koodali

Wednesday, April 6, 2011

మూడు చేపల కధ లా .............మనుషుల ఆలోచనా విధానాలు.


 
ఒక గ్రామంలో నీరు సమృధ్ధిగా ఉన్న ఒక చిన్న చెరువు ఉండేది. అందులో మూడు చేపలు కూడా నివసించేవి. అవి స్నేహంగా ఉండేవి.


ఇలా ఉండగా వేసవి కాలం సమీపించింది. ఎండలకు చెరువులో నీరు క్రమంగా తగ్గసాగింది.

ఒక రోజు కొందరు వ్యక్తులు వచ్చి, చెరువును పరిశీలించి .............. మరి కొన్ని రోజులు గడిస్తే నీరు మరింత తగ్గుతుందనీ...............అప్పుడు చేపలు పడితే బోలెడంత లాభం వస్తుందని చెప్పుకుని ............ మరికొన్ని రోజులు పోయాక వద్దామని అనుకుని వెళ్ళిపోతారు.


మాటలన్నీ మొదటి చేప విన్నది. దానికి పరిస్థితి అర్ధమయ్యింది.

అక్కడే ఉంటే ప్రమాదమని భావించి మిగతా రెండు చేపలను పిలిచి విషయం చెప్పింది.

చెరువుకు కొన్ని చిన్న కాలువలు ఉన్నాయి. వాటి ద్వారా వెళ్తే ఇంకో పెద్ద చెరువుకు చేరుకోవచ్చు.


*అలా వెళ్ళి ప్రాణాలు కాపాడుకుందామని మొదటి చేప మిగతా రెండు చేపలకు చెబుతుంది.............. అయితే మిగతా రెండు చేపలు విషయాన్ని సీరియస్ గా తీసుకోవు.


*ఇదంతా విని రెండవ చేప........ ఏమంటుందంటే ....... పరిస్థితి అంతదాకా వస్తే అప్పుడు చూసుకుందాములే అని వెళ్ళిపోతుంది.

*మూడో చేప.......... జాలరి వాళ్ళు మళ్ళీ రారు. ఇదంతా అనవసర భయం......... అంతా చాదస్తం అని విసుక్కుని కులాసాగా తిరగటానికి వెళ్ళిపోతుంది.


*ఇక చేసేదేమీ లేక మొదటి చేప.......... కాలువల ద్వారా బయలుదేరి పెద్ద చెరువుకు వెళ్ళిపోతుంది.

ఎందుకంటే ఆలస్యం చేస్తే ఎండలు పెరిగి కాలువలు కూడా ఎండిపోతే పెద్ద చెరువుకి వెళ్ళటానికి దారి మూసుకుపోతుంది కాబట్టి.


కొన్ని రోజులు పోయాక జాలరి వాళ్ళు వచ్చి వలలు వేసి చేపలను పట్టుకుంటారు. రెండు చేపలు కూడా వలలో చిక్కుతాయి.

జాలరులు చేపలను వలలో నుంచి తీసి ఒడ్డున వేస్తుంటారు.

రెండో చేప........... అప్పటికఫ్పుడు ఆలోచించి చచ్చిన దానిలా కదలకుండా ఒడ్డున పడిఉంటుంది.

జాలరులు చేప చనిపోయిందని భావించి ........ ఇక ఎక్కడికి పోతుందిలే అనుకుని దానిని పెద్దగా పట్టించుకోరు. అప్పుడు రెండో చేప నెమ్మదిగా నీటిలోకి జారిపోతుంది.


* చావుతప్పి కన్ను లొట్టపోయినట్లుగా రెండవ చేప.......... అప్పటికి తప్పించుకుంటుంది.

అయితే ఇంకోసారి జాలర్లు వస్తే మాత్రం దాని పరిస్థితి చెప్పలేము. ఇప్పుడు అది ఏమనుకుంటుందంటే ..............మొదటి చేప చెప్పినట్లు విని తాను కూడా ముందే పెద్ద చెరువుకి వెళ్ళిపోతే ఎంతో బాగుండేది కదా ! అని బాధపడుతుంది.


ఇప్పుడు వెళ్ళటానికి దానికి దారి లేదు. ఎందుకంటే పెద్ద చెరువుకి వెళ్ళే కాలువల్లో నీళ్ళు ఎండిపోయాయి.


ఇక మూడో చేప వలలో పడ్డాక ఏమి చేయాలో తెలియక ప్రాణ భయంతో ఎగిరెగిరి పడుతుంటే జాలరులు కర్రతో ఒక దెబ్బ వేసి దానిని చంపేస్తారు.

*పాపం మూడో చేప ........... కధ అలా అర్ధంతరంగా ముగిసిపోయింది.

