ప్రజలకు సహాయం చేసిన వారిని ఆ ప్రజలు ఎంతగా ఆరాధిస్తారో చూస్తూనే ఉన్నాము.
సత్యసాయి తమ జీవితంలో చూపించిన మహిమలను ఎందరో భక్తులు వివరిస్తున్నారు.
ఇంకా,... సత్యసాయిబాబా గారు ప్రపంచములోని ఎన్నో దేశాలలో సహాయకార్యక్రమాలు నిర్వహించారని తెలుస్తోంది .
ఒక కుటుంబంలోని కొద్ది మంది వ్యక్తులను సరిగ్గా నడిపించాలంటేనే చాలా కష్టం. ఇంట్లో ఒక్కొక్కరిది ఒక్కో మనస్తత్వం .అలాంటిది........... పెద్దమొత్తంలో .వచ్చిన విరాళాలను అన్ని దేశాలలో సేవా కార్యక్రమాలు నడిపిస్తూ ............ ఆ విధంగా సద్వినియోగం చేయటం సామాన్యమైన విషయం కాదు. .............. ఎంతో గొప్ప విషయం.
మరి ఇన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలంటే చాలా డబ్బు అవసరం కదా ! . ఇక ముందు కూడా ఈ సేవా కార్యక్రమాలు సక్రమంగా కొనసాగాలంటే ............... వారి దగ్గరున్న సొమ్మును దానికి సంబంధించిన వారు పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎందుకంటే, సేవా కార్యక్రమాలు సక్రమంగా జరగకపోతే ఉచితంగా విద్య, వైద్యం పొందుతున్న వారు బాధలు పడవలసి వస్తుంది .
రామకృష్ణపరమహంస, వివేకానంద లాంటివారు ఎందరో....... ప్రజలకు ఎంతో సహాయం చేశారు.
ఇంకా ..సుభాశ్ చంద్రబోస్, భగత్ సింగ్ ,బాబా ఆమ్టే ............. ఇలాంటివారు కూడా ఎందరో ఉన్నారు. ఇంకా కొంతమంది.. తమ శక్తికొలది చిన్న పరిధిలో సేవ చేస్తున్నవారూ ఉన్నారు. వీరందరూ భగవంతుని దయకు పాత్రులు.
కానీ ...........
కొందరు అవినీతిపరులు ప్రజల సొమ్మును దోచి పది తరాలకు సరిపడా తమ సొంతానికి దాచుకుంటారు. వారికీ........వీరికీ ఎంత తేడా ?
అలా ప్రజలకు అన్యాయం చేసిన వారికి ఏం మిగులుతుంది ? శాశ్వత అపకీర్తి , ప్రజలు పెట్టే శాపాలూ తప్ప...
ఇలాంటి అవినీతిపరులను వారి స్వంత పిల్లలే అష్టకష్టాలు పెడతారు. ఇంకా ,........... తాము చేసిన పాపాలకు ఫలితంగా వారికి ........... చచ్చినతరువాత కూడా నరకం, నీచమైన పునర్జన్మ తప్పకపోవచ్చు.
దీనికన్నా ..కుటుంబానికి కొంతవరకు ( అవసరమైనంత, తగినంత , తాను ఎంతవరకు సంపాదిస్తే ధర్మమో అంతవరకు ) సంపాదించి తృప్తిపడి ఇక ...... చక్కగా ప్రజలకు మంచి చేస్తే ఎంతో పేరు, మానసిక తృప్తి లభిస్తాయి కదా !
ప్రపంచాన్ని పీడించి తమ సుఖం తాము చూసుకొనే వారు ప్రజల అభిమానానికి, భగవంతుని దయకు ............. దూరమయ్యే దురదృష్ట జీవులు. ఇటువంటి వారు కూడా మంచిమార్గం లోకి వచ్చి భగవంతుని కృపకు పాత్రులు అవాలని కోరుకుందాము...
ఏంటో ! అవినీతిపరులు మంచిగా మారాలంటే దేవుడే దిక్కు.
..కుటుంబానికి కొంతవరకు సంపాదించి తృప్తిపడి ఇక ...... చక్కగా ప్రజలకు మంచి చేస్తే ఎంతో పేరు, మానసిక తృప్తి లభిస్తాయి కదా !
ReplyDelete---------
మీ దగ్గరనుండి ఎప్పుడో ఒకప్పుడు ఇటువంటి పోస్ట్ వస్తుందని అనుకున్నా.
"కొంతవరకూ" ని "అవసరమైనంత వరకూ" అని మార్చుకున్నా.
తాము ఏమీ చెయ్యక ఇతరులకి సహాయం చేసేవాళ్ళని విమర్శించే వాళ్ళను చూస్తుంటే జాలి వేస్తుంది.
$anrd గారు
ReplyDeleteచాలా చక్కగా విశదీకరించి చెప్పారు. ధన్యవాదాలు.
#తాము ఏమీ చెయ్యక ఇతరులకి సహాయం చేసేవాళ్ళని విమర్శించే వాళ్ళను..
Rao S Lakkaraju గారు, భలేవాళ్ళే మీరు... అలాంటి విమర్శకులు సమాజానికి చేసే సేవ "విమర్శ".. అంటే విమర్శించి ప్రజలు మోసపోకుండా కాపాద్డమే తమసేవాకంకణ౦ అంటారు మరి. మన౦ ఇంకా రాతియుగ౦లోనే ఉన్నామని ఓ హైరానా పడిపోతూ తమ విమర్శలే నవయుగానికి నాంది అని తెగ మురిసిపోతూఉంటారు..పి.నా.కొ. :)
నిజమేనండి. నేనుకూడా " తగినంత సంపాదించుకొని " అనే రాద్దామనుకున్నా మొదట,
ReplyDeleteకానీ " తగినంత " అంటే దానికి " మనకిష్టం వచ్చినంత " అని కూడా అర్ధం చెప్పుకోవచ్చు కదా ! అందుకే ఇలా .............. " కొంతవరకు సంపాదించుకొని " అని మార్చానండి........ ఇది కూడా సరైన పదం కాదేమో !
హ్మ్..
ReplyDeleteతగినంత అనేది సరియైనదేనని అనిపిస్తుంది నాకు :). ఇక ఈ "తగినంత" ఎంత అనేది వారివారి విచక్షణను బట్టి ఉంటుంది. అయితే ఆ పదం కనీసం "కావలసినంత" అనేదాన్ని గట్టిగా నొక్కి చెబుతుంది.. "కొంతవరకు" కన్నా! :)
ఏదో నా అభిప్రాయం అంతే :))
ధన్యవాదాలండి !
ReplyDeleteనిజమేనండి, నాకేమనిపిస్తుందంటేనండి, కొంతమంది నవయుగానికి నాంది పలుకుతున్నామనుకుంటున్నారు కానీ, ఈ రోజుల్లో నవ నాగరికత, అభివృధ్ధి పేరుతో సమాజం రాతియుగంలోకి తిరిగి వెళ్తోందేమోనని..........