koodali

Wednesday, April 13, 2011

సీతారాములు ... ఆదర్శదంపతులు. ...............

నేను గృహిణినండి. సరే, అది అలా ఉంచుదామండి.
**********
కొందరు రామాయణం గురించి రకరకాలుగా అభిప్రాయపడుతున్నారు.

రాములవారు అరణ్యాలకు వెళ్ళవలసి వచ్చినప్పుడు రాజ్యాన్ని చూసుకోవటానికి దశరధులవారు ఉన్నారు కదా ! .........

సీతారామలక్ష్మణులు తాము రాజభోగాలు వదిలి అరణ్యాలలో కష్టాలు పడుతున్నా.............. అక్కడి ప్రజలను, మునులను పీడిస్తున్న రాక్షసులను సంహరించి ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించారు.

రావణాసురుడు ఇతర రాజులతో యుధ్ధాలు చేసి వారిని పీడించి దోచి తెచ్చిన సంపదతో తన లంకరాజ్యాన్ని అభివృధ్ధి చేసుకునేవాడు.

రావణాసురుని చంపటం ద్వారా అందరికీ అతడి పీడను వదిలించారు శ్రీ రాముల వారు.

ఇంకా రామాయణం ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అసలు సీతారాములు పడ్డ కష్టాలు ఎన్నెన్నో.......

.తెల్లవారితే పట్టాభిషేకం అనుకుంటే......దాని బదులు 14 ఏళ్ళ అరణ్యవాసం చేయవలసి రావటం...........

అరణ్యవాసం ముగింపుకు వచ్చిందిలే అనుకుంటే ............అంతలోనే సీతాపహరణం జరగటం...........

సరే ,రావణవధ జరిగింది ,. సీతారాములు రాజ్యానికి తిరిగి వచ్చి......... ఇక అంతా సవ్యంగా ఉందిలే అనుకునేంతలో......కొందరు ప్రజల మాటలవల్ల సీతాదేవిని అరణ్యాలకు పంపవలసి రావటం...........


కొంతకాలానికి సీతాదేవిని, లవకుశులను వాల్మీకి మహర్షి ఆశ్రమంలో చూసిన తరువాత........ పిల్లలను చూసిన ఆనందములో రాములవారు ఉండగానే ...........సీతాదేవి భూమాతను ఆశ్రయించటం...........


ఇలా ఎన్నో ఆటు.........పోట్లు, ఆశ.......నిరాశలతో కూడిన జీవితం. నేటి సామాన్యులు సీతారాములు పడ్డ కష్టాలను గుర్తు తెచ్చుకుని తమ కష్టాలను ధైర్యంగా ఎదిరించటం నేర్చుకోవాలి.

సీతాపహరణం తరువాత రాములవారు ఎంతో శోకించి , ఎన్నో కష్టాలు పడి భార్యను వెదికి తెచ్చుకున్నారు. ............

ఈ ఆధునికకాలంలో అయినా , ఎంతమంది మగవాళ్ళు అలా చేయగలరు ? కొంతమంది భార్యను వెదకటం మాని మరొక వివాహం చేసేసుకుంటారు.



సీతమ్మవారిని అడవులకు పంపిన తరువాత రాములవారు ప్రజల కొరకు రాజ్యాన్ని పాలించినా....తాను రాజభోగాలకు దూరంగా సామాన్యంగా జీవించారు . ( సీతాదేవి అడవిలో ఏ విధంగా నిరాడంబరంగా జీవిస్తుందో అలాగ .! .)
( హంసతూలికా తల్పం పైన శయనించటం కాకుండా అతి సామాన్యమైన తల్పంపైన శయనించటం లాంటివి.)


ఇక సీతాదేవి లవకుశులను రాములవారికి అప్పగించి తాను భూదేవి ఒడిలోకి వెళ్ళిపోవటం గురించి నాకు ఇలా అనిపిస్తుంది............

అగ్నిపరీక్షలో నెగ్గిన తరువాత సీతాదేవిని ఇంటికి తెచ్చుకున్నా కూడా ........ కొంతమంది ప్రజలు ఏదేదో మాట్లాడారు. అందువల్ల సీతాదేవిని రాములవారు అడవికి పంపించటం జరిగింది.


ఇప్పుడు లవకుశులతో పాటు సీతాదేవి కూడా రాజ్యానికి తిరిగివస్తే,.............ఒకవేళ , మళ్ళీ కొందరు ప్రజలు ముందులా మాట్లాడితే ..........అప్పుడు సమస్య మళ్ళీ మొదటికొస్తుంది. ఇవన్నీ ఆలోచించి ,............. ఆ ఇబ్బంది ఎదురుకాకుండా సీతమ్మవారు అలా త్యాగం చేసి ఉంటారు.


తన ఇంటికి తాను వెళ్ళలేని పరిస్థితి...... సీతమ్మది తన భార్యతో తాను జీవించలేని పరిస్థితి రామయ్యది..... ( ఇది ఎంత విచిత్రమైన విపరీత పరిస్థితి ! )

సీతమ్మవారు ఎంత త్యాగమూర్తియో రాములవారు అంతకన్నా త్యాగమూర్తి. ఇద్దరూ ఆదర్శ దంపతులు.

****************

* కొంతకాలం ముందు రామాయణం గురించి వ్రాసిన టపా కూడా క్రింద జత పరుస్తున్నానండి...
..
 
పురాణములలో ఉన్నది అధర్మం కాదు......అంతటా ధర్మమే.....పురాణములు ఎంతో గొప్పవి ఆరవ భాగం...........

ఓం, శ్రీ మహా విష్ణువుకు లక్ష్మీదేవికి సరస్వతీదేవికి బ్రహ్మ దేవునికి సకల దేవతలకు నమస్కారములు.

ఇప్పుడు సీతారాముల కధలోని విషయములు కొన్ని చెప్పుకుందామండి. రామాయణం లోని పాత్రలు, వారి అవతార విశేషాలు, వారి పూర్వ కర్మ విశేషములు, శాపములు ఇవన్నీ చాలా పెద్ద కధ . ఇవన్నీ ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందని పెద్దలు చెబుతున్నారు కదండి. అదంతా పెద్ద కధ.


ఇక్కడ మనం సీతమ్మ వారి అగ్ని పరీక్ష, రాములువారు ఆమెను అడవులకు పంపించటం ఇదంతా అధర్మం అని కొంతమంది అంటుంటారు కదా ఆ విషయం గురించి నాకు తెలిసిన అభిప్రాయములు చెప్పుకుంటానండి .


.ఇంతకుముందు హరిశ్చంద్రుల వారి కధలో చెప్పుకున్నట్లు వారు తమ ప్రజలకు ధర్మం యొక్క విలువను తెలుపుటకు తాము ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు , శ్రీ మహావిష్ణువు లోకపాలనా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాబట్టి.... లోకంలోని ప్రజలను అధర్మం నుండి రక్షించుటకు ఎన్నో అవతారములు ధరించి ,ఎన్నో కష్టములు సహించి లోకములను రక్షించారు. అందుకోసం మత్స్యావతారం, కూర్మావతారం వంటి అవతారములను కూడా ధరించారు. శ్రీ రామావతారములో శ్రీ లక్ష్మీదేవి స్వరూపమైన సీతాదేవితో కలసి ఎన్నో కష్టములను అనుభవించి లోకులని రాక్షసులు బారి నుండి కాపాడారు. సీతారాములు ఆదర్శ దంపతులు.

 
రాములువారు ఏమి తప్పు చేశారు? తన భార్య కష్టముల పాలైనప్పుడు ఆమెకోసం ఎంతో ఆరాటపడి, రక్షించుకున్న మంచి భర్త. ఆ సందర్భములో ఎంతోమంది రాక్షసులను కూడా సం హరించారు.. రాములవారికి తాను విష్ణుమూర్తి అవతారమని తెలుసు. సీతమ్మ వారి జాడ తెలియని సందర్భములో ఆమె కోసం ఎంతో విలపించారు. దేవతలకు కూడా సుఖః, దుఃఖములు ఉంటాయి కదా!


ఇక సీతమ్మవారి అగ్ని పరీక్ష గురించి అంటే రాముల వారికి తమ అవతార రహస్యం గురించి తెలుసునట. సీతమ్మ మహాసాధ్వి అనీ తెలుసు. ఆమెకు ఏమీ కాదనీ తెలుసు. అందుకే అలా చేసిఉంటారు. లోకుల సంగతి ఆయనకు ముందే తెలుసు.

ఈ కలికాలంలోనే దైవభక్తి కలవారు ఎంతో మంది , ధ్యానం, తపస్సు, యోగా చేసేవారు ఎన్నో మహత్తులు చూపిస్తున్నారు. ఒక యోగి ఆత్మకధలో ఎంతో మంది ఈ నాటి యోగుల గురించిన ఎన్నో మహత్యములను గురించి తెలుసుకున్నాము. మరి సాక్షాత్తు లక్ష్మీ దేవి అవతారమయిన సీతమ్మ వారికి అగ్నిపరీక్ష వల్ల ఏ ఆపదా రాదని రాముల వారికి తెలుసు.


శ్రీ షిరిడి సాయిబాబా వారి కధలో కూడా ఆయనకు ఖండ యోగం అనే మహాధ్భుత విద్య తెలుసునని చెప్పబడింది. అంటే ఖండయోగమనగా శరీరావయవములన్నియు విడదీసి తిరిగి కలుపుట. ఇలాంటి మనకు తెలియని విషయాలు సృష్టిలో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఫోన్, టి.వి ఇలాంటివి తెలియని మారుమూల తెగల ప్రజలకు వాటి గురించి చెబితే అస్సలు నమ్మరు. అలాగే ఇవి కూడా.మనకు తెలియక వాటి గురించి నమ్మలేకపోతున్నాము.

సరే అలా సీతమ్మవారు మహాత్ములు కాబట్టి అగ్నిపరీక్ష వారికి ఆపద కలిగించలేదు. అన్ని కష్టాలు అనుభవించి, అగ్నిపరీక్ష అనంతరం తిరిగి వచ్చి భార్యాభర్తలు సంతోషంగా ఉంటే చూడండి.........వారిని ఒక పామరుడు తప్పుపట్టాడు. ఇది ఏమి న్యాయము? ఇలాంటి కొంతమంది గురించి ఆలోచించే రాముల వారు సీతమ్మవారి అగ్నిపరీక్షకు ఒప్పుకుని ఉంటారు.


.సీతమ్మవారు కూడా మరి తాను వనవాసం చెయ్యవలసిన అవసరం లేకపోయినా రాజభోగాలు అన్నీవదలి భర్తతోపాటు అడవులకు వెళ్ళారు. కష్టాలు అనుభవించారు. ఆమె ఎంతో ఉత్తమ ఇల్లాలు.


* ఇక సీతమ్మను అడవులకు పంపించటం. ......... ఇక్కడ గమనించవలసినది ఏమంటే ఆ పామరుడు అలా అన్న తరువాత మాత్రమే రాములవారు భార్యను అడవులకు పంపించారు. అప్పటి పాలకులు చాలా సెన్సిటివ్ గా ఉండేవారు మరి.


*ఒక వ్యక్తి అలా అన్న తరువాత నెమ్మదిగా మిగిలిన ప్రజలలో కూడా ఆ ఆలోచనలు వచ్చే ప్రమాదముంది. పైకి అనకపోయినా.....అందుకే భవిష్యత్తులో దీనిపైన వాదోపవాదములు, అనవసర చర్చలు, అపార్ధములు రాకుండాను, ఒక్కోసారి కొంతమంది అవకాశవాదులు తమ చెడ్డపనులకు ఇలాంటి సంఘటనను తమకు అనుకూలంగా మలచుకుని అధర్మానికి పాల్పడకుండాను, ఇన్ని ఆలోచించి ప్రజల క్షేమం కొరకు సీతారాములు తమ జీవితాన్ని, సంతోషాలను త్యాగం చేశారు...


అసలు అప్పుడు కూడా రాములవారు ఆమె గురించి ఎంతో జాగ్రత్త తీసుకున్నారంట. వాల్మీకి మహర్షి వద్ద ఆమె సురక్షితముగా ఉండటానికి ఆయన ఏర్పాటు చేశారట. అడవులకు పంపించటానికి ముందే వ్యాసులవారికి ఈ విషయం రాములు వారు తెలిపారట. అప్పట్లో ఒకరితో ఒకరు మనసు ద్వారా విషయములు తెలుసుకోవటం అనేవి ఉండేవంట. తపశ్శక్తి ద్వారా ఇది సాధ్యమట. ఇప్పుడు టెలిపతి అనే దానికి దగ్గరగా అర్ధం వస్తుందేమో. ...... సరే ముందే విషయం తెలియటం వల్ల వాల్మీకి మహర్షి వచ్చి ఆమెను ఆశ్రమానికి తీసుకువెళ్ళారని పెద్దలు చెబుతున్నారు.


