద్దలు ఈ కధ చెప్పారు. ఇలాంటి కధనే నేను శ్రీ రామకృష్ణ పరమహంస వారి కధలలో కూడా చదివానండి.
అందరి బోధనలు దగ్గరదగ్గర ఒకలానే ఉంటాయి.
ఎందుకంటే.. మతాలు ఎన్నయినా దైవం ఒక్కరే కాబట్టి. సూర్యుని ఎన్ని భాషలలో ఎన్ని పేర్లతో పిలిచినా సూర్యుడు ఒక్కరే కదా ! అలాగన్నమాట.
అయితే, భక్తులే వాదులాడుకుంటూ ఉంటారు. హిందువులలో కూడా కొందరు శైవులు...వైష్ణవులు మా దేవుడే గొప్ప ....అంటే...మా దేవుడే గొప్ప. అని వాదించుకుంటారు.
ప్రాచీన గ్రంధాలలో........... శివునికి విష్ణువుకు భేదం చూపించిన వారు .... నరకానికి పోతారని వారే చెప్పినట్లుగా ఉంది. అయినా భక్తులు వారు పూజించే దేవుళ్ళ మాటలు ప్రక్కన పెట్టి వాదులాడుకుంటూ ఉంటారు.
భగవంతుడు చెప్పిన ధర్మమార్గాన్ని పాటించకుండా ............... ఆ భగవంతునికి విపరీతంగా పూజలు చేయటం ఈ రోజుల్లో ఎక్కువగా జరుగుతున్న వింత.
ఏ మతం వారైనా భక్తులు ........ఈ విశ్వం అంతా తాము నమ్మే దైవమే సృష్టించారని నమ్ముతారు. మరి అలాంటప్పుడు ......... ఇతర మతస్తులు కూడా ఈ విశ్వంలో భాగమే కదా !
అలా చూస్తే... తాము నమ్మే దైవమే అందరినీ సృష్టించినట్లు కదా !
లేదు ..... ఇతర మతస్థులను మా దైవం సృష్టించలేదూ అంటారా ! ......వారు నమ్మే దైవం యొక్క విశ్వవ్యాపకత్వాన్ని వారే .......... తక్కువ చేసినట్లు అవుతుంది.వారు నమ్మే దైవం యొక్క శక్తి పరిమితమని వారే ఒప్పుకున్నట్లు ..
నేను పుట్టుకతో హిందువును కాబట్టి, నా ధర్మం ప్రకారం నేను హిందూ ఆచారాలను పాటిస్తాను.
( అయితే , కొన్నిసార్లు నాకు ఏసుప్రభువు..అల్లాహ్ కు సంబంధించిన దైవానుభూతులు కూడా కలిగాయి. నేను కొన్నిసార్లు......... దైవాన్ని వీరి వలె కూడా ప్రార్ధిస్తాను. )
ఎవరైనా తెలిసీతెలియక ఇతరుల దైవాన్ని నిందిస్తే ..... ఆ నిందించిన వ్యక్తి నిందను మనం తప్పు పట్టాలి గానీ , ఆ వ్యక్తి ఆరాధించే దైవాన్ని మనము తప్పుపట్టకూడదు. ఎందుకంటే .. దైవం అందరికీ ఒకరే కాబట్టి.
ఎవరి ఆచారాలను వారు పాటిస్తూ........ఇతరులను గౌరవిస్తూ జీవిస్తే పెద్దగా గొడవలు రావు .
శ్రీ రాములవారు తన భక్తుడయిన రామదాసును చెరసాల నుంచి విడిపించిన కధ మనకు తెలుసు.
మరి, రామలక్ష్మణులంతటివారు ........ మేము తానీషా వద్దకు ఎందుకు వెళ్ళాలి ? అనుకోలేదు.
తలచుకొంటే వారు చిటికెలో రామదాసును విడిపించగలిగేవారే...... కానీ వారు అలా చెయ్యలేదు.
రామదాసు కట్టవలసిన కప్పం సొమ్ముని కట్టి మాత్రమే రామదాసును విడిపించారు.
ఇలాంటి వాటి ద్వారా మనము ఎన్నో నేర్చుకోవచ్చు.
రామలక్ష్మణులు స్వయంగా మారు వేషాలలో తానీషా దగ్గరకు వెళ్ళకుండా ................ ఇతరుల ద్వారా డబ్బును పంపించి కూడా భక్త రామదాసును విడిపించవచ్చు.
రామలక్ష్మణులు దేవుళ్ళయి కూడా ఇంత కష్టపడటమెందుకు ? అని మనకు అనిపిస్తుంది. ................. ప్రతిపనికి ఒక పధ్ధతి ఉంటుంది కదా ! ఆ పధ్ధతి వెనుక .............. ఎన్నెన్నో కారణాలు, అర్ధాలు ఉంటాయి... .అవి అంతగా మనకు తెలియవు.
రామదాసును బంధించిన తానీషా వద్దకు రామలక్ష్మణులు స్వయంగా వెళ్ళటం వల్ల............ తానీషాకు, లోకానికి రామదాసు యొక్క భక్తి గట్టిగా నిరూపించబడింది.. .......... తనను నమ్మిన గొప్ప భక్తుల యెడల దైవం ఇంతగా దయను చూపిస్తారు.
రామలక్ష్మణులు తానీషాకు దర్శనమివ్వటానికి .. పూర్వజన్మలో తానీషా ఎంత పుణ్యం చేసుకున్నారో కదా !
రామదాసును కాపాడటంలో అంతగా ఆశ్చర్యం లేదు... ఆయన గొప్ప భక్తుడు కాబట్టి.
దేవుళ్ళు అయినా రామలక్ష్మణులు ..కప్పం కట్టి మాత్రమే భక్త రామదాసును విడిపించటం వంటి పధ్ధతులను పాటించారు......... అలా ఆచరించి చూపించారు.
నిజాయితీ గల ఒక దేశాధినేత గానీ .........లేక......... ఒక అత్యున్నత న్యాయమూర్తి గానీ తమకు ఎంత అధికారం ఉన్నా......... ధర్మబధ్ధమైన పధ్ధతిలో మాత్రమే జీవితాన్ని గడపటానికి ఇష్టపడతారు. ( అది కష్టమయినా సరే. )
అంతేగానీ తమ అధికారాన్ని ప్రతీపనికి ఉపయోగించరు.
అలా ఆదర్శవంతమైన జీవితాన్ని గడపటం ద్వారా ........ వారు అందరికీ ఆదర్శంగా నిలుస్తారు.
జీవితం లో నమ్మకమనేది ఒక అండ. అది వుంటే ముందరికి పోవటానికి ధైర్యం ఇస్తుంది. అది లేక పోతే దిగాజారిపోవటమే.
ReplyDeleteనిజమేనండి. దైవంపైన నమ్మకం ఉంచి...........జీవితంలో మన కర్తవ్యం మనం నెరవేర్చితే ఎంతో బాగుంటుంది.
ReplyDeleteకానీ ఎక్కువమందికి ......... జీవితంలో ప్రతీదానికి భయపడటమే జరుగుతోంది.
భగవంతునిపై పరిపూర్ణవిశ్వాసం కలగాలంటే ................ ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలేమో !...