గట్టి ఆధ్యాత్మిక సాధన, మంచి ప్రవర్తన వల్ల దైవానికి దగ్గరవటంతో పాటు క్రమంగా.... కొన్ని శక్తులు కూడా వాటంతట అవే వస్తాయని పెద్దలు చెబుతారు. అయితే ...... ఆ శక్తుల దగ్గరే ఆగిపోకుండా ముందుకు వెళితే దైవాన్ని పొందటం జరుగుతుందట.
ఇలాంటి యోగులు కష్టపడి తపశ్శక్తి ద్వారా సాధించిన శక్తులను పొదుపుగా వాడుకుంటారట. వాటిని ఎక్కువగా లోక కల్యాణానికే వినియోగించటం కనిపిస్తుంది.
దేవతలు కూడా శక్తిని పొందటం కొరకు తపస్సులు చేస్తారు. దేవతలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఇంద్రుడు త్రిమూర్తులను సహాయం కోరటం జరిగింది.
త్రిమూర్తులు కొన్నిసార్లు రాక్షసులను ఎదిరించలేనప్పుడు ఆదిపరాశక్తిని ప్రార్ధించగా ఆ శక్తి వారిని ఆదుకొని రాక్షసులను సంహరించటం జరిగింది.
పరమాత్మ , ( మణిద్వీపంలో ఉండే శ్రీ మన్మహాదేవీ మహాదేవులు )( వీరిద్దరూ ఒకటే.. ఆమే ఆయన ఆయనే ఆమె . )ఈ పరమాత్మ మాత్రం సర్వ శక్తిమంతులు . వారి శక్తి అపరిమితం. వారు ఏదైనా చేయగలరు. రెప్పపాటులో బ్రహ్మాండాలను సృష్టించనూగలరు ...... లయించనూగలరట.
( నేను ఎప్పుడైనా మనసుకు కష్టంగా అనిపించినప్పుడు పరమాత్మ పాదాలపైగానీ, ఒడిపైగానీ తల ఆనించి సేద తీరుతున్నట్లు భావించుకుంటాను. వారు అందరికీ అత్యంత ఆప్తులు కదా ! )
లోకంలో కొందరు దేవుడు లేడు అంటారు. ఎవరు అవునన్నా.....కాదన్నా దైవం ఉండటం నిజం.
దైవ సంబంధమైన అనుభవాలు ఎందరికో కలుగుతున్నాయి. ఇవి భ్రమలు ఎంతమాత్రం కాదు . అవి పొందినవారికే తెలుస్తాయి.
దైవం లేరని అనేవారిని చూసి జాలి పడాలి అంతే. దైవాన్ని నమ్మాలంటే దానికి ఒక టైం రావాలి. అప్పుడు వారికే అనుభవాలు కలుగుతాయి.
అదలా ఉంచితే కొందరు గొప్పపేరు తెచ్చుకున్నవారిని గురించి కొందరు రకరకాలుగా మాట్లాడుతుంటారు.
సీతారాములనే విమర్శిస్తున్నప్పుడు ఇక ఎవరిని మాత్రం విమర్శించకుండా వదులుతారు.
చూస్తే...... వాల్మీకి మహర్షి మహర్షిగా మారకముందు అడవిలో వెళ్ళే బాటసారులను చంపి వారి దగ్గరున్న సొమ్ము దోచుకోవటం జరిగేదట. తరువాత నారదుల వారి ద్వారా రామ నామమును పొంది మహర్షిగా మారటం జరిగింది.
తెలిసో తెలియకో జీవితంలో ఇలా పొరపాట్లు చేసి తరువాత సరిదిద్దుకొని గొప్పవారిగా మారిన వారు ప్రాచీన కధలలో కూడా కొందరు కనిపిస్తారు. వారిని మనం ఆరాధిస్తాము కూడా !
శ్రీ మంజునాధ సినిమాలో ఒక నాస్తికుడు మహా భక్తునిగా మారటం చూపించారు.
ఈ పాత్రల ద్వారా ఏం తెలుస్తుందంటే ......... పొరపాట్లు చేసినవారు తప్పు సరిదిద్దుకుంటే గొప్పవారిగా మారవచ్చని ఈ పాత్రలను సృష్టించటం ద్వారా పెద్దలు తెలియచేశారని అనిపిస్తుంది.
అందుకే మనం ప్రతి ఒక్కరినీ తప్పుపట్టకూడదు.
ఈ రోజుల్లో మోసాలు చేసేవారు ఎక్కువయ్యారు. నిజమే ! అందువల్ల ఎవరు మంచివాళ్ళో ..ఎవరు కాదో తెలియక ఒకోసారి మంచివాళ్ళను కూడా గుర్తించలేక ........... అంతా అయోమయంగా ఉంటోంది. ఇలాంటప్పుడు దేవుడే దిక్కు.
ఇవన్నీ అలా ఉంచితే సత్యసాయి గురించి మాకు జరిగిన ఒక సంఘటన చెబుతాను.
మేము ఉన్న దగ్గర చుట్టుప్రక్కల కొందరు సాయి భక్తులు ఉండేవారు. వారు మాతో మీరు పుట్టపర్తి వస్తే సాయిని దగ్గరగా చూపిస్తాము అనేవారు.