రాముల వారు మళ్ళీ వివాహం చేసుకోలేదు. రాములవారు ఆదర్శ పుత్రుడు, ఆదర్శ సోదరుడు,, ఆదర్శ భర్త, ఆదర్శ తండ్రి, ఆదర్శ పాలకుడు, ఆదర్శవ్యక్తి, సీతమ్మవారు అన్నింటా ఆయనకు సాటి వచ్చే ఆదర్శ వ్యక్తి. సీతారాములు ఆదర్శ దంపతులు. .
ఆ భగవంతుని దయ.
 

7 comments:

  1. అమ్మా మనకు ఆయనలో ధర్మం కనపడుతుంది
    రాక్షసులకు మాత్రం ఆయనలో ఈగుణాలు కనపడవు. దృష్టిదోషం .

    ReplyDelete
  2. మీరు చెప్పింది అక్ష‌రాలా నిజం.
    రాముడు ఆద‌ర్శ పురుషుడు, సీత‌మ్మ త‌ల్లి మ‌న‌కు క‌న్న త‌ల్లి క‌న్నా మిన్న‌. ఈ రాక్ష‌స జాతికి మాత్రం అన్నీ త‌ప్పులే క‌న‌బ‌డ‌తాయి. మా టీవీ చానెళ్లు న‌డిపే వారు పూర్వ జ‌న్మ‌లో ఈ సంత‌తి వారే. అందుకే హిందు దేవ‌త‌ల మీద ఆడిపోసుకోడానికి తాప‌త్ర‌య ప‌డ‌తారు. నేను నా బ్లాగ్ లో టీవీ జ‌ర్న‌లిస్టుల పూర్వ జ‌న్మ వృత్తాంతం కూడా రాశా. www.heisatya.blogspot.com.

    ReplyDelete
  3. కృతజ్ఞతలండి.
    నిజమేనండి. సీతారాముల వంటి ధర్మాత్ములలో దోషాలను వెదకటం అంటే ......... అది దోషాలు వెదికేవారి దురదృష్టం అని చెప్పుకోవాలి.

    ReplyDelete
  4. కృతజ్ఞతలండి.
    సీతారాముల వంటి వారిలో కూడా తప్పులు వెదుకుతున్నారంటే ఇక ఎవరిని మెచ్చుకుంటారో అర్ధం కాదు...

    ReplyDelete
  5. జీవితం లో ఆదర్శ మనేది లేక చాలా మంది క్రిందా మీదా పడుతూ ఉంటారు.మనకి భౌతికంగా మానసంగా ఎదగటానికి అంటూ ఒక గోల్ ఉండాలి. శ్రీరాముల వారిని దోషమెతికి హేళన పరిచేవారు వారి అమ్మ నాన్న ని కూడా హేళన చేస్తారు. ప్రతీ మానవుల లోనూ తప్పొప్పులు ఉంటాయి కదా.జీవిత సంధ్యా సమయంలో వారంతట వారే నేర్చుకుంటారు.

    ReplyDelete
  6. కృతజ్ఞతలండి.
    నిజమేనండి మీరు అన్నట్లు ప్రతీ మానవునిలోనూ తప్పొప్పులు ఉంటాయి. సరైన సమయం వచ్చినప్పుడు వారి తప్పులను వారే తెలుసుకుంటారు. అయితే ఈ లోపు వారి ప్రభావం సమాజం పైన ప్రభావాన్ని చూపే అవకాశం కూడా ఉంది. అలాంటప్పుడే సమస్యలు వస్తాయండి.........................

    అయితే ఒకోసారి ఇలాంటివారు వేసే ప్రశ్నల వల్ల చర్చలు జరిగి సీతారాముల వంటివారి గొప్పదనం మరింతగా ప్రపంచానికి తెలిసే అవకాశం కూడా ఉందండి.............

    ReplyDelete
    Replies
    1. అయితే, ఉత్తరకాండలో చెప్పినట్లు సీతాదేవిని వనవాసానికి పంపటం అనేది నిజంగా జరిగిందో లేదో? తెలియదు.

      కొన్ని కారణాల వల్ల , ఉత్తరకాండ..కొన్ని సంఘటనలు..విషయంలో మార్పులుచేర్పులు జరిగి ఉండవచ్చు...

      ఈ విషయంలో ఏం జరిగిందో? దైవానికే తెలియాలి.

      అయితే, ఎవరికి తోచినట్లు వాళ్ళు గ్రంధాలలోని విషయాలను మార్పులుచేర్పులు చేయటం అనేది సరైనది కాదు.

      వాల్మీకి వారి రామాయణంలో ఉత్తరకాండ భాగం ప్రక్షిప్తమని అంటున్నారు. ఈ విషయాన్ని మనం గమనించాలి.

      Delete