మనుషులలో కూడా ఇలా రకరకాల స్వభావాల వాళ్ళు ఉంటారు.

*ఒకోసారి ఒకే మనిషిలో............ మూడు చేపల స్వభావాలు కూడా ఉండొచ్చు.

అంటే ఒక విషయములో ఎంతో ముందు చూపుతో తెలివిగా ప్రవర్తించిన వ్యక్తే ......... ఇంకో విషయములో తెలివితక్కువగా ప్రవర్తించవచ్చు.

ఇలా ఎందుకు జరుగుతుందో తెలియదు. అలా జరగటాన్ని తలరాతగా చెప్పుకోవచ్చేమో !

*అందుకే మన ఆలోచనలు ఎప్పుడూ సరిగ్గా సాగాలని దైవాన్ని ప్రార్ధించాలి...

( కధ గుర్తుంది గానీ చేపల పేర్లు అవి సరిగ్గా గుర్తు లేవండి. ఎప్పుడో చదివిన కధ..... .మొదటి చేప పేరు,.........దీర్ఘదర్శనుడు, రెండవ దాని పేరు.....ప్రాప్తకాలజ్ఞుడు ఇలా ఏవో పేర్లున్నాయండి..)..



22 comments:

  1. సుమతి, కాలమతి మరియు మందమతి

    ReplyDelete
    Replies
    1. దీర్ఘదర్శి,దీర్ఘసూత్రుడు,ప్రాప్త కాలజ్ఞుడు

      Delete
    2. మనిషిలో Newton's first law of motion లాగా inertia (జడత్వం) ఉంటుంది.. అది మానసిక శారీరక రెండు విధాలుగా వుంటుంది.. రెండిటిలో కూడా ఈ 3 తత్వాలు ఉంటాయి.... జీవితంలో ప్రతి విషయంలో కూడా మనం ఈ కథలో పాత్రలలో ఏ పాత్ర లో వున్నామో ఎప్పటికప్పుడు చూసుకోవాలి

      Delete
  2. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియదు. అలా జరగటాన్ని తలరాతగా చెప్పుకోవచ్చేమో !
    -------
    అన్నీ తలలో జరిగేవే తరువాత తలరాత క్రింద మారతాయి.

    ReplyDelete
  3. నా జీవితంలో నేను సుమతి, నేను బయటకి వచ్చిన కంపెని లేఆఫ్ లు మొదలు పెడుతుంది. నేను ఉన్నంత వరకు, రీసైన్ చేసే దాక అంతా సూపర్ ఎందుకు బయటకు వెళుతున్నావు అని అడుగుతారు. నేను బయటకి వెళ్ళాక అంతా గోల గోల చేసేవాళ్ళు, నేనేదో ముందే తెలుసుకొని వెళ్లినట్టు.

    ఏదో భగవంతుడు దయ వలన నాకు ముందే బుద్ధి పుట్టి కంపెనీలు మారాను.

    ReplyDelete
  4. కృతజ్ఞతలండి. పేర్లు చక్కగా ఉన్నాయండి.

    ReplyDelete
  5. కృతజ్ఞతలండి. మీరు సరిగ్గా చెప్పారండి.

    ReplyDelete
  6. కృతజ్ఞతలండి. భగవంతుని దయవలన సమయానికి తగ్గ ఆలోచనలు వస్తున్నాయంటే.... మీరు ఎన్నో పుణ్యాలు చేసి ఉంటారు..

    ReplyDelete
  7. deergha darshi
    prapta kalajnudu
    deergha suthrudu

    ReplyDelete
  8. కృతజ్ఞతలండి. పేర్లు చక్కగా ఉన్నాయండి.

    ReplyDelete
  9. Moodu chepala perlu varusaga 1. Deerghadarshi, 2. Prapthakalaghunudu, 3.Deerghasuthrundu

    ReplyDelete
  10. Moodu chepala perlu varusaga 1. Deerghadarshi, 2. Prapthakalaghunudu, 3.Deerghasuthrundu

    ReplyDelete
    Replies
    1. మీరు సూపర్ నాకు ఇంకా ఈ కథ గుర్తుంది. సార్ పేర్లతోసహా

      Delete
  11. bhaley ga undhi!!

    ReplyDelete
  12. thanku bhayya.........

    ReplyDelete
  13. Edhi telugu Book loni 7th lesson . Title : moodu chepalu.

    ReplyDelete
  14. Deerghadarshi
    Prapthakalagnudu
    Deerghasoothrudu

    ReplyDelete
  15. Derga darshi-preparing initially for solving problems
    Praptakalgnudu-solving the problem instantly with his presence of mind
    Derga sutrudu-facing the problem with out any knowledge.

    ReplyDelete