ఇంతకు ముందు మేము ఉన్న ఊరిలో .. ఇరుగుపొరుగు ఇళ్ళల్లో ఒక లేడీ డాక్టర్ గారు లివర్ వ్యాధి వల్ల మరణించారు. ఆమె గమనించేసరికే వ్యాధి ముదిరి పరిస్థితి చేయిదాటి పోయిందట.
ఇంకొక ఆమె కాన్సర్ వ్యాధితో మరణించారు. కాన్సర్ అని తెలిసేవరకూ ఆమె ఆరోగ్యంగానే ఉండేవారు. వ్యాధి ఉన్న లక్షణాలేవీ తెలియలేదు. కాన్సర్ అని తెలిసిన కొన్ని నెలలకే ఆమె మరణించారు.
ఇప్పుడు మేము ఉన్న ఊరిలో .. కొన్ని రోజుల క్రిందట మా వీధిలో ఒకాయన లివర్ వ్యాధి వల్ల సడన్ గా మరణించారు. అంటే, మూడునెలల క్రితం మాత్రమే ఆ వ్యాధి ఉన్నట్లు వాళ్ళకు తెలిసిందట.
కిడ్నీ, కాన్సర్ వ్యాధిన బారిన పడుతున్న వారిలో పిల్లలు, మధ్యవయస్కులు, పెద్దవాళ్లు అని తేడా లేకుండా జబ్బులు వస్తున్నాయి.
ఇవన్నీ గమనించిన తరువాత ... ఈ రోజుల్లో వ్యాధులు బాగా పెరుగుతున్నాయనిపించి కొన్ని విషయాలను వ్రాసాను.
అయితే , అనారోగ్యాలు తక్కువగా వచ్చేవారు కూడా సమాజంలో ఉన్నారు.
వ్యాధులు రావటానికి గల కారణాలను గుర్తించి వీలైనంతలో జాగ్రత్తలు పాటించితే అనారోగ్యాలు రావటం తగ్గుతాయి.
..........................
ప్రాచీనకాలంలో ఆయుర్వేదంలో గొప్పప్రావీణ్యత కలిగిన సుశ్రుతుడు, చరకుడు వంటి గొప్పవైద్యులు ఉండేవారు. సుశ్రుతుడు ఆ రోజుల్లోనే శస్త్రచికిత్సలు చేయటంలో గొప్ప నైపుణ్యం కలిగినవారంటారు.
ఇక వైద్యులైన అశ్వనీకుమారులు ..చ్యవన మహర్షి యొక్క అంధత్వాన్ని పోగొట్టి, యవ్వనవంతునిగా చేసిన కధ చాలామందికి తెలుసు.
రామాయణంలో హనుమంతులవారు సంజీవని మూలిక తేవటం..లక్ష్మణుడు కోలుకోవటం జరిగింది.
ఇవన్నీ గమనిస్తే ప్రాచీనకాలంలోనే వైద్యశాస్త్రం ఎంతో గొప్పగా ఉండేదని తెలుస్తుంది.
ప్రాచీనకాలపు ఆయుర్వేద వైద్య విజ్ఞానం ఈ రోజుల్లో నిర్లక్ష్యానికి గురయింది. ఎంతో విజ్ఞానాన్ని మనం పోగొట్టుకున్నాం.
...................
ఇంగ్లీష్ వైద్యం వల్ల కూడా ఉపయోగాలున్నాయి.
ఎన్నో రోగాలను తగ్గించటంలో, ఎవరికైనా విపరీతంగా నీరసం వచ్చినప్పుడు సెలైన్ ఎక్కించటానికి, ఆపరేషన్స్ అవసరమైనప్పుడు చాలా ఉపయోగపడుతుంది.
...............
హోమియో వైద్యాన్ని చాలామంది నమ్మరు. అయితే , హోమియో కూడా బాగా పనిచేస్తుంది.
ప్రతిభ మరియు అనుభవజ్ఞుడైన వైద్యుని వద్దకు వెళ్ళి ...వారు చెప్పిన సలహాలను చక్కగా పాటిస్తే అనారోగ్యం తగ్గే అవకాశం ఉంది.
నేను చిన్నతనంలో టాన్సిల్స్ వల్ల చాలా బాధపడ్డాను. ఇక, వేసవిసెలవులలో నాకు టాన్సిల్స్ సర్జరీ చేయించటానికి మా పెద్దవాళ్లు సిద్ధమవగా , ఒక హోమియో వైద్యులు పరిచయమయి , టాన్సిల్స్ తగ్గటానికి హోమియో మందులు ఇవ్వటం జరిగింది.
అంతే టాన్సిల్స్ బాధ తగ్గిపోయింది. ఇప్పటివరకూ మళ్లీ ఇబ్బంది రాలేదు.
మాకు అనారోగ్యాలు తక్కువగానే వచ్చాయి. దైవానికి అనేక కృతజ్ఞతలు.
ఆసక్తి ఉన్నవారు ఈ క్రింది లింకులను చూడవచ్చు.
అయితే, ఈ రోజుల్లో కూడా కొందరు ..ఆయుర్వేదం ద్వారా ఎన్నో వ్యాధులను తగ్గిస్తున్నట్లుగా వార్తల ద్వారా తెలుస్తోంది.
..............................

Anatomy in ancient India: a focus on the Susruta Samhita.
Chyavana - Wikipedia, the free encyclopedia
అయితే, ఈ రోజుల్లో కూడా కొందరు ..ఆయుర్వేదం ద్వారా ఎన్నో వ్యాధులను తగ్గిస్తున్నట్లుగా వార్తల ద్వారా తెలుస్తోంది.
ఎందరో తెలుగు వైద్యులు కూడా టీవీ చానల్స్ ద్వారా చక్కటి వైద్య సలహాలను ఇస్తున్నారు.
ReplyDeleteచానల్స్ చూసే వారికి తెలుస్తుంది కదా అని ఆ వివరాలను టపాలో ఇవ్వలేదు.
Ayurveda medicinal uses of Madagascar Periwinkle or Sadabahar
ReplyDelete