మేము పుట్టపర్తి వెళ్ళలేదు.

తరువాత మేము చెన్నైకి మారినప్పుడు,... లోకకల్యాణార్ధం జరిగిన ఒక యాగం సందర్భంగా సాయి చెన్నై రావటం జరిగింది.
మా ఇంట్లోవాళ్ళం యాగం చివరి రోజు .... యాగం జరిగే దగ్గరకు వెళ్ళేసరికి యాగం పూర్తయ్యి సాయి అప్పుడే వెళ్ళిపోయారని తెలిసింది.
కొందరు సాయి మళ్ళీ కొంతసేపటిలో వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కొందరేమో వస్తారో......రారో చెప్పలేము వారిష్టం అన్నారు.
అక్కడ చాలామంది ఎదురు చూస్తున్నారు. చాలా సేపు ఎదురు చూసి ..... ఇక ఇంటికి వెళ్ళిపోదాం అనుకునేంతలో సాయి వస్తున్నారని వినిపించింది.
వారు వచ్చారు. కొంచెం దూరంగా చూడగలిగాము. వారి ఉపన్యాసం విన్నాము.
**********
షిర్డి సాయి తన నిర్యాణానికి కొద్ది రోజులముందు కొందరితో ఏం చెప్పారంటే.......... తాత్యా కోతే పాటీలు అనే తన ప్రియ భక్తుడు త్వరలో చనిపోతాడని చెప్పటం జరిగింది.
ఇది విన్నవారు భయపడ్డారు. అలాగే కొద్ది రోజులకు తాత్యాకు జబ్బు చేస్తుంది.. సాయిబాబా కూడా జబ్బు పడతారు....
తాత్యా గురించి విషయం తెలిసిన వారు సాయిబాబా చెప్పిన మాట తప్పక జరుగుతుందని నమ్మి.... తాత్యాకు ఏం ప్రమాదం జరుగుతుందో అని భయపడతారు.
అయితే తాత్యా కోలుకుంటాడు............ బాబా మరణించటం జరుగుతుంది. తాత్యాను రక్షించి సాయి మరణించారని అందరూ అనుకోవటం జరుగుతుంది.
అలా పెద్దలు చెప్పే కొన్ని విషయాల వెనుక భావం మనకు అర్ధం కాదు.....కొన్ని విషయాలను వారు అలా నర్మగర్భంగా చెబుతారు.
సత్యసాయి 96 సంవత్సరాలు వచ్చేవరకూ జీవించారని పండితులు చెబుతున్నారు.
ఎలాగంటే....నక్షత్ర ఆవర్తన పధ్ధతిలో సంవత్సరానికి 324 రోజులట .......... 30,834 రోజులు జీవించిన సత్యసాయి నక్షత్ర ఆవర్తన పధ్ధతి ప్రకారం లెక్క వేస్తే ..... వారు చెప్పినట్లే 96 వ సంవత్సరం వచ్చినతరువాతే పరమపదించారట.
సత్యసాయి కొంతకాలం ముందునుంచీ ఆహారం తీసుకోవటం మానేసారని వార్తలు వస్తున్నాయి. దానిని బట్టి చూస్తే........ వారికి తన గురించి ముందే తెలుసని అనుకోవచ్చేమో !
సాయి యొక్క సర్వమత సమానత్వ భావన చాలా గొప్పది. అలాగే వారి సేవా కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగాలని కోరుకుందాము.
ఈ పోస్ట్ కొంచెం హడావుడిగా రాయటం జరిగింది. తప్పులుంటే దయచేసి భగవంతుడు క్షమించాలని కోరుకుంటూ.
devudu ledu ani science kooda prove cheyyaledu. endukantee science itself predicts that there are 11 dimensions in the world. Humans can see only 3 dimensional world. Who knows, got might be in the other dimensions.
ReplyDeleteమీరన్నట్లు దేవుడు లేడని సైన్స్ కూడా ప్రూవ్ చెయ్యలేదు. ఉన్న దైవాన్ని లేరని ఎవరు మాత్రం ప్రూవ్ చెయ్యగలరు ?
ReplyDeleteఇంకా, నాకు సైన్స్ అంటేనే వ్యతిరేకత ఏమీ లేదండి. సైన్స్ అనేది సృష్టిలో భాగమే కదా ! అయితే ఆధునిక సైన్స్ వల్ల లాభాలున్నట్లే హాని కూడా జరుగుతోంది . ప్రపంచానికి హాని కలగని విధంగా సైన్స్ ను ఉపయోగించుకొంటే బాగుంటుంది అని నా అభిప్రాయమండి.
ఇంకా, కొందరు నాస్తికులు సైన్స్ మాత్రమే గొప్పది...........దేవుడు అని ఎవరూ లేరు అంటున్నారు. వాళ్ళని ఉద్దేశించి మాత్రమే టపాలో అలా రాశానండి.
ఇక డైమెన్షన్స్ గురించి ఎప్పుడో కొద్దిగా చదివాను గానీ నాకు పెద్దగా తెలియదండి....... ... అయితే , ఈ డైమెన్షన్స్ అంటే అవి ఇతరలోకాలు అని కూడా అనుకోవచ్చేమోనండి.