koodali

Friday, December 4, 2015

అప్పుడు ..ఇప్పుడు .. కొన్ని విషయాలు ...

 
 
ఈ మధ్య కాలంలో  కిడ్నీ, కాన్సర్, లివర్..వంటి వ్యాధులు అధికమవటానికి అనేక కారణాలున్నాయి. 
................

పాతకాలంలో పంటలు పండటానికి సహజ ఎరువులను మాత్రమే వాడేవారు. 

ఇప్పుడు రసాయన ఎరువులను వాడుతున్నారు.
............

 ఇంట్లో గిన్నెలు శుభ్రపరచటానికి మట్టి, బూడిద, సున్నిపిండి, కుంకుడురసం వంటివి వాడేవారు. ఈ పదార్ధాలు పొరపాటున గిన్నెలపై మిగిలిఉండి ఆహారంతోపాటు శరీరంలో ప్రవేశించినా కూడా హాని ఏమీ జరగదు. 

ఇప్పటి రోజుల్లో పాత్రలు శుభ్రం చేయటానికి రసాయనాలు కలిసిన వాటిని ఉపయోగిస్తున్నాం. 

పాత్రలను ఎంత శుభ్రం చేస్తున్నా చాలాసార్లు ఆ అవశేషాలు పాత్రపైనే మిగిలిఉంటున్నాయి. 

ఆ పాత్ర ద్వారా ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు ఆ రసాయనాలు కూడా శరీరంలో ప్రవేశించే అవకాశం ఉంది.
........................

పాతకాలంలో మట్టి, రాగి.. వంటి  పాత్రలను ఎక్కువగా వాడేవారు. 

ఈ రోజుల్లో మట్టి కూడా కలుషితం అవుతోంది కాబట్టి మట్టితో  పాత్రలు తయారుచేసినా ఉపయోగం లేదనిపిస్తోంది.

ఈ రోజుల్లో ఏవేవో కోటింగులు వేసిన పాత్రలను వాడుతున్నారు. ఇలాంటి పాత్రలలో  ఆహారాన్ని  ఎక్కువ వేడివద్ద వండకూడదట.
  ......................

 పాతకాలంలో  త్రాగటానికి, ఆహారాన్ని వండటానికి  చెరువులలో నీటిని వాడేవారు. చాలా ఇళ్ళల్లో నూయి కూడా ఉండేది. ఆ నీరు స్వచ్చంగా ఉండేది. 

ఈ రోజుల్లో అయితే కొన్ని పరిశ్రమల నుంచి వచ్చే రసాయన వ్యర్ధాలతో కూడిన నీటిని నదులలో, చెరువులలో కలిపేస్తున్నారు. 

రసాయన వ్యర్ధాలను  పనికట్టుకుని చెరువులలో, నదులలో కలపకపోయినా  వర్షాలు వచ్చినప్పుడు ఈ రసాయనా వ్యర్ధాలు వర్షపు నీటితో పాటు వచ్చి  చెరువులలో, నదులలో కలిసే అవకాశం కూడా ఉంది.

 త్రాగటానికి, ఆహారాన్ని తయారుచేయటానికి కలుషితమైన నీటిని వాడటం వల్ల శరీరభాగాలు త్వరగా పాడయ్యే అవకాశం ఉంది.
........................

పాత రోజులలో   ఇంటి శుభ్రతకు  ఆవుపేడ , మట్టి వంటివి వాడేవారు . ఆ రోజుల్లో  బాత్రూమ్స్  ఇంట్లో కాకుండా ఇంటికి కొంచెం బయట ఉండేవి .

 సింధు నాగరికత రోజుల్లోనే ఇళ్ళ నుండి  నీరు  బయటకు పోవటానికి  చక్కటి నీటిపారుదల వ్యవస్థ ఉన్నట్లు త్రవ్వకాల ద్వారా తెలిసింది. 


ఈ రోజుల్లో  ఇంటి  శుభ్రతకు ఎన్నో ఆసిడ్లను వాడుతున్నాము.

 ఈ రసాయనాలు ఇంటినుంచి డ్రైనేజ్లోకి వెళ్లి భూమిలో ఇంకటం, చెరువులలోనూ, నదులలోనూ కలవటం జరుగుతుంది. ఇందువల్ల  భూమి, నీరు కలుషితం అవుతోంది.
........................

 ఇక కొన్ని పరిశ్రమల వల్ల గాలి కూడా కలుషితం అవుతోంది. 
..................

కంప్యూటర్స్, ఏసీలు, ఫ్రిజులు..వంటి ఆధునిక పరికరాల  వాడకం  వల్ల ఓజోన్ పొర  పలుచబడుతోందని అంటున్నారు.

 ఓజోన్ పొర పలచబడితే అనేక దుష్పరిణామాలు కలుగుతాయంటున్నారు. 
......................
ఎన్నో విధాలుగా  గాలి, నీరు, భూమి..కలుషితం అవుతున్న ఈ రోజుల్లో  వ్యాధులు పెరగటంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
...........................

ఆధునికులు టెక్నాలజీకి బందీలయిపోయారు.

