koodali

Friday, April 8, 2011

కొంతమంది వృధ్ధులు కాదు ..... ఎప్పటికీ యువకులే.......( అన్నా హజారే లాంటివాళ్ళు )


మొత్తానికి అవినీతిని గురించి బాధపడుతూ నిట్టూర్చటంతో ఊరుకోకుండా అన్నాహజారే గారు .......... ప్రజలను నిర్లిప్తత నుంచి కదిలించారు.

దేశంలో పరిస్థితులు ఇలా తయారు కావటానికి ప్రజలు కూడా కొంతవరకూ కారణమే.

ఎన్నికలు వస్తే .......... నోట్ల కోసం ఎదురుచూసే పామర ప్రజలు కొందరు..........., ఫ్రీ........ఫ్రీ.....ఫ్రీ... అంటూ వినవచ్చే .గిఫ్టుల కొరకు ఆశపడి ఓట్లు వేసే ప్రజలు కొందరు....
ఎన్నికల రోజు ఓటు వెయ్యటానికి బధ్ధకించి......... టి.వి చూస్తూ ........ దేశం పాడైపోతోందని కామెంట్స్ చేస్తూ గడిపేసే ప్రజలు కొందరు........... .

ఇలా ఉంటే........ దేశం ఇలా కాకుండా ఇంకెలా ఉంటుంది ?


ఎన్నికలలో నిలబడ్డవారు తాము గెలిస్తే ఏ అభివృధ్ధి పధకాలు ప్రవేశపెడతామో ప్రజలకు చెప్పుకోవాలి గానీ ..... ప్రజలకు ఫ్రీ గిఫ్టులు ఇస్తామనటం లంచము ఇవ్వటము లాంటిదే కాదా ?..


అయితే అన్నా హజారే గారు ఈ వయస్సులో దీక్ష చేయటం బాధను కలిగిస్తున్నా .......... ప్రజలలో కొంచెము కదలిక వచ్చింది.

ఈ కదలిక తాత్కాలికం కాకుండా........ జన లోక్ పాల్ బిల్లు అమలు లోకి రావాలని........వచ్చిన తరువాత పకడ్బందీగా అమలు కావాలని .......... మనస్పూర్తిగా అందరమూ కోరుకుందాము.


అంతే కాదు ప్రజలకు అన్యాయం చేస్తున్న ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే బిల్ కూడా రావాలి.

ఇంకా.... ప్రజలలో నైతిక విలువలు పెరగనప్పుడు చట్టాలు ఎన్ని ఉన్నా అంత ప్రయోజనం కనబడదు.

జనం సినిమాలకు, క్రికెట్ కు, సీరియల్స్ చూడటానికి , ఇలా ఇంకా కొన్ని విషయాలకు ఇవ్వవలసినదానికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు............... అందువల్ల జనం దారి జనానిది............దేశాన్ని దోచుకునే వారి దారి........ వారిది అయిపోయింది.

ప్రజలు సమాజం గురించి కూడా కొంచెం సీరియస్ గా పట్టించుకుంటే పరిస్థితులు ఇంతవరకూ రావు.

మొత్తానికి........ ఏదో పెద్దాయన పాపం దీక్ష చేసుకుంటున్నాడు ............ మనమేమి చేయగలంలే అని జనం ఎప్పటిలా నిర్లిప్తంగా ఉండకుండా ...


మీడియా వాళ్ళను కూడా అభినందించాలి.

అవినీతిపరులు లాంటి వాళ్ళు కూడా ఆలోచిచాల్సిన విషయమేమిటంటే ........... వారు ఇక్కడ న్యాయస్థానాలలో తప్పించుకున్నా.....దైవమనే న్యాయస్థానంలో ఎప్పటికీ తప్పించుకోలేరు.

కొంతకాలం క్రితం అవినీతి గురించి ఒక సినిమా వచ్చిందండి. ............. అందులో అవినీతి, లంచాలకు పాల్పడిన వారిని వారి పిల్లలే మంచిగా మార్చుతారు. ............ అలా నేటి యువతరం చైతన్యవంతులై సమసమాజాన్ని స్థాపించాలి..

ఈ బ్లాగ్ ను ప్రోత్సహిస్తున్న అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి.....


No comments:

Post a Comment