 టెక్నాలజీని ఎంత వరకూ అవసరమో అంతవరకే వాడుకుంటే కొన్ని దుష్ఫలితాలను తగ్గించుకోవచ్చు. 
......................

Images for sindhu drainage system



6 comments:

  1. ivanni chadivinapudu bhayamgaa untundi. mana chetullo ledu manalni manam kaapadukovatam ani kallaki kattinattu kanipistundi kabatti.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      నిజమేనండి, ఇవన్నీ గమనిస్తే కొంచెం భయం కలగటం సహజమే.

      అయితే, ఎవరికి వీలైనంతలో వారు జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువగా అనారోగ్యం బారిన పడటం జరగదు.


      Delete
  2. They used open latrines in olden days. Now we are using enclosed toilets. which is better? Good and bad exist always.

    ReplyDelete
  3. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ఇలాంటి ప్రశ్న ఎవరైనా వేస్తారనే సందేహంతోనే సింధు నాగరికత కాలం నాటి డ్రైనేజ్ వ్యవస్థ లింక్ ఇచ్చాను.

    సింధు నాగరికతను గమనిస్తే, ఆ కాలంలోనే ఇళ్ళనుండి మురుగు పోవటానికి చక్కటి డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నట్లు తెలుస్తోంది.

    ఈ విషయాన్ని గమనించితే అప్పట్లోనే కాలకృత్యాలకు ఇంటి వద్ద సదుపాయాలు ఉన్నట్లు తెలుస్తోంది కదా !

    ఇక, విదేశీదాడుల తరువాత భారతదేశం తన ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది. అప్పుడే ఇళ్ళ వద్ద మరుగుదొడ్లు సౌకర్యం లేకపోవటం వంటివి మొదలయి ఉంటాయని నా అభిప్రాయం.
    ..............

    ఈ విషయం అలా ఉంచితే , ఆధునిక కాలంలో ఇంటివద్ద మరుగుదొడ్లు ఉండటం బాగుంది. అయితే, ఆ వ్యర్ధాలను ఎక్కడ వదులుతున్నారు ?

    మరుగుదొడ్ల వ్యర్ధాలను డ్రైనేజ్ ద్వారా.. నదులలో లేక సముద్రాలలో కలిపేస్తున్నారని వార్తాపత్రికలలో చదివాను.ఇది సరైన విధానం కాదు కదా!

    ఆధునిక కాలంలో టాయ్లెట్స్ నుంచి వచ్చే మురుగునీటిలో ఎన్నో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటున్నాయి. (టాయ్లెట్స్ శుభ్రం చేసే రసాయనాల వల్ల.. )

    ఇలాంటి రసాయనాలతో కూడిన మురుగు.. నదులలో కలవటం వల్ల , లేక భూమిలో ఇంకటం వల్ల ..మట్టి, నీరు కలుషితమయ్యి ..ఆ నీటితో, ఆ మట్టిలోనూ పండే పంటలను తిన్న వారికి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

    ప్రాచీనకాలంలో ఇప్పటిలా రసాయనాలు లేవు కాబట్టి... ఇళ్ళ నుండి వచ్చే మురుగు నీరు.. ఆరుబయట మట్టిలో ఇంకినా ప్రమాదం ఉండేది కాదు.
    .............

    ఆధునికకాలంలో టాయ్లెట్స్ నుంచి వచ్చే వ్యర్ధాలను నదులలో కలపకుండా గోబర్ గ్యాస్ ప్లాంట్లు ఏర్పరిచి పొయ్యి వెలిగించుకోవచ్చు.

    లేకపోతే అలా వచ్చిన వ్యర్ధాలతో విద్యుత్ తయారుచేసి ఉపయోగించవచ్చని ఇంతకుముందు ఒక టపాలో వ్రాసానండి.

    ReplyDelete

  4. నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో టాయ్ లెట్స్ త్వరగా రంగుమారతాయి.

    బేకింగ్ పౌడర్ మరియు వెనిగర్ వంటివి వాడినా టాయ్ లెట్స్ శుభ్రపడతాయి.

    అయితే, టాయ్ లెట్స్ శుభ్రం చేయటానికి చాలామంది యాసిడ్ వాడుతారు.

    కొందరు పనివారిచేత టాయ్లెట్స్ కడిగిస్తారు.

    టాయ్లెట్స్ శుభ్రం చేసేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారు మాస్కులు వేసుకోవాలి.

    యాసిడ్ వేసి టాయ్ లెట్స్ కడిగేటప్పుడు .. ముక్కులోకి..ఊపిరితిత్తులకు .. యాసిడ్ ఘాటు వెళ్ళకుండా మాస్కు ధరించాలి. కళ్ళకు యాసిడ్ పొగ తగలకుండా కళ్ళజోడు వాడటం మంచిది.

    ReplyDelete

  5. టాయ్ లెట్స్ ఎక్కువ మరకలు లేకపోతే.. మామూలుగా శుభ్రం చేయటానికి బట్టలు ఉతకటానికి వాడే నిర్మా పొడి కూడా వాడవచ్చు.

    ReplyDelete